Search
  • Follow NativePlanet
Share
» »అప్పుల బాధలను తొలగించే గణపతి ఉన్న పంచారామాల్లోని ఒక క్షేత్రం

అప్పుల బాధలను తొలగించే గణపతి ఉన్న పంచారామాల్లోని ఒక క్షేత్రం

పంచారామాల్లో ఒకటైన క్షీరారామం పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

హిందూ మతంలో తీర్థయాత్రల పర్యటన ఒక ప్రధాన ఘట్టం. ప్రతి హిందువూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. దీని వల్ల చేసిన పాపాలు పోతాయని నమ్మకం. ఈ నేపథ్యంలో కొన్ని తీర్థయాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. చాలా పుణ్యక్షేత్రాల్లో ఒక దేవాయం ఉంటుంది. ఆ దేవాలయం సందర్శనతో ఆ పుణ్యక్షేత్ర పర్యటన ముగుస్తుంది.

అయితే కొన్ని తీర్థయాత్రల్లో మాత్రం వివిధ చోట్ల ఉన్న వేర్వేరు దేవాలయాలను సందర్శించినప్పుడు మాత్రమే ఆ తీర్థయాత్ర పూర్తయినట్లు హిందువులు భావిస్తారు. అటువంటి కోవకు చెందినదే చార్ ధామ్ యాత్ర, మహామహం, పంచారామాల దర్శనం, పంచ కేశవ ఆలయాల దర్శనం తదితరులు.

ఇందులో పంచారామాలు అన్నీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. అవి ద్రాక్షారామం, క్షీరారామం, అమరావతి, కుమారారామము, భీమారామము.ఇందులో ఒక దేవాలయంలో అప్పుల బాధలను పోగొట్టే గణపతి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయ విశిష్టతకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం

అత్యంత ప్రాధాన్యత కలిగిన తీర్థయాత్ర

అత్యంత ప్రాధాన్యత కలిగిన తీర్థయాత్ర

P.C: You Tube

హిందూ మతంలో పంచారామాల సందర్శనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ పంచారామాలు ఆంధ్రప్రదేశ్ లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేర్వేరు చోట్ల ఉన్నయి. అవి ద్రాక్షారామం, క్షీరారామం, అమరావతి, కుమారారామము, భీమారామము.

ఒకే లింగం నుంచి

ఒకే లింగం నుంచి

P.C: You Tube

ఈ పంచారామాలు అన్నీ ఒకే లింగం నుంచి ఏర్పడినట్లు స్థల పురాణం చెబుతుంది. అదే విధంగా ఈ లింగాలను వేర్వేరు పురాణ పురుషులు వేర్వేరు సందర్భాల్లో ప్రతిష్టించినట్లు సదరు పురాణాలు స్పష్టం చేస్తాయి.

కుమారస్వామి జననం

కుమారస్వామి జననం

P.C: You Tube

అసలు ఈ పంచారామాలు ఏర్పడటానికి, కుమారస్వామి జననానికి ప్రత్యక్ష సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ పంచారామాలకు సంబంధించిన కథనాన్ని స్కంధపురాణంలో తారకాసుర ఘట్టంలో అత్యంత మనోహరంగా చెప్పబడింది.

హరిణ్యకశిపుడి మనుమడు

హరిణ్యకశిపుడి మనుమడు

P.C: You Tube

హిరణ్యకశిపుడి మనుమడైన తారకాసురుడు గొప్ప శివభక్తుడు. తన తాత మరణానికి కారణమైన విష్ణువు పై పగను పెంచుకొన్న తారకాసురుడు ఆయనను పూజించే మునులను గందర్వులను తీవ్రంగా హింసుస్తుంటాడు.

విష్ణువు పై యుద్ధానికి

విష్ణువు పై యుద్ధానికి

P.C: You Tube

ఈ నేపథ్యంలో హిరణ్యకశిపుడి చావుకు కారణమైన విష్ణువు పై యుద్ధానికి వెళ్లాలని భావిస్తాడు. ఇందుకోసం అవసరమైన శక్తిసామార్థాలు సముపార్జించాలని భావించి పరమశివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. ఈయన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు.

ఆత్మలింగం

ఆత్మలింగం

P.C: You Tube

అంతేకాకుండా తారకాసురుడి కోరిక మేరకు తన ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా కేవలం బాలుడి చేతిలో మాత్రమే మరణించేలా వరం ప్రసాదిస్తాడు. దీంతో తారకాసురుడికి పరమశివుడితో సమానమైన శక్తిసామర్థ్యాలు సమకూరుతాయి.

శివుడి వద్దకు

శివుడి వద్దకు

P.C: You Tube

ఈ పరిణామాలతో రెచ్చిపోయిన తారకాసురుడు మునులను, గందర్వులతో పాటు దేవతలను హింసించడం మొదలుపెడుతాడు. ముఖ్యంగా విష్ణు ప్రభ్తులను చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. దీంతో భీతిల్ల శివుడి దగ్గరకు వెళ్లి శరణు వేడుతారు.

అతడిని సంహరిస్తాడు

అతడిని సంహరిస్తాడు

P.C: You Tube

వారి కోరిక మేరకు ఆ బోళాశంకరుడు, పార్వతి దేవిలకు తారకాసురుడిని సంహరించే శక్తి, యుక్తులు కలిగిన కుమారస్వామి జన్మిస్తాడు. ఆయన దేవతలను తన వెంట తీసుకువెళ్లి తారకాసురిడితో యుద్ధం చేసి అతడిని సంహరిస్తాడు.

వేర్వేరు పురాణ పురుషులు

వేర్వేరు పురాణ పురుషులు

P.C: You Tube

అంతేకాకుండా అతని శరీరంలో ఉన్న శివలింగాన్ని తన బాణంతో ఐదు ముక్కలు చేస్తాడు. ఆ ఐదు ముక్కలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో పడిపోతాయి. ఆ ఐదు ముక్కలు పడిన ప్రాంతాల్లో వేర్వేరు పురాణ పురుషులు వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు.

పంచారామాల్లో విశిష్టమైనది

పంచారామాల్లో విశిష్టమైనది

P.C: You Tube

దీంతో ఆ ఐదు ప్రాంతాలు పంచరామాలుగా ప్రసిద్ధికెక్కి హిందూ పుణ్యక్షేత్రాల్లో ప్రముఖ వరుసలో నిలుస్తున్నాయి. ఇందులో క్షీరారామము అంత్య విశిష్టమైనది. ఇక్కడి శివలింగమే కాకుండా ఉపాలయాలు కూడా మిక్కిలి శక్తివంతమైనవని స్థానిక ప్రజల విశ్వాసం.

త్రిశూలంతో

త్రిశూలంతో

P.C: You Tube

క్షీరారామమునే పాలకొల్లు, క్షీరపురం, క్షీరపురి, పాలకొలను, ఉపమన్యూపురం, అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇదిలా ఉండగా ఉపమన్యుడనే శివభక్త బాలుడి ఆకలి తీర్చడానికి శివుడు తన త్రిశూలంతో ఇక్కడి నేల పై గుచ్చడని చెబుతారు.

పాలు పొంగాయి

పాలు పొంగాయి

P.C: You Tube

దీంతో వెంటనే పాలధారలు పొంగి పొర్లాయని చెబుతారు. ఈ కారణం వల్లే ఈ క్షేత్రానికి క్షీరపురం అని పాలకొల్లు అనే పేర్లు వచ్చయని చెబుతారు. క్షీరం అంటనే పాలు. ఆ పేరు మీదుగానే ఈ క్షేత్రానికి పాలకొల్లు అని పేరు వచ్చినట్లు చెబుతారు.

ఆత్మలింగంలోని పై భాగం

ఆత్మలింగంలోని పై భాగం

P.C: You Tube

ఇక ముక్కలైన ఆత్మలింగంలో పై భాగంలోని ముక్క పాలకొల్లులో పడినట్లు చెబుతారు. అందువల్లే ఈ శివలింగానికి పై భాగం మొనదేలి చూడటానికి శివుడి కొప్పువలే కనిపిస్తుంది. అందువల్లే దీనిని కొప్పు రామలింగేశ్వరుడని పిలుస్తారు.

శ్రీరామ చంద్రుడు

శ్రీరామ చంద్రుడు

P.C: You Tube

ఇక శ్రీరామచంద్రుడు, సీతాదేవి సమేతంగా ఇక్కడి లింగాన్ని ప్రతిష్టించినందువల్ల ఈ క్షేత్రంలోని శివలింగానికి రామలింగేశ్వరమని పేరువచ్చినట్లు చెబుతారు. మరో కథనం ప్రకారం విష్ణువు ఈ లింగాన్ని స్వయంగా ప్రతిష్టించిచారని చెబుతారు.

శ్రీ చక్రం

శ్రీ చక్రం

P.C: You Tube

అందువల్లే ఈ క్షేత్రపాలకుడు విష్ణువయ్యాడని వారు పేర్కొంటారు. అదే విధంగా ఈ క్షేత్రాన్ని ఆది శంకరాచార్యలు వారు సందర్శించి శ్రీ చక్రం ఇక్కడి దేవాలయంలో ప్రతిష్టింపజేశారని చెబుతారు. శ్రీ చక్రం ఉండటం వల్ల ఇది పంచారామ క్షేత్రాల్లో విశిష్టమైనదని భక్తుల నమ్మకం.

రుణ హర గణపతి

రుణ హర గణపతి

P.C: You Tube

మూలవిరాట్టు ఉన్న ఆలయ ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. అటు పక్కనే సుబ్రహమణ్యస్వామి ఆలయం, రుణహర గణపతి ఉపాలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని సందర్శించడం వల్ల అప్పుల బాధలు తీరుతాయని స్థానికుల నమ్మకం.

చాళుక్య భీముడు

చాళుక్య భీముడు

P.C: You Tube

ఈ క్షేత్రంలోని ఆలయాన్ని చాళుక్యభీముడు మొదట నిర్మించగా అటు పై రెడ్డిరాజులు, కాకతీయులు అభివ`ద్ధి చేసినట్లు ఇక్కడి శాసనాల వల్ల కనిపిస్తాయి. ఆలయం రాజగోపురం తొమ్మిది అంతస్తులతో 120 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది.

రామ గుండం

రామ గుండం

P.C: You Tube

ఈ దేవాలయం వద్ద ఉన్న చెరువును రామగుండం అని అంటారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఈ క్షేత్రం ఉంది. ప్రముఖ పట్టణమైన నరసాపురానికి పాలకొల్లుకు మధ్య కేవలం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే.

ఒక్క రోజులో

ఒక్క రోజులో

P.C: You Tube

ఈ క్షేత్రంతో పాటు మిగిలిన పంచారామాలన్నింటిని ఒక్క రోజులోపు చూడవచ్చు. ఇందు కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ యాత్ర తరువాతి రోజు రాత్రి 8 గంటలకు ముగుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X