Search
  • Follow NativePlanet
Share
» »ఈ నిర్మాణాల రహస్యాలు ఏలియన్స్ మాత్రమే చెప్పగలవేమో?

ఈ నిర్మాణాల రహస్యాలు ఏలియన్స్ మాత్రమే చెప్పగలవేమో?

భారత దేశంలో గుహాలయాలకు సంబంధించిన కథనం.

శాస్త్ర సాంకేతికంగా భారత దేశంలో ఎంతో అభివద్ధి చెందింది. అనేక క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి అతి తక్కువ ఖర్చులో అంతరిక్షాన్ని కూడా ముద్దాడుతూ ప్రపంచ దేశాలనే అబ్బురపరుస్తోంది. మరోవైపు మొండివ్యాధులకు సైతం మందులు కనిపెడుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతోంది. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ రంగంలో కూడా భారత దేశం ప్రతిభ తక్కువేమి కాదు.

ఆకాశాన్ని చుంబించే భవనాలను నిర్మించడంలో పొరుగు దేశాలకు మనం ఏమాత్రం తీసిపోవడం లేదు. ఉగ్రరూపంలో ప్రవహించే నదీ జలాలను కట్టడి చేస్తూ నిర్మిచిన ఆనట్టలకు భారత దేశంలో లెక్కలేదు. ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు మాత్రమే.

ఈ భారత దేశంలోనే శాస్త్ర సాంకేతికత ఇంతగా అందుబాటులోకి రాని రోజుల్లోనే కొండలను తొలిచి అతి తక్కువ సమయంలోనే అబ్బురపరిచే దేవాలయాలను మన పూర్వికులు నిర్మించారు. ఆ నిర్మాణంలో ఈ గ్రహాంతర జీవులు సహాయం చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకు తగ్గ కొన్ని ఆధారాలను కూడా చూపిస్తున్నారు. అటువంటి కోవకు చెందినవే అజంతా ఎల్లోరా, బాదామి, ఎలిఫెంటా తదితర గుహాలయాలు.

అజంతా ఎల్లోరా గుహాలు

అజంతా ఎల్లోరా గుహాలు

P.C: You Tube

అజంతా, ఎల్లోరా గుహలు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ గుహలు. కొండలను తొలిచి అక్కడ విగ్రహాలను చెక్కి దేవాలయాలను నిర్మించారు. మహారాష్ట్రకు ఉత్తర దిశలో ఔరంగాబాద్ కు 30 కిలోమీటర్ల ఉన్నాయి.

ఎల్లోరాలో మొత్తం 34 గుహలు ఉన్నాయి. అజంతా గుహలు అన్ని బౌద్ధ గుహలు. ఇవన్నీ క్రీస్తు శకం 6 నుంచి 11వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. అజంతాలో 29 గుహలు ఉన్నాయి. ఇవి క్రీస్తు పూర్వం 2 నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దం మధ్యలో దశల దశలగా ఏర్పడినవి. ఎల్లోరా గుహలు బౌద్ధమతం, హిందూమతం మరియు జైన మతానికి సంబంధించిన విగ్రహాలను మనం చూడవచ్చు.

ఎలిఫెంటా గుహలు

ఎలిఫెంటా గుహలు

P.C: You Tube

ఎలిఫెంటా గుహలు ముంబయి తీరాన ఉన్న ఒక ద్వీపంలో ఉన్నాయి. ఇవి మొత్తం ఏడు ప్రాచీన గుహలు ఉన్నాయి. ఒకే రాయిని తొలిచి ఈ గుహాలయాలను నిర్మించారు. ఈ గుహలను క్రీస్తు పూర్వం 450 నుంచి 750 మధ్య నిర్మించి ఉంటారని తెలుస్తోంది.

అన్ని గుహల్లో కెల్లా ప్రధాన గుహలో అనేక అద్భుతమైన పెద్ద శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ శివుడి గురించి వివిధ కథలను వివరిస్తాయి. ఎలిఫెంటా గుహలను చేరుకోవడానికి గేట్వే ఆఫ్ ఇండియా నుండి ఫెర్రీని తీసుకోవాలి.

బాదామి గుహాలయాలు

బాదామి గుహాలయాలు

P.C: You Tube

భారత దేశంలోని గుహాలయాల జాబితాలో కర్నాటకలోని బాదామి గుహాలయాలు మొదటి వరుసలో ఉంటాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాదామి గుహాలయాలు మొత్తం 5. అందులో ఒక గుహాలయంలో శివుడికి సంబంధించిన విగ్రహలు ఉంటాయి.

రెండింటిలో విష్ణు భగవానుడికి సంబంధించిన గుహాలయాలు ఉంటాయి.
మిగిలిన రెండు గుహాలయల్లో ఒకదాట్లో హిందూ, బౌద్ధ దేవతల విగ్రహాలు ఉండగా మిగిలిన చివరి ఐదో గుహలో జైన తీర్థాంకరుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న అగస్త్య తీర్థం కూడా చాలా పవిత్రమైనది.

ఉదయగిరి స్కందగరి గుహలు

ఉదయగిరి స్కందగరి గుహలు

P.C: You Tube

ఒడిషాలోని భువనేశ్వర్ శివారులో ఉదయగిరి స్కందగిరి గుహలు ఉన్నాయి. ఈ గుహాలు అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఉదయగిరి గుహ అందం సూర్యోదయం వేళ రెట్టింపవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక్కడ ఉన్న గుహలన్నింటిలో ఎక్కువగా అందమైన జైన మతానికి చెందిన విగ్రహాలను చూడవచ్చు. ముఖ్యంగం పులి మొహం ఆకారంలో ఉన్న ఒక గుహలోపలికి వెళ్లి అక్కడి విశేషాలను చూడాల్సిందేకాని వర్ణించడానికి అక్షరాలు చాలవని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఉండవల్లి గుహాలయాలు

ఉండవల్లి గుహాలయాలు

P.C: You Tube

ఒక పెద్ద పర్వత సముదాయాన్ని ముందు బాగం నుంచి తొలుచుకొని వెళ్లి ఉండవల్లి గుహాలయాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్మాణం క్రీస్తుశకం 4 లేదా 5వ శతాబ్దంలో జరిగిందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. గుహాల మధ్య ఉన్న స్తంభాల పై అందంగా చెక్కిన శిల్పాలు, లతలు చూడటానికి చాలా బాగుంటాయి.

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహాశ్వరుడి ప్రతి రూపాలను ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా గ్రానైట్ రాతితో చెక్కబడిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం చాలా బాగుంటుంది. గుంటూరు నుంచి ఉండవల్లికి 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X