Search
 • Follow NativePlanet
Share
» »స‌ముద్ర‌గ‌ర్భంలో డిజైన్ చేసిన ఈ రెస్టారెంట్లను చూశారా?!

స‌ముద్ర‌గ‌ర్భంలో డిజైన్ చేసిన ఈ రెస్టారెంట్లను చూశారా?!

స‌ముద్ర‌గ‌ర్భంలో డిజైన్ చేసిన ఈ రెస్టారెంట్లను చూశారా?!

నీటి అడుగున కూర్చొని మంచి భోజనం చేయాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చుట్టూ అందమైన చేపలు విహ‌రిస్తూ ఉంటే, నీటి అడుగున రుచికరమైన సముద్రపు ఆహారాన్ని మ‌న‌సారా రుచి చూడాల‌ని ఎప్పుడైనా అనిపించిందా? మాల్దీవులలో నీటి అడుగున విందు చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. ఆహారంతోపాటు ఇష్ట‌మైన పానీయాలతో ఇక్కడి ఆతిథ్యం జీవితంలో మ‌ర్చిపోలేని క్ష‌ణాల‌ను చేరువ చేస్తుంది.

నీటి అడుగున ఉన్న లగ్జరీ రెస్టారెంట్లు తమ అతిథులకు అత్యంత ప్రత్యేకమైన భోజన అనుభవాన్ని అందిస్తున్నాయి. చుట్టూ అందమైన చేపలు ఉన్న సమయంలో నీటి అడుగున రుచికరమైన సముద్రపు ఆహారాన్ని కుటుంబంతో రుచిచూడాల‌నుకునేవారి కోస‌మే ఈ ప్ర‌త్యేక క‌థ‌నం..

ఇథా - కాన్రాడ్ మాల్దీవులు రంగాలి ద్వీపం

ఇథా - కాన్రాడ్ మాల్దీవులు రంగాలి ద్వీపం

హిందూ మహాసముద్రం ఉపరితలం నుండి ఐదు మీటర్ల లోతులో ఉన్న ఇది ప్రపంచంలోనే మొదటి సముద్రగర్భ రెస్టారెంట్. ఇది కాన్రాడ్ మాల్దీవుల రంగాలి ద్వీపంలో ఉంది. మీరు దాని చుట్టూ ఉన్న సజీవమైన పగడపు దిబ్బ‌ల 180-డిగ్రీల విశాల దృశ్యాన్ని చూడవచ్చు. ఇక్కడి ఆహారం మీ అభిరుచికి త‌గ్గ‌ట్టుగా అందించ‌బడుతుంది. స్థానిక ఉత్పత్తులతోపాటు సుగంధ ద్రవ్యాలతోకూడిన‌ పాశ్చాత్య స్ఫూర్తితో ఉత్తమమైన వైన్ అందుబాటులో ఉంటుంది. ఈ గొప్ప రెస్టారెంట్ ఉదయం సమయంలో కాక్‌టెయిల్‌ల కోసం తెరిచి ఉంటుంది. వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో ప్రైవేట్ డైనింగ్ కోసం ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు.

హురావాల్హి ఐలాండ్ రిసార్ట్

హురావాల్హి ఐలాండ్ రిసార్ట్

హురావాల్హి ఐలాండ్ రిసార్ట్ స‌ముద్రానికి 5.8 మీటర్ల లోతులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే నీటి అడుగున ఉన్న అతిపెద్ద పనోరమిక్ రెస్టారెంట్. ఇక్కడ తయారు చేయబడిన ప్రతి వంటకం ప్ర‌త్యేక‌మైన ఇన్నోవేషన్‌తో క‌స్ట‌మ‌ర్‌ల‌కు అందిస్తారు. తద్వారా వినూత్నమైన ఆధునిక వంటకాల ప్రదర్శన, గొప్ప వైన్ జాబితాతో ప్రదేశం మొద‌టి స్థానంలో నిలుస్తోంది. మొత్తం రెస్టారెంట్‌లో ఎనిమిది టేబుళ్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఇద్దరు అతిథులు కూర్చునేందుకు అవ‌కాశం ఉంటుంది. సముద్రగర్భంలోని మంత్రముగ్ధులను చేసే దృశ్యాలు వీక్ష‌కుల‌ను మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళ‌తాయి.

H2O, యూ & మీ, మాల్దీవులు

H2O, యూ & మీ, మాల్దీవులు

ఈ ఇంటిమేట్ డిజైనర్ రెస్టారెంట్ పూర్తిగా ద్వీపం దిగువన నీటిలో మునిగిపోయి ఉంటుంది. మాల్దీవుల ద్వీపంలో మ‌ర్చిపోలేని, రుచినిచ్చే వంటకాలను అందిస్తుంది. అద్భుతమైన సముద్ర పర్యావరణం యొక్క 360-డిగ్రీల వీక్షణతో ఈ ప్రదేశం డైనర్‌లను ఆక‌ర్షిస్తుంది. ఒకేసారి ఇర‌వై మంది కూర్చునేలా ఇక్క‌డ రెస్టారెంట్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేయ‌బ‌డింది. ఇక్క‌డ భోజనం చేస్తూ అద్భుతమైన సముద్ర వాతావరణాన్ని చూసే అవకాశం దొరుకుతుంది.

అనంతర కివాహ్ మాల్దీవులు

అనంతర కివాహ్ మాల్దీవులు

ఈ రెస్టారెంట్ సముద్రం కింద మూడు మీటర్ల దూరంలో మెరిసే గాజు గోడల లోపల అద్భుతంగా డిజైన్ చేయ‌బ‌డింది. సముద్రపు అడుగుభాగంలో ఆహ్లాద‌ప‌రిచే అరుదైన జాతుల‌ను క‌నులారా వీక్షించేందుకు మ‌న‌కు ఇష్ట‌మైన టేబుల్‌ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, ఇక్క‌డి మెనులోని ఉత్తమ స‌ముద్ర వంటకాలను విందు చేస్తూ ప‌క్క‌నే చేపలు ఈత కొట్టడాన్ని చూడవచ్చు. ఉత్తమమైన వైన్ ఎంపికను రుచి చూడవచ్చు. ప్ర‌పంచ‌స్థాయిలో గుర్తింపు పొందిన అనేక వంట‌కాల‌ను ఈ స‌ముద్ర గ‌ర్భంలో మ‌న‌సారా రుచిచూడ‌వ‌చ్చు.

మాల్దీవులను చుట్టేసిన ప‌గ‌డ‌పు దీవుల అందాల‌ను మ‌నసారా ఆస్వాదించేందుకు ఈ భూగ‌ర్భ స‌ముద్ర రెస్టారెంట్లు స‌రైన ఎంపిక‌. మ‌రెందుకు ఆల‌స్యం కుటుంబ స‌మేతంగా విహారానికి ప్లాన్ చేస్తే మాల్దీవుల‌ను మీ మొద‌టి జాబితాలో చేర్చుకోండి మరి.

  Read more about: maldives rangali island
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X