Search
  • Follow NativePlanet
Share
» »వేసవిలో విహారాలు ... చౌకైన ప్రయాణాలు !

వేసవిలో విహారాలు ... చౌకైన ప్రయాణాలు !

By Mohammad

విహార యాత్ర లంటే చాలు పిల్లలు, పెద్దలు అందరూ ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో చేసే విహారాలను చాలా వరకు పర్యాటకులు ఆనందిస్తారని మొన్నీమధ్యలో జరిపిన ఒక సర్వే లో తేలింది కూడా ..!

మొన్ననే ఇంటర్ పరీక్షలు ముగిసాయి .. వెంటనే పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఇది అయిపోవటానికి ఇంకా 2 వారాలు సమయం పడుతుంది. మిగితా తరగతుల విద్యార్థులకు పరీక్షలు ఏప్రియల్ 3 వ వారం నుండి మొదలుకావచ్చు. ఇవన్నీ ముగియటానికి ఇంకా నెల - నెలన్నారా సమయం పట్టవచ్చు. పరీక్షలు ముగిసాక పిల్లల నుండి వచ్చే మొదటి ప్రశ్న 'సెలవులకు ఎక్కడికి వెళదాం? అని' సెలవులు వచ్చాక చూద్దాం లే అని మీరు సమాధానం ఇస్తే .. ఆ తర్వాత మీరే కోరుకున్న చోటికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అందుకే విహార యాత్రలకు వెళ్ళేవారు ముందుగా పక్కా ప్రణాళికతో (దానినే 'ముందుచూపు' అని కూడా అంటారు) ఉండటం ఉత్తమం. దానికిదే సరైన సమయం కూడానూ ..!

ట్రెండ్ కు తగ్గట్టు ..!

ట్రెండ్ కు తగ్గట్టు ..!

చాలా మంది చివరి నిమిషంలో టూర్ విషయమై హడావిడి పడుతుంటారు. ఓ 5 -10 ఏళ్ల కిందట చాలా మంది పర్యాటకులు స్వల్ప దూరంలో ఉన్న విహార యాత్రలకు వెల్లొచ్చేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది .. ఆలోచనలు మారాయి .... అందుకే ఇతర రాష్ట్రాల వైపు, విదేశాల వైపు టూర్ లకు వెళ్ళటం ఆరంభించారు యాత్రికులు.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

రద్దీ కారణంగా

రద్దీ కారణంగా

పై విధంగా ఆలోచించడం వలన సరిగ్గా మీరు వెళ్ళాలనుకొనే ఆ సమయంలో రైలు బుకింగ్ ల మీద, హోటల్ బుకింగ్ ల మీద రద్దీ ఉంటుంది. ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికే అవకాశం లభిస్తుంది.

చిత్ర కృప : Smeet Chowdhury

ఆఫర్ లు

ఆఫర్ లు

ప్రస్తుతం కొన్ని విమానయాన సంస్థలు వేసవి సెలవులకై కొన్ని రాయితీలను ప్రకటించింది. తీరా మీరు చివరి నిమిషంలో బుక్ చేసుకుందామనుకొని ఓపెన్ చేస్తే .. ఆ ఆఫర్ లు ఉండవు. మీరు విమానాశ్రయం వద్ద వెళ్ళి అడిగినా ప్రయోజనం ఉండదు. అందుకే మీరు వెళ్ళాలానుకున్న ప్రదేశం ఏదైనా లేక రాయితీ ప్రదేశానికైన ఇప్పుడే బుక్ చేసుకోవటం ఉత్తమం.

చిత్ర కృప : InSapphoWeTrust

రిజర్వేషన్

రిజర్వేషన్

దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు విమానం లేదా రైలు ఎంపిక చేసుకోవటం మంచింది. ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే లాస్ట్ మినిట్ లో ఎటువంటి గాబారా పడవలసిన అవసరం ఉండదు. ఒకవేళ లాస్ట్ మినిట్ లో టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే చాలా ఇబ్బందులు తలెత్తవచ్చు.

చిత్ర కృప : Miran Rijavec

తత్కాల్ టికెట్

తత్కాల్ టికెట్

చివరి నిమిషంలో తత్కాల్ తో తలనొప్పి స్టార్ అవుతుంది. సీట్ దొరుకుతుందో లేదో అని టెన్షన్ .. టెన్షన్. సీట్ దొరుకుతుంది లే అని పాసిటీవ్ మైండ్ ఉన్న వారితో ప్రాబ్లమ్ లేదుకానీ .. దొరకదనే వారుంటారే ... వాళ్ళు కాస్త ఆందోళనకరంగా ఉంటారు.

చిత్ర కృప : Daniel Mennerich

ఆదా మార్గాలు !

ఆదా మార్గాలు !

కనీసం నెల - నెలన్నారా ముందుగా టికెట్ లను బుక్ చేసుకొని పెట్టుకోవటం, అలాగే అక్కడ వసతి కై హోటళ్లు, రిశార్ట్ లు బుక్ చేసుకొని పెట్టుకోవటం శ్రేయస్కరం. విదేశీ యాత్రలు చేసే వారు రెండు .. మూడు నెల ల ముందుగానే టికెట్ ను సిద్ధం చేసుకొని ఉంచుకోవటం ఉత్తమం. ఆ సమయంలో నే టికెట్ ల మీద బోలెడన్ని ఆఫర్ లు ఉంటాయి. డబ్బు కూడా ఆదా అవుతుంది.

చిత్ర కృప : Fervil Tripoli

తక్కువ ధరల్లోనే ..!

తక్కువ ధరల్లోనే ..!

యాత్రలు వీకెండ్ లో కంటే వీక్ డేస్ లో చేయటం మరో గుర్తుంచుకోవలసిన అంశం. ఆ టైమ్ లోనే చాలా వరకు తక్కువ ధరల్లోనే వసతులు, రాయితీలు దొరుకుతాయి.

చిత్ర కృప : Sapphire Viajes

అడిగి తెలుసుకోండి ..!

అడిగి తెలుసుకోండి ..!

చాలా మంది తెలియని ప్రదేశాలను చూసి రావటానికి టూర్ ఆపరేటర్ లను, ఏజెంట్ లను ఆశ్రయిస్తారు. వారే అన్ని సదుపాయాలు కలిపిస్తామన్నప్పటికీ భారం ఎక్కువై ఆలోచనలో పడతారు. అలాంటప్పుడు ఆ ప్రదేశాలను ముందుగానే సందర్శించిన తోటి మిత్రులను, బంధువులను అడిగి తెలుసుకోవటం ద్వారా చౌకగా వెళ్లిరావచ్చు. టూర్ గైడ్ లను కానీ, మా తెలుగు నేటివ్ ప్లానెట్ ను గాని సందర్శించిన సరిపోతుంది.

చిత్ర కృప : Mehul Antani

ఆన్‌లైన్ సేవలు

ఆన్‌లైన్ సేవలు

నెట్ ఇప్పుడు అందరికీ ప్రధాన వనరుగా మారిపోయింది. పర్యాటక ప్రదేశాల వివరాలన్నీ ఆన్‌లైన్ లోనే ఉంటాయి. ముందు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటే ... ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి ? ఏమేమి చూడాలి ? అనే వాటిపై స్పష్టత వస్తుంది. దానికి తగ్గట్టు దగ్గరలోనే హోటళ్లను ఆన్‌లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు బెస్ట్ రాయితీలతో పాటు, క్యాష్ బ్యాక్ ఆఫర్ లను అందిస్తున్నాయి.

చిత్ర కృప : Saad Faruque

జట్టుగా లేదా గ్రూప్ గా

జట్టుగా లేదా గ్రూప్ గా

ఒకటే కుటుంబం కాకుండా ఓ రెండు మూడు కుటుంబాలు కలిసి ట్రావెల్ వాహనం అద్దెకు తీసుకొని ప్రయాణించడం వలన రవాణాపరంగా కలిసి వస్తుంది. ఒకటే వీధి లో ఉన్నవారు లేదా చూసిన వారు లేదా బంధువులతో కలిసి ప్రయాణిస్తే ... ఆ వాతావరణం భలే సందడిగా ఉంటుంది, ప్రయాణం సాఫీగా సాగుతుంది.

చిత్ర కృప : Virginia State Parks

హోటల్ .. పడకకు మాత్రమే ..!

హోటల్ .. పడకకు మాత్రమే ..!

11. హోటల్ .. పడకకు మాత్రమే ..!
హోటళ్లు బుక్ చేసుకున్నప్పుడు అదే హోటల్లో తినటం కంటే బయటికి వెళ్ళి తినటం ద్వారా ఖర్చు తగ్గుతుంది. బయట వివిధ రకాలైన రుచులను తనివితీరా ఆస్వాదించవచ్చు. హోటళ్లను కేవలం పడకకు మాత్రమే ఎంపిక చేసుకోవటం మంచింది.

చిత్ర కృప : Laura Blankenship

ప్రభుత్వ టూర్ ప్యాకేజీ లు

ప్రభుత్వ టూర్ ప్యాకేజీ లు

స్థానికంగా పర్యటనలు చేసేటప్పుడు ప్రభుత్వ పర్యాటక సంస్థల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ప్రవేట్ టూర్ ఆపరేటర్ లను, ఏజెంట్లను ఆశ్రయించటం కంటే ఇవే నయం. ఖర్చు కూడా తగ్గుతుంది.

చిత్ర కృప : Siddharth Bargate

రోమింగ్ ఛార్జీలు

రోమింగ్ ఛార్జీలు

ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ రోమింగ్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రోమింగ్ ఛార్జీలు తక్కువే కదా అని వదిలేస్తే బిల్లు తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చార్జీ లు వసూలు చేసే విధంగా ఉండేట ట్లు చూసుకోవాలి.

చిత్ర కృప : Vinoth Chandar

ఆహారం

ఆహారం

వెళ్ళిన చోటనో, రైల్లోనో ఆహారం కొంతమందికి నచ్చకపోవచ్చు. అలా అని అక్కడికి వెళ్ళి వంట చేసుకొనేరు ...!. కాబట్టి, ప్రయాణానికి వెళ్లే రోజున ఇంటినుండే భోజనం తీసుకొని పోవటం వలన ఒకరోజు భోజనం ఖర్చన్నా మిగులుతుంది.

చిత్ర కృప : Yelp Inc.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X