Search
  • Follow NativePlanet
Share
» »అట్టహాసంగా జరిగే దీపావళి పండుగ గోవాలో ఎలా జరుపుకుంటారో తెలుసా !

అట్టహాసంగా జరిగే దీపావళి పండుగ గోవాలో ఎలా జరుపుకుంటారో తెలుసా !

గోవా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి అందమైన బీచ్ లు, ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి దృశ్యాలు గుర్తుకు వచ్చేస్తాయి. దేశం అంతా అట్టహాసంగా జరిగే దీపావళి పండుగను గోవా వాసులు ఎంతో సాంప్రదాయంగా జరుపు కుంటారు.

By Venkatakarunasri

గోవా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి అందమైన బీచ్ లు, ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి దృశ్యాలు గుర్తుకు వచ్చేస్తాయి. దేశం అంతా అట్టహాసంగా జరిగే దీపావళి పండుగను గోవా వాసులు ఎంతో సాంప్రదాయంగా జరుపు కుంటారు. దీపావళి ని 'దియాంచి ఆలి' అంటే దీపాల వరుస అని గోవా లో పిలుస్తారు. దీపావళి రోజున ప్రతి ఇంటిలో మట్టి ప్రమిదలలో నూనె పోసి, ఒత్తి వేసి సాంప్రదాయక మట్టి ప్రమిదల దీపాలు వెలిగిస్తారు. వీటిని కొంకణి భాషలో ' దియులీస్' అని అంటారు. ఈ రోజున అత్యంత ఉత్సాహంతో ప్రతి ఇంటి కి వీరు ఆకాశ దీపాలు కూడా వెలిగిస్తారు. అంటే ఇవి వివిధ రంగుల తో కూడిన లాంతర్లు. వీటిని వీరు ఇంటి కిటికీలకు వేలాడ కడతారు. ఇది ఇక్కడి ప్రజల దీపావళి పండుగ ఆచారంగా వస్తోంది. గోవా లో ఈ పండుగ ఎలా చేస్తారనేది పరిశీలిద్దాం.

దీపావళి పండుగ గోవాలో

దీపావళి పండుగ గోవాలో

నరక చతుర్దశి ఈ పండుగ వేడుకలు నరకచతుర్దశి నాడు, అన్ని రాష్ట్రాలలో వలెనె మొదలవుతాయి. నరకచతుర్దశి రోజును చోటి దీవాలి అంటారు. దీని తర్వాత రోజు వచ్చేది, దీపావళి. దీనిని గోవా భాషలో వాదలి అంటే పెద్ద పండుగ అంటారు.

దీపావళి పండుగ గోవాలో

దీపావళి పండుగ గోవాలో

ఈ రోజు నుండి పన్నెండవ రోజును తులసి లగ్నం అని కూడా పేర్కొంటారు. ఈ తులసి లగ్నాన్ని వీరు అత్యంత శుభ ప్రదమైనదిగా భావిస్తారు. సాధారణంగా ఇక్కడి ప్రజలు ఈ పండుగ తర్వాత అంటే తులసి లగ్నం తర్వాత తమ తెగలలో వివాహాలు చేసుకోవడం మొదలు పెడతారు.

దీపావళి పండుగ గోవాలో

దీపావళి పండుగ గోవాలో

చోటి దీవాలి నాడు ఏమి చేస్తారు ?

చోటి దీవాలి గా పిలువబడే నరక చతుర్దశి నాడు ఒంటి నిండా నూనె రాసి, సుగంధ ద్రవ్యాలతో ఉదయం పెందలకడనే అభ్యంగన స్నానం చేస్తారు. స్నానాలు అయిన వెంటనే, ఇంటిలోని పెద్ద మహిళా ఒకరు హారతులు ఇచ్చి నూతన దుస్తులు ధరింప చేస్తారు.

దీపావళి పండుగ గోవాలో

దీపావళి పండుగ గోవాలో

'పోహా ' అనే రైసు వంటకాన్ని చేసుకు తింటారు. ఈ పోహ వంటకాలను వివిధ రుచులలో అంటే, స్వీట్, కారం, పాలు పోసే, మొదలైన రకాలుగా చేస్తారు. దీపావళి రెండవ రోజు దీపావళి పండుగ. ఈ రోజున నరకాసురిడి గడ్డి బొమ్మలను తగులబెట్టి, చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు.

దీపావళి పండుగ గోవాలో

దీపావళి పండుగ గోవాలో

కుటుంబ సభ్యులు అందరూ కలసి గోవా ప్రజల దీపావళి వంటకాలు తయారు చేసి తింటారు. దీపావళి పండుగ నాడు ప్రధాన వంటకం ' ఫ్లాట్ రైస్ ' లేదా పోహ. ఈ పోహను వివిధ రుచులలో తయారు చేస్తారు. దీనిలో పాలు, షుగర్ లేదా కొబ్బరి పాలు , బెల్లం జత చేస్తారు.

దీపావళి పండుగ గోవాలో

దీపావళి పండుగ గోవాలో

బంగాళా దుంపలు, పసుపు,పచ్చి మిరప, మొదలైనవి వేసి స్పైసి గా కూడా చేసి ఆరగిస్తారు. దీపావళి తేదీ నుండి పన్నెండవ రోజును తులసి లగ్నం లేదా హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా పేర్కొంటారు. ఈ రోజున వారి పంటలను ఇంటికి తెస్తారు. మంచి పంటలను ఇచ్చినందుకు గోవా భూమికి కృతజ్ఞతలు తెలుపుతారు.

దీపావళి పండుగ గోవాలో

దీపావళి పండుగ గోవాలో

ఈ సంవత్సరం గోవా పర్యాటక శాఖ దీపావళి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లలో ఒక బోటు ప్రయాణం లో కూర్చుని నరకాసురిడి గడ్డి బొమ్మలను తగులబెట్టటం వంటి ప్రోగ్రాములు చూడవచ్చు. దీనితో పాటు వినోద కార్యక్రమాలైన గోవా జానపద నృత్యాలు, డివలి డాన్స్ , స్పెషల్ ప్రోగ్రాం లు అనేకం నిర్వహిస్తోంది. దీపావళి రోజు రాత్రి పది గంటల నుండి అర్దరాత్రి వరకూ సాగే ఈ ప్రోగ్రాములు పాన్జీం లో ఒక జెట్టి బోటు లో నిర్వహించబడతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X