Search
  • Follow NativePlanet
Share
» »ఇవన్నీ భార్యలు, భర్తల కోసం నిర్మించినవే...

ఇవన్నీ భార్యలు, భర్తల కోసం నిర్మించినవే...

భార్తల కోసం భార్యలు నిర్మించిన స్మారకాలకు సంబంధించిన కథనం.

సామాన్యంగా మనకు తెలిసినంత వరకూ చరిత్రలో తమ భార్యలు, ప్రియురాళ్ల కోసం రాజులు, లేదా వారివద్ద ఉన్న మంత్రులు, సైన్యాధిపతులు కొన్ని ప్రత్యేక భవనాలను, కోటలను, స్మారకాలను నిర్మించారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆగ్రాలోని తాజ్ మహల్. మొఘల్ చక్రవర్తి తన భార్య కోసం ఈ తాజ్ మహల్ ను నిర్మించినట్లు చరిత్ర పై కొద్ది పాటి పరిజ్జానం ఉన్న ఎవరైనా చెబుతారు. అయితే మహిళలు కూడా తక్కువ తినలేదు. తమ భర్తల జ్జాపకార్తం లేదా వారి సాధించిన విజయాలకు గుర్తుగా కొన్ని కట్టడాలను నిర్మించారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

విరూపాక్ష దేవాలయం, పట్టదకల్, కర్నటక

విరూపాక్ష దేవాలయం, పట్టదకల్, కర్నటక

P.C: You Tube

పల్లవ రాజుల పై తన భర్త విక్రమాధిత్య సాధించిన విజయానికి గుర్తుగా ఆయన భార్య లోకా మహాదేవి ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 740లో నిర్మింపజేశారని చరిత్ర చెబుతోంది. అత్యంత అందమైన భారతీయ శిల్పకళకు అద్దం పట్టే ఈ దేవలయంలోని ప్రధాన దైవం. ఈశ్వరుడు. ఆయన్ను ఇక్కడ లోకేశ్వర పేరుతో పిలుస్తారు.

మోహినీశ్వర దేవలయం, గుల్మార్గ్

మోహినీశ్వర దేవలయం, గుల్మార్గ్

P.C: You Tube

జమ్ముకాశ్మీర్ ను పరిపాలించే రాజా హరిసింగ్ జ్జాపకార్తం ఆయన భార్య మోహినీ దేవి పర్వత శిఖర భాగంలో నిర్మించారు. ప్రక`తి సిగలో ఉన్నట్లు అనిపించే ఈ దేవాలయం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. అందువల్లే ఎక్కవ మంది పర్యాటకులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ుంటారు.

లాల్ దర్వాజ మసీదు, ఉత్తర ప్రసాద్

లాల్ దర్వాజ మసీదు, ఉత్తర ప్రసాద్

P.C: You Tube

లాల్ దర్వాజ మసీదును జన్పుర్ రాజు సుల్తాన్ మహ్మద్ షార్కీ భార్య రజియా భాయ్ క్రీస్తుశకం 1447లో నిర్మింపజేశారు. అప్పట్లో ప్రముఖ ధార్మికవేత్త అయిన సయ్యద్ ఆలీ దావూడ్ కుతుబుద్దీన్ స్మారకార్తం ఈ కట్టడాన్ని నిర్మించారు.

మీర్జాన్ కోట, కుమటా, కర్నాటక

మీర్జాన్ కోట, కుమటా, కర్నాటక

P.C: You Tube

మీర్జాన్ కోటను చెన్నబైరాదేవి తన భర్త జ్జాపకార్తం నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ కోట వాస్తుశైలి చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ కోటలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక వాచ్ టవర్లు కూడా ఈ మీర్జాన్ కోట కలిగి ఉంది. కర్నాటకలోని ఉత్తర కర్నాటక జిల్లాలోని ఈ కోటను చూడటానికే చాలా మంది వస్తుంటారు.

రాణి కి వావ్

రాణి కి వావ్

P.C: You Tube

ఒక బావి పేరే రాణి కి వావ్. సోలంకి రాజ్యాధిపతి 11వ శతాబ్దంలో రాజ భీమదేవుడి కోసం ఆయన భార్య ఉదయమతి నిర్మించారు. ఈ బావిలో అనేక శిల్పాలు ఉన్నాయి. ఏడు అంతస్తుల బావి ఇది. ఈ బావి 64 మీటర్లు ఎత్తు, 27 మీటర్ల వెడల్పు ఉంది.

 హుమయూన్ సమాధి

హుమయూన్ సమాధి

P.C: You Tube

ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో హుమయూన్ సమాధి కూడా ఒకటి. దీనిని రెండో మొఘల్ చక్రవర్తి హుమయూన్ భార్య తన భర్త పేరిట నిర్మించారు. పర్షియన్ వాస్తు శైలితో నిర్మించిన ఈ కట్టడం ఇండియాలో నిర్మించిన మొదటి ఉద్యానవనంతో కూడిన సమాధి అని చెబుతారు.

వీకెండ్ లో వెల్లూరు చూసొద్దాంవీకెండ్ లో వెల్లూరు చూసొద్దాం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X