Search
  • Follow NativePlanet
Share
» »పౌర్ణమిరోజు శ్వేత వర్ణం, అమావాస్య రోజు నలుపు వర్ణంలోకి మారే ప్రపంచంలోని ఏకైక శివలింగం

పౌర్ణమిరోజు శ్వేత వర్ణం, అమావాస్య రోజు నలుపు వర్ణంలోకి మారే ప్రపంచంలోని ఏకైక శివలింగం

భీమారామమునకు సంబంధించిన కథనం.

భారత దేశంలో లక్షల సంఖ్యలో ఆలయాలు ఉన్నా ఒక్కొక్క ఆలయానిది ఒక్కొక్క విశిష్టత. ఈ విశిష్టతలకు గల కారణాలు సాంకేతికత ఇంతగా అందుబాటులోకి వచ్చిన రోజుల్లో కూడా చెప్పలేకపోతున్నాం. ఇది దైవలీలే అని ఆస్తికులు అంటే కాదు శాస్త్రీయ కోణంలో మరింత పరిశోధనలు జరగాలని నాస్తికులు వాదిస్తున్నారు.

ఏది ఏమైనా ఆ విశిష్ట చమత్కారాలను గమనించడానికి నాస్తికులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటే, దైవానుగ్రహం కోసం ఆస్తికులు ఆ గుళ్లకు వెలుతున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలోని శైవక్షేత్రాల్లో విశిష్టమైన ఒక దేవాలయంలో ఆశ్చర్యకరమైన సంగతి ప్రతి అమావస్య, పౌర్ణమి రోజున మనకు కనిపిస్తుంది.

అమావాస్య రోజున ఆ శివాలయంలోని శివలింగం నలుపు రంగులో ఉంటే పౌర్ణమి రోజున శ్వేత వర్ణంలో మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయం ఎక్కడో కాదు మన తెలుగు నేల పైనే ఉంది. మరెందుకు ఆలస్యం ఆ దేవాలయం విశిష్టతను తెలుసుకొందాం. అంతేకాకుండా సమయం చిక్కినప్పడు అక్కడికి వెలుదాం.

స్కంధ పురాణాన్ని అనుసరించి

స్కంధ పురాణాన్ని అనుసరించి

P.C: You Tube

స్కంధపురాణం ప్రకారం హిరణ్యకశ్యపుడి కొడుకు నీముచి కాగా అతని కొడుకు తారకాసురుడు. విష్ణు ద్వేశి అయిన తారకాసురుడు ఈశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి అమితమైన బల సంపన్నుడిగా మారుతాడు.

ఆత్మలింగం కూడా

ఆత్మలింగం కూడా

P.C: You Tube

అంతే కాకుండా ఆత్మ లింగాన్ని కూడా సంపాదిస్తాడు. మరోవైపు ఓ బాలుడితో తప్ప మరే ఇతరులతో తనకు చావు ఉండకూడదని కోరుకొంటాడు. ఇందుకు పరమశివుడు అంగీకరించి తారకాసురుడు కోరిన కోర్కెలన్నీ ఇచ్చేస్తాడు.

కుమారస్వామి జననం

కుమారస్వామి జననం

P.C: You Tube

తనకు లభించిన వర గర్వంతో తారకాసురుడు దేవతలను, మునులను తీవ్రంగా బాధపెడుతూ ఉంటాడు. దీంతో వారు పరమశివుడిని వేడుకోగా వారి పార్థనను పరమశివుడు మన్నిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మిస్తాడు.

వేర్వేరు ప్రాంతాల్లో

వేర్వేరు ప్రాంతాల్లో

P.C: You Tube

కుమారస్వామి దేవతాగణాలను వెంటపెట్టుకొని వెళ్లి తారకాసురుడిని వధిస్తాడు. ఆ సమయంలో అతని శరీరంలో ఉన్న ఆత్మలింగం ఐదు ముక్కలై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గా పిలువబడే ప్రాంతంలో వేర్వేరు ప్రదేశాల్లో పడ్డాయి.

అవే పంచారామాలుగా

అవే పంచారామాలుగా

P.C: You Tube

అలా పడిన ప్రాంతాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ పంచారామాల గురించి వేర్వేరు పురాణాల్లో వేర్వేరు కథలు ఉన్నా బహుళ ప్రాచూర్యం పొందినది ఈ కథే. ఇదిలా ఉండగా ఐదు ఆత్మలింగం ముక్కలను ఐదుగురు వేర్వేరు పురాణ పురుషులు ప్రతిష్టించి దేవాలయాలు నిర్మించారని చెబుతారు.

చంద్రుడు ప్రతిష్టించాడు.

చంద్రుడు ప్రతిష్టించాడు.

P.C: You Tube

ఈ క్రమంలోనే శివలింగం ఆగ్రభాన ఉన్న ముక్క ప్రస్తుత పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునుపూడిలో పడింది. ఇలా పడిన శివలింగం ముక్కను చంద్రుడు ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి.

అందువల్లే సోమేశ్వుడు

అందువల్లే సోమేశ్వుడు

P.C: You Tube

చంద్రుడికి సోముడన్న పేరు ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే ఈ క్షేత్రాన్ని సోమారామం అని సోమేశ్వర క్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని సోమేశ్వడని పిలుస్తారు.

గురు పత్నిని మోహించి

గురు పత్నిని మోహించి

P.C: You Tube

చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్యను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన నారదుడి సూచనమేరకు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.

చరిత్రను అనుసరించి

చరిత్రను అనుసరించి

P.C: You Tube

ఇక చరిత్రను అనుసరించి చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలు, గోపురాలు నిర్మించినట్లు స్థానికంగా దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది. అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది.

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో

P.C: You Tube

దేవాలయంలోని శివలింగం అమావాస్య రోజు నలుపు రంగులో కనబడుతుంది. అదే విధంగా పౌర్ణమి సమీపించేకొద్ది ఆ శివలింగం రంగు ప్రకాశవంతమై ఆ శివలింగం రంగు శ్వేత వర్ణం అంటే తెలుపు రంగులోకి మారుతుంది.

ఆ రెండు రోజుల్లో సందర్శించాలి

ఆ రెండు రోజుల్లో సందర్శించాలి

P.C: You Tube

అదే విధంగా అమావాస్య దగ్గర పడేకొద్ది రంగును కోల్పోతు చివరికి నలుపురంగులోకి మారుతుంది. ఇది శతాబ్దకాలంగా జరుగుతోందిని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

 శాస్త్రీయ కారణాలు

శాస్త్రీయ కారణాలు

P.C: You Tube

ఇందుకు గల శాస్త్రీయ కారణాలను ఇప్పటి వరకూ ఎవరూ కనుగొనలేక పోయారు. అయితే చంద్రుడి చేత ఈ శివలింగం ప్రతిష్టించడం వల్ల అలా రంగులు మారుతుందని దేవాలయ పూజారులు చెబుతున్నారు.

ఐదు నందులు

ఐదు నందులు

P.C: You Tube

దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటు పై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది.

అందులవల్లే పంచ నందీశ్వర ఆలయం

అందులవల్లే పంచ నందీశ్వర ఆలయం

P.C: You Tube

అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు. ఇదిలా ఉండగా ఆలయం ముందు భాగాన ఉన్న కోనేరు గట్టున రాతి స్తంభం పై ఉన్న నందీశ్వరుడి నుంచి గర్భాలయంలోకి చూస్తే శివలింగం కనిపిస్తుంది.

మూల విరాట్టు కింది అంతస్తులో

మూల విరాట్టు కింది అంతస్తులో

P.C: You Tube

అయితే అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. మొత్తం రెండు అంతస్తుల ఉన్న దేవాలయంలో మూలవిరాట్ అయిన సోమేశ్వరుడు కింది అంతస్తులో ఉంటాడు.

అన్నపూర్ణా దేవి

అన్నపూర్ణా దేవి

P.C: You Tube

అదే గర్భాలయం పై భాగాన ఉన్న రెండో అంతస్తులో పార్వతీ దేవి అన్నపూర్ణాదేవి రూపంలో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా శివుడి పై భాగంలో పార్వతీ దేవి ఉండటం మనం ఇక్కడ మాత్రమే చూడగలం.

 ఐదు రోజుల పాటు ఉత్సవాలు

ఐదు రోజుల పాటు ఉత్సవాలు

P.C: You Tube

ఈ క్షేత్రంలో ప్రతిసారి మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారి కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు బ్రహ్మండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కొన్ని లక్షల మంది భక్తులు హాజరవుతారు. అదేవిధంగా ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్విహిస్తారు.

ఒకే రోజు దర్శనం

ఒకే రోజు దర్శనం

P.C: You Tube

పంచారామాల సందర్శన వల్ల మోక్షం లభిస్తుందని చెబుతారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పంచారామాలను ఒక్క రోజులో సందర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిప్పిస్తున్నారు. ఇందుకోసం ముందుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X