Search
  • Follow NativePlanet
Share
» » ఛత్తీస్ ఘడ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన ఈ క్షేత్రాలను చూశారా?

ఛత్తీస్ ఘడ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన ఈ క్షేత్రాలను చూశారా?

ఛత్తీస్ ఘడ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు గురించి కథనం

భారత దేశంలో పర్యాటకంగా కొంత నిర్లక్షానికి గురైన రాష్ట్రం చత్తీస్ ఘడ్. అయితే ఇక్కడ ప్రకతి సంపదకే కాకుండా పురాణ పరంగా, చారాత్రాత్మకంగా పేరుగాంచిన ఎన్నో ప్రాంతలను మనం చూడవచ్చు. పర్యాటకం అంటే ఇష్టపడే వారు ఈ రాష్ట్రంలో నదీలోయలు, ఎత్తైన హిల్ స్టేషన్లు, పచ్చటి అడవులు ఇలా ఒక్కటేమిటి నయనానందకరమైన ఎన్నో పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను ఈ ఈశాన్య రాష్ట్రంలో మనం చూడవచ్చు. ఇక పురాణ ప్రాధాన్యత ఉన్న దేవాలయాలు ఎన్నో ఈ రాష్ట్రం సొంతం చేసుకుంది. ఆ దేవాలయాల్లో అతి ముఖ్యమైనవాటిలో ఐదింటిని మీ కోసం అందిస్తున్నాం. ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నయి. అక్కడకు ఎలా వెళ్లాలి అనే విషయాలతో పాటు క్లుప్తంగా ఆ దేవాలయాల ప్రాధన్యత కూడా మీ కు అందిస్తున్నాం. మరెందుకు ఆలస్యం త్వరగా చదివేయండి. ఎప్పుడైనా ఛత్తీస్ ఘడ్ వెళ్లినప్పుడు ఆ దేవాలయాలకు వెళ్లడం మరిచిపోకండి.

మహామాయ దేవాలయం

మహామాయ దేవాలయం

P.C: You Tube

ఛత్తీస్ ఘడ్ లో అత్యంత ప్రాచూర్యం పొందిన దేవాలయాల్లో మహామాయ దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. ఈ దేవాలయం ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ జిల్లా రతన్ పూర్ లో ఉంది. ఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది లక్ష్మీదేవి, సరస్వతి.

పన్నెండో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రత్నదేవ్ ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు స్థానికంగా దొరికిన శాసనాల వల్ల స్పష్టమవుతుంది. ఈ మహామాయ దేవాలయం ప్రాంగణంలోనే అనేక ఉపాలయాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.

బార్ఫనీధామ్

బార్ఫనీధామ్

P.C: You Tube

ఛత్తీస్ ఘడ్ లోని రాజ్ నందన్ గాన్ జిల్లాలో బర్ఫనీధామ్ ఉంది. ఇది ప్రముఖ శైవక్షేత్రం. ఇక్కడ బ`హదాకారంలోని శివుడి, నంది విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రంలోని పరమశివుడిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక దేవాలయం నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. మొత్తం మూడు అంతస్తుల్లో ఈ దేవాలయం నిర్మితమై ఉంటుంది.

కింది అంతస్తులో మనం పాతాల భైరవిని చూడవచ్చు. రెండో అంతస్తులో నవదుర్గా విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. చివరి పై అంతస్తులో అతి పెద్దైన శివుడి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయాన్ని సందర్శిన వారు తప్పక దేవాలయ నిర్మాణ కౌశలాన్ని, అక్కడి అందమైన శిల్పకళను పొగడకుండా ఉండలేరు.

బొరామ్ డియో దేవాలయం.

బొరామ్ డియో దేవాలయం.

P.C: You Tube

భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయాల్లో బోరామ్ డియో దేవాలయం కూడా ఒకటి. అంతే కాకుండా ఛత్తీస్ ఘడ్ లో అత్యధికమంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రముఖ దేవాలయం కూడా ఇదే. ఈ బొరామ్ డియో దేవాలయం మూడు దేవాలయాల సమూహం. ఛత్తీస్ ఘడ్ లోని కబీర్ దామ్ జిల్లాలో ఈ దేవాలయం ఉంది.

దాదాపు 11వ శతాబ్దంలో దీనిని నాగార శిల్ప కళా శైలిలో నిర్మించారు. ఈ దేవాలయాచూడటానికి ఖజురహో దేవాలయాలను పోలిఉంటుంది. అందువల్లే బొరామ్ డియో దేవాలయాలను ఛత్తీస్ ఘడ్ ఖజురహో అని అంటారు.

బబ్లేశ్వరీ దేవాలయం

బబ్లేశ్వరీ దేవాలయం

P.C: You Tube

ఛత్తీస్ ఘడ్ లోని రజ్ నందన్ గాన్ జిల్లా దోగర్ ఘర్ వద్ద ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 1600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ దేవాలయం చేరుకోవడానికి 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోప్ వే కూడా ఉంది. ఈ ఇక్కడ కొలువైన అమ్మవారిని బడీ బబ్లేశ్వరీ దేవి అని పిలుస్తారు.

ప్రధాన దేవాలయానికి నకలు అనిపించే చిన్న దేవాలయాన్ని మనం పర్వతం అడుగు భాగాన చూడవచ్చు. ఇక్కడ ఉన్న అమ్మవారిని చోటీ బబ్లేశ్వరీ అని పిలుస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ బాగా జరుగుతాయి. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొంటూ ఉంటారు.

దంతేశ్వరీ దేవాలయం

దంతేశ్వరీ దేవాలయం

P.C: You Tube

చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా దంతేవాడలో దంతేశ్వరీ దేవాలయం ఉంది. పురాణ ప్రాధాన్యత కలిగిన దంతేశ్వరీలో ప్రధానంగా పూజలు అందుకొనేది దంతేశ్వరీ దేవి. ఈమె ఆది పరాశక్తి ప్రతిరూపంగా భావిస్తారు.

దాక్షాయణి శరీరాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె పన్ను పడిన ప్రాంతం ఇదే అని హిందు పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఇది భారత దేశంలోని 52 శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్పబడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X