Search
  • Follow NativePlanet
Share
» »హౌరా..! బ్రిడ్జ్‌ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలు

హౌరా..! బ్రిడ్జ్‌ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలు

భారతదేశం కొన్ని అత్యద్భుతమౌప వంతెనలకు సాక్షిభూతంగా నిలిచింది. నిర్మాణ రంగంలో ఖచ్ఛితంగా అద్భుతమైన కళాఖండాలు అనదగ్గ వంతెనలు కొన్ని భారతదేశంలో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా అవి తమ పట్ల ఆరాధనను చెక్కు చెదరనీయకుండా నేటికీ నిలిచిఉన్నాయి. వెనుకటి కాలంలో నిర్మించిన అనేక వంతెనలు ఆనాడే సాంకేతికంగా ఎంతో అధునాతనంగా ఉన్నాయి. అలాంటి అత్యాధునిక వంతెనల్లో భారత దేశంలో కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన కొన్ని వంతెనల్లో హౌరా వంతెన ఒకటి. మరి దీని గురించి కొన్ని వాస్తవాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

హౌరా బ్రిడ్జ్ ఒక అద్భుతమైన నిర్మాణం.

హౌరా బ్రిడ్జ్ ఒక అద్భుతమైన నిర్మాణం.

హౌరా బ్రిడ్జ్ ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది పశ్చిమ బెంగాల్ లో హుగ్లీ నదిపై ఉన్న కాంటిలివర్ వంతెన. పూర్తిగా ఉక్కుతో నిర్మించారు. 1936లో ప్రారంభమై 1942లో పూర్తయింది. ఇది 1943లో రాకపోకల కోసం ప్రారంభమైంది. తర్వాత దీనికి సమాంతరంగా మరో వంతెనెను కూడా నిర్మించారు.

హౌరా, కలకత్తా నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన

హౌరా, కలకత్తా నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన

హౌరా, కలకత్తా నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన కలకత్తా నగరానికి ఆయువు పట్టు. ఈ వంతెన నట్లు, బోల్టులు లేని అత్యంత అరుదైన వంతెనల్లో ఒకటి. మొత్తం రివిట్లతో నిర్మించిన మొదటి వంతెన ఇది.

 ‘న్యూ హౌరా బ్రిడ్జ్’

‘న్యూ హౌరా బ్రిడ్జ్’

ప్రతి రోజూ దాదాపు లక్షకు పైగా వాహనాలు ఈ వంతెనను దాటుతుండడం వల్ల ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన వంతెనల్లో ఇదొకటిగా పేరొందింది. వాస్తవంగా చెప్పాలంటే దీని పేరు ‘న్యూ హౌరా బ్రిడ్జ్'. హౌరా -కోల్ కత్తాలను కలిపేందకు నిర్మించిన ఒక బల్ల కట్టు వంతెన. దీని స్థానంలో మళ్లీ నిర్మించారు కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. అయితే రెండు దశాబ్దాల తర్వాత జూన్ 14, 1965లో దీని పేరును నోబెల్ గ్రహీత మరియు కోల్ కత్తా యొక్క ఆణిముత్యం కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో ‘రవీంద్ర సేతు'గా మార్చారు. కానీ అందరూ హౌరా బ్రిడ్జ్ అనే పిలుస్తారు.

ఇది ప్రపంచంలోనే నాల్గవ అతి పొడవైన కాంటిలివర్ సస్పెన్షన్ వంతెన

ఇది ప్రపంచంలోనే నాల్గవ అతి పొడవైన కాంటిలివర్ సస్పెన్షన్ వంతెన

ఇది ప్రపంచంలోనే నాల్గవ అతి పొడవైన కాంటిలివర్ సస్పెన్షన్ వంతెన. ఈ వంతెన 2వ ప్రపంచ యుద్ధం కాలంలో నిర్మించబడినది. 26500టన్నుల భారీ ఉక్కువ నిర్మాణం ప్రస్తావన రుడ్యార్డ్ కిప్లింగ్ రచనలలో మరియు టాటా స్టీల్ ప్రచురించిన కాఫీ టుబుల్ బుక్ ‘‘హౌరా బ్రిడ్జ్: యాన్ ఐకాన్ ఇన్ స్టీల్ '' అనే పుస్తకంలో కనిపిస్తుంది. 2వ ప్రపంచ యుద్ద సమయంలో హౌరా వంతెన బాంబు దాడికి లక్ష్యంగా చేసుకోబడినది.

 ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కోల్ కత్తా నగరం యొక్క రూపు రేఖలు

ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కోల్ కత్తా నగరం యొక్క రూపు రేఖలు

ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కోల్ కత్తా నగరం యొక్క రూపు రేఖలు మారిపోయాయి. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రపంచంలో 6వ అతి పెద్ద వంతన. కోల్ కత్తా పోర్ట్ ట్రస్ట్ 2150 అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడని ఈ వంతెన దాని పునాది నుండి 280అడుగుల ఎత్తులో ఉంది.

 ఈ బ్రిడ్జ్ మరమ్మత్తులు

ఈ బ్రిడ్జ్ మరమ్మత్తులు

అయితే ఈ బ్రిడ్జ్ తుప్పు, పక్షి రెట్టలు మరియు సున్నం, జర్తాతో కూడిన పాన్ ఉమ్మి వలన వంతెన దెబ్బతిన్నది, 2007 మరియు 2011 మధ్య కాలంలో ఆరు మిల్లీమీటర్లు నుండి మూడు మిల్లీ మీటర్ల వరకు స్తంభాలను రక్షింతే ఉక్కు ఉడ్స్ యొక్క మందం తగ్గిపోయిందని 2011లో జరిగిన ఒక సర్వేలో వెల్లడించారు. తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోబడ్డాయి మరియు రెగ్యులర్ గా పెయింటింగ్ చేయబడినది. 2014 లో కోల్కతా పోర్ట్ ట్రస్ట్ రూ .6.5 మిలియన్లను ఖర్చుచేసింది. 26,000 లీటర్ల లేద్-రహిత పెయింట్తో 2.2 మిలియన్ చదరపు మీటర్ల పేయింట్ చేయబడినది.2013 మరియు 2016 మధ్యకాలంలో ఇంజినీరింగ్ నిర్వహణ కొరకు సగటు వార్షిక వ్యయం 2.5 కోట్లు అయింది.

ఈ బ్రిడ్జ్ పై అనేక చలన చిత్రాలను కూడా షూట్ చేశారు

ఈ బ్రిడ్జ్ పై అనేక చలన చిత్రాలను కూడా షూట్ చేశారు

ఈ బ్రిడ్జ్ పై అనేక హిందీ చలన చిత్రాలను కూడా షూట్ చేశారు.ఈ వంతెన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, రాజ్ కపూర్, రోలాండ్ జోఫ్ఫ్ మరియు మీరా నాయర్ నిర్మించిన పలు చిత్రాలలో కన్పిస్తుంది. సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవి నటించిన చిత్రంలో హౌరా బ్రిడ్జ్ పై సూపర్-హిట్ పాట" ఔరా హౌరా బ్రిడ్జ్"ఉంది. శక్తిసామంత నిర్మించిన యొక్క "హౌరా బ్రిడ్జ్" హిందీ చిత్రం భారీ బాక్స్ ఆఫీసు విజయాన్ని సాధించింది. కోల్ కత నగరాన్ని సందర్శిచిన వాళ్లు ఆనాటి అద్భుత టెక్నాలజీని వీక్షించాలంటే తప్పక ఈ బ్రిడ్జిని సందర్శించాల్సిందే!

ఈ వంతెన హౌరా రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఉంటుంది

ఈ వంతెన హౌరా రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఉంటుంది

ఈ వంతెన హౌరా రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఉంటుంది. బ్రిటిష్ వారు తమ సౌకర్యం కోసం నిర్మించిన ఈ రైల్వేస్టేషన్ ఎంత చూసినా సరిపోదు. భారతదేశంలోనే అతి పెద్ద రైల్వే కాంప్లెక్స్ ఇది. 1851లో (సుమారు 160ఏళ్ళ క్రితం)నిర్మించిన రైల్వే స్టేషన్ ఇది. రోజులో దాదాపు పది లక్షల మంది ప్రయాణికులు ఈ ఒక్క రైల్వే స్టేషన్ నుండి బయటకు వస్తారు. లోపలికి వెళ్తారు.

ఎంత అద్భుతమైన రైల్వే స్టేషన్ అంటే

ఎంత అద్భుతమైన రైల్వే స్టేషన్ అంటే

23 ప్లాట్ ఫాంలపై 687రైళ్లు తిరుగుతుంటాయి. ఎంత అద్భుతమైన రైల్వే స్టేషన్ అంటే ..చెప్పడానికి మాటలకు అందనంత. ఈ స్టేషన్ బయటి నిర్మాణం ..రెడ్ బ్రిక్ తో నిర్మించిన ఈ నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. స్టేషన్ బయటి నిర్మాణ రూపం లోపల స్తంభాలు..గదులు..ఏదో రాజమహాల్ ను తలపిస్తాయి. అపరిమితమైన రద్దీతో ఎంత చిరాకు కలిగినా...చరిత్రను అధ్యయనం చేసేవారికి నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావం తెలుసకోవలనే వారికి అమితానందం కలిగిస్తుంది.

 మ్యూజియం

మ్యూజియం

అలాగే హౌరా స్టేషన్ ప్రాంగణంలోనే రైల్వే మ్యూజియం ఉంది. భారతీయ రైల్వే చరిత్రను ఈ మ్యూజియం విప్పి చెప్తుంది. ప్రపంచంలో అతి పెద్ద నెట్వర్క్ ఉన్న వ్యవస్థ మన రైల్వేలది. పొగబండి దగ్గరి నుండి రైల్వేల్లో పరిణామ క్రమంగా వచ్చిన మార్పులు ఈ మ్యూజియంలో ప్రతిఫలిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X