Search
  • Follow NativePlanet
Share
» »మీ జీవితంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విభిన్నమైన శివలింగాలు !

మీ జీవితంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విభిన్నమైన శివలింగాలు !

By Venkatakarunasri

మన నిత్య జీవితంలో దేవాలయాలు మరియు దేవతలు ఎక్కువగా ప్రధానపాత్ర వహిస్తూవుంటారు.దిననిత్య ఝంఝాటంలో మరియు అనేక సమస్యలనుంచి ముక్తి మార్గాలు దేవాలయాలు అని మనం భావిస్తుంటాం.మన హిందూ ధర్మంలో అనేక దేవతలను చూడవచ్చును.ఒక్కొక్క దేవత ఒక్కొక్కదానికి ప్రసిద్ధిచెందినది. మన ధర్మంలో శైవమతం మరియు వైష్ణవ మతం అని 2 రాజకీయ పక్షాలువున్నాయి.

ఆయా పక్షాలకు ఆయా పక్షం వారు వచ్చి దర్శించుకుంటారు.అయితే దేవతలకే లేని పక్షపాతం మనలో ఎందుకు? అన్ని దేవతలూ ఒకటే అని పూజిస్తాం.వ్యాసంలో ముఖ్యంగా శివలింగాల గురించి తెలుసుకుందాం.

సామాన్యంగా మహాశివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు.అతను అనేక విభిన్నరకాలుగా వుంటాడు. బహుశా మీరు అలాంటి శివ లింగాన్ని ఎప్పుడూ చూసివుండరు.అలాగైతే ఆ శివలింగాలు ఏవేవి?అవి ఏ పుణ్యక్షేత్రంలో వెలసివున్నాయి? అనే వాటిని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

అమరనాథ్ దేవాలయం

అమరనాథ్ దేవాలయం

ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఇది ప్రధానంగా గుహ దేవాలయంగా వుంది. ఇది సంవత్సరంలో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే కనిపించే శివలింగం. ఈ శివలింగం స్వయంగా మంచుగాడ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినది.ఇక్కడికి అనేకమంది భక్తులు వచ్చి దర్శించి పావనులవుతారు.

PC:Gktambe

హంపి రాతి మంచం శివలింగం

హంపి రాతి మంచం శివలింగం

కర్ణాటకలోని ప్రముఖ చారిత్రాత్మకమైన ప్రదేశమైన బళ్ళారి జిల్లాలోని హంపి తుంగభద్రానదితీరంలో వున్న రాతిశిలలపై 108శివలింగాలను చెక్కబడివున్నాయి. ఇది చాలా భిన్నమైన శివ లింగం మరియు చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

PC: Pratheepps

జమ్మూ కాశ్మీర్ లోని శివ లింగం

జమ్మూ కాశ్మీర్ లోని శివ లింగం

జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని వెరినాగ్ లోని ఓమోహ్ దేవాలయంలో ఉన్న విశేషంగా ఆకట్టుకుంటున్న శివ లింగం ఇది. ఈ శివలింగం అత్యంత మహిమాన్వితమైనదని చెప్పవచ్చును. శివ భగవంతుడిని పూజించిన వెంటనే శివుడికి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ శివలింగాన్ని భక్తితో పూజిస్తే శివుని కృప శీఘ్రంగా లభిస్తుందని భక్తులనమ్మకం.

PC: Akshey25

హోయసలేశ్వర దేవాలయం

హోయసలేశ్వర దేవాలయం

హస్సన్ జిల్లాలోని హొయసలేశ్వర దేవాలయంలోని గర్భగుడిలోవున్న శివలింగాన్ని హొయసలేశ్వరుడు అని పిలువబడుతుంది. గర్భగుడి యొక్క ద్వారంతెరవగానే కంటికి కనిపించే అద్భుతమైన శివలింగం. శివలింగాన్ని చూస్తూవుంటే ఆ పరమశివుడు స్వయంగా మనముందు ప్రత్యక్షమైనాడా అన్నట్లుగా కనపడుతుంది.

PC:Anks.manuja

కోటిలింగాలు

కోటిలింగాలు

కోటిలింగాలు వుండే పుణ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో వున్న కోలార్ లో వున్నది. ఇక్కడ అత్యంత పెద్దదైన శివలింగాన్ని చూడవచ్చును. అదే విధంగా ఈ దేవాలయం కూడా చాలా పెద్దది, లక్షలాది శివలింగాలు ఇక్కడ స్థాపించబడివున్నాయి. ఒకే స్థలంలో లక్షలాది చూడటం ఒక వైభవం.

PC:gsnewid

హంపి బడవ శివలింగం

హంపి బడవ శివలింగం

హంపిలో వున్న బడవలింగమిది. ఈ శివలింగానికి ఒక గొప్ప కథ కూడా ఉంది. ఆశ్చర్యమేమంటే, పెద్ద శివలింగం ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది. హంపిని సందర్శకులకు ఈ దేవాలయంలో అద్భుతంగా వెలసివున్న శివలింగం ఆకర్షించే ప్రధాన ఆకర్షణలలో ఒకటి.

PC:Arun Varadarajan

మధ్యప్రదేశ్ నది

మధ్యప్రదేశ్ నది

మధ్యప్రదేశ్ లో వున్న మహేశ్వర్ లో నర్మదా నదిలో ప్రతిష్టించబడివున్న ఈ శివలింగం అత్యంత అద్భుతమైనది. శివ లింగానికి ఎదురుగా నందిస్వామి వెలసియున్నాడు. పురుషుడు మరియు ప్రకృతి సమాగమాన్ని సూచించే ఈ శివలింగం స్థలం అత్యంత పవిత్రమైంది. ఇక్కడ స్నానమాచరించిన సకలపాపాలు పరిహారమౌతాయి అని నమ్ముతారు.

PC:nevil zaveri

భోజేశ్వర దేవాలయం

భోజేశ్వర దేవాలయం

ఈ దేవాలయం మధ్య ప్రదేశ్ లోని భోజ్పూర్ గ్రామంలో వున్న ఒక చారిత్రాత్మక దేవాలయం. ఈ భోజేశ్వర్ దేవాలయం యొక్క శివ లింగం ఏడున్నరఅడుగుల ఎత్తు కలిగివుంది. ఈ దేవాలయం మధ్యప్రదేశ్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది.

PC:Yann

ఉదయగిరి గుహ

ఉదయగిరి గుహ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలోని ఉదయగిరి గుహలో అత్యంత అరుదైన శివలింగం ఉంది. ఇది ఒక ముఖాన్నికలిగివున్నశివ లింగమైనా దీనిని ముఖలింగం అనే పిలుస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన నమూనాను కలిగి ఉన్న శివలింగం.

PC: Zippymarmalade

కేదారేశ్వర దేవాలయం

కేదారేశ్వర దేవాలయం

మహారాష్ట్రలోని హరిశ్చంద్రఘడ్ లో వున్న కేదారేశ్వర దేవాలయంలో అత్యంత మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ ఆలయం నాలుగు స్తంభాలు కలిగివున్న ఒక ఒక గుహ ఆలయం. అయితే ఆ నాలుగు స్తంభాలలో ఇప్పటికే 3 స్తంభాలు నాశనం చేయబడ్డాయి ఇంక మిగిలినది ఒకే ఒక స్థంభం. ఈ స్తంభంపడిపోతే యుగాంతం వస్తుందని చెప్పబడినది.

PC:rohit gowaikar

భూసందేశ్వర దేవాలయం

భూసందేశ్వర దేవాలయం

ఒడిషాలోని బలసోర్ జిల్లాలోని భోగ్రై అనే గ్రామంలో భూసందేశ్వర అనే దేవాలయం వుంది. ఆ దేవాలయంలో అత్యంత మహిమాన్వితమైన శివలింగం వుంది.ఇది ఆ రాష్ట్రం యొక్క అత్యంత పెద్దదైన శివలింగం.దీనిని జాగృతస్థలంగా పేరుగాంచినది.

PC: Monjit.paul

జంబుకేశ్వర దేవాలయం

జంబుకేశ్వర దేవాలయం

తమిళనాడులోని శ్రీరంగం జంబుకేశ్వర ఆలయంలో ఒక ప్రభావవంతమైన దేవాలయం ఉంది. ఈ లింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఎవరు భక్తి మరియు శ్రద్ధలతో పూజిస్తారో వారికి స్వామి సకల సంపదలు, ధనం, ధన్యాలను కురిపిస్తాడని చెప్తారు.

PC: Ilya Mauter

లఖ్ మండల్ దేవాలయం

లఖ్ మండల్ దేవాలయం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలోని జోన్సర్ - బవార్ ప్రదేశంలో లఖ్ మండల్ దేవాలయంవుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలోని జోన్సర్ - బవార్ ప్రదేశంలో లఖ్ మండల్ దేవాలయంవుంది. ఈ దేవాలయంలో పైకప్పులేని శివ లింగం వుంది.

PC:Bpmnnit

భీమేశ్వర దేవాలయం

భీమేశ్వర దేవాలయం

ఈ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట పట్టణంలో వుంది. ఈ శివలింగాన్ని కుమార రామ భీమేశ్వర దేవాలయం అని పిలుస్తారు. ఈ దేవాలయంలో వెలసిన శివలింగం అత్యంత శక్తిదాయకమైనది అని నమ్ముతారు.

PC:Palagiri

బృహదీశ్వర దేవాలయం

బృహదీశ్వర దేవాలయం

తమిళనాడులోని అనేక శివలింగ దేవాలయాలున్నాయి. అందులో బృహదీశ్వర దేవాలయం తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన మరియు ప్రసిద్ధమైన దేవాలయం. ఈ దేవాలయం అనేక విశేషాలను కలిగి, అత్యంత పవిత్రమైన యాత్రా స్థలంగా వుంది. ఇక్కడి శివలింగం ఏకశిలతో చేయబడిన శివలింగం.

PC:Shefali11011

సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే మహిమాన్విత సర్ప దేవాలయం

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక మంచి నిదర్శనం.....

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X