Search
  • Follow NativePlanet
Share
» »అందాన్ని పెంచుకోవడం కోసం ఈ జలపాతంలో తడుస్తుంటారు

అందాన్ని పెంచుకోవడం కోసం ఈ జలపాతంలో తడుస్తుంటారు

హున్నమే వాటర్ ఫాల్స్ గురించిన కథనం.

కర్నాటకలో అనేక జలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతాల అందాలను చూడాలంటే మీరు వర్షాకాలంలో వాటి చెంతకు వెళ్లాలి. కర్నాటకలోని తీరప్రాంత జిల్లా అయిన చిక్కమగళూరులో కూడా అనేక జలపాతాలు ఉన్నాయి. అందులో అత్యంత అందమైనది, మహిమాన్వితమైనదిగా భావిస్తున్న హున్నమే జలపాతానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొందాం

హున్నమే జలపాతం

హున్నమే జలపాతం

P.C: You Tube

కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో హున్నమే జలపాతం ఉంది. ఈ అందమైన జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రమైన కెమ్మనగుడి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా ప్రముఖ ధార్మిక క్షేత్రం బాబా బుడేన్‌గిరిలోని దత్తాత్రేయ పీఠం నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఈ జలపాతం ఉంది.

హున్నమే జలపాతం

హున్నమే జలపాతం

P.C: You Tube

దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం గురించి కర్నాటకవాసులకు కొంత తెలిసినా భారతదేశ వ్యాప్తంగా అంతగా ప్రాచూర్యం చెందలేదు. ఈ జలపాతంలో నీరు దాదాపు 30 అడుగుల పై నుంచి కిందికి దుముకుతాయి.

హున్నమే జలపాతం

హున్నమే జలపాతం

P.C: You Tube

ఈ జలపాతాన్ని మాణిక్యధార జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ జలపంలో నీరు ఎక్కవ వేగంగా కాకుండా చాలా నిదానంగా కిందికి దుముకుతాయి. ఇటువంటి జలపాతాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందువల్లేఈ జలపాతానికి మాణిక్యధార అని పిలుస్తారు.

హున్నమే జలపాతం

హున్నమే జలపాతం

P.C: You Tube

ఈ జలపాతం ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఎండిపోలేదు. మండు వేసవిలో కూడా ఈ జలపాతంలో నీరు కిందికి దుముకుతూనే ఉంటాయి. అందుకే ఏడాది మొత్తం ఈ జలపాతాన్ని సందర్శించడానికి పర్యాటకులు వస్తూనే ఉంటారు.

హున్నమే జలపాతం

హున్నమే జలపాతం

P.C: You Tube

అంతేకాకుండా ఈ జలపాతంలోకి వచ్చే నీరు ఔషద గుణాలున్న మొక్కల పై నుంచి వస్తుందని చెబుతారు. అందువల్లే ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అందం రెట్టింపవుతుందని స్థానికులు చెబుతూ ఉంటారు.

హున్నమే జలపాతం

హున్నమే జలపాతం

P.C: You Tube

అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకూ ఈ జలపాతాన్ని చూడటానికి ఎక్కువ మంది వస్తుంటారు. అప్పుడు ఈ జలపాతంలో నీరు ఎక్కువగా ఉండటమే కారణం. దీనివల్ల ఈ జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. ఇక ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ ప్రాంతం స్వర్గధామం.

హున్నమే జలపాతం

హున్నమే జలపాతం

P.C: You Tube

బెంగళూరు నుంచి చిక్కమగళూరుకు నిత్యం కేఎస్ఆర్టీసీలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి ఈ జలపాతానికి సులభంగా చేరుకోవచ్చు. కెమ్మనగుడి ప్రముఖ పర్యాటక కేంద్రం ఇక్కడి నుంచి కూడా ఈ జలపాతానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.

హున్నమే జలపాతం

హున్నమే జలపాతం

P.C: You Tube

ఈ జలపాతానికి దగ్గర్లో బీరూరు రైల్వే స్టేషన్ ఉంది. బీరూరు నుంచి ఈ జలపాతాన్ని చేరుకోవడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు లేదా మంగళూరు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ఈ జలపాతాన్ని చేరుకోచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X