Search
  • Follow NativePlanet
Share
» »చీటి రాసి పెడితే చిటికెలో మీ సమస్యలను తీర్చే శివయ్య

చీటి రాసి పెడితే చిటికెలో మీ సమస్యలను తీర్చే శివయ్య

ఉత్తరాఖండ్ లోని జాగేశ్వర మహాదేవాలయం గురించి కథనం.

భారత దేశంలో దేవాలయాల నిలయం అని చెబుతారు. ముఖ్యంతా హిమాలయాల రాష్ట్రాలుగా చెప్పబడే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో పురాణ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఎన్నో దేవాయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని దేవాలయాల పూజా విధానాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అంటు వంటి కోవకు చెందిన రెండు దేవాలయాలు ఈ కథనంలో తెలుసుకొందాం. మొదటి దేవాలయంలో భక్తులు తమ న్యాయసమస్యలను చీటీల రూపంలో రాసి దేవుడికి నివేదిస్తారు. ఫలితం కనిపించిన వెంటనే ముడుపుగా గంటలు సమర్పిస్తారు.

మరో దేవాయంలో రెండు శివలింగాలు విభిన్న పరిమాణాల్లో కనిపిస్తాయి. వీటిని మనం చేతితో కదుపవచ్చు. ఇక సుదూర ప్రాంతాల నుంచి నీళ్లను తీసుకువచ్చి ఇక్కడ దేవాలయంలోని శివలింగాన్ని అభిషేకిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే ఆకాల మృత్యు భయం పోతుందని భక్తులు నమ్ముతున్నారు. అందువల్లే దేశంలోనే కాకుండా ప్రపంపంచలోని వివిధ చోట్ల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం.

ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్

P.C: You Tube

హిమాలయ పర్వత ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని ఘరేవాల్, కుమావు ప్రాంతాలుగా విభిజించారు. ఇందులో బదరినాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి అతి ముఖ్యమైన ధార్మిక పుణ్యక్షేత్రాలు ఘరేవాల్ ప్రాంతంలో ఉన్నాయి.

కుమావు ప్రాంతంలో

కుమావు ప్రాంతంలో

P.C: You Tube

ఇక నైనిటాల్, రాణిఖేత్, జాగేశ్వర్, భాగేశ్వర్, పాతాళభువనేశ్వర్ కుమావు ప్రాంతంలో ఉన్నాయి. జాగేశ్వర్ ను దేవాలయాల సముదాయం అని పిలుస్తారు. ఇక్కడ చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 120 దేవాలయాలు ఉన్నాయి.

120 దేవాలయాల సముదాయం

120 దేవాలయాల సముదాయం

P.C: You Tube

ఈ నూట ఇరవై దేవాలయాల్లో గోలుదేవి దేవాలయం, జాగేశక్వర్ మహాదేవ్ మందిరం అత్యంత ముఖ్యమైనవి. ఉత్తరఖండ్లోని ఆల్మోడాకు నుంచి హైవేలో సుమారు 14 కిలోమీటర్ల దూరంలో చితై అనే ఊరు ఉంది. అక్కడ గోలు లేదా ఛితై దేవి దేవాలయం ఉంది.

ఘంటా దేవి అని కూడా

ఘంటా దేవి అని కూడా

P.C: You Tube

ఇక్కడ ఉన్న అమ్మవారిని శక్తి స్వరూపినిగా భావిస్తారు. ఇక భక్తులు అమ్మవారికి గంటల రూపంలో తీర్చుకొంటారు. అందువల్లే ఇక్కడ అమ్మవారిని ఘంటా దేవి అని కూడా అంటారు. అంతే కాకుండా ఇక్కడ కల్వ దేవత, గర్హ దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి.

కోర్టుకు వెళ్లలేని వారు

కోర్టుకు వెళ్లలేని వారు

P.C: You Tube

స్థానికులు గోలు దేవతను శివుని అవతారమని, కల్వ దేవతను భైరవుడని, గర్హ దేవిని శక్తి స్వరుపిణిగా భావిస్తారు. కోర్టులో తమకు అన్యాయం జరిగిందని భావించినవారు, లేదా ఆర్థిక, సామాజిక తదితర కారణాలతో కోర్టుకు వెళ్లలేనివారు తమకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ ఒక కాగితం పై రాస్తారు.

గంటలను ముడుపులుగా

గంటలను ముడుపులుగా

P.C: You Tube

అటు పై చిన్నని దారంలో దేవాలయం ప్రాంగణంలో వేలాడదీస్తారు. నిజంగా బాధితులకు శివయ్య గోలు దేవత రూపంలో సహాయం చేస్తారని, ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయని చెబుతారు. తమకు న్యాయం జరిగిన తర్వాత భక్తులు ఇక్కడ గోలు దేవతకు గంటలను ముడుపుగా చెల్లిస్తారు.

రెండున్నర లక్షలకు పైగా

రెండున్నర లక్షలకు పైగా

P.C: You Tube

ఇలా రాసిన చీటీలతో పాటు చిన్న, పెద్ద కలిపి దాదాపు రెండున్నర లక్షల ఘంటలు ఉంటాయి. ఈ చీటీలు, ఘంటల సంఖ్యను బట్టి ప్రజలకు ఈ దేవత పై ఎంత విశ్వాసం ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గోలు దేవతకు దగ్గర్లోనే 20 కిలోమీటర్ల దూరంలో జటగంటా నది వస్తుంది.

ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా

ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా

P.C: You Tube

ఇక్కడే జాగేశ్వర్ మహాదేవ మందిరంతో పాటు కుబేరుని ఆలయం, మరో చిన్న శివాలయం తదితర దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేవాలయాల సముదాయం ప్రస్తుతం ఆర్కియాలాజీకల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది.

450 ఏళ్లకు పూర్వం

450 ఏళ్లకు పూర్వం

P.C: You Tube

వీటిని నిర్మించి దాదాపు 450 ఏళ్లు అవుతోందని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడే మృత్యుంజయ మందిరం కూడా ఉంటుంది. ఇది స్వయంభూలింగం. దీని పైన కన్ను ఆకారంలో చీలిక ఉంటుంది.

ఆకాల మృత్యు భయం

ఆకాల మృత్యు భయం

P.C: You Tube

ఇ దేవాలయం గోడల పైన మృత్యుంజయ మహా మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని జపిస్తే ఆకాల మృత్యు భయం పోతుందని భక్తులు నమ్ముతారు. దేశంలో చాలా చోట్ల నుంచి నిత్యం ఇక్కడకు వచ్చి అనేక మంది భక్తులు మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటారు.

నాగేశమ్ అని కూడా

నాగేశమ్ అని కూడా

P.C: You Tube

ఈ ప్రాంగణంలో ఉన్న మరో కోవెల నాగేశమ్ దేవాలయం. దీనినే నాగనాథ్ అని కూడా పిలుస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది కూడా అని చెబుతారు. ఇక్కడ శివుడు పరమ ముఖంగా కనిపిస్తారు. అంతేకాకుండా ఇది రెండు భాగాలుగా ఉంటుంది.

అర్థనారీశ్వరుడు

అర్థనారీశ్వరుడు

P.C: You Tube

ఒక భాగం పరిమాణంలో కొంత పెద్దదగా ఉంటుంది. దీనిని శివుడి ప్రతిరూపంగం భావిస్తారు. మరో భాగం చిన్నదిగా ఉంటుంది. దీనిని పార్వతీ దేవిగా స్థానిక భక్తుల భావన అందువల్లే ఈ లింగాన్ని అర్థనారీశ్వర లింగం అని అంటారు.

యోగ నిద్రలో

యోగ నిద్రలో

P.C: You Tube

సాధారణంగా అన్ని శివాలయాల్లో శివుడు యోగ నిద్రలో ఉండి హరతి సమయంలో మాత్రమే జగరూకుడై భక్తులను అనుగ్రహిస్తాడు. అంటే ఈ పుణ్యక్షేత్రంలో సర్వకాల, సర్వావస్థల్లో శివుడు జాగ్రాదావస్థలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాడని చెబుతారు.

మంచం పై పరుపు

మంచం పై పరుపు

P.C: You Tube

అందువల్లే ఇక్కడ శివుడిని జాగేశ్వర మహాదేవ్ అని పిలుస్తారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. గర్భగుడిలో కుడివైపున పట్టు పరుపు పై సూర్యాస్తమయం తర్వాత పవళింపు సేవ చేస్తారు. ఒక మంచం పై పరుపు దాని పై చక్కగా మడత పెట్టిన దుప్పటి వేస్తారు.

దుప్పటి నలిగి ఉంటుంది

దుప్పటి నలిగి ఉంటుంది

P.C: You Tube

అయితే మరునాడు ఉదయం స్వామివారి కోవెల తెరవగానే పక్క నలిగి ఉంటుంది. రాత్రి స్వామివారు ఇక్కడకు వచ్చి నిద్రపోతాడని అందువల్ల ఇక్కడ పక్క నలిగి ఉంటుందని చెబుతారు. అదే విధంగా ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గుట్ట పై వ`ద్ధ జాగేశ్వర్ మందిరం ఉంది.

 ఈశ్వరుడు తపస్సు చేసిన ప్రాంతం

ఈశ్వరుడు తపస్సు చేసిన ప్రాంతం

P.C: You Tube

అంతేకాకుండా ఇక్కడ ఉన్న దేవాలయాల్లో దండేశ్వర్ మహాదేవ్ దేవాలయం. కోటిలింగా మహాదేవ దేవాలయాలు చూడదగినవి. ఈశ్వరుడు తపస్సు చేసిన ప్రాంతమే కోటిలింగా మహాదేవ్ దేవాలయంగా చెబుతారు.

వివిధ దేశాల నుంచి

వివిధ దేశాల నుంచి

ఈ దేవాలయంలో శ్రావణ మాసంలో జరిగే శ్రావణ మేళకు దేశ విదేశాల నుంచి భక్తులు హారవుతారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు కావళ్లలో తమ ఊరిలో ఉన్న నదుల నుంచి నీరును తీసుకువచ్చి జగేశ్వర్ లోని శివలింగానికి అభిషేకిస్తారు.

కావడి యాత్ర

కావడి యాత్ర

P.C: You Tube

అటు పై ఈ దేవాలయం దగ్గరగా ఉన్న జటగంగలోని నీటిని తీసుకువెళ్లి తమ గ్రామాల్లోని శివాలయాల్లో ఉన్న శివలింగాలను అభిషేకిస్తుంటారు. దీనిని కావడి యాత్ర అని అంటారు. ఈ యాత్ర హరిద్వార్ వరకూ జరుగుతూ ఉంటుంది.

ఢిల్లీ నుంచి 400 కిలోమీటర్లు

ఢిల్లీ నుంచి 400 కిలోమీటర్లు

P.C: You Tube

భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి జాగేశ్వర్ కి 400 కిలోమీటర్ల దూరం. ఢిల్లీ నుంచి టూరిస్ట్ బస్సులు, ప్రేవేటు టాక్సీలు, ద్వారా నేరుగా జాగేశ్వర్ కు వెళ్లవచ్చు. అదేవిధంగా ఢిల్లీ నుంచి కోఠ్ గోదాం వరకూ రైలు అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి 125 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ద్వారా జాగేశ్వర్ ను చేరుకోవచ్చు.

ఆల్మొడాలో మాత్రమే

ఆల్మొడాలో మాత్రమే

P.C: You Tube

కోఠ్ గోదాం తర్వత భోజన వసతులు మనకు అల్మొడాలో మాత్రమే దొరుకుతాయి. మధ్యలో టీ తప్ప మరేమి దొరకదు. అందువల్ల స్నాక్స్ ఏమైనా కావాలనుకొంటే కోఠ్ గోదాంలోనే కొనుగోలు చేయడం మంచిది. కోఠ్ గోదాం అంతా ఘాట్ రోడ్డు. అందువల్ల ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X