Search
  • Follow NativePlanet
Share
» »బంగారు త్రికోణ పర్యటన !

బంగారు త్రికోణ పర్యటన !

ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ మూడు ప్రదేశాలను మ్యాప్ లో కలిపితే ఒక త్రికోణం ఏర్పడుతుంది. దీనినే బంగారు త్రికోణం అని కూడా అంటారు. ఈ మూడు నగరాలు పర్యటిస్తే చాలు భారత దేశ సంస్కృతి, చరిత్రలు ఒక పర్యాతకుడికి తేలికగా అర్ధం అవుతాయి.

బిజీ గా వుండే వీధులు, బ్రిటిష్ కాల భావన నిర్మాణాలు, ఆశ్చర్య పరచే అందమైన స్మారక నిర్మాణాలు కలిపి దేశంలో ప్రసిద్ధ టూరిస్ట్ క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

విదేశాలనుండి వచ్చిన వారు ఇండియా అంతా టూర్ చేయుటకు సమయం లేకపోతే, ఈ మూడునగరాలు పర్యటిస్తే చాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అర్ధం చేసుకున్నట్లే. మరి ఈ మూడు నగరాలలోని పర్యాటక ఆకర్షణలు పరిశీలిద్దాం.

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఈ బంగారు త్రికోణ పర్యటన ఢిల్లీ లో మొదలవుతుంది. అక్కడ నుండి ఆగ్రా వెళ్ళాలి, ప్రేమ చిహ్నం అయిన తాజ్ మహల్ చూసి పరవసించండి. ఫోటోలు తీయటం మరువకండి. అక్కడ నుండి పింక్ సిటీ గా పిలువబడే జైపూర్ వెళ్లి అందమైన రాజ భవనాలు, మరువ లేని స్థానికుల ఆతిధ్యం అనుభవించి మరో మారు ఢిల్లీ కి తిరిగి వచ్చి అలసిన మీ శరీరానికి విశ్రాంతి కల్పించండి. అయితే ఈ పనికి ముందుగా, ఇండియా గేటు లో మృత వీరులకు శ్రద్ధాంజలి ఘాతించటం మరువకండి.

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఢిల్లీ నగరం భారత దేశ రాజధాని. ఎల్లపుడూ ఎంతో బిజీ గా వుండే నగరం. ఇది పురాతన ఢిల్లీ, కొత్త ఢిల్లీ గా విభజించబడింది. పురాతన ఢిల్లీ లో నేటికీ మొఘల్ సంస్కృతి కనపడుతుంది. ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల నాటి చాందిని చౌక్ మార్కెట్ చూడండి. ఈ మార్కెట్ లో మీరు ఏది కోరితే అది కొనవచ్చు.
Photo Courtesy: Sourav Das

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఇండియా గేటు
నగరం మధ్యలో కల ఈ నిర్మాణం ఒక యుద్ధ స్మారకం. దీనిని ఒకటవ ప్రపంచ యుద్ధం లో మరియు మూడవ ఆంగ్లో - ఆఫ్ఘన్ యుద్ధం లో మరణించిన సైనికుల గౌరవార్ధం నిర్మించారు. ఈ స్మారకం దిగువన 'అమర్ జవాన్ జ్యోతి' కలదు. ఈ జ్యోతి నిరంతరం వెలుగుతూనే వుంటుంది. దీనిని 1971 భారత్ - పాక్ యుద్ధ మృత వీర సైనికుల గౌరవార్ధం ఏర్పరిచారు.

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

పేరుకి తగినట్లే ఇది ఒక 'రాజ మార్గం'. ఇది రాష్ట్రపతి భవన్ నుండి ఢిల్లీ మ్యూజియం వరకూ విస్తరించి వుంది. ప్రతి సంవత్సరం జనవరి 26 వ తేది రిపబ్లిక్ డే రోజున ఈ రాజ మార్గం పై సైనికుల కవాతు జరుగుతుంది. ఇక్కడ దేశాధ్యుక్షుడి నివాసం మరియు పాలనా భవనాలు వుండటంచే రక్షిత ప్రాంతం గా ప్రకటించారు.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

రాజ్ ఘాట్
ఢిల్లీ లో అత్యధికులు సందర్శించే పర్యాటక ప్రదేశం రాజ్ ఘాట్. ఇక్కడ గాంధి సమాధి కలదు. దేశ విదేశాల ప్రముఖులు ఇక్కడకు వచ్చి గాంధి కి నివాళులు అర్పిస్తారు. ఇదే ప్రదేశంలో ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీ ల సమాధులు కూడా కలవు.

Photo Courtesy: nikkul

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

రెడ్ ఫోర్ట్
రెడ్ ఫోర్ట్ లేదా ఎర్ర కోటను అది ఎర్రటి రాళ్ళ తో నిర్మించటం చే అలా పిలుస్తారు. ఇది ఒక యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. దీనిలో అనేక అద్భుత నిర్మాణాలు, దివాన్ ఐ ఆం, దివాన్ ఐ ఖాస్ వంటి సమావేశ ప్రాంగణాలు కలవు.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

హుమాయూన్ సమాధి
ఇది మరొక యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశం. చక్రవర్తి మరణం తర్వాత అతని భార్య దీనిని నిర్మించింది. ఇక్కడ అందమైన గార్డెన్ లు, నీటి ఫౌంటెన్ లు, కాలి నడక మార్గాలు కలవు.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

పురానా కిలా
ఢిల్లీ లో ఇది అతి పురాతన కోట. పొడవైన గోడలు, పెద్ద గేటు లు కలవు. పాండవులు దీనిని తమ రాజధాని ఇంద్ర ప్రస్తా గా ఏర్పరచుకోన్నారని చెపుతారు.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

లోడి గార్డెన్స్
లోడి గార్డెన్స్ లో అనేకమంది లోడి వంశానికి చెందినా పాలకుల సమాధులు కలవు. ఢిల్లీ గత చరిత్ర వైభవానికి చిహ్నంగా వుంటుంది.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

కుతుబ్ మినార్
భారత దేశంలో ఇది అతి ఎత్తైన టవర్ ఇది. అద్భుత శిల్ప శైలి కలిగిన ఒక ఇనుప స్థంభం వేలాది సంవత్సరాల పాటు ఎండలకు, వానలకు గురైనా ఇంతవరకు తుప్పు పట్టలేదు
Photo Courtesy: Geoff Stearns

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

పంచేంద్రియాల తోట

అతి పెద్దదైన ఈ పార్క్ లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనిని ఢిల్లీ టూరిజం శాఖ నిర్వహిస్తుంది. ఈ పార్క్ ప్రవేశంతో మన పంచేంద్రియాలకు పని పడుతుంది.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

తుగ్లకా బాద్ కోట

ఈ కోటను తుగ్లక్ వంశ పాలకులు తమ తుగ్లక్ నగర రక్షణకై నిర్మించారు. ఈ శిధిలాల సందర్శన మిమ్ములను ఒక్కసారి గతం లోకి తీసుకు వెళుతుంది.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

జామా మసీద్

జామా మసీద్ ను షా జహాన్ చక్రవర్తి నిర్మించాడు. నేటికీ ఈ మసీదులో వేలాది మంది ముస్లిం లు ప్రార్ధనలు చేస్తారు.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

అక్షర ధాం

ఇది ఒక హిందూ దేవాలయం. దీని దైవం స్వామీ నారాయణ్. ఆధునిక శిల్ప శైలి కల ఈ టెంపుల్ యమునా నది తీరంపై కలదు.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

లోటస్ టెంపుల్

ఈ టెంపుల్ బహాయీ మతస్తుల ప్రార్థనా స్థలం. ఈ టెంపుల్ తొమ్మిది దళాలు కలిగి న ఒక పద్మంలా అద్భుత శిల్ప శైలితో నిర్మించారు.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఆహారం

పురాతన ఢిల్లీ లో రుచులు కలిగిన మొగలాయీ వంటకాలు ప్రతి రెస్టారెంట్ లో దొరుకుతాయి. ధరలు కూడా సరసమే. బిర్యాని, వేపుడు మాంసం, కబాబు లతో ఆహారాలు స్వర్గాన్ని మరపిస్తాయి.

చిత్ర కృప: Saad Akhtar

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

షాపింగ్

ఢిల్లీ లో అనేక మాల్స్ కలవు. స్థానిక మార్కెట్ లు విభిన్న వస్తువులు అమ్ముతాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు మొదలైనవి చాంద్ ని చౌక్ లో కొనవచ్చు. మీరు చేయవలసినదల్లా కొనవలసిన వస్తువులు ఒక జాబితా చేస్తే అన్నీ ఒకే చోట దొరుకుతాయి.

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఆగ్రా

మన పర్యటనలో రెండవ మజిలీ ఆగ్రా పట్టణం. ఇక్కడ కల ప్రేమ చిహ్నం తాజ్ మహల్ చూసేందుకు సంవత్సరంపొడవునా పర్యాటకులు వస్తారు. ఇక్కడ ఇంకనూ అనేక ఆకర్షణలు కలవు.

Photo Courtesy: netlancer2006

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

తాజ్ మహల్

తాజ్ మహల్ మరువలేని ప్రేమకు చిహ్నం. ప్రపంచ ఏడు వింతలలో ఒకటి. ఈ కట్టడం స్వచ్చమైన తెల్లని మార్బుల్ రాయి తో నిర్మించబడినది. దీనిలో షా జహాన్ భార్య ముంతాజ్ మహల్ సమాధి వుంటుంది. ఆగ్రాలో వసతుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Photo Courtesy: Shubham.tiwari53

 ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఆగ్రా కోట

ఆగ్రా కోటను అక్బర్ చక్రవర్తి నిర్మించాడు. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎర్ర రాతి నిర్మాణం.

Photo Courtesy: LASZLO ILYES

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

చిని కా రౌజా

ఇది ఒక ప్రఖ్యాత కవి, పండితుడు, షా జహాన్ రాజ్యంలో ప్రధాన మంత్రి అయిన అల్లామా అఫ్జల్ ఖాన్ యొక్క స్మారకం. భారత - పర్షియన్ శిల్ప శైలి కలిగి అనేక లిఖితాలు కలిగి వుంటుంది.

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

మరియంస్ టూంబ్

ఇది అక్బర్ చక్రవర్తి భార్య స్మారకం. ఈ టూంబ్ సికింద్ర లో కలదు. ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్.

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ ని మోఘోల్ సంస్కృతి, నాగరికతల ప్రతినిధిగా అక్బర్ చక్రవర్తి నిర్మించాడు. ఇది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్

Photo Courtesy: Shakti

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఆహారం

ఇక్కడి రెస్టారెంట్ లలో మొగలాయీ వంటకాలు అధికం. అయితే, ఇతర వంటకాలు కూడా దొరుకుతాయి.

Photo Courtesy: Connie Ma

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

షాపింగ్

ఆగ్రా లో షాపింగ్ చేయటం తేలిక. హస్త కళల వస్తువులు మార్కెట్ లలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి.

Photo Courtesy: VasenkaPhotography

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

జైపూర్

పింక్ సిటీ గా చెప్పబడే జైపూర్ మన తర్వాతి మజిలీ. ఇది రాజపుత్రుల రాజధాని. పూర్తిగా వారి సంస్కృతి, వారసత్వాలు ఇక్కడ కనపడతాయి. మేలి తిరిగిన మీసాలు, తలపాగాలు ఇక్కడి ప్రజల ప్రత్యేకత.

Photot Courtesy: Tim Moffatt

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

అంబర్ కోట

ఇది చాలా పురాతన కోట. ఇది జైపూర్ ఏర్పడకముందే వున్నదని చెపుతారు. ఇపుడు కోట అవశేషాలు మాత్రమే కలవు.

Photo Courtesy: Nvvchar

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

సిటీ పాలస్

ఈ భవనాన్ని మహారాజా సవాయ్ జై సింగ్ , జైపూర్ వ్యవస్థాపకుడు నిర్మించాడు. దీని నిర్మాణంలో అందమైన రాజపుత్ర మరియు మొఘల్ శిల్ప శైలి గోచరిస్తుంది.

Photo Courtesy: Rednivaram

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

హవా మహల్

హవా మహల్ అంటే గాలుల భవనం అని అర్ధం చెపుతారు. కవి రాజు అయిన మహారాజ సవాయ్ ప్రతాప్ సింగ్ దీనిని నిర్మించాడు. ఈ భావన అందాలు పర్యాటకులను ముగ్ధులను చేస్తాయి.

Photo Courtesy: Janwiki

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఆల్బర్ట్ హాల్

ఒకప్పుడు దీనిని కరవు బాధితుల రిలీఫ్ కొరకు నిర్మించారు. ఇపుడు దీనిని వివిధ పెయింటింగ్ లు ఇతర పురాతన వస్తువులు వుంచి ఒక మ్యూజియం గా నిర్వహిస్తున్నారు.

Photo Courtesy: Ksheer

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

జంతర్ మంతర్

ఇది ఒక ఖగోళ నక్షత్రశాల. ఆ నాటి రాజ పుత్రుల ఖగోళ అంశాల ఆసక్తి కనబరుస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడినది. Photo Courtesy: Marcin Białek

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఆహారాలు

ఇక్కడ రుచికర రాజస్థానీ వంటకాలు దొరుకుతాయి. రుచులూరే రక రకాల కూరలు చేస్తారు. తియ్యని పెరుగు మరింత రుచికరంగా వుంటుంది. Photo Courtesy: Scott Dexter

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

ఒకేసారి పర్యటిస్తే అంతా పొదుపు!

షాపింగ్

స్థానిక తయారీలైన హస్త కళల వస్తువులు ఆసక్తి కలవారు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ దొరికే పురుషుల పెద్ద తలపాగాలు ఒకటి కొని పర్యటన గుర్తుగా ఉంచుకోండి.

Photo Courtesy: John Haslam

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X