• Follow NativePlanet
Share
» »అతి భయంకరమైన కోట పూణేలోని శనివార్ వాడా కోట

అతి భయంకరమైన కోట పూణేలోని శనివార్ వాడా కోట

దెయ్యం, భూతాల పరికల్పనల గురించి ప్రతిఒక్కరికీ వారి యొక్క వేరే వేరే అభిప్రాయాలుంటాయి. కొంతమంది మంచి అనేది వుంటే చెడ్డది కూడా వుండేవుండాలి అవునా? కనుక దెయ్యం, భూతాల పరికల్పనలు వుంది అని వాదిస్తారు. అది వదిలేయండి భారతదేశంలో ప్రసిద్ధమైన కోట గురించి అదే విధంగా వ్యాసం మూలంగా మీకు తెలియజేస్తాను.

కోటలు భారతదేశంలో శ్రీమంతులను గుర్తుచేస్తాయి. మన దేశంలో వేలకొలది కోటలున్నాయి. ప్రతిఒక కోటకు తన ఇతిహాసం వల్ల ప్రసిద్ధిపొందుతుంది. అయితే కొన్ని కోటలు మాత్రం "హంటెడ్ ఫోర్ట్స్"
అనే పేరును ధరించివుంది. ఇటువంటి వాటిలో పూణేలోని శనివార్ వాడా కోట ఒకటి.

ప్రతి అమావాస్య యొక్క రాత్రి ఈ కోట భయానకమైన స్థలంగా రూపుదిద్దుకుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ కోటకు అత్యంత భయంకరమైన కధ వుంది. ఈ కోట యొక్క కథను విన్నవారికెవరికైనా కన్నీళ్లు రాకుండా వుండదు. అటువంటి దారుణమైన కథను కలిగి వుంది ఈ శనివారా వాడా.

ప్రస్తుత వ్యాసం మూలంగా శనివారా వాడా కోటకు "హంటెడ్ ఫోర్ట్" అనే పేరు ఎలా వచ్చింది? అనే దాని గురించిన విషయాలు తెలుసుకుందాం.

ఎక్కడుంది?

ఎక్కడుంది?

శనివార్ వాడా కోట భారతదేశంలోని మహారాష్ట్రలోని పూణే నగరంలో వున్న ఒక ఐతిహాసిక కోట. దీనిని 1732 లో నిర్మించారు. ఇది మూడో ఆంగ్ల - మరాఠా యుద్దానంతరం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది.

PC:Ramnath Bhat

భారతీయ రాజకీయ కేంద్రం

భారతీయ రాజకీయ కేంద్రం

తరువాత ఈ రాజ కోట 18 వ శతాబ్దంలో భారతీయ రాజకీయ కేంద్రంగా ఏర్పాటైంది. అయితే కోట 1828 లో అగ్నిప్రమాదం వల్ల నాశనమైంది. మిగిలియున్న నిర్మాణాన్ని ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటుచేసారు.

PC:Pragya Sharan

మరాఠా సామ్రాజ్యం

మరాఠా సామ్రాజ్యం

శనివార్ వాడ మరాఠా సామ్రాజ్యంలోని పీష్వాల యొక్క 7 అంతస్థుల కట్టడం. ఈ రాజభవనాన్ని సంపూర్ణంగా రాళ్ళతో నిర్మించాలనుకున్నారు. కట్టడం పూర్తికాకుండానే కొందరు రాజుకి ఫిర్యాదు చేశారు. అందువలన మిగిలిన భవనం ఇటుకలతో నిర్మించడం జరిగింది.

PC:Clayton Tang

బాజి రావ్

బాజి రావ్

భారతదేశంలో అన్నికాలాల్లో అత్యుత్తమమైన సైన్యాధ్యక్షుడు బాజి రావ్. పీశ్వాలకు అత్యంత ఘనమైన,భద్రత కలిగినటువంటి కోటను నిర్మించాలని మహత్వమైన కాంక్షను కలిగివుండెను. అందువలన 1730 లో శనివార్ వాడా కోటకి పునాదిని నిర్మించారు.

PC:Mayurthopate

బ్రిటీష్ వాళ్ళు

బ్రిటీష్ వాళ్ళు

శనివార్ వాడా కోట నిర్మాణమై సుమారు 90సంల తర్వాత బ్రిటీష్ సైనికులు భారీ దాడి చేసి కోటని నాశనం చేసారు. ఈ శనివార్ వాడా అంటే శనివారం అనేది ఒక వారంలో ఒకరోజు అదేవిధంగా వాడా అంటే మరాఠి భాషలో వసతి గృహ సముదాయం అని అర్థం.

PC:Haripriya 12

ప్రజలు

ప్రజలు

ఇక్కడ 1758లో కోటలో మొత్తం తక్కువంటే 1000మంది ప్రజలు నివసించేవారు. 1773 లో 5 వ పరి పాలనాధ్యక్షుడు నారాయణ రావ్ సైనికులచేత హత్యగావించ బడ్డారు. అతనే ఇక్కడ ప్రేతాత్మైనాడని ఒక కథ వుంది.

PC:Mayurthopate

హంటెడ్ స్టోరీ

హంటెడ్ స్టోరీ

ఇక్కడొక హత్య కధ వుంది. అదేంటంటే బాజి రావ్ మరణం అనంతరం తర్వాత నానాసాహెబ్ మరాఠా అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. నానాసాహెబ్ కు ముగ్గురు పుత్రులు.

PC:Mayurthopate

పుత్రులు

పుత్రులు

నానాసాహెబ్ ముగ్గురు పుత్రులు మాధవ్ రావ్, విశ్వస్రావ్ మరియు నారాయణరావ్. 3 వ పానిపట్టు యుద్ధంలో మృతిచెందాడు. ఈ విధంగా అతని ముగ్గురు పుత్రులలో పెద్దవాడయిన మాధవ్ రావ్ కి
వారసుడిగా పట్టాభిషేకం చేసినారు.

PC:Sivaraj D

మాధవ రావ్

మాధవ రావ్

పట్టాభిషేకం చేయించుకున్న మాధవ రావ్ తో పాటే సోదరుడైన విశ్వాస్ రావ్ కూడా మరణిస్తాడు. అందువలన చివరి లేదా మూడవకొడుకైనా నారాయణ రావ్ కు వారసుడిగా పట్టాభిషేకం
చేసి వారసుడిగా నియమిస్తారు.

PC:Mayurthopate

నారాయణ రావ్

నారాయణ రావ్

అయితే నారాయణ రావ్ కేవలం 16 సంవత్సరముల వయస్సు వాడు. అంత చిన్న వయస్సులోనే నారాయణరావు పీష్వా కావడం జరిగింది. అతని వయస్సు కారణంచేత అతని చిన్నాన్న రఘునాథ రావ్ పరిపాలనా బాధ్యతను స్వీకరించెను.

PC:Haripriya 12

హత్య

హత్య

1773 లో రాక్షకుడైన చిన్నాన్న రఘునాథ రావ్ మరియు అధికారాదాహంతో వున్న పిన్నమ్మ ఆందీబియా ఆదేశం ప్రకారం కాపలాగారుల చేత 16 సంల నారాయణ రావ్ ని చంపించినారు. చంపే సమయంలో నారాయణ రావుగారు నిద్రిస్తున్నారు.

PC:Haripriya 12

 ముక్కలు ముక్కలుగా నరికి

ముక్కలు ముక్కలుగా నరికి

నిద్రిస్తున్న సమయంలో వచ్చిన హత్యాకారులు నారాయణ రావ్ ని చంపే సమయంలో తన చిన్నాన్నను తలచుకుని "కాకా మలా వాచావా" అని వేడుకున్నాడు.

అయితే కనికరం లేని చిన్నాన్న, నారాయణ రావ్ ని ముక్కలు ముక్కలుగా నరికి మూట కట్టి నదిలో విసిరి వేసినాడు.

PC:Yashmittal03

"కాకా మలా వాచావా"

ఇక్కడ కొన్ని భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయంట. అందులో పౌర్ణమి రాత్రియందు మాత్రం "కాకా మలా వాచావా" అనే అరుపు వినిపిస్తుందంట. కాకా మలా వాచావా అంటే "చిన్నాన్న నన్ను కాపాడు" అని.

PC:Haripriya 12

దెయ్యం

దెయ్యం

ఈవిధంగా అంత చిన్న వయస్సులోనే చంపివేయబడ్డాడు కాబట్టి నారాయణ రావ్ ప్రేతాత్మలాగా ఈ శనివార వాడ కోటలోనే వున్నాడని కొంత మంది జనాలు చెప్తారు.
ప్రతి పూర్ణిమ రోజు రాత్రి నారాయణ రావ్ ప్రేతాత్మ రక్షణ కోసం పిలుస్తుందని అక్కడ జనాల వదంతులు ఇవి.

PC:ANI(GM)

అధికార దాహం

అధికార దాహం

అధికార దాహం వల్ల ఏమీ తెలీని బిడ్డని చంపిన చిన్నాన్న. ఇప్పుడు ఈ స్థలం అత్యంత భయంకరమైన స్థలంగా రూపుదిద్దుకుంది. రాత్రి సమయంలో ఇక్కడ ఎవరూకూడ వుండరు.
సాయంత్రమవుతూవుందంటే భయానకం ఈ శనివార్ వాడాలో ఆవరిస్తుంది.

PC:Nitish kharat

కోట

కోట

భయానకాన్ని పక్కకి పెడితే కోట అత్యంత సుందరమైనది. అదేవిధంగా అప్పటి బాజి రావ్ అనే పరిపాలకుడిని కళ్ళారా చూస్తున్నామనే అనుభూతి ఈ కోటలో కలుగుతుంది.ఈ కోట యొక్క సౌందర్యాన్ని చూచుటకు దేశ,విదేశీయులు విచ్చేస్తారు.

PC:Haripriya 12

ప్రవేశ సమయం

ప్రవేశ సమయం

ఈ భయానక కోటకు ప్రవేశించటం కోసం మంచిసమయమేమంటే అది ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు.

PC:User:Ashok Bagade

ఇక్కడ దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు

ఇక్కడ దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు

ఖండాలా - పర్యాటకుల స్వర్గం

వారం అంతా అవిశ్రాంతంగా పనిచేసి ఆటవిడుపు కోరుకొనేవారికి మహారాష్ట్ర లోని ముఖ్య పర్వత కేంద్రాలలో ఒకటైన ఖండాలా ప్రధాన ముఖద్వారం. భారతదేశం లో పశ్చిమ భాగంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 625 మీటర్ల ఎత్తులో గల ఈ ప్రాంతం ఒక ముఖ్య పర్యాటక ప్రదేశం. పర్వతారోహకుల స్వప్నమైన కర్జాట్ నించి 7 కిలోమీటర్ల దూరంలో, మరొక అందమైన పర్వత కేంద్రమైన లోనావాలా నుండి 3 కిలోమీటర్ల దూరంలో బోర్ఘాట్ అంచున ఉంది.

లోనావాలా

లోనావాలా

రద్దీగా ఉండే ముంబై నగరజీవితం నించి చక్కటి ఆటవిడుపుని అందించే లోనావాలా మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధ పర్వత ప్రాంతం. సముద్ర మట్టానికి 625 మీటర్ల ఎత్తున ఉండే ఈ పర్వత ప్రాంతం అద్భుతమైన సహ్యాద్రి శ్రేణిలో భాగమై, 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒప్పారుతోంది. లోనావాలా పూణే నించి 64 కిలోమీటర్లు, ముంబై నించి 89 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జున్నార్

జున్నార్

దేశీయ పర్యాటకులకు అధిక ఆకర్షణకల పర్యాటక ప్రదేశం జున్నార్ మహారాష్ట్రలోని పూనే జిల్లాలో కలదు. జున్నార్ పట్టణం దాని మతపర, చారిత్రక మరియు పౌరాణిక ఆకర్షణలకు ప్రసిద్ధి. ఎన్నో పురాత దేవాలయాలు, చక్కగా ఆకర్షించే గుహలు, మరియు కోటలు వంటివి ఇక్కడ కలవు. సహ్యాద్రి పర్వత శ్రేణులలో కల జున్నార్ పూనేకు ఉత్తర దిశగా సుమారు 94 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ముంబై నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ పట్టణం సముద్రమట్టానికి సుమారు 2260 అడుగుల ఎత్తుకంటే అధికంగా కలదు.

సతారా - దేవాలయాలు, కోటలు

సతారా - దేవాలయాలు, కోటలు

మహారాష్ట్ర లోని సతారా జిల్లా 10500 చ.కి.మీ.లవిశాలమైన విస్తీర్ణంలో నెలకొని వుంది. దీనికి పడమటి వైపున రత్నగిరి, తూర్పున సోలాపూర్, దక్షిణాన సాంగ్లి వున్నాయి. ఈ జిల్లా ఏడు వైపులా కొండలతో చుట్టుకుని వుండడం వల్ల దీన్ని సతారా అంటారు - అంటే సుమారుగా ఏడు కొండలు అని అర్ధం. జరందేశ్వర్, యవతేశ్వర్, అజింక్యతర, కిట్లిచా దొంగార్, సజ్జనగడ, పెధ్యాచా భైరోబా, నడ్కిచా దొంగార్ ఆ ఏడు కొండల పేర్లు.

పంచగని - అయిదు కొండల ప్రాంతం

పంచగని - అయిదు కొండల ప్రాంతం

ప్రకృతి రమణియత తో శోభిల్లే జంట పర్యాటక కేంద్రాలు మహారాష్ట్ర లోని పంచగని, మహాబలేశ్వర్ లు. పంచగని బ్రిటీషు వారిచే కనుగొనబడిన వేసవి విడిది. ఇది సముద్రమట్టానికి 1,350 మీటర్ల ఎత్తులో ఉంది. చరిత్ర అందిస్తున్న ఆధారాల ప్రకారం జాన్ ఛెసన్ అనే బ్రిటీష్ సూపరింటెండ్ ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ ఉండేవాడట. పంచగని అంటే అయిదు కొండల ప్రాంతం అని అర్ధం. పంచగని లోయల అందాలు దేశ విదేశ పర్యాటకులకు కనువిందు చేస్తూ వారిని ఆకర్షిస్తున్నాయి. చారిత్రకంగా ఆనాడు బ్రిటీషు వారికి ఇష్టమైన వేసవి విడిది ఇది. ఇప్పటికీ పంచగని లో ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక వర్ష ఋతువు ఈ ప్రాంతానికి సరికొత్త అందాలను తీసుకు వస్తుంది. ఇరుకైన కొండల మధ్య సన్నని జలపాతాలు మనోహరంగా ఉంటాయి.

భీమశంకర్

భీమశంకర్

మహారాష్ట్రలోని భీమశంకర్ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది పేరొందిన ట్రెక్కింగ్ ప్రదేశం కర్జాత్ సమీపంలో కలదు. భీమశంకర్ భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మరియు మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలో ఒకటి.

చేరుకొనుట ఎలా?

చేరుకొనుట ఎలా?

సమీపంలోని విమానాశ్రయం ఏదంటే అది పూణే విమానాశ్రయం. ఇక్కడ నుంచి ఈ శనివార్ వాడా కోటకి సుమారు 11 కి.మీ లదూరం వుంది. 25 నిలు ప్రయాణించవలసి వుంటుంది.

సమీపంలోని రైల్వేస్టేషన్

సమీపంలోని రైల్వేస్టేషన్

సమీపంలోని రైల్వేస్టేషన్ ఏదంటే పూణే. ఇక్కడి నుంచి శనివార్ వాడాకి సుమారు 4 కి.మీ ల దూరం వుంది. ఇక్కడ నుంచి సులభంగా శనివార్ వాడాకి చేరుకోవచ్చును.

హైదరాబాద్ నుంచి అయితే

హైదరాబాద్ నుంచి అయితే

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి షోలాపూర్ మీదుగా పూణే రైల్వేస్టేషన్ లో దిగి శనివార్ వాడా ప్యాలెస్ చేరుకోవచ్చు. దీనికి బస్సులో 9 గంటల 21ని లు పడుతుంది.కారులో అయితే 11 గంటల 4ని లు పడుతుంది.

హైదరాబాద్ నుండి విమానమార్గం

హైదరాబాద్ నుండి విమానమార్గం

హైదరాబాద్ నుండి విమానంలో నైతే 1 గంట 5 నిలు పడుతుంది. హైదరాబాద్ నుండి పూణే ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడి నించి శనివార్ వాడా ప్యాలెస్ కి చేరుకోవాలి.

pc: google maps

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి