Search
  • Follow NativePlanet
Share
» » వేములవాడ ధర్మగుండ మహత్యం..!ఆశ్చర్యం కలిగించే కథ..!

వేములవాడ ధర్మగుండ మహత్యం..!ఆశ్చర్యం కలిగించే కథ..!

వందల సంవ్సతరాల చరిత్ర గల వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి పుణ్య క్షేత్రంకి ప్రసిద్ది ఇక్కడికి వచ్చే భక్తజనంతో ఎపుడు కిటకిటలాడుతూ ఉంటుంది .కరీం నగర్ జిల్లాలో ఉన్న వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత

వందల సంవ్సతరాల చరిత్ర గల వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి పుణ్య క్షేత్రంకి ప్రసిద్ది ఇక్కడికి వచ్చే భక్తజనంతో ఎపుడు కిటకిటలాడుతూ ఉంటుంది .కరీం నగర్ జిల్లాలో ఉన్న వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందినది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. ఇక్కడ పరమశివుడు రాజరాజేశ్వర స్వామి పేరుతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శివుడు పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలిశాడు.

ప్రాచీన కాలానికి సంబంధించిన సంస్కృతీ-సంప్రదాయాలు, ఆచారాలు, కళలు ఉట్టిపడేలా ఇప్పటికీ దేశంలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అటువంటి కట్టడాల్లో వేముల వాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో విశేషమైనది. చాళుక్యులు ఎంతో వైభవంగా నిర్మించిన ఈ క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. ఈ ఆలయాన్ని సందరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు.

స్థల పురాణం:

స్థల పురాణం:

భాస్కర, హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న ఆ ఆలయం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట.

Photo Courtesy: anwar.babu

 ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని

ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని

కొలను సమీపంలో కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణగాథ ఉంది. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.

Photo Courtesy: telangana tourism

ధర్మగుండం లో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకొని

ధర్మగుండం లో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకొని

ఇక్కడికి వచ్చే భక్తులు మొదట ధర్మగుండం లో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకొని ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాడ నమ్మకం.

ఈ ధర్మగుండం వెనుకు ఒక కథ ఉంది.

ఈ ధర్మగుండం వెనుకు ఒక కథ ఉంది.

ఈ ధర్మగుండం వెనుకు ఒక కథ ఉంది. రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేముల వాడ ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడ నెలకొని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతంలో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది. ఇక్కడ బసచేయడానికి అనువైన ప్రదేశంగా ఉండటం వల్ల బోధి చెట్టు క్రింద సేద తీర్చుకున్నాడు.

తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానమాచరించుటకు

తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానమాచరించుటకు

తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానమాచరించుటకు పక్కనే ఉన్న కోనేరులో దిగగానే ఒక్కసారిగా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినట్లు అనిపించింది. అంతే చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయంలో సంపూర్ణ ఆరోగ్యంతో తన వ్యాధి నయం అయి బటయకు వచ్చాడు.

PC: www.facebook.com

అంతే ఆ రోజు బోధివృక్షం క్రింద గల దక్షిణామూర్తి (శివలింగం)కు

అంతే ఆ రోజు బోధివృక్షం క్రింద గల దక్షిణామూర్తి (శివలింగం)కు

అంతే ఆ రోజు బోధివృక్షం క్రింద గల దక్షిణామూర్తి (శివలింగం)కు పూజనాచరించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వరపోతూ ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ చెట్టు క్రింద వాలిపోయాడు. కొద్ది సేపటి తర్వాత జనం అలజడికి మేల్కొని చూడటగా అక్కడ ఒక మహాముని కూర్చుండి, వ్యాధి గ్రస్తులయిన వారికి కోటనేటి నీటితో వైద్యం చేస్తూ కనిపించాడు.

PC: www.facebook.com

ఆ మహామునికి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు

ఆ మహామునికి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు

ఆ మహామునికి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తిని నాకు అతిబయంకరమైన కుష్టు వ్యాధి వ్యాపించినది ఎన్నో ప్రదేశాలు తిరిగా..ఎన్నో పుణ్యనదులలో స్నానమాచరించా కానీ ఈ కోనేటిలో మునగగానే నా వ్యాధి దూరమైంది ఎలా? అని నా సందేహం నివృతి చేయండి స్వామి అంటూ ప్రాదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధంగా చెప్పాడు.

ఈ కోటి అడుగు భాగమున అష్టదిక్కల కాలబైరవ జ్వలముకి బహుముకి

ఈ కోటి అడుగు భాగమున అష్టదిక్కల కాలబైరవ జ్వలముకి బహుముకి

ఈ కోటి అడుగు భాగమున అష్టదిక్కల కాలబైరవ జ్వలముకి బహుముకి ...దేవతలు కొలువుతీరి ఉన్నారు అందుకే ఈ కోనేటికి కలియుగాంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడి గుండంలో ఇప్పటికీ నీరు పూర్తిగా తొలగిస్తే మనకు ఆ కోనేరు అడుగు భాగంలో ఆ విగ్రహాలు కనిపిస్తాయి.

PC: www.facebook.com

గండం దీపాన్ని వెలిగించడం కూడా

గండం దీపాన్ని వెలిగించడం కూడా

పవిత్రమైన గండందీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని ఇక్కడి భక్తులు భావిస్తారు. దర్శ గుండం కోనేరు రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నది. ఈ కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. ఈ కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి.

Photo Courtesy: anwar.babu

ఈ ఆలయంలో శివరాత్రి రోజున

ఈ ఆలయంలో శివరాత్రి రోజున

ఈ ఆలయంలో శివరాత్రి రోజున వంద మంది ఈ ఆలయంలో శివరాత్రి రోజున వంద మంది అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. అప్పుడు దేవాలయాన్ని మూడు లక్షలకుపైగా భక్తులు సేవించుకుంటారు. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్థరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.

PC: www.facebook.com

వేములవాడకు ఎలా వెళ్లాలి?

వేములవాడకు ఎలా వెళ్లాలి?

వేములవాడ లో ఎటువంటి విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ లేదు. కేవలం హైదరాబాద్ నుండి ప్రతిరోజు పరిమిత సమయంలో మాత్రమే బస్సులు ఉన్నాయి. ప్రయాణ సమయం ప్రభుత్వ బస్సులో అయితే 4 గంటల 3 నిమిషాలు, అదే త్వరగా చేరుకోవాలంటే క్యాబ్ ద్వారా 2 గంటల 52 నిమిషాల సమయం పడుతుంది.
విమాన మార్గం
వేములవాడ లో ఎటువంటి విమానాశ్రయం లేదు. దీనికి సమీపంలో ( 205కి. మీ) గల విమానాశ్రయం హైదరాబాద్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి క్యాబ్ లేదా ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా వేములవాడ చేరుకోవచ్చు లేకుంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు వేములవాడ కి నడిచే బస్సులో ప్రయాణించవచ్చు.
రైలు మార్గం
వేములవాడ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు కానీ, 67 కి. మీ. దూరంలో ఉన్న కామారెడ్డి రైల్వే స్టేషన్ దీనికి సమీపంలో గల రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ప్రధాన కూడలి గా ఉన్నది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబై, పూణే, భోపాల్ వంటి నగరాలకు ప్రయాణించవచ్చు. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గల ఒక ప్రధాన రైలు కూడలి.
రోడ్డు మార్గం
హైదరాబాద్ నగరానికి సుమారు 150 కి. మీ .దూరంలో ఉన్న వేములవాడకి ప్రతిరోజు ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. అదే విధంగా 32 కి. మీ. దూరంలో ఉన్న జిల్లా ముఖ్య పట్టణం కరీంనగర్ నుండి కూడా ప్రతిరోజు అరగంటకోసారి ప్రభుత్వ బస్సులు నడుపుతుంటారు ఆర్టీసీ అధికారులు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X