Search
  • Follow NativePlanet
Share
» »మన దేశంలోని మిస్టీరియస్ జలాశయం !

మన దేశంలోని మిస్టీరియస్ జలాశయం !

By Venkatakarunasri

ఫ్రెండ్స్ మన దేశంలో ఒక మిస్టీరియస్ జలాశయం వుంది. అది చూట్టానికి నార్మల్ గానే వుంటుంది.కానీ ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే పెరిగిపోతాయి. దాంతో ఎపుడైతే సడెన్ గా ఈ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందో స్థానికులు త్వరలోనే ఏదో ఆపద ముంచుకురానుందని జ్యోస్యం చెప్పేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జ్యోస్యం 100కి 100 పాళ్ళు చాలాసార్లు నిజమైంది. 2004లో సంభవించిన ప్రకృతి భీభత్సం సునామీసమయంలోనయితే ఈ జలాశయంలోని నీరు ఏకంగా 1500మీ ల ఎత్తుకు చేరుకుంది. అలాగే నేపాల్, గుజరాత్ లలో సంభవించిన భూకంపాల సమయంలో కూడా ఈ జలాశయంలోని నీరు విపరీతంగా పెరిగిపోయిందట. వినటానికే ఆశ్చర్యంగా వుంది కదూ. కానీ ఇది నిజం.

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి 3చెరువుల నీళ్ళు త్రాగించింది. చేసేదేమీలేక ఆ టీం వారు తోక ముడుచుకుని వెనుదిరిగారు.ఇంతకీ ఆ జలాశయం పేరు చెప్పలేదు కదూ. ఆ జలాశయం పేరు భీంకుండ్. ఏంటీ మధ్యలో భీముని పేరు ఎందుకొచ్చిందని ఆశ్చర్యపోతున్నారా?

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఈ జలాశయానికి భీంకుండ్ అని పేరు పెట్టడం వెనుక ఒక పురాణ గాథ వుంది. మహాభారతంలో పాండవులు జూదంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపదీసమేతంగా వనవాసానికి వెళ్ళేటప్పుడు,మార్గ మధ్యంలో సూర్యునిదాటిని తట్టుకోలేక విపరీతమైన దాహంతో ద్రౌపదీ విల విలలాడి పోయింది. అది ఒక కొండ ప్రదేశం.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

కను చూపు మేర ఎక్కడ నీటి ఆనవాళ్ళు కనిపించలేదు.దాంతో భీముడు తన గద తీసుకుని కోపంతో ఆ కొండపై ఒక్క వేటు వేసాడంతే. ఇంకేముంది.భీముడు ఎక్కడైతే గదతో మోదాడో ఆ కొండపైనున్న భూమి కిందికి కృంగి జలాశయం ఏర్పడినది.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఆ నీటిని త్రాగి అందరూ తమ దాహాన్ని తీర్చుకున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకూ యుగయుగాలుగా ఆ జలాశయం ఎండిపోకుండా ఇంకా అలాగే వుంది.అందుకే ఈ జలాశయానికి భీంకుండ్ అని పేరు పెట్టారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఎక్కడ వుంది?

ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్ పూర్ జిల్లాకి 80కిమీ ల దూరంలో వుంది. అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయంఏంటంటే ఎన్నో అడ్వాన్సెడ్ ఎక్విప్ మెంట్స్ అందుబాటులో వున్నప్పటికీఎన్నో ఈ జలాశయం లోతును మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. సుప్రసిద్ధ భూగర్భశాస్త్రవేత్తలు సైతం మావల్ల కావట్లేదని చేతులెత్తేసారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

అలాగే ఈ జలాశయం లోతును కనుక్కోవటానికి డిస్కవరీచానల్ టీంలోని వరల్డ్ ఫేమస్ స్విమ్మర్స్ కూడా చాలా ప్రయత్నం చేసారు.అయితే వారికి కొన్ని విచిత్రమైన ఇంతకుముందు ఎన్నడూచూడని కొన్ని జలప్రాణులు మాత్రం కనిపించాయట. అలాగే వారికి 80అడుగుల లోతులో సముద్రపు అలలు తగిలినప్పుడు కలిగే అనుభూతి కలిగిందట.దాంతో సైంటిస్ట్ లు ఈ జలాశయం సముద్రంతో లింక్ చేయబడివుందనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

అలాగే ఈ జలాశయానికి అండర్ గ్రౌండ్ లో వాటర్ రావటానికి ఒక ఇన్ పుట్, వాటర్ వెళ్ళటానికి ఒక ఔట్ పుట్ మార్గాలున్నాయని అందుకనే ఈ జలాశయం అడుగులో సముద్రగర్భం అంతర్భాగంలో వుండే భయానక లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు.ఇన్ని చెప్పారుకాని ఆ జలాశయం లోతెంతాఅని అడిగితే మాత్రం నీళ్ళు నమిలారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఈ జలాశయానికి సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం సాధారణంగా చెరువుల్లో, బావుల్లో, జలాశయాలలో గనక ఎవరైనా మునిగి చనిపోతే కొన్ని రోజులకు వారి శరీరం ఉబ్బి పైకి తేలుతుంది. కానీ ఈ జలాశయంలో ఎవరైనా మునిగిచనిపోయారో ఇక వారి శవం అడ్రస్ ఆ దేవుడికే తెలియాలి.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఈ జలాశయంలో మునిగి చాలా మంది చనిపోయినప్పటికి ఒక్కరంటే ఒక్కరి శవంకూడా ఇప్పటివరకూ పైకి తేలలేదు.వింటుంటే ఏదో మిస్టరీగా వుంది కదూ. ఈ జలాశయంలోని నీరు సముద్రపునీటిలాగా బ్లూకలర్ లో వుండి ట్రాన్సపరెంట్ గా క్లిస్టర్ క్లియర్ గా వుంటుంది.రోజూ ఎంతో మంది ఈ జలాశయంలో స్విమ్మింగ్ చేస్తూ స్నానం చేసినప్పటికీ ఈ జలాశయం మాత్రం ప్రతీరోజూ క్లీన్ చేసే లాగా స్విమ్మింగ్ పూల్ లాగా క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

అందుకే స్థానికులు ఈ జలాశయాన్ని నేచ్యురల్ స్విమ్మింగ్ పూల్ అని పిలుచుకుంటారు.అదేవిధంగా ఈ జలాశయంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని,సర్వపాపాలు నశిస్తాయని,ఈ నీరు హిమాలయాపర్వతప్రాంతాలలోని పవిత్రగంగా జలంతో సమానమని కొంతమంది బలంగా నమ్ముతున్నారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

అందుకే సుదూరప్రాంతాల నుండి ఈ జలాశయంలో స్నానం చేయటానికి యాత్రికులు వస్తూ పోతూ వుంటారు. ఈ ఫోటోను చూడండి.పై భాగంలో ఓ చిన్నరంధ్రం వుంటుంది. లోపల సువిశాల ప్రాంతం. చూస్తుంటే పురాణాలను నమ్మనివారు సైతం భీముడు నిజంగానే గదతో మోదటం వలన ఈ జలాశయం ఏర్పడిందని ఖచ్చితంగా నమ్మేలావుంది కదూ.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఈ జలాశయంలోని నీరు నీలంగా వుండటంవలన దీనిని నీల్ కుంట్ అని, నారద్ కుంట్ అని పిలుస్తుంటారు.మధ్యలో నారదుడు ఎందుకొచ్చాడు అని అనుకుంటున్నారా? దానికీ ఓ ఫేమస్ స్టోరీ ఇక్కడ ప్రచారంలో వుంది.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

నారద మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ ప్రాంతంలో ఘోరతపస్సు చేసాడట. నారదుని గాంధర్వ గానంతో శ్రీమహా విష్ణువు పులకించిపోయాడట.నారదుడిభక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ జలాశయం నుండి బయటకువచ్చాడని అందుకే శ్రీ మహావిష్ణువు శరీరఛాయతగిలి ఈ జలాశయంలోని నీరు నీలిరంగులోకి మారిపోయాయని భక్తుల విశ్వాసం.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఈ జలాశయం ఎంట్రన్స్ కి ఎడమవైపు ఓ శివలింగం కూడా మనకు కనిపిస్తుంది. సునామీ సమయంలో ప్రశాంతంగా వున్న ఈ జలాశయం నుండి ఒక్కసారిగా నీరు 15ఫీట్ ల వరకూ అలల్లాగా ఎగరటం మొదలైందట.దాంతో స్నానంచేయటానికి అందులో దిగినవారు బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పైకి పారిపోయారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

వెంటనే ఈ విషయం తెలిసి దేశ విదేశాల నుండి మీడియా మొత్తం ఈ ప్రదేశానికి చేరుకున్నారు. దేశవిదేశాల నుండి ప్రఖ్యాతశాస్త్రవేత్తలు ఈ చోటికి చేరుకున్నారు.ఆఖరికి వరల్డ్ ఫేమస్ డిస్కవరీ ఛానల్ టీంకూడా ఈ ప్రదేశానికి చేరుకుంది.లేదంటే విదేశీమీడియా ఇదంతా ఓ కట్టుకథ అని కొట్టిపారేసి వుండేవాళ్ళేకావచ్చు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

కానీ కళ్ళతో చూసిన నిజం,కెమేరాలో ఖైదైననిజం అబద్దమని ఎలా భుకాయిస్తారు. ఈ జలాశయం రహస్యం తెలుసుకోవటానికి డిస్కవరీ ఛానల్ టీంసభ్యులు రంగంలోకి దిగారు. భారత మిలటరీ విభాగానికి చెందిన గజఈతగాళ్ళు సైతం క్రిందికి దిగారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

సుమారు 40మీ ల లోతుకు చేరుకున్న తర్వాత వారికి అరేబియా సముద్రంలో కనిపించే జలప్రాణులు కనిపించాయి. సముద్రపు అలలతాకిడిని అనుభూతిచెందారు.అసలేంజరుగుతుందో అర్ధంకాక డిస్కవరీ ఛానల్ వారు ఈ జలాశయంను కనుక్కోవటం మావల్ల కాదని చేతులెత్తేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

ఇక అప్పటినుండి ఈ జలాశయం మరింత ఫేమస్ అయ్యింది. ఈ జలాశయం లోపలికివెళ్ళటానికి మెట్లు కూడా వున్నాయి. లోపలికి వెళ్ళే ముందు ఎంట్రెన్స్ దగ్గర శ్రీ మహావిష్ణువు,లక్ష్మీ దేవి విగ్రహాలు మనకు కనిపిస్తాయి.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

అదేవిధంగా సూర్యుని కిరణాలు నేరుగా ఈ జలాశయంపై పడి నీటి రంగు రంగురంగులుగా ఇంధ్రధనస్సులాగా కనిపిస్తుంది.ఆ అద్భుత చిత్రాలను ఖైదుచేయటానికి ఫోటోగ్రాఫర్లుసైతం ఈ ప్రదేశానికి క్యూ కడుతుంటారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

1978లో జిల్లా ప్రభుత్వం ఈ జలాశయ మిస్టరీని చేధించటానికి,ఈ జలాశయం లోతును కనుక్కోవటానికి, అందులోని నీటిని ఖాళీచేయటానికి ఇక్కడ 3పంపుల ద్వారా విశ్వ ప్రయత్నం చేసారు.ఇలా ఒకటికాదు,రెండు కాదు 7రోజుల పాటు వారి ప్రయత్నం నిరంతరంగా కొనసాగింది.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఏడు రోజులలో భీంకుండ్ లోని నీళ్ళు ఒక్కఇంచ్ అంటే ఒక్క ఇంచ్ కూడా తగ్గలేదు.మహా భారతంలో ద్రౌపదీవస్త్రాపహరణం ఘట్టంలో లాగా దుశ్శాసనుడు ద్రౌపదీ చీర లాగినాకొద్దీ వచ్చినట్లు ఈ జలాశాయంలోని నీటిని పంపులద్వారా తరలించిన కొద్దీ కొత్తనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు బిత్తరపోయి తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

దీంతో ఆ నీటిని అత్యంత పవిత్రమైనదిగా భావించి ఇక్కడకు వచ్చిన యాత్రికులు బాటిళ్ళలో నింపుకుని ఈ నీటిని తీసుకెళ్తూవుంటారు. ఫ్రెండ్స్ ఇదేదో శంభాలలాగా అదృశ్య నగరమూకాదు అట్లాంటిస్ లా కాల్పనిక గాథ కాదు మన కళ్ళ ముందే కనిపిస్తున్న నిజం.ఈ నిజాన్ని కళ్ళారా చూడాలి అనుకుంటే మీరు కూడా ఈ ప్రదేశానికి ఒక్కసారైనా వెళ్లి చూడండి.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తనివి తీరా ఆస్వాదించండి. ప్రతీ సంక్రాంతి రోజూ ఈ జలాశయం దగ్గర పెద్ద జాతర జరుగుతుంది.సంక్రాంతి రోజు ఈ నీటితో స్నానం చేస్తే గనక సర్వపాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.మరి సంక్రాంతి పండగలో విహారయాత్రలంటే ఇష్టపడేవారు ఓ సారి వెళ్లి చూసిరండి మరి.

pc:youtube

భీమ్ కుండ్ మిస్టరీ !

భీమ్ కుండ్ మిస్టరీ !

సమీపంలో చూడదగినవి

అలాగే ఈ జాలాశయానికి సమీపంలో శ్రీనారాయణ సంస్కృతవిద్యాలయ అనే ఓ గురుకులం వుంది.ఈ గురుకులంలో సుమారు 80మంది స్టూడెంట్స్ వున్నారు. ఇది అలాంటి ఇలాంటి గురుకులం కాదు.పూర్వం శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి దగ్గర కురుపాండవులు, ద్రోణాచార్యుడి దగ్గర ఎలాగయితే తమ రాజ్యంలోని భోగాలన్నింటిని వదిలి కఠోరనియమాలతో విద్యాభ్యాసం చేసారో అలా ఇక్కడ వీరు విద్యను అభ్యసిస్తారట.ఈ కాలంలో కూడా ఇంకా అలాంటి గురు కులంలు వున్నాయంటే ఆశ్చర్యంగా వుంది కదూ.

pc:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాదు నుండి వెళ్ళాలంటే కారులో నైతే 17గంటలు పడుతుంది.

హైదరాబాదు నుండి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నర్సింగ్ పూర్, సాగర్ మీదుగా భీంఖండ్ చేరవచ్చును.

PC:google maps

టిప్పుసుల్తాన్ కుటుంబాన్ని బంధించిన కోట ఇది...

ఆ సొరంగంలోనికి వెళ్ళినవారు మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు.....

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more