Search
  • Follow NativePlanet
Share
» »ఎడారిలో ఒయాసిస్సు - మౌంట్ అబూ !

ఎడారిలో ఒయాసిస్సు - మౌంట్ అబూ !

By Mohammad

భారతదేశంలో అతి పురాతన ముడుత పర్వతాలు - ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాల అందచందాల్ని చూడాలన్నా, అపురూప శిల్పసంపదను ఆస్వాదించాలన్నా, బ్రహ్మకుమారీల శాంతిసరోవరంలో విశ్రాంతి పొందాలన్నా రాజస్థాన్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం మౌంట్ అబూ వెళ్లాల్సిందే! వేసవిలో చల్లగా, మిగిలిన రోజుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అబూ సందర్శన ఒక అనుభూతి.

ఇది కూడా చదవండి : ఎన్నో వింతల అద్భుత ఆలయం చూసొద్దాం పదండి !

ఆరావళి పర్వతాలు రాజస్థాన్ లో సముద్రమట్టానికి 4 వేల అడుగుల ఎత్తులో భారతదేశానికి వాయువ్య దిక్కున విస్తరించి ఉన్నాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు పగలు - 36 డిగ్రీల సెల్సియస్, శీతకాలంలో పగలు - 28 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైతాయి. కొండల నుంచి జాలువారే జలపాతాలు, తోటలు, శిల్ప సంపదకు అబూ ఖ్యాతి గాంచింది.

నక్కి సరస్సు

నక్కి సరస్సు

క్రూరులైన రాక్షసుల బారి తప్పించుకోవటానికి హిందూ దేవతలు గోళ్లతో ఈ సరస్సును తవ్వడం వల్ల నక్కీ (నెయిల్) సరస్సుగా పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఇక్కడి బోటు షికారు ఆకర్షణగా నిలుస్తుంది. పర్వతారోహకులు సరస్సు దగ్గరలోని రాతికొండలు సూచించదగినవి.

చిత్ర కృప : Jmacleantaylor

గురు శిఖర్ పీక్

గురు శిఖర్ పీక్

మౌంట్ అబూకు ఈశాన్యంగా 15 కిలోమీటర్ల దూరంలోని గురుశిఖరం ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తయింది. ప్రముఖ హిందూ యాత్రాస్థలం. ఈ శిఖరం లో ప్రాచీన గురు దత్తాత్రేయ ఆలయాన్ని చూడవచ్చు. గుడిలో గంట పెద్ద ఆకర్షణ. శాంతిశిఖరం, అచల్‌ఘడ్ శిఖరం కూడా చూడదగిన ప్రదేశాలు.

చిత్ర కృప : Guptaele

దిల్వార జైన మందిరం

దిల్వార జైన మందిరం

ప్రపంచంలో అత్యంత సుందర దేవాలయాలలో దిల్వార జైన దేవాలయం ఒకటి. దీనిని క్రీ.శ. 11-13 శతాబ్దాల మధ్య 5 ప్రధాన భాగాలుగా నిర్మించారు. ఇందులో 5 గురు తీర్ధాంకరులను ప్రతిష్టించారు. ఇక్కడి చలువరాతి శిల్ప సంపద ఆశ్చర్యచకితులను చేస్తుంది.

చిత్ర కృప : Malaiya

బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం

బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం

మౌంట్ అబూ లో ప్రపంచ ప్రసిద్ధ సామాజిక ఆధ్యాత్మిక విద్యాసంస్థ 'బ్రహ్మకుమారి యూనివర్సిటీ' కలదు. దీనిని శాంతి, సోదరభావం పెంపొందిచాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటుచేశారు. ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత వంటి విద్యలకు శిక్షణ ఇస్తుంటారు.

చిత్ర కృప : Brahma Kumaris

అచల్ ఘర్

అచల్ ఘర్

అచల్ ఘర్, మౌంట్ అబూ లో 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ అచల్ కోట ప్రసిద్ధి చెందినది. చారిత్రక, ధార్మిక ప్రాధాన్యత గల ఈ కోటను దర్శించటానికి మౌంట్ అబూ యాత్రికులు తరచూ వస్తుంటారు. కోటలో అచల్ మహాదేవ ఆలయం, ఇతర జైన దేవాలయాలు ఉన్నాయి.

చిత్ర కృప : Nagarjun Kandukuru

అధర్ దేవి ఆలయం

అధర్ దేవి ఆలయం

మౌంట్ అబూ లో మరో ప్రసిద్ధ ఆకర్షణ అధర్ దేవి ఆలయం. ఇందులో దుర్గా మాత కొలువై ఉంటుంది. దేవాలయం ఒక గుహలో ఉంటుంది. కొండ పై ఉన్న గుడికి చేరుకోవటానికి 365 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.

చిత్ర కృప : Azmal Singh

దూద్ బవోరి

దూద్ బవోరి

అధర్ దేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ఆకర్షణ దూద్ బవోరి. ఇందులోని నీరు పాల వలే తెల్లగా ఉంటుంది. స్థానికులు ఈ బావిని దేవతలకు పాలు అందించే ప్రధాన వనరుగా, గోమాత కామధేనువుగా భావిస్తారు.

దాట్డ సీ వాల్డ్

దాట్డ సీ వాల్డ్

మౌంట్ అబూ నుండి దిల్వారా దేవాలయానికి వెళ్లే దారిలో దాట్డ సీ వాల్డ్ అక్వేరియం కలదు. ఇందులో వివిధ దేశాల నుండి దిగుమతి చేసిన చేపలు, వివిధ పరిమాణాలలో, రంగులలో గవ్వలు ప్రదర్శించబడుతున్నాయి.

చిత్ర కృప : Sajith T S

హనిమూన్ పాయింట్

హనిమూన్ పాయింట్

సముద్రమట్టానికి 1200 మీ. ఎత్తున ఉండే హానిమూన్ పాయింట్, నక్కి సరస్సుకు ఈశాన్యాన కలదు. దీనిని అనాదర పాయింట్ అని పిలుస్తారు. ఇక్కడ గల రాయి స్త్రీ, పురుష ఆకారాన్ని పోలి ఉంటుంది కనుక దీనిని హనిమూన్ పాయింట్ అంటారు. ఈ ప్రాంతం అద్భుత సూర్యాస్తమయ దృశ్యాలను అందిస్తుంది.

చిత్ర కృప : T.sujatha

అబూ వన్యప్రాణి అభయారణ్యం

అబూ వన్యప్రాణి అభయారణ్యం

మౌంట్ అబూ వన్య ప్రాణుల అభయారణ్యం 1960 లో ఏర్పాటుచేశారు. ఇక్కడికి చాలా మంది పర్యాటకులు సైట్ సీఇంగ్ లను, అద్భుత దృశ్యాలను చూడటానికి మాత్రమే వస్తుంటారు. 7 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు ఉంటుంది ఈ అభయారణ్యం.

చిత్ర కృప : Christopher Kray

అబూ లో ఉత్సవాలు

అబూ లో ఉత్సవాలు

అబూలో మహావీర్ జయంతి, వేసవి ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపు కుంటారు. పండుగల సమయంలో సంప్రదాయ జానపద నృత్యాలను, మధురమైన జానపద సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

చిత్ర కృప : Arian Zwegers

వసతి

వసతి

బడ్జెట్ తగ్గట్టే హోటళ్లు దొరుకుతాయి. డీలక్స్, సెమి డీలక్స్, ఏసీ, నాన్ ఏసీ గదులతో పాటు కాటేజీలు అందుబాటు ధరల్లోనే లభ్యమవుతాయి. నార్త్, సౌత్ ఇండియన్ వంటకాలతో పాటు విదేశీ వంటకాలు రుచి చూడవచ్చు.

మౌంట్ అబూ హోటళ్ల కోరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : gags9999

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ఉదయపూర్ (185 కి.మీ) ఎయిర్ పోర్ట్ సమీపాన ఉన్నప్పటికీ, అహ్మదాబాద్ (221 కి. మీ) ఎయిర్ పోర్ట్ దేశంలోని ప్రధాన నగరాలతో కనెక్ట్ చేయబడింది. ఉదయపూర్, అహ్మదాబాద్ నుండి క్యాబ్ లో ప్రయాణించి అబూ చేరుకోవచ్చు.

రైలు మార్గం : అబూ రోడ్, ప్రధాన పట్టణానికి 22 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా గంటకోసారి తిరిగే బస్సులలో ఎక్కి అబూ వెళ్ళవచ్చు.

రోడ్డు మార్గం : న్యూఢిల్లీ, ముంబై, జైపూర్, ఉదయపూర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుండి అబూ కు బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Raviraj96

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X