Search
  • Follow NativePlanet
Share
» »రాముడి కోసం పోరాడిని ఓ పక్షి దేవాలయం ఇది

రాముడి కోసం పోరాడిని ఓ పక్షి దేవాలయం ఇది

అత్యంత అరుదైన గరుడ దేవాలయల్లో ఒకటి కర్నాటకలో కూడా ఉంది. ఈ దేవాలయంలో ఉన్న విగ్రహం లాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని ప్రతీతి.

By Staff

కర్ణాటకలో ఏకైక గరుడ దేవాలయం కోలారు జిల్లా, ములబాగుల తాలూకాకు 18 కిలోమీటర్ల దూరంలోని కొలాదేవి గ్రామంలో ఉంది. ఈ దేవాలయంలో ఉన్నట్లు ప్రపంచంలో మరెక్కడా విగ్రహం లేదని ప్రతీతి.

1. గరుడికీ ఓ దేవాలయం

1. గరుడికీ ఓ దేవాలయం

Pc

భారత దేశంలో ప్రతి గ్రామంలో విష్ణువుకి దేవాలయం ఉండటం తెలిసిందే. అదే విష్ణువు వాహనమైన గరుడికి దేశంలో చాలా కొన్ని చోట్లే దేవాలయాలు ఉంటాయి. అటు వంటి దేవాలయమే కర్ణాటకలో కూడా ఉంది. ప్రాచుర్యం లేక పోవడంతో మరుగున పడిన ఈ దేవాలయం సదరు ప్రాంతానికి రవాణా సౌకర్యాలు పెరుగుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. మరింకెందుకు ఆలస్యం అటువంటి అరుదైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుని రాబోయే వీకెండ్ లో అక్కడికి కుటుంబ సభ్యులతో వెళ్లడానికి ప్లాన్ చేసుకుందాం

2. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదు

2. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదు

Pc

ఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది విష్ణు వాహనమైన గరుక్మంతుడు. ఇక్కడ ఉన్నట్లు గరుడ విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదని స్థానికులు చెబుతుంటారు. గరుక్మంతుడు నేల పైన ఓ మోకాలును ఉంచి మరో కాలు మోకాలు పైకి లేచి ఉంటుంది. ఇక కుడి భుజం పై విష్ణువు ఉండగా ఎడమ భుజం పై లక్ష్మిదేవి ఉంటుంది. అంతే కాక ఇక్కడి విగ్రహానికి పాములు ఆభరణాలుగా ఉంటాయి.

3. స్థానికుల కథనం ప్రకారం...

3. స్థానికుల కథనం ప్రకారం...

Pc

రావణుడు సీతా దేవిని అపహరించే సమయంలో ఓ గరుడ పక్షి రావణుడితో ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతంలో పోరాటం మొదలు పెడుతుంది. అయితే చివరికి ఆ పోరాటంలో ప్రణాలు కోల్పోతుంది. తుది గడియల్లో రామ..రామ అని కలవరించింది. ఈ విషయాన్ని దూర ద`ష్టితో చూసిన రాముడు గరుడ పక్షికి మోక్షం ప్రసాదించడమే కాకుండా ఈ ప్రాతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

4. ఎటువంటి కోర్కెలు తీరుతాయి...

4. ఎటువంటి కోర్కెలు తీరుతాయి...

Pc

సాధారణంగా ఈ దేవాలయానికి సంతానం లేని దంపతులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి తప్పక సంతానం కలుగుతుందని స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు సైతం నమ్ముతుంటారు.

5. భక్తిభావం ఉట్టిపడే హనుమవిగ్రహం...

5. భక్తిభావం ఉట్టిపడే హనుమవిగ్రహం...

Pc

ఈ దేవాలయం ఆవరణంలోనే భక్తిభావం ఉట్టిపడే హనుమంతుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం సరిగ్గా గరుడ విగ్రహానికి ఎదురుగా ఉంటూ ఒకదానికొకటి చూస్తున్నట్లు ఉంటాయి.

6. ఎక్కడ ఉంది...

6. ఎక్కడ ఉంది...

Pc

కర్ణాటకలోని కోలారు జిల్లా ములబాగులు తాలూకా, కోలాదేవి గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

7. ఎలా వెళ్లాలి...

7. ఎలా వెళ్లాలి...

Pc

బెంగళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలాదేవి గ్రామానికి దాదాపు 2.30 గంటల ప్రయాణం. బెంగళూరు నుంచి కోలారు చేరుకోవడానికి ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక కోలారు నుంచి కోలాదేవికి చేరుకోవడానికి కూడా బస్సులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X