Search
  • Follow NativePlanet
Share
» »ప‌చ్చ‌ని కునూర్‌లో.. ప‌సందైన ప్ర‌యాణం చేద్దామా?!

ప‌చ్చ‌ని కునూర్‌లో.. ప‌సందైన ప్ర‌యాణం చేద్దామా?!

కూనూర్ భారతదేశంలోని అత్యుత్తమ హిల్ స్టేషన్లలో ఒకటి. తమిళనాడులోని నీలగిరి కొండల మధ్య దాగి ఉన్న కూనూర్ దక్షిణ భారతదేశంలోని సహజసిద్ధమైన హిల్ స్టేషన్.

ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రాంతం. కాబట్టి మీరు ఎప్పుడైనా కూనూర్ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

ప‌చ్చ‌ని కునూర్‌లో.. ప‌సందైన ప్ర‌యాణం చేద్దామా?!

ప‌చ్చ‌ని కునూర్‌లో.. ప‌సందైన ప్ర‌యాణం చేద్దామా?!

ఊటీకి సమీపంలో ఉన్న ఈ సుందరమైన హిల్ స్టేషన్ పచ్చని, వెల్వెట్ టీ తోటలను కలిగి ఉంది. రుచికరమైన నీలగిరి టీని ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంతం ప్ర‌సిద్ధి గాంచింది. ఇక్క‌డికి విచ్చేసిన ప‌ర్యాట‌కులు వేడి వేడి టీ తాగుతూ, లోయలోని కమ్మని దృశ్యాలను తిలకించేయొచ్చు. కూనూర్‌ను సంద‌ర్శించేవారు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల్సిందే. ఆ ప్ర‌దేశాలేంటో

టాయ్ ట్రైన్‌..

టాయ్ ట్రైన్‌..

టాయ్ ట్రైన్ అంటే స‌హ‌జంగా చిన్న‌పిల్ల‌లు చాలా ఇష్ట‌ప‌డ‌తారు. కానీ, ఈ టాయ్ ట్రైన్‌ను పెద్ద‌వారు కూడా ఎంజాయ్ చేయొచ్చు. కొండల్లో టాయ్ ట్రైన్ ప్రయాణం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. మూడు కోచ్‌లు, 254 మంది సీటింగ్ కెపాసిటీతో, నీలగిరి మౌంటైన్ రైల్వే టాయ్ రైలు కూనూర్ సమీపంలోని మెట్టుపాళయం నుండి మొదలై ఊటీ వరకు వెళుతుంది. ఈ రైలు సుందరమైన పచ్చని లోయలు, చీకటి సొరంగాలు, ఖరీదైన కాఫీ తోటల గుండా వెళుతుంది. ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ మ‌ధ్య జ‌రిగే ఈ రైడ్ మ‌న‌ల్ని వేరే ప్ర‌పంచంలోకి తీసుకువెళుతుంది.

హిడెన్ వ్యాలీ ట్రెక్

హిడెన్ వ్యాలీ ట్రెక్

పచ్చని లోయలను ఇష్టపడే వారు త‌ప్ప‌క‌ ఈ ప్రదేశాన్ని సందర్శించాలి. ఈ ట్రెక్కర్స్ స్వర్గం కూనూర్ ప్రధాన నగరం నుండి ఇర‌వై కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఇది పర్యాటకులకు గొప్ప అనుభూతుల‌ను అందిస్తుంది. ఈ ప్రాంతాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సంద‌ర్శ‌న‌ చేయవచ్చు. అద్భుతమైన దృశ్యాల‌ను మీ కెమెరాలో బంధించ‌డానికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. సవాలుతో కూడిన ట్రెక్కింగ్ యాత్రను చేయాల‌నుకుంటే మాత్రం కూనూర్‌లో చూడడానికి కటరీ జలపాతాలు అనువైన ప్రదేశం. సిటీ సెంటర్ నుండి కొంచెం దూరంలో కటరీ జలపాతాలు ఉంటాయి. ఈ ప్రాంతం చాలా ఆకర్షణీయమైనది. జలపాతం వరకు ట్రెక్కింగ్ చేయాల‌నుకుంటే మాత్రం తియ్యని నీలగిరి మిమ్మల్ని చుట్టుముడుతుంది. ఇక్కడ మ‌రొక ఆసక్తికరమైన స్పాట్‌ ఉంది. అది ఏంట‌టే, భారతదేశంలోని మొట్టమొదటి జలవిద్యుత్ ప్లాంట్ కాటేరి జలవిద్యుత్ వ్యవస్థ ఇక్క‌డే ఉంది.

లాంబ్స్ రాక్

లాంబ్స్ రాక్

కూనూర్‌లోని అత్యంత పర్యాటక ఆకర్షణలలో ఒకటి లాంబ్స్ రాక్‌. ఇది ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. లాంబ్స్ రాక్ చుట్టుపక్కల లోయలు కొన్ని మనోహరమైన వీక్షణలను ప‌ర్యాట‌కుల‌కు అందిస్తుంది. ఇది కుటుంబస‌భ్యుల‌కు ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ గా పేరుగాంచింది. కూనూర్ లో టీ మరియు కాఫీ ఎస్టేట్‌లు, దట్టమైన పచ్చదనం, మేఘాలతో కప్పబడిన దట్టమైన అడవులు, కోయంబత్తూర్‌లోని మైదానాలను ఒకే పైకప్పు కింద వీక్షించ‌వ‌చ్చు. ఇది నిస్సందేహంగా స‌హ‌జ‌సిద్ధ‌ అనుభవాన్ని కోరుకునే వారికి ఆనందాన్ని కలిగిస్తుంది.

హైఫీల్డ్ టీ ఫ్యాక్టరీ

హైఫీల్డ్ టీ ఫ్యాక్టరీ

సతత హరిత కొండలతో కూడిన భారతీయ గ్రామీణ ప్రాంతాలను ఇక్క‌డ చూడొచ్చు. కూనూర్‌లో ప్ర‌త్యేకంగా హైఫీల్డ్ టీ ఫ్యాక్టరీలో టీ తయారీ గురించి తెలుసుకునే అవ‌కాశం ఇక్క‌డికి వెళ్లిన ప‌ర్యాట‌కుల‌కు ల‌భిస్తుంది. ఇక్క‌డి గైడ్‌లు సందర్శకులకు మొక్కలను నాటడం, పులియబెట్టడం నుండి బ్రూయింగ్ వరకు అన్ని విధాల ప్రక్రియల‌ గురించి అవగాహన క‌ల్పిస్తారు. ఇక్క‌డి టీ రుచితో మీ పర్యటనను ముగించొచ్చు. ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో, టీ తయారీని క‌ళ్లారా తిల‌కించొచ్చు. మీరు బయలుదేరే ముందు ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లోని సావనీర్ దుకాణానికి త‌ప్ప‌క వెళ్లండి. అక్క‌డ‌ మీకు ఇష్టమైన రుచి గల టీ బాక్స్‌ను తీసుకోవ‌డం మాత్రం మ‌ర‌వ‌ద్దు.

Read more about: toy train hidden valley treck
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X