Search
  • Follow NativePlanet
Share
» »అల‌నాటి మ‌రాఠీల‌ సంస్కృతికి నిలువెత్తు చిహ్నం.. షిండే ఛత్రి

అల‌నాటి మ‌రాఠీల‌ సంస్కృతికి నిలువెత్తు చిహ్నం.. షిండే ఛత్రి

అల‌నాటి మ‌రాఠీల‌ సంస్కృతికి నిలువెత్తు చిహ్నం.. షిండే ఛత్రి

మ‌హ‌రాష్ట్ర పూణేలోని షిండే ఛత్రి 18వ శతాబ్దపు కమాండెంట్ మహద్‌జీ షిండేకి అంకితం చేయబడిన స్మారక చిహ్నం. షిండే 1760-1780 వరకు పీష్వాల ఆధ్వర్యంలో మరాఠీ సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశాడు.

ఇది పూణేలోని వాన్వాడి ప్రాంతంలో ఉంది. నేటికీ చెక్కుచెద‌ర‌ని అల‌నాటి మరాఠా పాలనను గుర్తు చేస్తుంది ఈ నిర్మాణం. షిండే ఛత్రిలో మహద్‌జీ షిండే మ‌ర‌ణానంత‌రం దహన సంస్కార స్థలానికి గుర్తుగా ఉన్న హాలు నిర్మించ‌బ‌డింది. ఈ ప్రదేశం పూణేలోని పురాతన ప్రదేశాలలో ఒకటిగానే కాకుండా ఈ నగరం యొక్క వారసత్వంలో ఒక భాగంగా నిలుస్తోంది.

అద్భుత నిర్మాణ శైలికి చిహ్నంగా..

అద్భుత నిర్మాణ శైలికి చిహ్నంగా..

షిండే ఛత్రి యొక్క ప్రధాన ఆకర్షణ దాని ఆక‌ర్ష‌ణీయ‌మైన నిర్మాణ శైలి అనే చెప్పాలి. ఇది భారతదేశంలోని రాజస్థాన్‌లో ఉపయోగించిన ఆధునిక నిర్మాణ‌ శైలిని ప్రతిబింబిస్తుంది. స్మారక చిహ్నం యొక్క వాస్తుశిల్పి బొంబాయికి చెందిన షాపూర్‌జీ ఎన్. చందాభోయ్ సంస్థ. దీని నిర్మాణం ఆంగ్లో-రాజస్థానీ శైలికి చెందిన‌ రెండు విభిన్న సంస్కృతుల చక్కటి సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది పసుపు ఇసుకరాయితో తయారు ఏర్పాటు చేయబడింది. అంతేకాదు, టెర్రస్ అంచున ఉన్న రాతి శిల్పాలు విశిష్ట లక్షణాలలో సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తాయి. ఎక్కువ‌గా విద్యార్థులు, చ‌రిత్ర ప్రేమికులు ఇక్క‌డకు నిత్యం వ‌స్తూ ఉంటారు.

షిండే ఛత్రి గురించి ఆసక్తికరమైన విషయాలు

షిండే ఛత్రి గురించి ఆసక్తికరమైన విషయాలు

ఈ నిర్మాణం యొక్క ఎత్త‌యిన‌ పైకప్పు భిన్న‌మైన రాతి చెక్క‌డాల‌తో అల‌నాటి అద్భుత కళాఖండాలుగా నిలిచే మూడు అంతస్తుల నిర్మాణం. అందమైన శిల్పాలతో కూడిన భవనం నిర్మాణ రూపురేఖ‌లు అభినందనీయమ‌నే చెప్పాలి. మహద్‌జీ షిండే 1974లో హాలులో శివునికి ఆలయాన్ని కూడా నిర్మించారు.

రాతి శిల్పాలతోపాటు ప‌సుపురాతి చెక్కిన‌ శిల్పాలు అధ‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా చెప్పొచ్చు. ఇక్క‌డి గర్భగుడి పునాది నల్లరాతితో చేయబడింది. స్మారక చిహ్నం అగ్నిజ్వాల‌ల‌ రంగు ఉత్ప‌న్న‌మ‌య్యేలా తలపాగా, శాలువాతో కప్పబడిన యోధుని వెండి రూపాన్ని కలిగి ఉంటుంది. ఛత్రీ హాలులోని చెక్కడాలు, పెయింటింగ్‌లతో కూడిన గ్యాలరీ చూప‌రుల మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి. ఇందులో సింధియా కుటుంబం యొక్క పెయింటింగ్స్ మరియు ఫోటోగ్రాఫ్‌లను సంద‌ర్శ‌నార్థం ఏర్పాటు చేశారు. షిండే ఛత్రి వారంలో అన్ని రోజులు తెర‌చి ఉంటుంది. ఉదయం 07:00 నుండి రాత్రి 08:00 వరకు సంద‌ర్శ‌కులను లోప‌ల‌కు అనుమ‌తిస్తారు. దీనికి ప్రవేశ రుసుము ప‌ది రూపాయిలుగా నిర్ణయించారు. న‌గ‌ర‌వాసుల‌కు వారాంతాల్లో కుటుంబ స‌మేతంగా స‌ర‌దాగా గ‌డిపేందుకు షిండే ఛత్రి స‌రైన ఎంపిక‌.

సమీపంలోని ప్రసిద్ధ ప్రదేశాలు

సమీపంలోని ప్రసిద్ధ ప్రదేశాలు

శనివార్ వాడ

దగ్దుశేత్ గణపతి

సరస్ బాగ్

లక్ష్మి రోడ్

అగా ఖాన్ ప్యాలెస్

దర్శన్ మ్యూజియం

శ్రీ బాలాజీ మందిర్

షిండే ఛత్రికి ఎలా చేరుకోవాలి

షిండే ఛత్రికి ఎలా చేరుకోవాలి

రైలు మార్గం:- షిండే ఛత్రీ నుండి పూణే రైల్వే స్టేషన్‌కు ఆరు కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. అక్క‌డి నుంచి టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

బస్సులో :- షిండే ఛత్రీకి వెళ్లాలంటే న‌గ‌రంలోని ప్ర‌ధాన బస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడి నుంచి సిటీ బస్సులో వెళ్లవచ్చు.

విమాన మార్గం:- షిండే ఛత్రి విమానాశ్రయం నుండి సుమారు 13 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. అక్క‌డి నుంచి క్యాబ్ ద్వారా చేరుకోవ‌చ్చు.

Read more about: maharashtra pune
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X