Search
  • Follow NativePlanet
Share
» »ఐటీ నగరిలోనూ ఆధ్యాత్మిక గుభాళింపులు

ఐటీ నగరిలోనూ ఆధ్యాత్మిక గుభాళింపులు

బెంగళూరులో ఉన్న అత్యంత ప్రచీన, ప్రాచుర్యం చెందిన దేవాలయాలకు సంబంధించిన కథనం.

By Kishore

బెంగళూరు అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద అద్దాల మేడలు. అందులో కీబోర్డులను టక టక లాడించే ఐటీ ఉద్యోగులు. మరికొంతమందికి అత్యంత ఫ్యాషనబుల్ సిటీ బెంగళూరు. అయితే బెంగళూరుకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ నగరం కూడా ఆధ్యాత్మికతకు నెలవు. విజయనగర రాజులు, హొయసల, పల్లవుల రాజులు నిర్మించిన ఎన్నో దేవాలయాలు ఈ నగరంలో ఉన్నాయి. అందులో దొడ్డ గణపతి దేవాలయం, బుల్ టెంపుల్, హలసూరు సోమేశ్వర దేవాాలయం, గవి గంగాధరేశ్వర దేవాలయం వంటి ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇస్కాన్, కెంఫోర్ట్ లోని శివుడి దేవాలయం వంటి ఇటీవల నిర్మించిన దేవాలయాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెలుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో అత్యంత ప్రాచీన, ప్రాచూర్యం పొందిన దేవాలయాల వివరాలు మీ కోసం

శృంగార తీరాల్లో ఈ పరిమళాలు ఆస్వాధించారా?శృంగార తీరాల్లో ఈ పరిమళాలు ఆస్వాధించారా?

ఈ రాశి వారు రొమాంటిక్ కింగ్స్ అండ్ క్వీన్స్ఈ రాశి వారు రొమాంటిక్ కింగ్స్ అండ్ క్వీన్స్

1. దొడ్డ గణేష దేవాలయం

1. దొడ్డ గణేష దేవాలయం

Image source:

బెంగళూరులో అత్యంత ప్రాచీన, ప్రాముఖ్యమైన దేవాలయాల్లో దొడ్డ గణేష దేవాలయం ఒకటి. బెంగళూరు నగర స్థాపకుడిగా పేరుగాంచిన కెంపేగౌడ ద్వారా ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతారు. ఇక్కడ గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడగుల వెడల్పుతో ఉంటుంది. భారత దేశంలోని అతి పెద్ద వినాయక విగ్రహాల్లో ఇది కూడా ఒకటి. వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి.

ఈ ఆలయాన్ని ఉదయం 5.30 నుండి రాత్రి 8.30 వరకు సందర్శించవచ్చు.

2. చొక్కనాథ స్వామి దేవాలయం

2. చొక్కనాథ స్వామి దేవాలయం

Image source:

నగరంలో అత్యంత పురాతన దేవాలయాల్లో చొక్కనాథ స్వామి దేవాలయం కూడా ఒకటి. ఇది చోళుల కాలం నాటిది. ఈ దేవాలయంలో ప్రధానంగా విష్ణువును అర్చిస్తారు. ఈ దేవాలయం దొమ్మలూరులో ఉంది.
ఇక్కడ శిల్పకళ చూడముచ్చటగా ఉంటుంది.

3. గవి గంగాధరేశ్వర స్వామి దేవాలయం

3. గవి గంగాధరేశ్వర స్వామి దేవాలయం

Image source:

ఇది ఒక గుహాలయం. ఇక చిన్న రాతి పర్వతాన్ని తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. అదే విధంగా అగ్ని దేవుడికి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఇక్కడ పూజిస్తారు. శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

ఎక్కడ ఉంది.... గవిపురం, కెంపేగౌడ నగర్, బెంగళూరు 560019

4. కెంఫోర్ట్, శివాలయం

4. కెంఫోర్ట్, శివాలయం

Image source:

నగరంలో అత్యంత ఎతైన శివుడి విగ్రహం ఉన్న దేవాలయం కెంఫోర్ట్. విగ్రహం ఎత్తు సుమారు 65 అడుగులు. ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆ ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు.

ఎక్కడ ఉంది. ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డ్, బెంగళూరు

5. బనశంకరి దేవాలయం

5. బనశంకరి దేవాలయం

Image source:

నగరంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో బనశంకరి అమ్మవారి దేవాలయం కూడా ఒకటి. దీనిని 1915లో నిర్మించబడింది. రాహుకాలంలో ఇక్కడి అమ్మవారిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలుగుతాయని చెబుతారు. సెప్టెంబర్ 13న అమ్మవారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుతారు. అదే విధంగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో వందల సంఖ్యలో భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొంటూ ఉంటారు.

ఎక్కడ ఉంది.... బనశంకరి, బెంగళూరు

6. బుల్ టెంపుల్

6. బుల్ టెంపుల్

Image source:

దొడ్డ గణేష దేవాలయం దగ్గరగానే ఈ బుల్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. అయితే ఆయన వాహనమైన నంది విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఒకే రాతిలో దాదాపు 15 అడుగుల ఎత్తున ఉన్న నంది విగ్రహం చెక్కబడింది. ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 1537లో నిర్మించారని ఇక్కడ లభించిన శాసనాల వల్ల తెలుస్తోంది.

ఎక్కడ ఉంది....బుల్ టెంపుల్ రోడ్, బసవనగుడి, బెంగళూరు.

7. ఇస్కాన్ దేవాలయం

7. ఇస్కాన్ దేవాలయం

Image source:

బెంగళూరులో ఎక్కువ మంది భక్తులు సందర్శించే దేవాలయాల్లో ఇస్కాన్ కూడా ఒకటి. దీనిని 1997లో నిర్మించారు. చిన్న గుట్ట పై నిర్మించిన ఈ దేవాలయంలో ప్రధాన దైవం కృష్ణుడు, రాధ. ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ దేవాలయం తెరుస్తారు. అటు పై రెండు గంటలు మూసి వేసి 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ తెరిచి ఉంచుతారు. మధ్యాహ్నం ఆలయాన్ని మూసి వేస్తారు. మరళ సాయంత్రం 4 గంటల నుంచి 8.30 గంటల వరకూ ఈ దేవాలయం తెరిచి ఉంచుతారు.

ఎక్కడ ఉంది. యశ్వంతపుర మెట్రో స్టేషన్ సమీపంలో, బెంగళూరు.

8. చెన్నకేశవ దేవాలయం

8. చెన్నకేశవ దేవాలయం

Image source:

నగరంలోని అత్యంత పురాతన దేవాలయాల్లో చెన్నకేశవ దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. దీనిని విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. అద్భుతమైన శిల్ప సంపద ఈ వైష్ణవాలయం సొంతం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఎప్పుడైనా సందర్శించవచ్చు.

9. వెంకటేశ్వర స్వామి దేవాలయం

9. వెంకటేశ్వర స్వామి దేవాలయం

Image source:

దాదాపు 3 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం బెంగళూరులోని అత్యంత పురాతన వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. అయితే 1791లో జరిగిన మైసూరు యుద్ధంలో ఇది పూర్తిగా దెబ్బతిన్నది. అయితే మరళా పునరుద్ధరించారు. ఈ దేవాలయం స్తంభాల పై ఉన్న శిల్పాలు భారతీయ శిల్ప సంపదకు అద్దం పడుతాయి.

ఎక్కడ ఉంది....బసనవన గుడి, బెంగళూరు

10. సోమేశ్వరనాథ స్వామి దేవాలయం, హలసూరు

10. సోమేశ్వరనాథ స్వామి దేవాలయం, హలసూరు

Image source:

హలసూరులోని సోమేశ్వరనాథ దేవాలయం అత్యంత ప్రాచీనమైనమైనది. ఈ దేవాలయంలోని శిల్ప సంపద చూడ ముచ్చటగా ఉంటుంది. చోళ సామ్రాజ్య కాలంలో దీనిని నిర్మించారు. భారతీయ శిల్ప కళకు అద్ధం పట్టే శిల్ప సంపద ఈ దేవాలయం సొంతం.

ఎక్కడ ఉంది. హలసూరు, బెంగళూరు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X