Search
  • Follow NativePlanet
Share
» »యుద్ధ భూమి...ఇంఫాల్ పట్టణం !!

యుద్ధ భూమి...ఇంఫాల్ పట్టణం !!

మణిపూర్ రాజధాని అయిన ఇంఫాల్ ఈశాన్య భారతదేశంలో దూరంగా ఉన్న పట్టణం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపనీస్ భారతదేశంలో ప్రవేశించి ఇంఫాల్ లో యుద్ధాన్ని ప్రారంభించిన సమయంలోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ తరువాత తీవ్రమైన జపనీస్ దళాన్ని ఆసియా వారు ఓడించారు. పలు యుద్దాలు ఇంఫాల్ ను తీవ్రంగా ప్రభావితం చేశాయి, అయినాకూడా నగరం కొత్త పుంతలు తొక్కింది, నవీన నాగరికతకు అలవాటుపడింది. ఇక్కడున్న పర్యాటక ప్రదేశాలను వీక్షిద్దాం రండి!!

Holi Offer: Flat 60% concession on Hotels Booking at Goibibo

ఇంఫాల్ యుద్ధ సమాధి

ఇంఫాల్ యుద్ధ సమాధి

నగరం మౌనంగా అనేక యుద్ధాలు చూసి ఉన్నప్పటికీ, యుద్ధాల్లో మృతి చెందిన వారికి నివాళిగా యుద్ధ శ్మశానాలు నిర్మించారు.యుద్ధ శ్మశానాలు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపనీస్ దాడి నుండి భూభాగంను రక్షించే క్రమంలో చనిపోయిన బ్రిటీష్ మరియు భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు ప్రధానంగా నిర్మించారు.యుద్ధ శ్మశానాలు ఇంఫాల్-దిమాపూర్ రహదారిలో ఇంఫాల్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వేలాది మంది సైనికులతో కూడిన యుద్ధ శ్మశానాలలో వారి సమాధుల రాయి గుర్తులను కాంస్య ఫలకాలతో గుర్తించబడ్డాయి. ఇది ఒక స్మశానము అయినప్పటికీ, ఈ ప్రదేశం చాలా ప్రశాంతత మరియు నిర్మలంగా ఉంటుంది. ఇది భారతదేశ రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా వాలియంట్ యుద్ధ వీరులకు గుర్తుగా ఉంది.

Photo Courtesy: Herojit th

ఉమెన్ మార్కెట్

ఉమెన్ మార్కెట్

ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాలలో ఖ్వైరంబండ్ బజార్ లో ఉన్న ఐ ఎం ఎ కెఇథెల్ మహిళల మార్కెట్ ఒకటి. మీరు ఐ ఎం ఎ కెఇథెల్ వద్ద ఏ వస్తువునైన పొందవచ్చు. దీనిని మహిళలలే పూర్తిగా నడుపుతున్నారు. ఒక కార్నర్ లో ఒక మహిళ చేపలు అమ్మటం లో బిజీగా ఉంటే, మరొక కార్నర్ లో మహిళ అల్లడం మరియు సంతోషంగా వినియోగదారులకు తాజాగా తయారుచేసిన ఊలు బట్టలు అమ్మడం చూడవచ్చు. 100 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం ఐ ఎం ఎ కెఇథెల్ లో మహిళలకు సమానత్వం మరియు స్వతంత్ర్యానికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన చిహ్నంగా ఉంది. ఇక్కడ 3000 కంటే ఎక్కువ మంది మహిళలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఐ ఎం ఎ కెఇథెల్ లో కూరగాయలు, చేనేత వస్త్రాలు ,హస్తకళలు మరియు చేప వంటి ఏదైనా కొనుక్కోవచ్చు.

Photo Courtesy: Ppyoonus

కంగ్లా కోట

కంగ్లా కోట

కాంగ్లా ప్యాలెస్ మణిపుర్ కి గర్వకారణంగా ఉంటుంది. ఈ ప్రదేశం 17 వ శతాబ్దం నుంచి శక్తివంతమైనదిగా ఉంది. కాంగ్లా అనే పదం 'పొడి భూమి' నుండి వచ్చింది. కాంగ్లా కోట ఇంఫాల్ నది ఒడ్డున ఉంది. అంతేకాకుండా ఈ కోట నగరానికి రక్షణగా ఉందని చెప్పవచ్చు. చాలా భాగం ఇప్పుడు శిధిలాలలో ఉన్నప్పటికీ అది ముఖ్యమైన రాజకీయ మరియు మతపరమైన కార్యక్రమాలు జరిగేవి. కాంగ్లా రాజ భవనము మణిపూర్ కు ప్రధాన కేంద్రంగా ఉంది. మణిపురి రాజులు 1891 లో ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో బ్రిటీష్ కు కోల్పోవడంతో, కోటను భద్రతా దళాలు ఆక్రమించినాయి. స్వాతంత్రం తరువాత కూడా అస్సాం రైఫిల్ కోటను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత 2004 లో కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

Photo Courtesy: rajkumar1220

శ్రీ గోవిందజీ దేవాలయం

శ్రీ గోవిందజీ దేవాలయం

గోవిందజీ ఆలయం పవిత్రత మరియు ధర్మనిష్ఠ కార్యాలు ఏ మార్గదర్శకత్వం లేకుండానే నిర్వహిస్తారు. పవిత్రమైన మరియు అహంభావం లేని ఆలయంలలో ఒకటిగా ఉంది. ఇది ఒక వైష్ణవమతానికి చెందిన కేంద్రం మరియు మణిపూర్ ప్రధాన దేవాలయాలలో ఒకటి. జగన్నాథ్, సుభద్ర, బలరాం మరియు కృష్ణ విగ్రహాలు ఆలయం చుట్టూ ఉన్న గదులు లేదా ప్రార్థనా మందిరాలలో ఉంచబడతాయి. అయితే గోవిందజీ విగ్రహం లోపలి గర్భగుడిలో ఉంటుంది. ఈ ఆలయంను మణిపూర్ రాజు 1846 వ సంవత్సరంలో నిర్మించెను. ఇది పట్టణ కేంద్రం నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో మాత్రమే ఉంది.

Photo Courtesy: Ppyoonus

పోలో గ్రౌండ్

పోలో గ్రౌండ్

ఈ పోలో గ్రౌండ్ ప్రపంచంలోనే అతి పురాతనమైన పోలో గ్రౌండ్. బ్రిటిష్ ప్రఖ్యాతి గాంచిన పోలో మణిపూర్ లో ఉద్భవించింది. ఈ ఆటలో గుర్రం మీద క్రీడాకారులు ఉండి గెలుపుకు అవసరమైన గోల్స్ చేస్తారు. ఇది ఒక టీం క్రీడ. మణిపూర్ లో ఆటను 'కంజి-బాజీ' అని పిలిచేవారు. 'సగోల్ కంగ్జే' లేదా 'పులు' నుండి ఇప్పుడు పిలిచే పోలో గా మారింది.అనేక ముఖ్యమైన వ్యక్తులు మరియు గేమ్ క్రీడాకారులు పోలో గ్రౌండ్స్ లో ఆడటానికి ఇంఫాల్ ను సందర్శించారు. ఆధునికమైన పోలో కు తండ్రి అయిన లెఫ్టినెంట్ షేరర్ 1850 వ సంవత్సరంలో ఈ మైదానాల్లో సందర్శించారు. భారతదేశం యొక్క వైస్రాయ్ లార్డ్ కర్జన్ కూడా 1901 వ సంవత్సరంలో ఈ మైదానాలను సందర్శించారు.

Photo Courtesy: PP Yoonus

మణిపూర్ స్టేట్ మ్యూజియం

మణిపూర్ స్టేట్ మ్యూజియం

మణిపూర్ స్టేట్ మ్యూజియంను మణిపూర్ సంపన్న సంస్కృతి మరియు వారసత్వాన్ని సంరక్షించేందుకు స్థాపించబడింది. 1969 లో భారతదేశం యొక్క మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ ప్రారంభించారు. మణిపూర్ స్టేట్ మ్యూజియంలో పురావస్తు, మానవజాతి శాస్త్రం, సహజ చరిత్ర, జల్లన్ మరియు చిత్రలేఖనం మీద సమాచారాన్ని ఉంచటానికి స్టోరేజ్ గృహాలను నిర్మించింది.దీనికి దగ్గరగా కాంగ్లా లో పోలో మైదానం ఉన్నది. పర్యాటకులు సులువుగా ఒకే రోజులో ఈ ప్రదేశాలను సందర్శించటానికి ప్లాన్ చేసుకోవచ్చు. మ్యూజియంలో ఉన్న ప్రముఖ కళాఖండాలలో ఒకటైన హియంగ్ హిరెన్ (రాయల్ బోట్) అనే 78 అడుగుల పొడవు గల పడవ ఓపెన్ గ్యాలరీలో ప్రదర్శించబడినది. మణిపూర్ స్టేట్ మ్యూజియం ఉదయం10 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. సెలవు రోజులలో మినహా సోమవారం నుండి శనివారం వరకు తెరిచి ఉంటుంది.

Photo Courtesy: Achumbani

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమాన మార్గం

ఇంఫాల్ నగరం విమానాశ్రయాన్ని కలిగి ఉన్నది. దేశం లోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులను అందిస్తున్నది.

రైలు మార్గం

ఇంఫాల్ కు రైలు సౌకర్యం లేదు. కనుక దిమాపూర్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి అక్కడ నుంచి బస్సు ప్రయాణం చెయ్యాలి. బస్సు ప్రయాణం సుమారుగా 7 గంటలు ఉంటుంది.

Photo Courtesy: Herojit th

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more