Search
  • Follow NativePlanet
Share
» »అందమైన రాణులుండే కోట !

అందమైన రాణులుండే కోట !

శనివార్ వాడా దీనిగురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ లో దీన్నిగూడా ఒకటిగా చెప్పుకోవచ్చును. మరి దీనివెనకున్న వాస్తవాలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం.

By Venkatakarunasri

శనివార్ వాడా దీనిగురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ లో దీన్నిగూడా ఒకటిగా చెప్పుకోవచ్చును. మరి దీనివెనకున్న వాస్తవాలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం.

దీన్ని బాజీరావ్ పేష్వా నిర్మించారు. అదేనండీ దీపికాపడుకొనే నటించిన బాజీరావ్ మస్తానే అనే సినిమాలోని బాజీరావ్ పాత్ర. మరి చరిత్రలోని ఆ బాజీరావే ఈ మహల్ ను నిర్మించారు.

అందమైన రాణులుండే కోట !

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

పూణే లోని శనివార్ వాడాగా ప్రసిద్ధిచెందిన ఈ కోట అనేక రహస్యాలతో నిండివుంది.మరి భారతదేశంలోనే అనేక కోటలు కాలక్రమంలో బండరాళ్ళుగా మిగిలిపోయాయి.

PC:youtube

శనివార్ వాడా

శనివార్ వాడా

కానీ వాటివెనకనున్న ఎన్నో కథలు, వాటి ఖ్యాతి మాత్రం అలాగే మిగిలివుంది.కాబట్టి మనం ఈ వ్యాసంలో అలాంటి కధనాలతో కూడిన శనివార్ వాడా గురించి తెలుసుకుందాం.

PC:youtube

ఎవరు నిర్మించారు?

ఎవరు నిర్మించారు?

ఈ కోటను 1730లో పేష్వా బాజీరావ్ నిర్మించారు. కానీ ఆ సమయంలో ఎవరూ అనుకొనివుండరు వూహించివుండరు.అంత అందమైన కోట ఒక భయాన్ని కలిగించే ఒక బండరాయిగా మిగిలిపోతుందిఅని అయితే కొందరి కథనాల ;ప్రకారం ఇదంతా ఒక స్త్రీ శాపంవల్లనే అయిందని అంటారు.

PC:youtube

చరిత్ర సృష్టించిన వాడా

చరిత్ర సృష్టించిన వాడా

మరి చరిత్ర సృష్టించాలన్నా ఆ చరిత్రను నాశనం చేయాలన్నా స్త్రీల వల్లే అవుతుంది అనటానికి చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తాయి.కాబట్టి ఈ కథకూడా నిజమే కావచ్చు అనుకుందాం.

PC:youtube

బాజీరావు

బాజీరావు

అయితే శనివార్ వాడా నిర్మించిన సంవత్సరం లోపే బాజీరావు మరణించారు. తర్వాత సింహాసనం అధిష్టించినవారుకూడా ఎవ్వరూఎక్కువ కాలం జీవించలేదు.

PC:youtube

స్త్రీశాపం

స్త్రీశాపం

ఇందాక చెప్పినట్లు ఒక స్త్రీశాపం వల్ల ఇలా అయిందా? లేక ఒక శిథిలమైన భయంకరమైన ఆత్మలు తిరిగే కోటగా మారటానికి కారణం.

PC:youtube

ద్రోహం

ద్రోహం

మరి బాజీరావు యోక్క మొదటిభార్య అయిన కాషుబాయ్ యొక్క స్నేహితురాలు ఆవిడ యొక్క భర్త ని మరాటా సామ్రాజ్యానికి ద్రోహం చేస్తుందనే అనుమానంతో అతడిని చంపుతారు.

PC:youtube

భర్త మరణం

భర్త మరణం

అయితే భర్త మరణంతో ఆమె నాభర్తను చంపిన మీరెవ్వరూ శనివార్ వాడాలో సంతోషంగా జీవించలేరు. అది ఒక బండరాయిగా అవుతుందని శపిస్తుంది. నిజంగానే కాలక్రమంలో ఆ కోటలో తరువాత ఆనందం అనేదేలేదు.

PC:youtube

నారాయణరావ్ పేష్వా ది

నారాయణరావ్ పేష్వా ది

కొందరి కథలప్రకారం ఆ కోటలో ఏదో ఆత్మ తిరుగుతుందని అది బాజీరావ్ మనమడుఅయిన నారాయణరావ్ పేష్వా ది అని అతడి సింహాసనం కోసం అతనియొక్క చిన్నాన్ననే అత్యంత దారుణంగా చంపివేసాడు అందువల్ల అతని ఆత్మఅనేది ఆ కోటలో తిరుగుతుందని నమ్ముతారు.

PC:youtube

మస్తానీ

మస్తానీ

మరి అంతేకాకుండా బాజీరావుయొక్క ప్రేమికురాలైన మస్తానీ కూడా ఆ కోటలో మరణించిందని ఆమె యొక్క ఆత్మ కూడాఆ కోటలో తిరుగుతూందని భావిస్తారు.ఒక వేళ ఇది నిజం కాకపోయినాఆ కోటలో ఏదో తప్పకుండా జరిగేవుంటుంది.

PC:youtube

శనివార్ వాడా గురించి కొన్ని నిజాలు !

శనివార్ వాడా గురించి కొన్ని నిజాలు !

అయితే కొందరు మాత్రం దీనిని 1736లో నిర్మించారు అని బాజీరావుగారు 1700లో మరణించారు అని అంటారు. అయితే ఈ శనివార్ వాడా గురించి కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PC:youtube

ఆర్తనాదాలు

ఆర్తనాదాలు

మరి తెలియనినిజాలు ఏంటంటే ఆ కోటలో సింహాసనం కోసమో లేదా ఇంకేదైనా పొరపాటువల్లనో కానీ నారాయణరావ్ పేష్వాను అత్యంత దారుణంగా హత్యచేసి అతడి శరీరాన్ని ముక్కలుగాచేసి నదిలోవేసారని ఆ సమయంలో అతడు అరచిన ఆర్తనాదాలే ఇప్పటికీ ఆ కోటలో వినిపిస్తాయని అంటూవుంటారు.

PC:youtube

బాజీరావ్ యొక్క ప్రేమికురాలైన మస్తానీ

బాజీరావ్ యొక్క ప్రేమికురాలైన మస్తానీ

మరి మరొక కధనంప్రకారం బాజీరావ్ యొక్క ప్రేమికురాలైన మస్తానీకూడా ఆ కోటలోనే ఖైదుగా వుంటుంది.బాజీరావ్ యుద్ధానికి వెళ్ళినసమయంలో మస్తానీని అతడి మొదటిభార్య మరియు అతడి కుటుంబసభ్యులు చెరసాలలో ఖైదీగా వేస్తారు.

PC:youtube

మరణ వార్త

మరణ వార్త

అయితే బాజీరావుయొక్క మరణ వార్తవిని మస్తాని కూడా చెరసాలలోనే శనివార్ వాడా కోటలో మరణించిందని ఆమె యొక్క ఆత్మకూడా అక్కడ తిరుగుతూ వుంటుందని నమ్ముతారు.

PC:youtube

పూర్వపు వైభవం

పూర్వపు వైభవం

మరి ఇదంతా నిజంకావచ్చుకాకపోవచ్చు కానీ పూర్వపు వైభవానికి ప్రతీకగా ఆ కోటఅనేది ప్రస్తుతం బండరాళ్ళుగా మిగిలిపోయివుంది.

PC:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రహదారి మార్గం

హైదరాబాద్ నుండి జహీరాబాద్, షోలాపూర్ బారామతి మీదుగా శనివార్ వాడా చేరుకోవచ్చును. కారులో అయితే 10గంటలు పడుతుంది.

pc: google maps

విమాన మార్గం

విమాన మార్గం

హైదరాబాద్ నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పూణే ఎయిర్ పోర్ట్ లో దిగి శనివార్ వాడా చేరుకోవాలి. ఈ మార్గంలో ఒక గంట ప్రయాణం పడుతుంది.

pc: google maps

 రైలు మార్గం

రైలు మార్గం

హైదరాబాద్ నుండి నాంపల్లి రైల్వేస్టేషన్ నుండి సేడం,షోలాపూర్ మీదుగా చేరుకోవచ్చును.

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X