Search
  • Follow NativePlanet
Share
» »చ‌ల్ల‌ని సాయంత్ర‌పు వేళ.. చార్మినార్‌ను చూసొద్దామా?!

చ‌ల్ల‌ని సాయంత్ర‌పు వేళ.. చార్మినార్‌ను చూసొద్దామా?!

చ‌ల్ల‌ని సాయంత్ర‌పు వేళ.. చార్మినార్‌ను చూసొద్దామా?!

తెలంగాణ రాష్ట్ర‌ రాజధాని నగరం హైదరాబాద్ ఓ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. పురాతన సంప్రదాయాలు, సాంస్కృతికి చిహ్నం ఈ భాగ్య‌న‌గ‌రం. అలాంటి చారిత్ర‌క న‌గరంలో దాగిన అపురూప నిర్మాణం పాత‌బ‌స్తీలోని చార్మినార్ క‌ట్ట‌డం. సంద‌ర్శ‌కుల మ‌న‌సుదోచే ఈ అపురూప నిర్మాణ విశేషాల‌ను తెలుసుకుందాం.

ఆర్క్ డి ట్రయంఫ్ ఆఫ్ ది ఈస్ట్‌గా పిలుచుకునే చార్మినార్ ప్రతి మూలలో నాలుగు టవర్లతో అందంగా అలంకరించబడింది. ఒక్కొక్కటి నాలుగు అంతస్తులతో అన్నివైపులా ఉన్న మినార్లు 48.7 మీ ఎత్తును క‌లిగి ఉంటాయి. మొత్తంగా 56 మీటర్ల ఎత్తు, 30 మీటర్ల వెడల్పుతో ఈ చతురస్రాకార నిర్మాణం 1591లో నిర్మించబడింది. దీనిని సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా తన భార్య భాగమతి గౌరవార్థం నిర్మించారు.

చామినార్ పై అంతస్తులో చిన్న మసీదుతోపాటు 45 ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. వీటిని ఇప్పటికీ సంద‌ర్శ‌కులు ప్రత్యేకంగా శుక్రవారాల్లో సందర్శిస్తారు. సాయంత్రం వేళ‌ లైటింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

అద్భుత‌మైన నిర్మాణ శైలి..

అద్భుత‌మైన నిర్మాణ శైలి..

హైదరాబాద్‌లో స్థిరపడిన ఇరానియన్ ఆర్కిటెక్ట్ మీర్ మోమిన్ అస్త‌రాబాది చార్మినార్‌కు రూపకల్పన చేశారు. ఈ చతురస్రాకారపు స్మారక చిహ్నం నాలుగు స్తంభాలతో నేటికీ ఠీవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. చార్మినార్ యొక్క నిర్మాణ రూపకల్పన షియా తాజియాస్ నుండి ప్రేరణ పొందింది.

ఈ తాజియాలు ముహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు, కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హుస్సేన్ జ్ఞాపకార్థం నిర్మించబడ్డాయి. చార్మినార్ నాలుగువైపులా నాలుగు ప్రముఖ మార్గాలతో గ్రానైట్‌, సున్నం మోర్టార్‌తో నిర్మించారు. చుట్టూ ఉన్న నాలుగు స్తంభాలు నలుగురు ఖలీఫాలను సూచిస్తాయి. ఈ స్తంభాలు లేదా మినార్ల ఎత్తు 48.7 మీటర్లు.

ఇవి నాలుగు అంతస్తులుగా, ప్రతి అంతస్తు అద్భుత‌మై చెక్క‌డాల‌తో విభ‌జించ‌బ‌డుతుంది. చామినార్ పై అంతస్తులో హైదరాబాద్ నగరంలోని పురాతన మసీదుగా భావించే మసీదు ఉంది. ఈ స్మారక చిహ్నం పైకప్పును 149 వైండింగ్ మెట్ల ద్వారా చేరుకోవచ్చు. క‌ట్ట‌డం పైనుంచి న‌గ‌ర వీక్ష‌ణం ద్వారా ఓ సుంద‌ర దృశ్యం ఆవిష్క్ర‌త‌మ‌వుతుంది.

చార్మినార్‌పై కుతుబ్ షాహీ భవనాల సంతకం మూలాంశాలను కూడా గమనించవచ్చు. ఒక్కో స్తంభాన్ని కట్టిన తీరు చూస్తే అది తామరపువ్వులా కనిపిస్తుంది. మినార్‌లతో పోల్చినప్పుడు నిర్మాణం చుట్టూ ఉన్న తోరణాలు కొద్దిగా తక్కువగా కనిపిస్తాయి. 1889 సంవత్సరంలో నాలుగు వైపులా నాలుగు గడియారాలు జోడించారు.

ప్రవేశ రుసుము మరియు సమయాలు

ప్రవేశ రుసుము మరియు సమయాలు

చార్మినార్ ప్రవేశ రుసుము భారతీయ సందర్శకులకు రూ.5, ఇతర దేశాలకు చెందిన పర్యాటకులకు ఒక్కొక్కరికి రూ.100 ఉంటుంది. చార్మినార్ సంద‌ర్శ‌న‌కు ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 వరకు వారంలోని అన్ని రోజులలో అనుమ‌తి ఉంటుంది. అయితే, కుటుంబ‌స‌మేతంగా కనీసం ఒక్కసారైనా ఈ నిర్మాణాన్ని సాయంత్ర స‌మ‌యంలో చూసేందుకు ఎక్కువ‌మంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు.

ఆ స‌మ‌యం ఇక్క‌డి లైటింగ్‌తోపాటు కొన్ని అడుగుల దూరంలో ఉన్న లాడ్ బజార్ మెరుపుల‌ను వీక్షించేందుకు అనువుగా ఉంటుంది.

చార్మినార్ ఎలా చేరుకోవాలి

చార్మినార్ ఎలా చేరుకోవాలి

చార్మినార్ హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రముఖమైన సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌లో ఒకటి. కాబట్టి ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం.

ఘాన్సీ బజార్‌లోని చార్మినార్ రోడ్డును చేరుకునేందుకు నగరంలోని ప్రధాన బస్టాండ్‌లు మరియు రైల్వే స్టేషన్‌ల నుండి టిఎస్ఆర్‌టిసి అనేక బస్సులను అందుబాటులో ఉంచింది. చార్మినార్ నుంచి హైదరాబాద్ బస్టాండ్ మధ్య దూరం కేవ‌లం ఐదు కిలోమీట‌ర్లు.

Read more about: charminar hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X