» »భద్రాచలం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

భద్రాచలం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

By: Venkata Karunasri Nalluru

భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది. పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు వచ్చింది.

ఇతిహాసం

గోల్కొండను నవాబు అబుల్ హసన్ తానీషా పరిపాలించేటప్పుడు భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు.

ఇది కూడా చదవండి: మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

ఈ నెలలో టాప్ 6 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. కొలువుతీరిన శ్రీరామచంద్రుడు

1. కొలువుతీరిన శ్రీరామచంద్రుడు

దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది.

చిత్రకృప: PAPA RAO KVSKS

2. సీతారామ కళ్యాణ ఉత్సవం

2. సీతారామ కళ్యాణ ఉత్సవం

ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం.

చిత్రకృప: Bcmnet at English Wikipedia

3. వైకుంఠ రాముడు

3. వైకుంఠ రాముడు

భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.

ఇది కూడా చదవండి:భారతదేశంలో దర్శించదగ్గ పది ప్రముఖ పుణ్యక్షేత్రాలు

చిత్రకృప: Adityamadhav83

4. బస్సు సౌకర్యం

4. బస్సు సౌకర్యం

భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా అనుసంధానమై వుంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

చిత్రకృప: Adityamadhav83

5. రైలు సౌకర్యం

5. రైలు సౌకర్యం

భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

ఇది కూడా చదవండి:బంగారు పద్మంలో అవతరించిన శ్రీపద్మావతి దేవి మరియు లక్ష్మీ దేవి ఒక్కరేనా !

చిత్రకృప: Dmitry A. Mottl

6. లాంచీ సౌకర్యం

6. లాంచీ సౌకర్యం

గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి.

ఇది కూడా చదవండి:దయ్యాలను వదలగొట్టే తాంత్రిక శక్తి దేవాలయాలు

చిత్రకృప:Pranayraj1985

7. వికలాంగుల కోసం

7. వికలాంగుల కోసం

భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారి కోసం లిఫ్ట్‌ సౌకర్యం కలదు.

చిత్రకృప: Adityamadhav83

8. కిన్నెరసాని

8. కిన్నెరసాని

భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి.

ఇది కూడా చదవండి: గోకర్ణం క్షేత్ర మహిమ

చిత్రకృప: Berit

9. పర్ణశాల

9. పర్ణశాల

వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.

చిత్రకృప: Adityamadhav83

10. పాపి కొండలు:

10. పాపి కొండలు:

సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.

ఇది కూడా చదవండి:బాహుబలి 2 షూటింగ్ జరిగిన ప్రదేశాలు

చిత్రకృప:Adityamadhav83

11. సంస్కృతి సంప్రదాయాలు

11. సంస్కృతి సంప్రదాయాలు

భద్రాచలం పరిసరప్రాంతాలలో సుందరమైనటువంటి అడవి, జలపాతాలు ఉన్నవి. భద్రాచలం చుట్టుపక్కల గిరిజన ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు కట్టుబొట్టు ధింస్సా నృత్యం, కొమ్మునృత్యం జాతరలు పండగలు జరుపుకుంటారు. భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు సీత రామ కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు.

చిత్రకృప:Adityamadhav83

12. భద్రగిరి

12. భద్రగిరి

మేరుపర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.

చిత్రకృప:Pranayraj1985

13. వైకుంఠ రాముడు

13. వైకుంఠ రాముడు

శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది. భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.

చిత్రకృప:Pranayraj1985

14. సీతమ్మవారు

14. సీతమ్మవారు

ఇతర దేవాలయములలో సీతమ్మవారు రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనయై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కాని ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటాడు.

ఇది కూడా చదవండి:దాదాపు వేయి సంవత్సరాల క్రితం నాటి రహస్యలు

చిత్రకృప:Vivek rachuri

15. నిత్యపూజలు, ఉత్సవాలు

15. నిత్యపూజలు, ఉత్సవాలు

ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతున్నది.

చిత్రకృప:Vivek rachuri

16. వైకుంఠఏకాదశి పర్వదినం

16. వైకుంఠఏకాదశి పర్వదినం

వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్దిచెందింది.

ఇది కూడా చదవండి:శ్రీ పెద్దమ్మ దేవాలయం

చిత్రకృప:vimal_kalyan - Flickr

17. నిత్యపూజలు

17. నిత్యపూజలు

తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విధంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.

చిత్రకృప:Adityamadhav83

18. పర్ణశాల

18. పర్ణశాల

ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉన్నది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసం సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడిరూపంలో వచ్చిన మారీచుని బొమ్మ. పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మవాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.

చిత్రకృప: Vivek rachuri

19. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి

19. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి

రావణుడు సీతను అపహరిమంచిన ప్రదేశం ఇది. సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు. శ్రీరామ నవమి రొజున ఇక్కడ కూడా కల్యాణోత్సవం జరుగుతుంది.

చిత్రకృప:Vivek rachuri

20. జటాయుపాక

20. జటాయుపాక

భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువు యొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో రెఖపల్లి గ్రామంలో పడిందట.

చిత్రకృప:Vivek rachuri

21. దుమ్ముగూడెం

21. దుమ్ముగూడెం

ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉన్నది గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు.

చిత్రకృప:Vivek rachuri

22. వేడినీటి బుగ్గలు

22. వేడినీటి బుగ్గలు

ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు చలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.

ఇది కూడా చదవండి:వేసవి సెలవులకి ఛలో ఢిల్లీ

చిత్రకృప:vimal_kalyan - Flickr

23. శ్రీరామగిరి

23. శ్రీరామగిరి

ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది.

చిత్రకృప:Adityamadhav83

24. పాపికొండలు

24. పాపికొండలు

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి.

చిత్రకృప:VaidhyanathanN

25. ఆహ్లాదకరమైన వాతావరణము

25. ఆహ్లాదకరమైన వాతావరణము

సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది.

ఇది కూడా చదవండి:పేదల ఊటీ ఎక్కడుందో మీకు తెలుసా

చిత్రకృప:VaidhyanathanN

26. పాపికొండల అడవులు

26. పాపికొండల అడవులు

పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.

చిత్రకృప:kiran kuma

27.గోదావరి నది

27.గోదావరి నది

పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

చిత్రకృప: Dineshthatti

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా? షాకింగ్ నిజాలు !

అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?

Please Wait while comments are loading...