Search
  • Follow NativePlanet
Share
» »బెట్ ద్వారక వెళితే ద్వాపర యుగం లోకి ప్రయాణం చేసినట్లే

బెట్ ద్వారక వెళితే ద్వాపర యుగం లోకి ప్రయాణం చేసినట్లే

బెట్ ద్వారక గురించిన కథనం.

By Kishore

ద్వారక నగరం నకలుగా బెట్ ద్వారకను పేర్కొంటారు. శ్రీ కృష్ణుడి నిర్యాణం తర్వాత ద్వారక మొత్తం సముద్రంలో మునిగి పోగా ఆ శ్రీ కృష్ణుడి పరివారం నివసించినట్లుగా చెప్పబడే బెట్ ద్వారక మాత్రం ఆ ముప్పు నుంచి తప్పించుకొంది. ఇక్కడ ఉన్న దేవాలయాలను చూడటానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ బెట్ ద్వారక ధార్మిక స్థలంగానే కాక చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. అక్కడ పురావస్తుశాఖ పరిశోధనలో బయటపడిన అనేక వస్తువులు మనకు అప్పటి అంటే ద్వాపర యుగంనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ద్వారక నుంచి గోపితలాబ్, నాగేశ్వర్ చూసిన తర్వాత బెట్ ద్వారకను సముద్రంలో పడవ ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. సముద్ర ప్రయాణం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ బెట్ ద్వారక గురించి క్లుప్తంగా ఈ కథనంలో

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

P.C: YouTube

బెంట్ ద్వారకను శంఖోదర్ అని కూడా అంటారు. ఇక్కడ సముద్ర శంఖువులు ఎక్కువగా దొరకడం వల్ల దీనికి శంఖోదర్ అని పేరు వచ్చింది. గుజరాత్ లోని ఓఖా పట్టణం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉంటుంది. ఈ బెట్ ద్వారక 13 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది ప్రస్తుత ద్వారక పట్టణం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కచ్ సింధుశాఖలో ఉన్న ఈ దీవికి పడవ ప్రయాణం చాలా బాగుంటుంది.

2. శ్రీ కృష్ణుడు తన కుటుంబంతో సహా

2. శ్రీ కృష్ణుడు తన కుటుంబంతో సహా

P.C: YouTube

పురాణాలను అనుసరించి శ్రీ కృష్ణుడు తన కుటుంబంతో సహా నివసించిన ప్రదేశం బెట్ ద్వారక అని తెలుస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడైన సుదాముడి (కుచేలుడు)కి ఆ శ్రీ కృష్ణుడు పాదాలు కడిగిన ప్రదేశం ఇదే అని పురాణాలను అనుసరించి తెలుస్తోంది. ఇక ఇక్కడ ద్వారక నగరంలో వలే చేతిలో గదతో ఉన్న ద్వారకాధీశుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే ద్వారకలోని విగ్రహంతో పోలిస్తే బెట్ ద్వారాకలోని విగ్రహం పరిమాణంలో కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ ఇంకా శ్రీ కృష్ణుడి ఆలయం, ప్రద్యుమ్యుడు, పురుషోత్తముడు, దేవకీ, రుక్మిణి, రాధాదేవి, జాంబతి మొదలైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి.

3. గోదుమ పిండితో చేసిన

3. గోదుమ పిండితో చేసిన

P.C: YouTube

ఈ దేవాలయాలను సందర్శించడానికి వచ్చే భక్తులు గోదుమ పిండితో చేసిన రకరకాల ఆహారపదార్థాలను ప్రసాదంగా అందజేస్తారు. బెట్ ద్వారకలోని ప్రధాన ఆలయంలో మధ్యాహ్నం సరిగ్గా 1 గంటలకు భక్తులకు మహాప్రసాదంగా ఉచితంగా భోజనాన్ని పెడుతారు. ఇక ఇక్కడి దేవాలయంలో ఒక ప్రత్యేక బియ్యం పళ్లెం ఉంటుంది. అందులో మనకు తోచిన దక్షిణ పెడితే కొన్ని బియ్యాన్ని మనకు అందజేస్తారు. ఈ బియ్యం మన ఇంట్లోని బియ్యంతో కలిపితే శుభం జరుగుతుందని స్థానికుల నమ్మకం.

 4. బెట్ ద్వారాక చారిత్రాత్మకంగా కూడా

4. బెట్ ద్వారాక చారిత్రాత్మకంగా కూడా

P.C: YouTube

పురాణ పరంగానే కాకుండా బెట్ ద్వారాక చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ చాలా ఏళ్లుగా పురా వస్తు శాఖ వారు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకూ దొరికిన కొన్ని ఆధారాలను అనుసరించి ఇక్కడ సముద్ర వాణ్యిజ్య, వ్యాపార కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి. ముఖ్యంగా మట్టి పాత్రలు, వివిధ లోహాలతో చేసిన నాణ్యాలు, రాగి చేపల గాలు, రాతి లంగర్లు వంటవి ఎన్నో దొరికాయి. ఈ వస్తువలన్నీ ఈజిప్టు, రోమ్ నగరాలకు చెందినవిగా భావిస్తున్నారు. అంటే అప్పట్లోనే బెట్ ద్వారక ఆయా రాజ్యాలతో వాణిజ్య, వ్యాపారాలు నడిపేదని తెలుస్తోంది.

5. పోలికలు ఉన్నాయి

5. పోలికలు ఉన్నాయి

P.C: YouTube

మరోవైపు ఇక్కడ ఉన్న ఆలయ నిర్మాణం, సముద్ర గర్భంలో మునిగిపోయిన ఆలయ, పట్టణ, ఇళ్ల నిర్మాణాలు ఇంచుమించు ఒకే రకంగా ఉన్నాయి. అంతే కాకుండా మహాభారతంలోని సభా పర్వంలో పేర్కొనబడిన అంతర్ద్వీపమే బెట్ ద్వారాక అనేవారు కూడా ఉన్నారు. పురావస్తు శాఖ తవ్వకాల్లో భయటపడిన వస్తువులు, మహాభారతంలో కొన్ని చోట్ల వర్ణించిన వస్తువులకు పోలికలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పురావస్తుశాఖలో బయటికి వచ్చిన వస్తువులను, శిథిలావస్తలో ఉన్న కట్టడ నిర్మాణాలను చూస్తే ద్వాపర యుగంలోనే ఉన్నామన్న భావన కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X