Search
  • Follow NativePlanet
Share
» »బంగారంతో తయారు చేసిన అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే సకల ఐశ్వర్యాలు మీ చెంతనే....

బంగారంతో తయారు చేసిన అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే సకల ఐశ్వర్యాలు మీ చెంతనే....

హొరనాడు అన్నపూర్ణేశ్వరీ దేవి దేవాలయానికి సంబంధించిన కథనం.

హిందూ సంప్రదాయంలో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తాం. ప్రపంచంలో జీవులు బదకడానికి కావాల్సింది ఆహారమే. ఇక ప్రతి జీవిలోనే కాకుండా ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూడటం భారతీయ సంప్రదాయంలోనే కనిపిస్తుంది. ఇక ప్రతి జీవికి ఆహారాన్ని అందజేసే అన్నపూర్ణ దేవి అంటే మనమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అటువంటి అన్నపూర్ణ దేవికి ప్రత్యేకమైన దేవాలయాలు భారత దేశంలో అత్యంత అరుదుగా ఉన్నాయి. అటువంటి అరుదైన రెండు దేవాలయాల గురించి ఈ కథనంలో తెలుసుకొందాం. అంతేకాకుండా ఈ దేవతకు సంబంధించిన పురాణ కథలు కూడా క్లుప్తంగా మీ కోసం...

ఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రంఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రం

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube

అన్నపూర్ణ దేవికి సంబంధించి రెండు కథలు ప్రచాచంలో ఉన్నాయి. వాటి ప్రకారం శివుడి భార్య అయిన పార్వతి దేవి అత్యంత సౌందర్యవతి. అంతటి అందమైన భార్య తన పక్కన ఉండాలని ఏ భర్తైనా కోరుకొంటాడు కదా

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
ఈ క్రమంలోనే పరమేశ్వరుడు ఆమె సౌందర్యానికి ముగ్దుడైన ఒక క్షణ కాలం పాటు తన మూడు కన్నులను మూసుకొంటాడు. దీంతో దీంతో జగత్తు మొత్తం అంధకారం అవుతుంది. విశ్వం మొత్తం చీకటిగా మారి పోతుంది.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
అంతేకాకుండా గౌరీ దేవి కూడా తన ప్రాభవాన్ని కోల్పోతుంది. దీంతో పశ్చాత్తాపం చెందిన గౌరీ దేవి ఆ పరమశివుడిని క్షమించమని వేడుకొంటుంది. పరిపరి విదాలుగా వేడుకొంటుంది. నా వల్లనే ఈ జగత్తుకు ముప్పు వాటిల్లిందని బాధపడుతుంది.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
అంతేకాకుండా ప్రాయశ్చిత్తం కూడా సూచించమని చెబుతుంది. దీంతో పరమశివుడు కాశీలో అన్నదానం చేయమని గౌరి మాతకు సూచిస్తాడు. భర్త సూచనమేరకు ఆ పార్వతీ దేవి కాశీకి వెళ్లి అక్కడ అన్నదానం చేస్తుంది.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
మరో కథనం ప్రకారం శివ పార్వతులు మాట్లాడుకొంటున్న సమయంలో పరమశివుడు ఈ లోకం మాయ అని చెబుతాడు. ఈ విశ్వంలోని అన్ని వస్తువులు మాయ, చివరికి ఆహారము కూడా మాయ అని చెబుతాడు.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
దీంతో పార్వతీ దేవికి కోవం వచ్చి అద`శ్యమై పోతుంది. అంతే కాకుండా ఈ విశ్వం నుంచే ఆహారాన్ని మాయ చేస్తుంది. దీంతో ఈ జగత్తులో ఆహాకారాలు మొదలవుతాయి. ఎక్కడ చూసినా ఆకలితో బాధపడేవారే. వారికి కనీసం ఒక్క మెతుకు కూడా దొరకదు.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
ప్రజలు ఆకలితో అలమటిస్తారు. శివుడికి కూడా ఆకలి వేస్తుంది. దీంతో పార్వతీ దేవి తన తప్పును తెలుసుకొని కాశీలో అన్నపూర్ణగా మారి అందరికీ ఆహారాన్ని పంచుతుంది. అప్పటి నుంచి గౌరి మాతను అన్నపూర్ణేశ్వరిగా పిలవడం ప్రారంభిస్తారు.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
అలా అన్నానికి ప్రతిరూపమైన ఆ పార్వతీ దేవిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. అంతేకాకుండా ఇంటిలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని భక్తులు నమ్ముతారు. అందుకే నిత్యం ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
అటువంటి అన్నపూర్ణ దేవికి కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఒక ముఖ్యమైన దేవాలయం ఉంది. జిల్లా కేంద్రమైన చిక్కమగళూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో హొరనాడు అనే క్షేత్రం ఉంది.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి


P.C: You Tube
ఇది ప్రముఖ ధార్మిక కేంద్రం. భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. అన్నపూర్ణేశ్వరి మూల విగ్రహాన్ని బంగారంతో తయారు చేశారు.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొన్న భక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నానికి ఇబ్బంది పడరని చెబుతారు. పూర్వం ఒకసారి ఆ పరమశివుడు శాపగ్రస్తుడైతే ఇక్కడ అమ్మవారిని సందర్శించుకున్న తర్వాత శాప విముక్తి లభించిందని చెబుతారు.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
ఇక్కడ ఉచిత భోజన, వసతి సౌకర్యం ఎల్లప్పుడూ లభిస్తుంది. హొరనాడులోని అన్నపూర్ణేశ్వరి దేవాలయం చుట్టు పక్కల ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఈ హోరనాడుకు దగ్గర్లోనే 75 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన శ`ంగేరి ఉంది.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
అంతేకాకుండా ధర్మస్థల మంజునాథ స్వామి, ఉడిపి శ్రీ క`ష్ణ మఠం కూడా ఇక్కడికి దర్గర్లోనే ఉన్నాయి. బెంగళూరు నుంచి దాదాపు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొరనాడు కు దగ్గర్లో అంటే శివమొగ్గలో రైల్వే స్టేషన్ ఉంది.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
మంగళూరు ఎయిర్ పోర్ట్ ఇక్కడకు దగ్గర్లో ఉన్న విమానాశ్రయం. హొరనాడులో మధ్యహ్నంతో పాటు రాత్రి పూట ప్రతి ఒక్కరికి ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తారు. ఈ క్షేత్రం బెంగళూరు నుంచి 315 కిలోమీటర్ల దూరం,

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

P.C: You Tube
శ`ంగేరి నుంచి 44 కిలోమీటర్ల దూరం, ధర్మస్థలం నుంచి 95 కిలోమీటర్ల దూరం, కుదురేముఖ నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతి నగరం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి

హొరనాడు, అన్నపూర్ణేశ్వరీ దేవి


P.C: You Tube
ఇక రెండో అన్నపూర్ణేశ్వరి దేవాలయం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ధార్మిక క్షేత్రమైన వారణాశి లేదా కాశీలో అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉంది. ప్రముఖ కాశీ విశ్వనాథ్ దేవాలయం నుంచి సుమారు 50 అడుగుల దూరంలోనే ఈ మందిరం ఉంది. ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X