• Follow NativePlanet
Share
» »హైదరాబాద్ అందరికి నచ్చడానికి కారణం ఇవే ..

హైదరాబాద్ అందరికి నచ్చడానికి కారణం ఇవే ..

Written By: Venkatakarunasri

హైదరాబాదు భారత దేశములో ఐదవ అతిపెద్ద మహానగరము. హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందినాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నముగా నిర్మించారు.

వనస్థలిపురం జింకల పార్క్ చూసొద్దామా !!

హైదరాబాదును మూసీ నది ఒడ్డున క్రీ.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. హైదరాబాదుకు ''భాగ్యనగరం '' అనే పేరు కూడా ఉంది. మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా రూపాంతరం చెందింది. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం వుంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.

హైదరాబాద్ అంటే ఇష్టం వుండటానికి గల కొన్ని కారణాలు

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

ఉపాధి

ఉపాధి

హైదరాబాద్ చదువుకున్న వాళ్లకి చదువుకోని వాళ్లకి అందరికీ ఏదో రకంగా ఏదో ఒక ఉపాధి కల్పిస్తుంది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం హైదరాబాద్ లో !

pc: youtube

ఖర్చు

ఖర్చు

హైదరాబాద్ నగరంలో జీవనం సాగించేందుకు అయే ఖర్చు చాలా తక్కువ.

మన మధ్య ఉన్న చార్మినార్ వెనుక ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి !

pc: youtube

అన్ని ప్రాంతాలకు చెందినవాళ్ళు

అన్ని ప్రాంతాలకు చెందినవాళ్ళు

ఈ నగరంలో అన్ని ప్రాంతాలకు చెందినవాళ్ళు ఉండేందుకు వీలుగా వుంటుంది.

చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !

pc: youtube

ఆహారం

ఆహారం

ఇక్కడ ఆహారం కూడా చాలా ఫేమస్.అంతేకాదు అందరికీ ఇష్టం కూడా.

భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !

pc: youtube

 వసతులు

వసతులు

విద్యకి సంబంధించి హైదరాబాద్ నగరంలో అన్ని వసతులు వున్నాయి.

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

pc: youtube

సినిమా టికెట్స్

సినిమా టికెట్స్

అన్ని మెట్రో నగరాల్లా కాకుండా ఇక్కడ సినిమా టికెట్స్ రేటు కూడా చాలా తక్కువ.

భద్రాచలం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

pc:pc: youtube

చీప్

చీప్

ఇక్కడ ఎలాంటి కోర్సు కూడా చాలా చీప్ గా దొరుకుతుంది.

మనకు తెలియని రహస్య పురాణ ప్రదేశాలు

pc: youtube

హైదరాబాద్ కు ఎలా చేరుకోవాలి

హైదరాబాద్ కు ఎలా చేరుకోవాలి

విమానాశ్రయాలు

ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరుతో ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యములకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.

దుబాయి, సింగపూరు, మలేషియా మరియు చికాగో మొదలైన దేశాలకు చక్కని విమాన ప్రయాణ సౌకర్యములు ఉన్నాయి. అంతేకాదు 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ప్రస్తుతం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయము మూసివేయబడింది.

ఒకప్పుడు ఇంద్రపురి అని పిలవబడిన నిజామాబాద్ లోని పర్యాటక స్థలాలు

pc: youtube

రైలు రవాణా

రైలు రవాణా

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది.

హైదరాబాద్ లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ను అందించే ఉత్తమ స్థలాలు !

రోడ్డు రవాణా

రోడ్డు రవాణా

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు మరియు కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-9 మరియు ఎన్‌హెచ్-202 నగరంలో నుంచే వెళ్తుంటాయి. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.

హైదరాబాద్ లో గల ఉత్తమ పార్కులు మరియు గార్డెన్స్!

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి