Search
  • Follow NativePlanet
Share
» »యుగాంతాన్ని ఈ క్షేత్రంలో చీమలు, ఈగలు ముందుగా చెబుతాయి

యుగాంతాన్ని ఈ క్షేత్రంలో చీమలు, ఈగలు ముందుగా చెబుతాయి

మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని వింతను గురించి.

By Kishore

చలా 'మని'లోకి వచ్చిన నోటు పై ఉన్న ఈ క్షేత్రంలోనే సూర్యుడు తపస్సు చేశాడు. సందర్శిస్తేచలా 'మని'లోకి వచ్చిన నోటు పై ఉన్న ఈ క్షేత్రంలోనే సూర్యుడు తపస్సు చేశాడు. సందర్శిస్తే

మాతృశ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రపంచంలోని ఏకైక పుణ్యక్షేత్రం మన దేశంలోనేమాతృశ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రపంచంలోని ఏకైక పుణ్యక్షేత్రం మన దేశంలోనే

బహిస్టు వస్త్రం, మద్యం ఇక్కడ ప్రసాదాలుబహిస్టు వస్త్రం, మద్యం ఇక్కడ ప్రసాదాలు

యుగాంతాన్ని సూచించే ప్రాంతాల్లో మంగళగిరి కూడా ఒకటి. మంగళగిరిలోని మూల విరాట్టును లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. ఆయనకు మరోపేరు పానకాల లక్ష్మీ నరసింహస్వామి. యుగాంతానకి, పానకానికి, ఈగలకు, చీమలకు ఇక్కడ సంబంధ ఉంది. యుగాంతం ఎప్పటికీ ఉత్సుకతను కలిగించే విషయమే. అయితే ఈ యుగాంతాన్ని చీమలు, ఈగలు ఎలా ముందుగా సూచిస్తాయో తెలుసుకోవడానికి మొదట మంగళగిరి, అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు పురాణ ప్రాధాన్యతను కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.

1.రాక్షసరాజును సంహరించి

1.రాక్షసరాజును సంహరించి

Image Source:

పూర్వ కాలంలో ఇక్కడ నముచి అనే రాక్షసరాజు ఉండే వాడు. అతను బ్రహ్మచేత వరం పొంది దేవతలను, మునులను విమరీతంగా వేధించేవాడు. దీంతో వారంతా కలిసి విష్ణువును వేడుకొనగా స్వామి ఉగ్ర నరసింహుడి రూపంలో సదరు రాక్షసుడిని సంహరించాడు.

2. ఉగ్రరూపాన్ని చూడలేకపోయారు

2. ఉగ్రరూపాన్ని చూడలేకపోయారు

Image Source:

అయితే అంతటి ఉగ్రరూపాన్ని దేవతలు చూడలేక పోయారు. దీంతో ఆ ఉగ్రరూపాన్ని చల్లార్చడం కోసం పానకం సమర్పించారు. ఆ కారణంగానే ఇక్కడ స్వామివారికి పానకం ఇచ్చే ఆనవాయితి మొదలయ్యిందని స్థల పురాణం చెబుతుంది.

3. లక్షల ఏళ్లనాటి చరిత్ర

3. లక్షల ఏళ్లనాటి చరిత్ర

Image Source:

మంగళగిరిని కోటాద్రి అని, స్తుతాద్రి అని, మంగళాద్రి అని కూడా పిలుస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లీలా విశేషాలకు వేదికలా ఉన్న ఈ దివ్య క్షేత్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కొన్ని లక్షల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది.

4. పురాణ పురుషులందరూ

4. పురాణ పురుషులందరూ

Image Source:

పురకుత్సుడనే మహారాజు ఇక్కడ స్వామివారిని సేవించి అనేక గోదాన, భూదాన, సువర్ణ దానాలిచ్చినట్లు చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే రఘువంశజుడైన శంఖ భూపాలుడు, యయాతి మహారాజు; చంద్ర వంశజుడైన ఇంద్రద్యుమ్నుడు
ఇక్కడ స్వామిని సేవించి మాన్యాలు ఇచ్చినట్లు ప్రతీతి.

5. రెండు దేవాలయాలు

5. రెండు దేవాలయాలు

Image Source:

ఇక్కడ ఉన్న రెండు దేవాలయాలు ఉన్నయి. వాటిలో కింద ఉన్న దేవాలయాన్ని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అని అంటారు. అదే విధంగా పైన ఉన్న దేవాలయాన్ని పానకాల స్వామి దేవాలయంగా పిలుస్తారు. ఇక్కడ విగ్రహం ఉండదు.

6. ఒక రంద్రం మాత్రమే

6. ఒక రంద్రం మాత్రమే

Image Source:

ఒక రాతికి మూతి ఆకారంలో ఒక రంధ్రం మాత్రం ఉంటుంది. ఆ రంధ్రాన్నే పానకాల స్వామిగా భక్తులు చెబుతుంటారు.ఇక్కడ ఉన్న పానకాల స్వామికి మరో ప్రత్యేకత ఉంది. మనం ఎంత పానకాన్ని స్వామి వారికి అభిషేకం చేసినా అందులో సగం మాత్రమే తాగి మిగిలిన సగభాగాన్ని భక్తులకు వదిలి పెడుతాడు.

7. ఇక్కడ ఈగలు, చీమలు చేరవు

7. ఇక్కడ ఈగలు, చీమలు చేరవు

Image Source:

సాధారణంగా పానకం ఉన్న చోట ఈగలు, చీమలు చేరుతాయి. అయితే మంగళగిరిలో ఇందుకు విరుద్ధం. ఇక పానకాల తయారి సందర్భంగా పానకం ఎంత ఒలికినా ఈగలు, చీమలు ఇక్కడ చేరవు. కలియుగం అంతమయ్యే సమయంలో ఈ పానకాల దేవాలయం ఈగలు, చీమలు ఎక్కువ చేరి పోతాయని స్థల పురాణం చెబుతుంది.

8. ఇందుకు సమాధానమేది

8. ఇందుకు సమాధానమేది

Image Source:

అయితే హేతువాదులు మాత్రం మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని చెబుతారు. ఈ అగ్ని పర్వతంలో పెద్ద మొత్తంలో గంధకం ఉందని చెబుతారు. అందువల్లే ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేదుకే పానకాన్ని నివేదించాలని దేవుని పేరట పానకాలను ఆ అగ్ని పర్వతం లోపలికి వెళ్లే ఏర్పాటు చేస్తున్నారని చెబుతారు. అయితే ఆ ఈగలు, దోమలు ఎందుకు చేరడం లేదన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం మాత్రం ఉండటం లేదు.

9. ఎతైన గాలి గోపురం

9. ఎతైన గాలి గోపురం

Image Source:

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ గాలి గోపురం రాష్ర్టంలోనే ఎతైన గాలి గోపురాల్లో ఒకటి. దీనిని 1807లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. దీని నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. మొత్తంగా ఈ గోపురం11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తు ఉంటుంది.అయితే ఇంత ఎత్తు గాలి గోపురం కేవలం 49 అడుగుల వెడల్పు ఉన్న పీఠం పై నిలబడటం విశేషం.

10. ఎంతో మంది సందర్శించారు

10. ఎంతో మంది సందర్శించారు

Image Source:

ప్రాచీన కాలం నుంచి ఈ మంగళగిరిని ఎంతో మంది సందర్శించినట్లు ఈ క్షేత్రాన్ని ఎంతో మంది ముఖ్యులు సందర్శించినట్లు తెలుస్తుంది. ఇందులో అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామానుజా చార్యులు, దైత సిద్ధాంత ప్రచార కర్త మద్వాచార్యలు వంటి వారు కూడా ఉన్నారు.

11. విజయ స్థూపం

11. విజయ స్థూపం

Image Source:

ఇక శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆయన మంత్రి తిమ్మరుసు మంగళగిరిని సందర్శించి విజయ స్థూపాన్ని నిర్మింపజేశాడు. పానకాల స్వామి దేవాలయం మెట్ల మొదట్లో ఈ శాసనం ఉంది. శ్రీ క`ష్ణ దేవరాయలు కొండవీటిని జయించినందుకు గుర్తుగామహామంత్రి తిమ్మరుసు ఈ శాసనాననని వేయించారని చెబుతారు. అదే విధంగా కొండవీటి మంత్రి సిద్ధరాజు తిమ్మరాజు

12. పెద్ద కోనేరు

12. పెద్ద కోనేరు

Image Source:

మంగళగిరి మధ్యలో అర ఎకరం వైశాల్యంలో పెద్ద కోనేరు ఉంటుంది. దీనినే కళ్యాణ పుష్కరిణి అంటారు. ఇది చాలా లోతుగా ఉంటుంది. దీనికి నాలుగు వైపులా మెట్లు ఉంటాయి. ఈ కోనేటి నీటితోనే దేవుడిని అభిషేకం చేస్తారు. కాగా ఈ పుష్కరిణి కింద బంగారు గుడి ఉందని చెబుతారు.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ 1883లో గార్డన్ మెకెంజీ జిల్లా మాన్యువల్ లో కూడా రాశాడు. గుడి అభివృద్ధి కోసం అనేక భూములను దానంగా కూడా అందజేసారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X