Search
  • Follow NativePlanet
Share
» »శబరిమల గురించి మనకు తెలియని నిజాలు !

శబరిమల గురించి మనకు తెలియని నిజాలు !

శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్ళటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు.

By Staff

ఇపుడైతే శబరిమల వెళ్లిరావటం నీళ్లు తాగినంత ఈజీ. కానీ ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. అప్పట్లో శబరిమల వెళ్ళటానికి ఎరుమేలిమార్గం అనే ఒక్క దారినే ఉపయోగించేవారట. ఈ దారి గుండానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్లివచ్చేవారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు. వీరు ఎప్పుడువెళ్ళినా గుంపులు గుంపులుగా, బృందంగా వెళ్లేవారట.

శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్ళటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు.

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

రెండువందల సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్ర కు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డ్ లలో పేర్కొనబడింది. 1907 లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డి తో, ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు. 1909 లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

చిత్ర కృప : sreenisreedharan

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

దేవాలయాన్ని మరలా 1909-10 వ సంవత్సరంలో పునఃనిర్మించారని తెలుస్తుంది. అప్పుడు శిలా విగ్రహానికి బదులు, పంచలోహాలతో తయారుచేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుండి పంచలోహ విగ్రహానికె పూజలు చేస్తుండటం గమనార్హం.

చిత్ర కృప : gallery.oneindia.com

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకూండా మండల పూజ కొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు.

చిత్ర కృప : Challiyan

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది. కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు 1945 వ సంవత్సరంలో ఆలయ బోర్డు తీర్మానించింది.

చిత్ర కృప : ragesh ev

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

1950 వరకు పరుశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతైంది. మరలా 1951 లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య ప్రతిష్టించారు. అప్పటి వరకు కేరళీ కేళీవిగ్రహంగా కిర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా, నేడు భూతళీకేళీ విగ్రహం గా కీర్తించబడుతున్నది.

చిత్ర కృప : Jaya jaya

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

బెంగళూరు భక్తుడొకాయన గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకోవడటంతో 2000 వ సంవత్సరంలో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది.

చిత్ర కృప : AnjanaMenon

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

1984 కు పూర్వం పదునెట్టాంబడి ఎక్కటానికి భక్తులు పరుశురామ నిర్మితమైన రాతిమెట్లనే వాడేవారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్లుపై కొబ్బరికాయ ను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకొని బోర్డు వారు 1985 లో పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు.

చిత్ర కృప : Aruna

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామి వారి ఆభరణాలను పందళం లో భద్రపరిచి ఉంచుతారు. అక్కడి నుండి ప్రతి ఏటా మకరసంక్రాంతి తారీఖున మూడు పెట్టలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను 11 మంది మూడురోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు.

చిత్ర కృప : gallery.oneindia.com

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్లో ఇవ్వగానే తూర్పుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది.

చిత్ర కృప : telugu native planet

స్వామియే ... శరణమయ్యప్ప !

స్వామియే ... శరణమయ్యప్ప !

ఆభరణాల వెంట పందళం రాజ వంశస్థులలో ఒకరు(పెద్దవాడు) కత్తి పట్టుకుంటూ నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20 వ తేదీన ఆభరణాలను వెంట పందళం వరకు వెళ్లి వాటిని చేరవేరుస్తాడు.

చిత్ర కృప : gallery.oneindia.com

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X