Search
  • Follow NativePlanet
Share
» »సముద్రతీర అందాన్ని ఆస్వాదిస్తూ...ఆయుర్వేద మసాజ్ చేయించుకోవాలంటే కేరళలోని హవా బీచ్ కి వెళ్ళాల్సిందే..

సముద్రతీర అందాన్ని ఆస్వాదిస్తూ...ఆయుర్వేద మసాజ్ చేయించుకోవాలంటే కేరళలోని హవా బీచ్ కి వెళ్ళాల్సిందే..

కేరళ రాజధాని తిరువనంతపురం (పూర్వపు త్రివేండ్రం) దగ్గరలో ఉన్న సముద్ర తీర పట్టణం కోవలం. పక్కపక్కనే మూడు చంద్రాకారంలో ఉన్న బీచ్‌లను కలిగిన కోవలం అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచింది. 'కొబ్బరిచెట్ల తోపు' అనే అర్థం వచ్చే కోవలం అనే మలయాళ పదం ద్వారా ఈ పేరు వచ్చింది.

తిరువనంతపురం ప్రధాన నగరానికి ఈ తీరం కేవలం 16 కిలోమీటర్ల దూరంలో వుంది. మెల్లగా అలలు ఎగసిపడుతుండగా వెచ్చని ఇసుక మీద తీరంవెంబడి నడవడం జీవితంలో ఎదురయ్యే అందమైన అనుభవం. తీరం మాటున దాగిన పచ్చని పొలాలతో కొండల నడుమ కొబ్బరి, అరటిచెట్లు ఎప్పటిలాగానే.. సందర్శకులకు సాదర ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. అంతేకాదు, ఇక్కడ గడిపే ప్రతిక్షణం జీవితంలో మర్చిపోలేని అనుభూతుల సమ్మేళనమే. చల్లగా పాదాలను పలకరిస్తూ దోబూచులాడే సముద్రపు కెరటాలను మనసారా పలకరించాలంటే కేరళలోని కోవలమ్‌ బీచ్‌లో అడుగులు వేయాల్సిందే.

సూర్యోదయ, సూర్యాస్తమయాలని ఆస్వాదించాలంటే

సూర్యోదయ, సూర్యాస్తమయాలని ఆస్వాదించాలంటే

చిక్కటి పచ్చదనం, ప్రశాంతమైన నీలిరంగుల మిశ్రమం హృదయానికి హత్తుకొనేంత ఆహ్లాదంగా ఉంటాయి. కోవలం లో మూడు ప్రధాన తీరాలు ఉన్నాయి. వీటిని చూడడానికి తెల్లవారుఝామున కానీ, బాగా సాయంత్రం గానీ వెళ్ళాలి. అలా అయితే ఇక్కడి అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలని ఆస్వాదించగలుగుతారు.

దక్షిణాది స్వర్గం

దక్షిణాది స్వర్గం

కోవలంలోని తీరాలలో ఉండే ఇసుక రంగు చాలా విశిష్టతతో కూడినది. కాశ్మీర్ ‘భూమి మీద స్వర్గం'గా దీనికి ఒక ప్రత్యేక పేరు కూడా వుంది. ‘దక్షిణాది స్వర్గం' గా కోవలంకు పేరు వచ్చింది.

ట్రావెన్కోర్ సంస్థానానికి వచ్చే యూరోప్ దేశాల అతిథులు

ట్రావెన్కోర్ సంస్థానానికి వచ్చే యూరోప్ దేశాల అతిథులు

1920లలో ట్రావెన్కోర్ ను పరిపాలించిన మహారాణి సేతు లక్ష్మీబాయి తన కోసం ఇక్కడ ఒక తీర విహారకేంద్రాన్ని నిర్మించుకుంది. హాల్సియన్ కాజిల్ గా పిలువబడే ఈ విహారకేంద్రం ఇప్పటికీ కోవలంలోనే ఉంది. మహారాణి మేనల్లుడు, ట్రావెన్కోర్ మహారాజు ఈ తీర నగరాన్ని నిత్యం సందర్శించి స్థానిక కళలకు పోషకుడయ్యాక కోవలం మరోసారి ప్రాముఖ్యంలోకి వచ్చింది. అయితే, ట్రావెన్కోర్ సంస్థానానికి వచ్చే యూరోప్ దేశాల అతిథుల వల్ల నగరం బాగా ప్రసిద్ధి చెందింది. యూరోప్ దేశాల నుండి వచ్చే యాత్రికులకు తీర విహారకేంద్రం అయింది. 1970 ప్రాంతాలలో హిప్పీలు తమ కార్యకలాపాలకు దీన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నారు.

లైట్ హౌస్ తీరం, హవా తీరం, సముద్రా తీరం

లైట్ హౌస్ తీరం, హవా తీరం, సముద్రా తీరం

ఇక్కడి మూడు తీరాలూ పక్కపక్కనే ఉండి 17 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి ఉంటాయి. ఈ మూడు తీరాల్లో పెద్దపెద్ద రాళ్ళూ ఉండటంతో మూడు భాగాలుగా చీలినట్టు ఉంటాయి. ఒక్కడ వున్న లైట్ హౌస్ తీరం, హవా తీరం, సముద్రా తీరం అనే మూడు తీరాలు ఉంటాయి.

హోరెత్తే శబ్దాలతో, దగ్గరగా వచ్చి వెళ్తున్న అలలు

హోరెత్తే శబ్దాలతో, దగ్గరగా వచ్చి వెళ్తున్న అలలు

కోవలం వెళ్ళినపుడు ఈ మూడు తీరాలను చూడాల్సిందే. ఎందుకంటే దేని అందం దానిదే. ఈ మూడు తీరాలలో లైట్ హౌస్ బీచ్ అన్నిటికంటే పెద్దది. ఇక్కడ కురుమ్కల్ కొండమీద 35 మీటర్ల ఎత్తున్న లైట్ హౌస్ ఉండడం వల్ల ఈ తీరానికి ఆ పేరు వచ్చింది. లైట్ హౌస్ తీరానికి, హవా తీరానికి అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. తీరానికి ఉత్తర భాగంలో బీచ్ ఉంటుంది. హావా, లైట్‌హోస్‌ బీచ్‌లు రెండూ ఎదురెదురుగానే ఉంటాయి. హోరెత్తే శబ్దాలతో, దగ్గరగా వచ్చి వెళ్తున్న అలలు మనల్ని మైమరపింపజేశాయి.

 రాత్రి పూట చంద్రుని వెన్నల కాంతులు ఈ నీటిలో గమ్మత్తైనా నీడలను

రాత్రి పూట చంద్రుని వెన్నల కాంతులు ఈ నీటిలో గమ్మత్తైనా నీడలను

హవా తీరం, కోవలం, తిరువనంతపురం హవా తీరం పచ్చని కొబ్బరి చెట్ల తోపులు, నీటితో చక్కగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు, యువకులు స్నానాలు ఆచరించడానికి మక్కువ చూపుతారు. రాత్రి పూట చంద్రుని వెన్నల కాంతులు ఈ నీటిలో గమ్మత్తైనా నీడలను కలగజేస్తాయి. ఇక్కడి విశేషం ఏమిటంటే సముద్ర తీర అందాన్ని ఆస్వాదిస్తూ ... ఆయుర్వేద మసాజ్ చేయించుకోవచ్చు.

హవా తీరాన్ని ఈవ్స్ బీచ్ గా పిలుస్తారు.

హవా తీరాన్ని ఈవ్స్ బీచ్ గా పిలుస్తారు.

హవా తీరాన్ని ఈవ్స్ బీచ్ గా పిలుస్తారు. పూర్వం యూరోపియన్ స్త్రీలు ఇక్కడ అర్ధనగ్నంగా ఈత కొట్టి సూర్యస్నానాలు చేసేవారు, ఐతే ఇప్పుడది నిషేధించారనుకోండి. రాత్రి పూట, చంద్రుడి చల్లని కిరణాలు ఈ నీటిలో గమ్మత్తైన నీడలను కలుగచేస్తాయి. రాత్రి పూట ఈ తీరం పూర్తిగా మరో కోణంలో కనపడుతుంది.

ఈ తీరం అందాన్ని ఆస్వాదిస్తూ

ఈ తీరం అందాన్ని ఆస్వాదిస్తూ

లైట్ హౌస్ తీరంలోని హడావిడి తప్పించుకోవాలనుకునే వారికి ఈ తీరం బాగుంటుంది. ఈ బీచ్ కాస్త ప్రశాంతంగా హాయిగా వుంటుంది. ప్రపంచం నుంచి దూరంగా మీ వారికి చేరువగా గడపాలంటే ఇది సరైన ప్రదేశం.హవా బీచ్ లైట్ హౌస్ తీరానికి ఎదురుగా వుండి ఈదడం ఇష్టంలేని వాళ్ళతో నిండి వుంటుంది - ఎందుకంటే ఇక్కడి నీటిలో అలలు చాలా శక్తివంతంగా వుంటాయి. ఈ తీరం అందాన్ని ఆస్వాదిస్తూ మీరు ఆయుర్వేద మర్దనా చేయించు కోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X