Search
  • Follow NativePlanet
Share
» »పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాళ్ళో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాళ్ళో తెలుసా !

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది.

By Venkatakarunasri

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి.

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని పూర్వం తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి.తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు పాండ్య రాజులు, 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. ఇక్కడ లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర బయటపడింది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడట.1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

1518 సెప్టంబర్ 9న ఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు. ఇక విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాం ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి వశమైంది. ఈస్టిండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి క్రీ.శ.1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. క్రీ.శ.1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ... మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు ఆ సమయంలో.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

తిరుమల నిర్వహణ హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హథీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలూ కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25వేలకు పెరిగింది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

30 ఏళ్ల క్రితం వరకూ కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకొనేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించారు.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించి బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదేనెల పదోతేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్ధర్‌హోప్ రోడ్డుమార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటిసత్రం నుంచి రోజుకు మూడుసార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

1955-56లో రైల్వేస్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్‌రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అదీ పూర్తయింది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

వాతావరణం

వేసవి వేసవి వేసవి కాలంలో తిరుపతి లో వాతావరణం చాలా అసౌకర్యంగా ఉండడం వల్ల ఈ సమయంలో పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించరు. ముఖ్యంగా ఇక్కడ ఏప్రిల్, మే నెలల్లో 40° -45° డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షాకాలం వర్షాకాలం జులై, సెప్టెంబర్ నెలలలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి, అయినప్పటికీ అక్టోబర్, నవంబర్ మాసాలలో తరచుగా భారీ వర్షాలు పడతాయి. ఈ వర్షాల రాకతో ఉపశమనం కలుగుతుంది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

వాతావరణం

తేలికపాటి వర్షాల సమయంలో తిరుపతి అందంగా, తాజాగా కనిపిస్తుంది. చలికాలం శీతాకాలం సంవత్సరంలో డిసెంబర్, ఫిబ్రవరి నెలలలో ఉండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం ఉత్తమం. ఇక్కడి ఉష్ణోగ్రత 15° - 30 ° ల మధ్య ఉంటుంది. ఇక్కడి ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత చాలామంది ప్రయాణీకులకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది.

pc: youtube

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాల్లో తెలుసా !

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X