Search
  • Follow NativePlanet
Share
» » ఈ గిరి దుర్గం మొత్తాన్ని ఒక్క రోజులో చూస్తే మీరే ఈ కోటకు రాజు

ఈ గిరి దుర్గం మొత్తాన్ని ఒక్క రోజులో చూస్తే మీరే ఈ కోటకు రాజు

పూణేకు దగ్గర్లో ఉన్న రాజ్ ఘడ్ కోట గురించి కథనం.

భారత దేశంలో గిరి దుర్గాలకు కొదువులేదు. పూర్వం రాచరికం అమల్లో ఉన్న సమయంలో ఒక రాజ్యం పై మరొక రాజ్యం దండెత్తడం, ఆక్రమించుకోవడం, సంపదను కొల్లగొట్టడం సర్వసాధారణం. అందువల్లే శత్రు దేశాలకు సులభంగా తమ రాజ్యం చిక్కకుండా ఉండటానికి జరిపే యుద్ధ తంత్రాల్లో గిరి దుర్గాల నిర్మాణం కూడా ఒకటి. పర్వత శిఖరా లపై భాగంలో కోటలు నిర్మించి చుట్టు కందకాలు ఏర్పాటు చేసేవారు. ఇటువంటి గిరి దుర్గాలు భారత దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అటు వంటి కోటల్లో విశిష్టమైన కోట గురించి ఈ కథనంలో తెలుసుకొందాం.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

గిరి దుర్గాలకు మహారాష్ట్ర పెట్టింది పేరు. అక్కడి భౌగోళిక పరిస్థితులను అనుసరించి శత్రుదుర్భేద్యమైన గిరి దుర్గాలను నిర్మించుకున్నారు.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

అందులో పూనే దగ్గరగా ఉన్న రాజ్ ఘడ్ కోట భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచింది. పూనే నగరం నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

మరాఠా సామ్రాజ్య కాలంలో ఈ కోటను మురుమదేవి అని పిలిచేవారు. స్థానికంగా మురుంబా దేవిని పూజిస్తారు. ఆ దేవి పేరు పైనే మొదట ఈ కోటను మురుమదేవి అని పిలిచే వారు.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

ఈ కోట ప్రధాన ద్వారాన్ని మహా దర్వాజ అని పిలిచేవారు. ఇక మరాఠా యోథుడు అన్న తక్షణం మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఛత్రపతి శివాజీ.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

ఆ శివాజీ కాలంలో ఈ రాజ్ ఘడ్ కోట 26 ఏళ్ల పాటు మరాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. దాదాపు 40 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఈ కోటను ఆక్రమించుకోవడం అంత సులభమైన విషయం కాదు.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

ముఖ్యంగా కోట పై భాగం నుంచి శత్రువు ఏ వైపు నుంచి వచ్చినా ఇట్టి తెలిసుకొనే ఏర్పాటును శివాజీ చేశాడు. ఈ రాజ్ కోట లోపలే మంచినీటి నిల్వల నుంచి యుద్ధ సామాగ్రీ వరకూ ప్రతి ఒక్కటినీ నిల్వచేసుకునే వీలు ఉండేది.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

అంతే కాకుండా చుట్టు పక్కల ప్రక`తి కూడా శత్రుదేశాలు ఈ కోట పై భాగంలో చేరుకోనియకుండా అడ్డుకొనేవి. శివాజీ తాను నిర్మించిన కోటల్లో ఎక్కువ కాలం నివశించినది ఈ రాజ్ ఘడ్ కోటలోనే అని తెలుస్తోంది.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

అనేక చారిత్రాత్మక సంఘటనలకు రాజ్ ఘడ్ సాక్షి భూతం. ముఖ్యంగా అఫ్జల్ ఖాన్ ను శివాజీ మట్టు పెట్టింది ఇక్కడే.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

రాజ్ పుత్ రాజు రాజ జయసింగ్ తో చేసుకొన్న ఒప్పందం ప్రకారం క్రీస్తు శకం 1665లో శివాజీ తన ఆధీనంలో ఉంచుకున్న 17 కోటల్లో రాజ్ ఘడ్ కోట కూడా ఒకటి.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

ఇక పర్యాటక పరంగా కూడా ప్రస్తుతం ఈ కోట యువతతో పాటు అన్ని వర్గాల వారనీ విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సాహస యాత్రలంటే ఇష్టపడే వారికి ఈ కోట పచ్చటి కార్పెట్ పరుస్తోంది.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

వర్షాకాలం తర్వాత ఈ కోట పరిసర ప్రాంతాల్లోని అందాలు రెట్టింపవుతాయి. మేఘాలను తాకే పర్వతశిఖరాలు, కనుచూపుమేర పచ్చటి పర్వత శిఖరాలను మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

ముఖ్యంగా పూణే, ముంబై నుంచి ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వారు ఎక్కువగా ఈ ప్రాంతానికి వారాంతాల్లో ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

ఈ కోట మొత్తాన్ని ఒక రోజులో చూడటానికి అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది ఒక రోజు రాత్రి ఇక్కడే ఉండి తరువాతి రోజూ కూడా ఈ కోట విశేషాలను చూస్తూ ఉంటారు.

రాజ్ ఘడ్ గిరి దుర్గం

రాజ్ ఘడ్ గిరి దుర్గం

P.C: You Tube

రాత్రి బసకు ఇక్కడ అవకాశం ఉంది. రాత్రి పూట అవసరమైన ఆహారం కూడా దగ్గర్లో ఉన్న పల్లెటూరి ప్రజలు వండి పెడుతారు. ఇందుకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X