Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతిలో ఈ పర్యాటక ప్రాంతాలన్నీ చూశారా? లేదంటే ఈ వీకెండ్ ఉందిగా

తిరుపతిలో ఈ పర్యాటక ప్రాంతాలన్నీ చూశారా? లేదంటే ఈ వీకెండ్ ఉందిగా

తిరుపతికి చుట్టు పక్కల ఉన్న పర్యాటక స్థలాల గురించి కథనం.

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని అంటారు. ఆ కలియుగ దైవం కొలువై ఉన్న క్షేత్రం తిరుపతి అన్న విషయం తెలిసిందే. భారత దేశంలో భారత దేశంలోని అతి ధనవంతమైన దేవాలయల్లో శ్రీ వేంకటేశ్వరుడి దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ మంది భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల్లో తిరుపతి మొదటి స్థానంలో ఉంటుంది. ఇంతటి విశిష్టమైన ఈ క్షేత్రం పరిసర ప్రాంతాలతో పాటు కొంత దూరంలో అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. అందులో స్వామి వారి పుష్కరిణి, ఆకాశగంగ తీర్థం. శ్రీ వేంకటేశ్వర ద్యాన మందిరం, శిలా తోరణం, టీటీడీ ఉద్యానవనం, వేదాద్రి నరసింహ స్వామి దేవాలయం వంటివి ఎన్నో ఉన్నాయి. వాటి వివరాలు క్లుప్తంగా ఈ కథనంలో మీ కోసం

 తిరుమల

తిరుమల

P.C: You Tube

ఇక్కడ కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఆనందనిలయం ఉంటుంది. ఏడుకొండల పై వెలిసిన ఆ పరమాత్ముడిని చూడటానికి దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే అనేక పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి.

స్వామి వారి పుష్కరిణి

స్వామి వారి పుష్కరిణి

P.C: You Tube

తిరుమల దేవాలయానికి అతి దగ్గరగా ఉంటుంది. పురాణాల కథనం ప్రకారం వేంకటేశ్వరుడి నిలయం ఇదేనని చెబుతారు. ఈ పుష్కరిణిలోని నీరు మన పాపాలను పోగొడుతుందని భక్తులు నమ్ముతారు.

ఆకాశగంగ తీర్థం

ఆకాశగంగ తీర్థం

P.C: You Tube

అకాశగంగ తీర్థం ఒక జలపాతం. ఇది తిరుమల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడాది మొత్తం ఆ ఆకాశగంగలో నీరు ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.

 శ్రీ వేంకటేశ్వర ద్యాన మందిరం.

శ్రీ వేంకటేశ్వర ద్యాన మందిరం.

P.C: You Tube

శ్రీ వేంకటేశ్వర ద్యాన మందిరాన్ని 1980లో ఏర్పాటు చేశారు. ఈ ద్యాన మందిరం ఒక వస్తు సంగ్రహానాలయం. ఇక్కడ వేంకటేశ్వరుడి పూజకు వినియోగించిన ఆ కాలం నాటి అనేక వస్తువులను మనం చూడవచ్చు.

శిలా తోరణం

శిలా తోరణం

P.C: You Tube

ప్ర`తి సిద్ధంగా ఏర్పడిన ఈ శిలాతోరణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ శిలాతోరణం నదీ ప్రవాహ కోత వల్ల ఏర్పడినదని చెబుతారు. ఈ శిలా తోరణం పై శంఖం, చక్రం, శ్రీవారి హస్తం, పాదాలు, గరుడపక్షి, నాగాభరణాలు ఉన్నాయి. ఇవి కూడా సహజ సిద్ధంగా ఏర్పడినవేనని చెబుతారు.

టీటీడీ ఉద్యానవనం

టీటీడీ ఉద్యానవనం

P.C: You Tube

తిరుపతిలో దాదాపు 460 ఎకరాల విస్తీర్ణంలో ఈ టీటీడీ ఉద్యానవనం ఉంది. ముఖ్యంగా వివిధ ఆక`తిలో మలిచిన చిన్నచెట్లు ఇక్కడ చూడటానికి చాలా బాగుంటాయి. ఇక్కడే మనకు ఆల్వార్ సరస్సు కూడా కనిపిస్తుంది.

వేదాద్రి నరసింహ స్వామి దేవాలయం

వేదాద్రి నరసింహ స్వామి దేవాలయం

P.C: You Tube

తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. శ్రీమహావిష్ణువు సోమాసుర అనే రాక్షసుడితో యుద్ధం చేసి అతను దొంగిలించిన వేదాలను తిరిగి స్వాధీనం చేసుకున్న స్థలం ఇదేనని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని శ్రీ క`ష్ణ దేవరాయులు నిర్మించారు.

పద్మావతి అమ్మవారి దేవాలయం

పద్మావతి అమ్మవారి దేవాలయం

P.C: You Tube

పద్మావతి అమ్మవారు కొలువైన క్షేత్రం ఇది. తిరుపతికి వెళ్లినవారు ఇక్కడ తప్పక వెళ్లి అమ్మవారిని సందర్శించుకొని వస్తారు.

వరహాస్వామి దేవాలయం

వరహాస్వామి దేవాలయం

P.C: You Tube

ప్రధాన దేవాలయానికి దగ్గర్లోనే ఈ వరాహస్వామి దేవాలయం ఉంది. శ్రీవారి దేవాలయం ఇక్కడ ఉండటానికి మొదలే వరహాస్వామి స్థానికుల నుంచి పూజలు అందుకునేవారని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీవారి పాదపద్మాలు

శ్రీవారి పాదపద్మాలు

P.C: You Tube

తిరుమలలో మరో ఎతైన పర్వత పై భాగాన శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చే సమయంలో ఆయన మొదటి పాదాన్ని శ్రీవారి పాదల వద్ద, రెండో పాదాన్ని శిలాతోరణం వద్ద, మూడో పాదాన్ని ఆనంద నిలయంలో పెట్టారని చెబుతారు. శ్రీవారి పాదాల వద్దకు అనేక ప్రైవేటు వాహనాలు వెలుతుంటాయి.

తలకోన

తలకోన

P.C: You Tube

తిరుపతి నుంచి దాదాపు 42కిలోమీటర్ల దూరంలో తలకోన ఉంటుంది. ఇక చిన్న అటవీ ప్రాంతం. ఇక్కడి జలపాత అందాలు మనలను మంత్రముగ్దులను చేస్తాయి. ఇక్కడ నిత్యం వెండి, బుల్లితెర షూటింగ్ లు జరుగుతూనే ఉంటాయి.

కపిల తీర్థం

కపిల తీర్థం

P.C: You Tube

ఇది ప్రముఖ శైవ క్షేత్రం. వైష్ణవ క్షేత్రాల్లో శై క్షేత్రాలు ఉండటం చాలా అరుదు. ఇక్కడ ఉన్న లింగాన్ని కపిల లింగం అని అంటారు. కపిల మహర్షి పూజలకు మెచ్చిన ఈశ్వరుడు భూమిని చీల్చుకొని ఇక్కడ లింగ రూపంలో వెలిశాడని చెబుతారు.

గోవిందరాజుల స్వామి దేవాలయం

గోవిందరాజుల స్వామి దేవాలయం

P.C: You Tube

గోవిందరాజుల స్వామిని శ్రీనివాసుడి పెద్దన్నగా భావిస్తారు. ఇక్కడి ఆలయంలో స్వామివారి విగ్రహం కింద మనం కుంచం చూడవచ్చు. శ్రీనివాసుడు వివాహానికి కుబేరుడి వద్ద తీసుకున్నరుణం ఈ కుంచంలోనే కొలిచాడని చెబుతారు.

శ్రీనివాస మంగాపురం

శ్రీనివాస మంగాపురం

P.C: You Tube

తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో స్వామివారిని కళ్యాణ వేంకటేశ్వరుడని పిలుస్తారు. నారాయణ వనంలో పద్మావతిని వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమల వెలుతూ ఇక్కడ కొంత సేపు విశ్రమించాడని చెబుతారు.

చంద్రగిరి కోట

చంద్రగిరి కోట

P.C: You Tube

అద్రచంద్రాకారంలో ఉన్న ఓ కొండ వద్ద ఈ కోటను నిర్మించారు. తిరుపతి నుంచి కేవలం 23 కిలోమీటర్లు మాత్రమే. విజయనగర చక్రవర్తులు నిర్మించిన ఈ కోట ప్రస్తుతం మ్యూజియంగా మార్చారు. అప్పట్లో రాజులు వాడిన ఆభరణాలు, ఆయుధాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X