Search
  • Follow NativePlanet
Share
» »ఇడుక్కి పర్యటన .. అదుర్స్ !!

ఇడుక్కి పర్యటన .. అదుర్స్ !!

ఇడుక్కి లోని డ్యాం లలో ఇడుక్కి ఆర్చ్ డ్యాం, కులమావు డ్యాం మరియు చేరుతోని డ్యాం స్ ముఖ్యమైనవి. సుందరమైన ప్రదేశంలో ఉన్నఈ ఆనకట్టలు పర్యాటకులని ఆకట్టుకుంటాయి

By Mohammad

దేవుని స్వంత ప్రదేశమైన కేరళ లో ఉన్న ఇడుక్కి, పర్యాటకులని అమితంగా ఆకట్టుకునే అధ్బుతం. దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు ఈ ప్రాంతం ప్రత్యేకత. భారత దేశం లో నే అతి పెద్ద శిఖరమైన 'అనముడి' శిఖరం ఇడుక్కి లో ఉంది. అంతే కాదు, ప్రంపంచంలోనే రెండవ అతి పెద్ద వంపైన ఆనకట్ట కలిగిన ప్రాంతంగా ఇడుక్కి ప్రసిద్ది చెందింది. చేరా సామ్రాజ్యంలో భాగం కావటం, యూరోపెయన్ నుండి ఇక్కడికి వచ్చిన ఎంతో మందికి నివాస స్థలం కావడం వల్ల ఇడుక్కి చరిత్రలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది.

ఇడుక్కిలో ని డ్యాం ల లో ఇడుక్కి ఆర్చ్ డ్యాం, కులమావు డ్యాం మరియు చేరుతోని డ్యాం స్ ముఖ్యమైనవి. సుందరమైన ప్రదేశంలో ఉన్నఈ ఆనకట్టలు పర్యాటకులని ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా, విండ్ ఎనర్జీ ఫార్మ్ ఉన్న రామక్కల్మేడు, ఇడుక్కి లో ని ముఖ్యమైన కొండప్రాంతం. పర్యాటకులని బోటింగ్ మరియు ఫిషింగ్ ల కి అమితంగా ఆకట్టుకునే మలంకర రిజర్వాయర్ ప్రాజెక్ట్ కేరళ లో అతి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్. వీటితోపాటు ఇడుక్కి లోమరెన్నోఆకర్షణలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : అన్ని కాలాల పర్యటనకు అనువైన కేరళ ప్రదేశాలు !!

సుందరమైన ప్రకృతి దృశ్యాల తో పాటు, అనేకమైన తేయాకు తోటలు, కాఫీ ప్లాంటేషన్స్, నిర్మలమైన వాతావరణం, మంత్రముగ్ధులని చేసే జలపాతాలు, వివిధ జంతువులు కలిగిన సాంచురీ లు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇడుక్కి లో పేరొందిన ప్లాంటేషన్ అయిన ముర్రిక్కడ్డి గాలిలో తేయాకు, కాఫీ ల పరిమళం నిండి ఉంటుంది. మిరియాలు, యాలకులను పండించే ప్రాంతంగా నేడుంకండం హిల్ ప్రసిద్ది. ప్రవహించే సెలయేళ్ళు సందర్సకులకి ఆహ్వానం పలుకుతాయి.

ఇడుక్కి జిల్లాలోనే మున్నార్, పీర్ మేడ్, తెక్కడి వంటి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఇడుక్కి జిల్లా పర్యటనకు వస్తే టీ రుచి ఆస్వాదించక ఉండలేరు. తోటలు, అవి తయారుచేసే విధానం, దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఒకరకంగా పర్యాటక ఆకర్షణలలో భాగమే !!

హిల్ వ్యూ పార్క్

హిల్ వ్యూ పార్క్

హిల్ వ్యూ పార్క్, ఇడుక్కి నుండి కేవలం 1.5 కి మీ ల దూరంలో ఉంది. ఎనిమిది ఎకరాల మేరకు విస్తరించిన ఈ పార్క్ ఒక చిన్న కొండ పై ఉంది. అందంగా తిర్చిదిద్దబడిన అందాలను మరింత పెంచేలా సహజమైన సరస్సు ఈ పార్క్ లో ఉంది. పేరుకి తగ్గట్టుగానే పరిసర ప్రాంతాల అందాలను ఇక్కడ నుండి వీక్షించవచ్చు.

చిత్రకృప : Rameshng

ఇడుక్కి ఆర్చ్ డ్యాం

ఇడుక్కి ఆర్చ్ డ్యాం

ప్రతి రోజు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చే ఎందరో పర్యాటకులని ఇడుక్కి ఆర్చ్ డ్యాం ఆకర్షిస్తోంది. ఆసియా లో నే మొదటి ఆర్చ్ డ్యాం కాగా ప్రపంచం లో నే రెండవ ఆర్చ్ డ్యాం గా ఇడుక్కి ఆర్చ్ డ్యాం ప్రాచుర్యం పొందింది. పెరియార్ నది పైన, కురవన్మల మరియు కురతిమల కొండల మధ్య ఈ డ్యాం అందంగా కట్టబడినది.

చిత్రకృప : http://www.kseb.in/

కీజహర్కుతు ఫాల్స్

కీజహర్కుతు ఫాల్స్

తోడుపుజ్హ పట్టణం నుండి కీజహర్కుతు ఫాల్స్ 25 కి మీ ల దూరం లో ఉంది. ఈ జలపాతానికి రైన్ బో వాటర్ ఫాల్స్ గా పేరు ఉంది. 1500 మీ ల ఎత్తు నుండి ఈ జలపాతం పడుతుంది. రాతి నుండి నీళ్ళు ఉద్భవిస్తున్నట్టుగా ఈ జలపాతం కనిపిస్తుంది. సంవత్సరం మొత్తం ఈ జలపాతం నుండి జలధార కురుస్తూనే ఉంటుంది. ఆహ్లాదంగా సమయాన్ని గడపాలనుకునే వారికి తగిన ప్రదేశం.

చిత్రకృప : Jaseem Hamza

రామక్కల్మేడు

రామక్కల్మేడు

ఇడుక్కి లో నున్న పర్యాటక ఆకర్షణలలో రామక్కల్మేడు ఒకటి. చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఈ హిల్ స్టేషన్ నుండి పనోరమిక్ (విశాల దృశ్యం) వీక్షణ సాధ్యం. కురతి విగ్రహం మరియు కురవార్ స్మారక చిహ్నం ఇందులో కలవు. సీతమ్మ వారిని వెతుకుతూ వచ్చిన రాముడు ఈ రామక్కల్మేడు కొండ అంచులో పాదం మోపాడని నమ్మకం.

చిత్రకృప : Balachand

కురింజిమల సాంచురి

కురింజిమల సాంచురి

అరుదైన వృక్ష మరియు జంతు జాలానికి నివాసం ఈ కురింజిమల సాంచురి. దేవకుళం తాలుకా లో ని వట్టవాడ మరియు కొట్టకంబూర్ ప్రాంతాలతో పాటు ఇడుక్కి జిల్లాలో ని ప్రాంతాలను కూడా ఈ ప్రాంతం కవర్ చేస్తుంది. అంతరించిపోతున్న నీలకురింజి జాతి మొక్కని 32 కి మీ ల మేరకు సంరక్షిస్తుంది.

చిత్రకృప : Varkey Parakkal

ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురి

ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురి

కురింజమల సాంచురి మరియు ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురి లకు చిన్నర్ వైల్డ్ లైఫ్ సాంచురి సమీపంలో ఉంది. ఎరావికుళం నేషనల్ పార్క్, పంపాడం షోల నేషనల్ పార్క్ మరియు అనముడి షోలా నేషనల్ పార్క్ లు ఈ సాంచురి కి దగ్గరలో ఉన్న ఇతర నేషనల్ పార్కులు. పళని హిల్స్ నేషనల్ పార్క్ కురిమంజల సాంచురి కి తూర్పు వైపున రూపుదిద్దుకున్తున్నది.

చిత్రకృప : aphotoshooter

చేరుతోని డ్యాం

చేరుతోని డ్యాం

కేరళలో ఉన్న మరొక ప్రసిద్దమైన డ్యాం ఇడుక్కి జిల్లాలో ఉన్న చేరుతోని డ్యాం. ఈ డ్యాం చేరుతోని నదిపై నిర్మించబడినది. కరింబన్, మంజప్పర వజ్హతోప్, తడియంపాడు మరియు మనియరంకుడి గ్రామాలకు ఈ డ్యాం ద్వారా విద్యుత్ శక్తిని సరఫరా చేస్తారు. ఇడుక్కి రిజర్వాయర్ ప్రాజెక్ట్ లో ఇది మూడవ డ్యాం. ఫోటోగ్రఫీ ల కి మంచి ప్రదేశం.

చిత్రకృప : കാക്കര

తోమ్మంకుతూ ఫాల్స్

తోమ్మంకుతూ ఫాల్స్

ఇడుక్కి జిల్లాలో ఉన్న తోడుపుజ్హ నగరం నుండి 17 కి మీ ల దూరంలో ఉన్న తోమ్మంకుతు ఫాల్స్ 1500 మీ ల ఎత్తు నుండి పడతాయి. ఈ జలపాతం చిన్నదయినా అత్యంత ఆకర్షణ కలిగినది. ఈ జలపాతాన్ని, చుట్టు పక్కల ప్రకృతి సౌందర్యాన్ని సందర్శించేందుకు ఎందరో పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు.తోమ్మన్ అనే గిరిజన నాయకుడి పేరునే ఈ జలపాతానికి పెట్టారు.

చిత్రకృప : Kiran Gopi

కల్వరి పర్వతం

కల్వరి పర్వతం

ఇడుక్కి నుండి 5 కి మీ ల దూరంలో ఉన్న కల్వరి పర్వతం కట్టపన - ఇడుక్కి రోడ్డులో ఉంది. ఈ పర్వతం ఏటవాలుగా ఉంటుంది. ఏంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షించే పర్వతం ఇది. గుడ్ ఫ్రైడే మరియు లెంట్ పండుగల రోజున జరిగే ఉరేగిమ్పులకి ఈ ప్రాంతం ప్రసిద్ది. శిలువ వేయబడిన ఏసుక్రీస్తు జ్ఞాపకార్ధంగా ఏప్రిల్ నెలలో భక్తులు శిలువలు పట్టుకుని నడుస్తారు.

చిత్రకృప : Praveenp

మలంకర రిజర్వాయర్

మలంకర రిజర్వాయర్

మలంకర రిజర్వాయర్ ఒక క్రుతిమమైన సరస్సు. 11 కి మీ ల మేరకు విస్తరించబడినది. ప్రకృతి ని ఆస్వాదించడానికి తగిన ప్రదేశం. పడవ ప్రయాణానికి, ఫిషింగ్ కి ఇది అనువైన ప్రదేశం. తోడుపుజ్హ నగరం నుండి దాదాపు 6 కి మీ ల దూరంలో ఇడుక్కి జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం లో సందర్శకులు బోటు రైడ్ మరియు ఫిషింగ్ ని ఆనందిస్తారు. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం.

చిత్రకృప : Rameshng

కులమవు

కులమవు

ఇడుక్కి జిల్లాలో ఉన్న ప్రసిద్దమైన హిల్ స్టేషన్ ల లో కులమవు ఒకటి. ఇది సముద్ర మట్టం నుండి 3000 అడుగుల ఎత్తులో ఉంది. అసాధారణ అందం వల్ల ఈ ప్రాంతం ఏంతో మంది పర్యాటకులని ఆకర్షిస్తుంది. ట్రెక్కింగ్ కి కూడా అనువైన ప్రదేశం. ఇడుక్కి రిజర్వాయర్ ప్రాజెక్ట్ లో ఉన్న మూడు డ్యాం ల లో ఈ కులమావు డ్యాం ఒకటి. ఏంతో మంది పర్యాటకులని ఈ డ్యాం ఆకర్షిస్తుంది.

చిత్రకృప : Geoshrad

నేడుంకందం హిల్

నేడుంకందం హిల్

ఇడుక్కి లో ఉన్న ఉడుమ్బంచోల తాలూకా వద్ద ఉన్ననేడుంకందం హిల్స్ సముద్ర మట్టం నుండి 3200 కి మీ ల ఎత్తు నుండి పడతాయి. ఈ గ్రామం మున్నార్ మరియు తట్టేక్కాడ్ బర్డ్ సాంచురి ల మధ్యలో రోడ్డు నుండి 3 కి మీ ల దూరంలో విస్తరింపబడి ఉన్నది. ఈ ప్రాంతంలో కాఫీ, ఇలాచీ మరియు మిరియాలు పండిస్తారు.

చిత్రకృప : Arunguy2002

తట్టేకాడ్ బర్డ్ సాంచురి

తట్టేకాడ్ బర్డ్ సాంచురి

తట్టేకాడ్ బర్డ్ సాంచురి లేదా సలీం అలీ బర్డ్ సాంచురి ఎర్నాకుళం జిల్లాలో ఉంది. రక రకాల పక్షులని చూసి ఆనందించాలనుకునే వారికి ఈ సాంచురి అద్భుతమైన సందర్శనానుభూతిని కలిగిస్తుంది. దేశీయ సరీసృపాల కి మరియు జంతువులకి ఈ సాంచురి నివాసం. నవంబర్ నుండి జూన్ నెల ల లో అరుదైన వలస పక్షులు ఈ సాంచురి లో కనువిందు చేస్తాయి.

చిత్రకృప : SHYAMAL CHANDRA GHOSH

పల్కులమేడు

పల్కులమేడు

ఇడుక్కి కి 12 కిలోమీటర్ల దూరంలో పలుక్కమేడు కలదు. ఇది సముద్రమట్టానికి 3125 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరం. ఇక్కడి నుండి ప్రకృతి దృశ్యాలు, చుట్టూ అందమైన లోయలను చూసి ఆనందించవచ్చు. ఫోటోగ్రఫి వారికి ఇది అనువైన ప్రదేశం.

చిత్రకృప : Praveenp

పైనావు

పైనావు

పైనావు ఇడుక్కి డ్యాం కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సాహసికులు ఇక్కడ ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు చేయటానికి ఇష్టపడతారు. వర్షాకాలం తర్వాత ఈ ప్రదేశ సందర్శన అనువైనది. ఇది కూడా ఆహ్లాదకరమైన వాతావరణానికి, ప్రకృతి దృశ్యాలకు పెట్టింది పేరు.

చిత్రకృప : Arun Suresh

తుంపచి కాల్వేరి సముచ్చయం

తుంపచి కాల్వేరి సముచ్చయం

ఇది తోడుపుజా గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇడుక్కి వచ్చే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని తమ సందర్శనలో తప్పక జతకలపాలి. విశ్రాంతి, ధ్యానం, లాంగ్ వాక్ లకు ఈ ప్రదేశం సూచించదగినది.

చిత్రకృప : Jean-Pierre Dalbéra

వసతి

వసతి

ఇడుక్కి లో వసతి సదుపాయాలకు కొదువలేదు. ఏసీ, నాన్ - ఏసీ గదులు మరియు ఇతర తరగతి గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పైన పేర్కొన్న అన్ని ప్రదేశాలకు ఇడుక్కి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని ప్రయాణించవచ్చు. ఇడుక్కి పర్యటన ఒక్కరోజుతో పూర్తి కాదుసుమీ ..!!!

చిత్రకృప : Sibyperiyar

రవాణా సదుపాయాలు

రవాణా సదుపాయాలు

వాయు మార్గం : ఇడుక్కి నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి ఇడుక్కి చేరుకోవచ్చు.

రైలు మార్గం : ఇడుక్కి లో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన 60 కిలోమీటర్ల దూరంలో థేని, మరికొంత దూరంలో చెంగనశేరి రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఇడుక్కి చేరుకోవటానికి బస్సులు ఉంటాయి.

రోడ్డు మార్గం : ఇడుక్కి చేరుకోవటానికి బెంగళూరు, చెన్నై, కొచ్చి, కొట్టాయం తదితర ప్రాంతాల నుంచి ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు కలవు.

చిత్రకృప : shankar s.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X