Search
  • Follow NativePlanet
Share
» »రెండంతస్తుల లింగమంట, సందర్శనతో శత్రుబాధలు తీరునంట

రెండంతస్తుల లింగమంట, సందర్శనతో శత్రుబాధలు తీరునంట

కుమారభీమారామమునకు సంబంధించిన కథనం.

హిందువుల జీవన విధానంలో పుణ్యక్షేత్రాల పర్యటనకు విడదీయరాని బంధం ఉంది. పురాణ కాలం నుంచి ఈ పర్యటన కొనసాగుతూనే ఉంది. సాదారణంగా ఒక పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయాన్ని సందర్శనతో ఆ పర్యటన ముగుస్తుంది. అయితే కొన్ని పర్యటనలు మాత్రం వివిధ ప్రాంతాల్లో ఉన్న వేర్వేరు పుణ్యక్షేత్రాల్లోని వేర్వేరు దేవాలయాలను సందర్శించినప్పుడు మాత్రమే పూర్తి పుణ్యక్షేత్ర ఫలితం అదుతుంది. ఈ కోవకు చెందినవే ఛార్ దామ్ యాత్ర, పంచారామ క్షేత్రాల దర్శనం, పంచకేశవ దేవాలయాల పర్యటన. పంచారామ క్షేత్రాల్లోని ఒక క్షేత్రానికి వివిష్ట ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఉన్న స్వామి, అమ్మవారిని సూర్యకిరణాలు ఒక నిర్థిష్టసమయంలో తాకుతాయి. అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని దర్శించుకొంటే శత్రుభయం ఉండదని చెబుతారు. ఆ క్షేత్రానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం.

పురాణ ప్రాధాన్యత కలిగినది

పురాణ ప్రాధాన్యత కలిగినది

P.C: You Tube

పంచారామల పుట్టకుకకు సంబంధించిన కథలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే రెండిండి సారము ఒకటే. స్కంధపురాణంలోని తారకాసుర వధ ఘట్టాన్ని అనుసరించి హిరణ్యకశ్యపుడి కొడుకు నీముచి. అతని కుడొకే తారకాసురుడు.

 తారకాసురుడు

తారకాసురుడు

P.C: You Tube

ఇతడు కూడా తాతవలే విష్ణు ద్వేశి. పరమశివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమవ్వగానే తనకు చావులేకుండా వరమివ్వాలని కోరుతారు. స`ష్టికి విరుద్ధమైన కోరిక తీర్చలేనని అయితే మరో కోరిక కోరుకోవడానికి అనుమతిస్తానని ఈశ్వరుడు చెబుతాడు.

ఓ బాలుడి చేత

ఓ బాలుడి చేత

P.C: You Tube

దీంతో తారకాసుడు బాగా ఆలోచించి తనకు ఆత్మలింగం కావాలని, అదే విధంగా ఒక బాలుడి చేతిలో తప్ప తనకు ఎవరి చేతనూ చావు ఉండకూడదని ఈశ్వరుడిని కోరుతాడు. దీంతో ఈశ్వరుడు తారకాసురుడికి అతను కోరిన వరాలు ఇస్తాడు.

వర గర్వంతో

వర గర్వంతో

P.C: You Tube

వర గర్వంతో తారకాసుడు దేవతలను, మునులను తీవ్రంగా బాధపెడుతూ ఉంటాడు. దీంతో వారు పరమశివుడిని శరను కోరుతాడు. తమకు అపూర్వ శక్తిమంతుడైన బాలుడిని ప్రసాదించాలని ప్రార్థిస్తారు. దేవతల కోరిక నెరవేరి శివ పార్వతులకు కుమారస్వామి జన్మిస్తాడు.

కుమారస్వామి వధిస్తాడు

కుమారస్వామి వధిస్తాడు

P.C: You Tube

ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుడిని వధిస్తాడు. ఆ సమయంలో అతని శరీరంలో ఉన్న ఆత్మ లింగం ఐదు ముక్కలై ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. అలా పడిన ప్రాంతాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి.

భీమేశ్వర పురాణం

భీమేశ్వర పురాణం

P.C: You Tube

ఇదే కథ శ్రీనాథ మహాకవి రచించిన భీమేశ్వర పురాణంలో మరో రకంగా ఉంది. క్షీరసాగర మధనం అనంతరం వెలువడిన అమృతం తమకు దక్కలేదన్న అసూయతో రాక్షసులు తీవ్రంగా మధనపడుతారు. ఆ అసమయంలో త్రిపురాసులు ఈశ్వరుడిని ప్రార్థించి అపార బల సంపదను పొందుతారు.

త్రిపురాంతకుడిగా

త్రిపురాంతకుడిగా

P.C: You Tube

వర గర్వంతో ప్రజలను, మునులను చివరికి దేవతలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ సమయంలో పరమేశ్వరుడు ఆ త్రిపురాసురులను వధిస్తాడు. ఆ సమయంలో శివుడి త్రిపురాంతకుడిగా పేర్కొంటారు.

ఐదు వేర్వేరు చోట్ల

ఐదు వేర్వేరు చోట్ల

P.C: You Tube

ఈ యుద్ధంలో త్రిపురాసురులు చనిపోయినా వారికి అంతటి శక్తులు రావడానికి కారణమైన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో మహాదేవుడు ఆ పెద్ద లింగాన్ని ఛేదించి ఐదు వేర్వేరు చోట్ల ప్రతిష్టింపజేస్తాడు.

అవే పంచారామాలు

అవే పంచారామాలు

P.C: You Tube

ఆ లింగ ప్రతిష్ట జరిగిన ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ పంచారామాల్లో ఒకటే కుమార భీమారామము. ఇది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోట అనే చిన్న పట్టణంలో ఉంది. ఈ కుమార భీమారామములో ఉన్న దేవుడిని సందర్శిస్తే శత్రుభయం ఉండదని చెబుతారు. అందువల్లే చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడకు వస్తుంటారు.

చాళుక్య రాజు భీముడు

చాళుక్య రాజు భీముడు

P.C: You Tube

పట్టణానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ ఆలయ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఈ దేవాలయంలోని ఈశ్వరుడిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. చాళుక్య రాజైన భీముడు ఈ క్షేత్రంలోని దేవాలయాన్ని నిర్మించాడు.

 రెండు ఆలయాలు ఒకే రకంగా

రెండు ఆలయాలు ఒకే రకంగా

P.C: You Tube

ఈయనే ద్రాక్షారామంలోని దేవాలయాన్ని కూడా కట్టించాడు. అందుకే ఈ రెండు దేవాలయాలు ఒకే నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. అంతేకాకుండా ఈ రెండు దేవాలయాలకు నిర్మించిన రాయి కూడా ఒకటే.

చాలా ఏళ్ల పాటు

చాలా ఏళ్ల పాటు

P.C: You Tube

ఇక కుమార భీమారామములోని దేవాలయ నిర్మాణం క్రీస్తు శకం 892లో ప్రారంభమై క్రీస్తు శకం 922 వరకూ కొనసాగింది. అదే విధంగా క్రీస్తు శకం 1340 నుంచి 1466 మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పున: నిర్మించారు.

శిల్పకళ

శిల్పకళ

P.C: You Tube

ఇక్కడ కాకతీయుల నాటి శిల్పకళ అటు కాకతీయులకు, ఇటు తూర్పు చాళుక్యుల శిల్ప కళా శైలికి అద్దం పడుతుంది. ఇక్కడ ఉన్న శివుడు కాలభైరవుడి రూపంలో ఉంటే అమ్మవారు బాలా త్రిపురసుందరి పేరుతో నీరాజనాలు అందుకొంటున్నారు.

14 అడుగుల ఎత్తు

14 అడుగుల ఎత్తు

P.C: You Tube

గర్భగుడిలో భీమేశ్వరుడి శివలింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది సున్నపురాయితో ఏర్పడింది. ఆలయ నిర్మాణ సమయంలో ఈ శివలింగం అంతకంతకూ పెరిగిపోతుండటాన్ని గమనించిన శిల్పులు శివలింగం పై ఒక మేకును కొట్టారని స్థానిక కథనం.

అగ్ర భాగం మొదటి అంతస్తులో

అగ్ర భాగం మొదటి అంతస్తులో

P.C: You Tube

శివలింగం ఆధారం కింది గదిలో ఉండగా అగ్ర భాగం మొదటి అంతస్తులో ఉంటుంది. భక్తులు మొదట అగ్రభాగ పూజలు చేసి కింది భాగంలో ఉన్న శివలింగాన్ని సందర్శించుకొంటారు. మొదటి అంతస్తు నుంచి కింది అంతస్తుకు చేరుకోవడానికి వీలుగా మెట్ల సౌకర్యం ఉంది.

రెండు ప్రాకారాలు

రెండు ప్రాకారాలు

P.C: You Tube

ఈ దేవాలయం చుట్టూ రెండు ఎతైన ప్రాకారాలు ఉన్నాయి. ఈ ప్రాకారాలు ఇసుక రాయితో నిర్మించారు. వెలుపల ప్రాకారానికి చుట్టూ నాలుగు దిశల్లో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ద్వారాన్ని సూర్య ద్వారం అని అంటారు.

సూర్య కిరణాలు

సూర్య కిరణాలు

P.C: You Tube

ఇక్కడ చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను తాకితే సాయం వేళ అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ విశేషంగా చెప్పుకొంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి, బాలా త్రిపుర సుందరికి వైభవంగా వివాహం జరుపుతారు.

అమ్మవారిని సింహ వాహనం పై

అమ్మవారిని సింహ వాహనం పై

P.C: You Tube

ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనం పై, అమ్మవారిని సింహ వాహనం పై ఊరేగిస్తారు. ఈ ఉత్సవాలను తిలికించడానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకొంటారు.

కుమార భీమారామానికి దగ్గరగా

కుమార భీమారామానికి దగ్గరగా

P.C: You Tube

పంచారామాల్లో మిగిలిన నాలుగు కూడా ఈ కుమార భీమారామానికి దగ్గరగా ఉంటాయి. అవి వరుసగా గుంటూరు జిల్లాలోని అమరారామము, కాకినాడకు దగ్గర్లోని దాక్షారామము, భీమవరంలోని సోమారామము, పాలకొల్లులోని క్షీరామము.

ఒక్క రోజులో పంచారామాల దర్శనం

ఒక్క రోజులో పంచారామాల దర్శనం

P.C: You Tube

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X