Search
  • Follow NativePlanet
Share
» »ఎంత రంగు పడితే అంత ఆనందం

ఎంత రంగు పడితే అంత ఆనందం

By Beldaru Sajjendrakishore

సాధారణంగా దుస్తుల పై రంగులు పడితే మొహం కొంత చికాకుగా తయారవువతుంది. అయితే కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే రంగులను కావాలని మనం మన పై వేయించుకుంటాం. ఎంత ఎక్కువగా రంగులు పడితే అంత ఆనందం కలుగుతుంది. ఈ రంగులను మనం వేసుకోవడమే కాకుండా మనకు అత్యంత ఇష్టమైనవారి పై కూడా చల్లుతాము. ఇప్పటికే మీకు అర్థమయ్యిందనుకుంటాను. సదరు రంగులను ఒకరి పై ఒకరు చల్లుకోవడమే హోళి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగా ఇప్పడిప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ నయా పండుగను జరుపుకోవడానికి కనీసం రెండు మూడు రోజుల నుంచి ప్రణాళికలు రచించుకుంటున్నారు. మార్చి 1, 2 తేదీల్లో హోళి నేపథ్యంలో హోళితో పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలు, అక్కడ వినూత్నంగా జరుపుకొనే హోళి గురించి నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. రంగులతో పాటు లాఠీలతో కూడా

1. రంగులతో పాటు లాఠీలతో కూడా

Image source

ఉత్తర ప్రదేశ్ లోని బర్సానాలో హోళిని దేశంలోని మిగిలిన ప్రాంతలతో పోలిస్తే వినూత్నంగా జరుపుతారు. ఇక్కడ అమ్మాయిలు, అబ్బలను లాఠీ లాంటి కట్టెలతో సరదాగా తరుముతూ హోళిని జరుపుకుంటారు.

2. దీని వెనక పెద్ద కథే ఉంది

2. దీని వెనక పెద్ద కథే ఉంది

Image source

పురాణ కథనం ప్రకారం బర్సానాలో ఉన్నత ప్రియమైన రాధను కలవడానికి శ్రీ కృష్ణుడు వచ్చినప్పడు సరదాగా ఆటపట్టించడానికి మిగిలిన గోపికలు లాఠీలతో ఆ నల్లనయ్యను తరుముతారు. అటు పై అందరూ కలిగి ఒకరి పై ఒకరు రంగులు చెల్లుకుంటూ ఆనందంగా హోళిని జరుపుకుంటారు. ఇప్పటికీ అదే విధానం ఆచరణలో ఉంది.

3. మధుర

3. మధుర

Image source

ఉత్తర ప్రదేశ్ లో మధురలో హోళిని ప్రత్యేకంగా జరుపుకొంటారు. ముఖ్యంగా ఈ పర్వదినాన మొదట శ్రీ కృష్ణ దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేసి స్వచ్చమైన పాలను, నెయ్యిని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అటు పై ఒకరి పై ఒకరు రంగులను చల్లుకుని ఉత్సాహంగా హోళి పండుగను జరుపుకొంటారు. ఇక్కడ కూడా లాఠీలతో పురుషులను తరమడం మనం చూస్తాము.

4. బృందావన్

4. బృందావన్

Image source

శ్రీ కృష్ణుడు పుట్టి పెరిగిన ప్రాంతంగా బృందావన్ కు పేరు. ఇక్కడ హోళి రోజున చిన్ని పిల్లలను శ్రీ కృష్ణుడిగా అలంకరించి వారికి పూజలు చేస్తారు. అటు పై వారికి రంగులు పూజి వారి శరీరం నుంచి సదరు రంగులను తీసుకుని ఇతర రంగుల్లో కలుపుతారు. ఆ తర్వాత ఆ రంగులను ఒకరి పై మరొకరు చల్లుకుని ఆనందిస్తారు. ఇలా చేస్తే తమకు మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం.

ఇందుకు సంబంధించిన కథనం కోసం ఇందుకు సంబంధించిన కథనం కోసం

5. శాంతినికేతన్ లో

5. శాంతినికేతన్ లో

Image source

కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన హోళిని పశ్చిమ బెంగాల్ కు కూడా పరిచియం చేసిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్య సంస్క`తి, సంప్రదాయాల వినిమయం జరగాలని భావించిన ఆయన రంగుల పండుగను మొదటి సారిగా శాంతినికేతన్ లో జరిపారు.

6. ఇతర రాష్ట్రాల వారికి మిఠాయిలు పంచుతూ

6. ఇతర రాష్ట్రాల వారికి మిఠాయిలు పంచుతూ

Image source

ముఖ్యంగా ఇక్కడి యూనివర్శిటీలో విద్యార్థులంతా ఒక చోటకు చేరి ఒకరి పై మరొకరు రంగులు చల్లు కొంటూ హోళిని గడుపుతారు. ఆ రోజున పశ్చిమ బెంగాల్ కు చెందిన విద్యార్థులు మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారికి మిఠాయిలు ముఖ్యంగా బెంగాల్ స్వీట్స్ ను అందజేస్తారు.

7. ముంబైలో

7. ముంబైలో

Image source

ముంబైలో హోళిని అటు సంప్రదాయంతో పాటు ఇటు పాశ్చత్య విధానం ముడి పడి ఉంటుంది. ముఖ్యంగా వయస్సు భేదాన్ని మరిచి గుంపులు గుంపులుగా ఒక చోట చేరి ఒకరి పై ఒకరు రంగులు చల్లు కుంటూ హోళి జరుపు కుంటారు.

8. డీజే, ఫుడ్ స్టాల్స్ కూడా

8. డీజే, ఫుడ్ స్టాల్స్ కూడా

Image source

అయితే ఆ సమయంలో హోరెత్తే సంగీతంతో పాటు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. కొన్ని చోట్ల మద్యం కూడా ఉంటుంది. అందుకే చాలా మంది హోళి జరుపుకోవడానికే ముంబైకి వస్తుంటారు. అనేక రిసార్టులు సైతం ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

9. విదేశీయులు కూడా

9. విదేశీయులు కూడా

Image source

భారత దేశానికి పర్యాటకానికి వచ్చే విదేశీయులు కూడా హోళిని ఉత్సాహంగా జరుపు కుంటారు. ముఖ్యంగా కర్ణాటకలోని హంపి, మ్రుడేశ్వరలో హోళిని జరుపుకోవడానికి వారు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. అందువల్ల హోళి సమయంలో దేశంలో ఎక్కడ ఉన్నా ఆ రోజున అక్కడకు చేరిపోతారు.

10 ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా

10 ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా

Image source

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో, గోవాలో కూడా హోళిని స్థానికులతో పాటు పర్యాటకులు ఉత్సాహంగా జరుపుకుంటారు. దీంతో స్థానికంగా ఉండే ఫైవ్ స్టార్ హోటల్స్ వారు కూడా హోళిని జరుపుకోవడం కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X