Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి ఇస్కాన్ దేవాలయం: శ్రీ కృష్ణ కమల మందిరం

తిరుపతిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి ఇస్కాన్ దేవాలయం: శ్రీ కృష్ణ కమల మందిరం

తిరుపతిలో ముఖ్యంగా చూడవల్సిన ప్రదేశాల్లో ఇస్కాన్ దేవాలయం: శ్రీ కృష్ణ కమల మందిరము

తిరుపతి ఇండియాలోని పవిత్రమైన యాత్రా స్థలాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది...అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండల మీద ఉన్న వేంకటేశ్వరున్ని దర్శించుకుని వెలుతుంటారు. అయితే ఈ మహిమాన్విత ప్రదేశంలో మీరు దర్శించాల్సిన ప్రదేశాలు మరెన్నో ఉన్నాయి. కలియుగ దైవం చుట్టూ ఎన్నో మరెన్నో దర్శనీయ ప్రదేశాలు, ప్రకృతితో మమేకమయ్యి విశ్వమంతానిండి ఉన్న ఆ మహా రూపానికి దగ్గరగా మనలని తీసుకు వెళ్ళిన అనుభూతినిచ్చే ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి ఇస్కాన్ టెంపుల్ .

కలియుగంలో శ్రీకృష్ణుని కోసం అనేక దేవాలయాలు నిర్మింపబడ్డాయి. వాటిలో కొన్ని శ్రీకృష్ణ దేవాలయాలు నిత్యం భక్తులతో, యాత్రికులతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి నిత్యం కొన్ని వేలల్లో భక్తులు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి దేవాలయాలను వెళుతూనే ఉంటారు. మనం సాధారణంగా శ్రీకృష్ణుని దేవాలయాలలో శ్రీకృష్ణునితో పాటు రాధ లేదా రుక్మిణి ఉన్నవిగ్రహాలను కొలువుదీరి ఉంటాయి.

శ్రీకృష్ణుడు తరచూ వేణువు ఊదుతుంటారు కాబట్టి, వేణుమాధవా అని స్మరిస్తుంటారు. మన సృష్టికే మూల పురుషుడైన శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు తన జీవిత చరిత్రతో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ది. మరి అంతటి ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణుడు కొలువై ప్రసిద్ది చెందిన తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..

తిరుపతి పుణ్య క్షేత్రములో

తిరుపతి పుణ్య క్షేత్రములో

తిరుపతి పుణ్య క్షేత్రములో, కపిలతిర్థమ్ జలపాతం ఉన్న ప్రాంతమునకు దగ్గరలో ఇస్కాన్ కృష్ణ దేవాలయము ఉన్నది. ఇక్కడ ఈ ఆలయము ఇస్కాన్ (హరేకృష్ణ )ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయమును చాలా శ్రమపడి అందంగా తీర్చి దిద్దారు.

ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు

ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు

ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు తయారు చేసి సందర్శకులకు చూడచక్కని ప్రదేశముగా తయారు చేశారు. పండగలు పర్వదినాల్లో ఇస్కాన్ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబు అవుతాయి.

ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో

ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో

తిరుపతిలోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన శిల్పకళా సౌందర్యం సందర్శకులను మంచి అనుభూతిని కలిగిస్తాయి.

పైకప్పులు తంజావూరు శైలి కళతో

పైకప్పులు తంజావూరు శైలి కళతో

కిటికీలు కృష్ణుడి లీలల గాజు చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. పైకప్పులు తంజావూరు శైలి కళతో అలంకరించారు. ఆలయ స్తంభాలపై విష్ణుమూర్తి పది అవతారాలూ ఉంటాయి. గర్భగుడిలో చుట్టూ గోపికలతో కృష్ణుడు ఉంటాడు. ఆలయం లోపల అందమైన పూలు, కొలనులు, ఫౌ౦టైన్ లు, కృష్ణ లీల విగ్రహాల తో ఒక అందమైన పార్కు కూడా ఉంటుంది.

ప్రతి రోజూ ఆలయ దర్శనము

ప్రతి రోజూ ఆలయ దర్శనము

తిరుపతి రైల్వే స్టేషను నుండి ఆటోలో ఈ దేవాలయమునకు వెళ్ళవచ్చును. తిరుమల తిరుపతి దేవస్థానము వారు ప్రతి రోజూ ఆలయ దర్శనము యాత్రలో ఈ అలయాన్ని చూపిస్తారు.

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది. ఇక్కడ వేసవి చాలా వేడిగా వుంది అసౌకర్యంగా వుంటుంది కనుక, ఆ సమయంలో ఇక్కడికి రాకుండా వుండడం మంచిది. వర్షాలు వేసవి నుంచి ఉపశమనం ఇస్తాయి, తేలిక పాటి వర్షాలు తిరుపతి అందాన్ని ఇనుమడింప చేస్తాయి.

చూడాల్సిన ఆకర్షణలు

చూడాల్సిన ఆకర్షణలు

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు.

గోవిందరాజ స్వామి గుడి, తిరుపతి

గోవిందరాజ స్వామి గుడి, తిరుపతి

తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. 1235లో నిర్మించిన ఈ దేవాలయానికి వైష్ణవ గురువు శ్రీమద్రామానుజాచార్యులు శంఖుస్థాపన చేసారని చెప్తారు. ఈ గోపురం కాక మరో రెండు గుళ్ళ చుట్టూ బయటి ప్రాకారం వుంటుంది.

దక్షిణం వైపు గుడిలో పార్ధసారధి స్వామి విగ్రహం వుండగా ఉత్తరం వైపు గోవింద రాజ స్వామి గుడి వుంది. అలాగే ఇక్కడ మనవాల మాముని, శ్రీ చక్రాతాళ్వార్, సలాయి నాచియార్ అమ్మవారి, శ్రీ మచురకవి ఆళ్వార్, శ్రీ వ్యాసరాజ ఆంజనేయ స్వామి, శ్రీ తిరుమంగాయి ఆళ్వార్, శ్రీ వేదాంత దేశికర్ ల చిన్న చిన్న ఆలయాలు కూడా వున్నాయి.

పద్మావతీ దేవి గుడి, తిరుపతి

పద్మావతీ దేవి గుడి, తిరుపతి

తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు.

ఈ ఆలయం పద్మావతీ దేవి జననం గురించి, పద్మావతీ వెంకటేశ్వరుల పరిణయం గురించిన గాథలను చెప్తు౦ద౦టారు. తోన్దమందలాన్ని పాలించే ఆకాశ రాజు ఒక యజ్ఞ౦ చేసినప్పుడు ఆయనకు ఒక తామరపువ్వు లో దొరికిన బిడ్డను పద్మావతీ దేవి పేరిట తన కూతురుగా పెంచుకున్నాడు.

ఆవిడనే అలమేలు మంగ అని కూడా అంటారు - అంటే ప్రేమ, కరుణల నిరంతర, అక్షయ వనరు అని అర్ధం. ఆవిడ పెరిగి పెద్దదయ్యాక దైవ నిర్ణయంగా వెంకతెస్వ్హ్వార స్వామి ఆవిడను వివాహమాడారని చెప్తారు.

కపిల తీర్ధం, తిరుపతి

కపిల తీర్ధం, తిరుపతి


తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.

ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో

ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో

ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.

తిరుపతి ప్రయాణం చాలా తేలిక. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది. డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

రోడ్డు ద్వారా తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

రైలు మార్గం ద్వారా దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

వాయు మార్గం ద్వారా తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X