Search
  • Follow NativePlanet
Share
» »ఖురాన్ చదివితేనే ముందుకు కదిలే భూ వరహాస్వామి

ఖురాన్ చదివితేనే ముందుకు కదిలే భూ వరహాస్వామి

శ్రీ మూష్నం లో ఉన్న భూ వరాహ స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

మహా విష్ణవు వరాహ రూపంలో భూ దేవిని రాక్షసుల భారి నుంచి రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ వరాహ స్వామి స్వయంభువుగా వెలిసిన పుణ్యక్షేత్రం తమిళనాడులో ఉంది. ఇక్కడ స్వామి వారి శరీరం నుంచి చిందిన చమట వల్ల ఇక్కడ ఏర్పడింది. దీనిని నిత్య పుష్కరిణి అని అంటారు. దీనిలో స్నానం చేస్తే సర్వరోగాలు ముఖ్యంగా చర్మవాధులు సమసిపోతాయాని చెబుతారు. ఇక స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో స్థానికంగా ఉన్న ఓ మసీదు వద్ద ఉత్సవ మూర్తి ఆగుతారు. అక్కడ ఖురాన్ చదివిన తర్వాతనే ఉత్సవ మూర్తి ముందుకు కదులుతారు. ఈ ఉత్సవంలో ముస్లీం సోదరులు కూడా పాల్గొంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ పుణ్యక్షేత్రం విశేషాలు మీ కోసం

ఆంగ్లేయుడికి కూడా శ్రీరాముడు దర్శనమిచ్చిన ప్రాంతం...ఈ క్షేత్రంలో కాలుపెడితే...ఆంగ్లేయుడికి కూడా శ్రీరాముడు దర్శనమిచ్చిన ప్రాంతం...ఈ క్షేత్రంలో కాలుపెడితే...

1. స్వయంభువుగా

1. స్వయంభువుగా

P.C: You Tube

హిందూ పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలిసిన తొమ్మిది క్షేత్రాల్లో శ్రీ మూష్నం కూడా ఒకటి. ఇది తమిళనాడులోని కడలూరు జిల్లా వ`ద్ధాచలానికి 19 కిలోమీటర్ల దూరంలో, మరో పుణ్యక్షేత్రమైన చిదంబరానికి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది.

2. భూదేవిని రక్షిస్తాడు

2. భూదేవిని రక్షిస్తాడు

P.C: You Tube

హిరణ్యకశిపుడి సోదరుడైన హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రంలో ఉంచుతాడు. భూ దేవి ప్రార్థనతో కరిగిపోయిన విష్ణువు వరాహ రూపంలో వచ్చి ఆమెను రక్షిస్తాడు. ఇక్కడ ఉన్న అమ్మవారిని అంబుజవల్లీ పేరుతో కొలుస్తారు. విష్ణువు దశావతారాల్లో వరహావతారం రెండవది.

3. చమట వల్ల

3. చమట వల్ల

P.C: You Tube

హిరణ్యక్షుడిని యుద్ధంలో చంపిన తర్వాత సాలగ్రామ శిలలో వరాహస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. ఇక యుద్ధం చేసే సమయంలో స్వామి వారి శరీరం నుంచి చిందిన చమట వల్ల ఇక్కడ పుష్కరిణి ఏర్పడింది. దీనిని నిత్య పుష్కరిణి అని అంటారు.

4. రెండు కన్నుల నుంచి

4. రెండు కన్నుల నుంచి

P.C: You Tube

అదే విధంగా స్వామి వారి రెండు కన్నుల నుంచి తులసి, అశ్వర్థ వ`క్షం ఏర్పడినట్లు స్థల పురాణం వివరిస్తుంది. నిత్యపుష్కరిణిలో స్నానం చేస్తే చర్మరోగాలు పూర్తిగా సమసి పోతాయని చెబుతారు.

5. సంతానం లేనివారికి

5. సంతానం లేనివారికి

P.C: You Tube

అదే విధంగా అశ్వర్ధ వృక్షాన్నిన్ని పూజిస్తే సంతానం లేనివారికి త్వరగా పిల్లలు పుడుతారని నమ్మకం. ముఖ్యంగా పుష్కరిణిలో స్నానం చేసి అశ్వర్థ వృక్షం కింద గాయత్రి మంత్రం జపిస్తే చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణకథనం.

6. ముఖం దక్షిణ దిశగా

6. ముఖం దక్షిణ దిశగా

P.C: You Tube

స్వామివారి విగ్రహం చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ స్వామి వారి శరీరం పశ్చిమ ముఖంగా ఉండగా ముఖం మాత్రం దక్షిణం వైపు ఉంటుంది.

7. నడుము పై చెయ్యి

7. నడుము పై చెయ్యి

P.C: You Tube

హిరణ్యాక్షుడు తన ఆఖరి ఘడియల్లో స్వామివారిని తనవైపు చూడమని ప్రార్థించాడు. అందువల్లే స్వామి శరీరం పడమర వైపుగా ఉన్న మొహం దక్షిణం వైపు ఉంటుంది. స్వామి వారు నడుం పై చేయ్యి పెట్టుకొని గంభీరంగా కనిపిస్తాడు.

8. అందమైన రూపంలో

8. అందమైన రూపంలో

P.C: You Tube

ఇక ఇక్కడ వెలిసిన అంబుజవల్లీ అమ్మవారికి స్వామి వారిని అందమైన రూపంలో చూడాలని కోరుకొంటుంది. దీంతో స్వామి వారు శంఖ, చక్రాలను కలిగి అందమైన నారాయణుడి రూపంలో వెలిశాడు.

9. ఉత్సవ మూర్తి వరాహ రూపంలో ఉండదు

9. ఉత్సవ మూర్తి వరాహ రూపంలో ఉండదు

P.C: You Tube

అందువల్లే ఇక్కడ ఉత్సవ మూర్తి విగ్రహం వరాహ రూపంలో కాక, నారాయణుడి రూపంలో ఉంటుంది. ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో కాకుండా ఆలయంలోని వేరొక మండపంలో ఉండటం ఇక్కడ విశేషం.

10. గోపాలుడి విగ్రహాన్ని

10. గోపాలుడి విగ్రహాన్ని

P.C: You Tube

వరాహ స్వామితో పాటు చిన్న గోపాలుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. వరాహ స్వామితో పాటు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.

11. పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు

11. పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు

P.C: You Tube

ఈ ఆలయంలో పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు భరణీ నక్షత్రంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

12. తాయ్ కాల్ అనే గ్రామంలో

12. తాయ్ కాల్ అనే గ్రామంలో

P.C: You Tube

ఆ సమయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని దగ్గర్లో ఉన్న సముద్రం వద్దకు తీసుకువెలుతారు. అక్కడకు చేరుకొనే లోపు తాయ్ కల్ అనే గ్రామంలో ఒక మసీదు దగ్గర ఊరేగింపు ఆగిపోతుంది.

13. ఖురాన్ చదివిన తర్వాత

13. ఖురాన్ చదివిన తర్వాత

P.C: You Tube

అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మసీదుకు చెందిన కాజీ.... స్వామి వారికి పూల దండ సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మసీదులో కర్పూరం వెలిగించి తర్వాత ఖురాన్ చదువవుతారు. బాణా సంచా కూడా కల్చిన తర్వాత ఊరేగింపు యథావిధిగా సాగుతుంది.

14. నవాబుకు జబ్బు చేస్తుంది

14. నవాబుకు జబ్బు చేస్తుంది

P.C: You Tube

ఇందుకు సంబంధించిన కథనం కూడా ఉంది. ఒక సారి ఇక్కడి నవాబుకి జబ్బు చేస్తుంది. విషయం తెలుసుకొన్ని స్థానిక మధ్వ బ్రాహ్మణుడు నవాబుని కలిసి స్వామి వారి గుడి నుంచి తెచ్చిన ప్రసాదన్ని ఇస్తాడు.

15. రాజు రోగం తగ్గిపోతుంది

15. రాజు రోగం తగ్గిపోతుంది

P.C: You Tube

క్షణాల్లో రాజు రోగం తగ్గిపోతుంది. దీంతో నవాబు మిక్కిలి సంతోషంతో ఆ ఆలయానికి అనేక ఎకరాల సారవంతమైన భూమిని దానం చేశారు. ఈ భూమి ఇప్పటికీ మధ్వ బ్రాహ్మణుల రక్షణలో ఉంది.

16. చిత్రై ఉత్సవాలు

16. చిత్రై ఉత్సవాలు

P.C: You Tube

ఇక్కడ చిత్రై ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. శ్రీదేవి , భూ దేవి సమేతంగా స్వామివారిని ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడల వీధుల్లో ఊరేగిస్తారు.

17. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా

17. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా

P.C: You Tube

అటు పై ఫిబ్రవరి, మార్చినెల్లో వచ్చే ఉత్సవాల్లో దేవేరులతో కలిసి స్వామి వారు చుట్టు పక్కల గ్రామలకు వెలుతుంటారు. ఆ సమయంలో ఆయా గ్రామాల వారు గ్రామ పండుగను చేస్తారు.

18. నవరాత్రుల్లో

18. నవరాత్రుల్లో

P.C: You Tube

ఇక్కడ కొలువై ఉన్న అంబుజవల్లికి నవరాత్రుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. తమిళనెలలైన అడి, తాయ్ లలో ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారిని సువాసన భరితమైన పుష్పాలతో అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు.

19. గ్రహదోషాలు ఉన్నవారు కూడా

19. గ్రహదోషాలు ఉన్నవారు కూడా

P.C: You Tube

ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల సకల సంపదలూ లభిస్తాయని చెబతుారు. గ్రహ దోషాలున్నవారు ఇక్కడ స్వామివారిని కొలిస్తే ఆ బాధలన్నీ తొలిగిపోతాయని స్థానికుల నమ్మకం.

20. ఎలా చేరుకోవాలి

20. ఎలా చేరుకోవాలి

P.C: You Tube

చెన్నై నుంచి, వ`ద్ధాచలం నుంచి నిత్యం ఇక్కడకు బస్సులు ఉన్నాయి. అలయం పక్కన గెస్ట్ హౌస్ ఉంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. అటు పై స్వామి వారిని సాయంత్రం 4 నుంచి రాత్రి 8.30 మధ్య దర్శించుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X