Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో ఈ స్ట్రీట్ ఫుడ్ రుచి చూడని వారు లేరు

హైదరాబాద్ లో ఈ స్ట్రీట్ ఫుడ్ రుచి చూడని వారు లేరు

హైదరాబాద్ లోని స్ట్రీట్ ఫుడ్ గురించి

By Kishore

హైదరాబాద్ అన్న తక్షణం మనకు ఛార్మినార్, హైదరాబాద్ బిర్యాని, ఇక రంజాన్ మాసం అయితే హలీం గుర్తుకు వస్తాయి. అయితే హైదరాబాద్ లో తినదగ్గ, చూడదగ్గ ఎన్నో ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రాంతం చాలా ఫేమస్. ఇందులో కొన్ని లోకల్ వంటలు, డిషెష్ కాగా మరొకొన్ని నాన్ లోకల్. అయినా ఆ నాన్ లోకల్ డిషెష్ కూడా స్థానికులతో పాటు పర్యాటకులు రుచి చూడకుండా వెనుతిరిగి రాలేరు. హైదరాబాద్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ కు ఫేమస్సే. ఆయా ప్రాంతానికి చెందిన వారు దగ్గరగా ఉన్న ఫుడ్ కోర్ట్ అదేనండి బండి దగ్గరికి వెళ్లి తిని వస్తుంటారు. అయితే కొన్ని బండ్లు మాత్రం హైదరాబాదే కాకుండా చుట్టు పక్కల ఉన్న కొన్ని నగరాల్లో కూడా ఫేమస్. ముఖ్యంగా తవ్వా ఇడ్లీ దొరికే లక్ష్మణ్ బండి, రామ్ బండి, గోకుల్ ఛాట్ వంటివి చాలా ఫేమస్. అక్కడ దొరికే పదార్థాలతో పాటు, అడ్రస్ సమయం మొదలైన అన్ని వివరాలు అందిస్తున్నాం. అందువల్ల హైదరాబాద్ కు వెళ్లి ఆ ప్రాంతాలకు వెళితే తప్పకుండా ఆ స్ట్రీట్ ఫుడ్ రుచి చూడండి

 లక్ష్మణ్ బండి, బేగం బజార్

లక్ష్మణ్ బండి, బేగం బజార్

P.C: You Tube

దక్షిణ భారత దేశ వంటకాలను బాగా ఇష్టపడే వారికి ఈ లక్ష్మణ్ బండిలో దొరికే వంటకాలు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా వివిధ రకాలైన దోస, ఇడ్లీ ఇక్కడ చాలా ఫేమస్

ఎక్కడ ఉంది....మంగళ్ హాట్ రోడ్డు దగ్గర, గ్యాన్ బాగ్ కాలనీ, బేగం బజార్

చాలా ఫేమస్....బట్టర్ ఇడ్లీ, బట్టర్ దోస

సమయం....వారంలో అన్ని రోజులూ ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకూ

రామ్ బండి, నాంపల్లి

రామ్ బండి, నాంపల్లి

P.C: You Tube

తెల్లవారకముందే రుచికరమైన మసాలా దోసే తినాలంటే నాంపల్లిలోని రామ్ బండిని పలకరించాల్సిందే. ఈ బండి దగ్గర చాలా క్యూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఈ బండి ఎంత ఫేమస్సో

ఎక్కడ ఉంది....కరాచీ బేకరి ఎదురుగా, మోజామ్ జాహీ మార్కెట్

చాలా ఫేమస్....తీన్ మార్ దోసె, చీజ్ ఉప్మా

సమయం....వారంలో అన్ని రోజులూ తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ మాత్రమే

గోవింద బండి, గుల్జార్ హౌస్

గోవింద బండి, గుల్జార్ హౌస్

P.C: You Tube

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అన్ని రకాల టిఫిన్స్ ఇక్కడ బాగా దొరుకుతాయి. ముఖ్యంగా నోట్లోపెట్టుకొంటే కరిగిపోయే ఇడ్లీ ఇక్కడ చాలా ఫేమస్. తవ్వా ఇడ్లీ పై వెన్నరాసుకొని తింటూ ఉంటూ నా సామిరంగా ఆ ఆనందమే వేరు

ఎక్కడ ఉంది....గుల్జార్ హౌస్, ఆగ్రా స్వీట్స్ ఎదురుగా, ఘాన్సీ బజార్

చాలా ఫేమస్....తవ్వా ఇడ్లీ

సమయం....వారంలో అన్ని రోజులూ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ

మోమూస్ పాయింట్, హబ్సీగూడ

మోమూస్ పాయింట్, హబ్సీగూడ

P.C: You Tube

ఇటీవల ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ మోమూస్. తెల్లగా సుతిమొత్తగా ఉండే ఈ మామూస్ ను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటున్నారు. సికింద్రాబాద్, హబ్సీగూడ ఏరియాలో మోమూస్ కు చాలా ఫేమస్ ఈ మామూస్ పాయింట్

ఎక్కడ ఉంది.... బాలాజీ ఆర్కెడ్, స్టుడియో 11, స్ట్రీట్ 8

చాలా ఫేమస్....చాకొలేట్ మోమూస్

సమయం....వారంలో అన్ని రోజులూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ

రాజస్థానీ జిలేబీ, ఛార్మినార్

రాజస్థానీ జిలేబీ, ఛార్మినార్

P.C: You Tube
హైదరాబాద్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఛార్మినార్ వద్ద జిలేబీ తయారీ దుకానం ఉంది. దీనిని రాజస్థాని జిలేబీ షాప్ అనే పిలుస్తారు. ఇక్కడ జిలేబీతో పాటు మిక్సర్ కూడా చాలా రుచిగా ఉంటుంది.

ఎక్కడ ఉంది.... చింతల్ మెట్, రుచి కాఫీ దగ్గర

చాలా ఫేమస్.... జిలేబీ, జాంగ్రీతో పాటు సమోసా, కచోరి,

సమయం....వారంలో అన్ని రోజులూ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ

లమాఖాన్, బంజారా హిల్స్

లమాఖాన్, బంజారా హిల్స్

P.C: You Tube

ఇక్కడ ఉత్తరాది వంటకాలు కూడా చాలా ఫేమస్. తక్కువ ధరకే రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ అందులోనూ బంజారా హిల్స్ వంటి ఖరీదైన ప్రాంతంలో తినాలంటే మాత్రం ఇక్కడికి వెళ్లాల్సిందే.

ఎక్కడ ఉంది....జీవీకే మాల్, రోడ్ నం 5

చాలా ఫేమస్.....లస్సీ, మిర్చీ బజ్జీ, ఎగ్ పకోడ

సమయం....ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకూ (సోమవారం సెలవు)

గోకుల్ ఛాట్, కోటి

గోకుల్ ఛాట్, కోటి

P.C: You Tube

గోకుల్ ఛాల్ లో రుచికరమైన ఎన్నో ఛాట్స్ మనకు దొరుకుతాయి. కోటికి వెళ్లిన వారు తప్పకుండా గోకుల్ ఛాట్ కు వెళుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పావ్ బాజీ నుంచి మిర్చి బజ్జీ వరకూ ఇక్కడ ప్రతి ఒక్కటీ రుచి కరంగానే ఉంటుంది.

ఎక్కడ ఉంది.....ఉమెన్స్ కాలేజ్ దగ్గర, కోటి

చాలా ఫేమస్....పావ్ బాజీ, బేల్ పూరీ, కచోరి. ముఖ్యంగా కుల్ఫీ

సమయం....ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10.45 గంటల వరకూ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X