Search
  • Follow NativePlanet
Share
» » జైన మందిరాలు - జీవన విధాన ప్రతి బింబాలు!

జైన మందిరాలు - జీవన విధాన ప్రతి బింబాలు!

సుమారు 8 వ శతాబ్దంలో, కర్నాటక రాష్ట్రంలో జైన మతం బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. అనేక విహారాలు లేదా జైన మందిరాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్మించారు. కర్ణాటకలో జైన మత అభిమానులు, కదంబ, గంగ రాజులు కాగా వారి తరవాత చాళుక్యులు, రాష్ట్రకూటులు కూడా ఈ మత అభివృద్ధికి పాటు పడ్డారు. పదవ శతాబ్దంలో ఇండియా మొత్తం మీద బౌద్ధ మతం వ్యాప్తిలో వున్నపుడు, మౌర్య సామ్రాజ్య చక్రవర్తి చంద్రగుప్తుడు శ్రావనబెలగోల పట్టణంలో తన జైన బోధకుడు అయిన భద్రబాహుడి కి గొప్ప శిష్యుడు అయ్యాడు. ఆ మత వ్యాప్తికి పాటు పడ్డాడు.

ఆ రాజు జ్ఞాపకార్ధం, శ్రావనబెలగోల లో కల ఒక కొండకు చంద్రగిరి అని మరొక కొండకు ఇంద్రగిరి అని పేరు పెట్టారు. ఉత్తర కర్నాటక లో అనేక జైన మందిరాలు ఎన్నో ప్రకృతి దృశ్యాల మధ్య కనపడతాయి. జైన నిర్మాణాలలో స్తంభాలపై కల శిల్ప శైలి అద్భుతంగా వుంటుంది. ఈ మందిరాలు, చక్కని శిల్ప శైలి కలిగి అందంగా ఆకర్షణీయంగా వుండి పర్యాటకులకు కను విందు చేస్తాయి.

శ్రావణ బెలగోళ

శ్రావణ బెలగోళ

శ్రావణ బెలగోళ ఇండియా లో ప్రసిద్ధి చెందిన అతి పొడవైన ఏక శిలా విగ్రహం శ్రావణ బెలగోళ లోని గోమాతేస్వరుడి విగ్రహం. ఇది వింధ్య గిరి పర్వతాలలో కలదు. దీనిని చేరాలంటే సుమారు 600 మెట్లు ఎక్కాలి. తన విలాస వంత జీవనం వదిలి జైన సన్యాసి అయిన బాహుబలి రాజు కు నివాళిగా ఈ విగ్రహం నిర్మించారు. అతి పొడవైన ఈ విగ్రహం సమీపం నుండి చూస్తె, ప్రతి వారికి ఆశ్చర్యం, భక్తి భావాలు పుట్టక మానవు.

మూడబిద్రి

మూడబిద్రి

మూడబిద్రి పట్టణాన్ని జైనుల వారణాసి గా పిలుస్తారు. ఇది మంగళూర్ పట్టణానికి ఈశాన్యంగా 35 కి. మీ. ల దూరంలో కలదు. పశ్చిమ కనుమలలో కల ఈ ప్రదేశంలో సుమారు 18 జైన మందిరాలు కలవు. ఈ మందిరాల నిర్మాణంలో చాలా వరకు లోపలి భాగంలో మార్బుల్ బయట రాతి చెక్కడ నిర్మాణాన్ని చేసారు. చిత్రంలో చంద్రప్రభ స్వామీ బాసాడి ని చూడవచ్చు.

విస్వాశానికి మూల స్తంభాలు

విస్వాశానికి మూల స్తంభాలు

మూడబిద్రి లో కల జైన మందిరం అంటే చంద్రనాథ మందిరం సుమారు 1430 ల నాటిది. జైన శిల్ప శైలి లో ఉత్తమమైనది. దీని నిర్మాణంలో ఏ రెండు స్తంభాలు ఒకే రకంగా ఉండవనే అంశం మీకు తెలుసా ? ప్రతి పిల్లర్ కు ఒక రకమైన ఇతిహాస గాధ చెక్కారు.

కర్కాల - ఆధ్యాత్మిక అద్భుతం

కర్కాల - ఆధ్యాత్మిక అద్భుతం

రెండవ పొడవైన గోమాతేస్వరుడి విగ్రహం కర్కాల పొలిమేరలలో కలదు. 42 అడుగులు పొడవైన ఈ విగ్ర్తహాన్ని 1432 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ అనేక జైన మందిరాలు కలవు. వాటిలో చతుర్ముఖ తీర్ధంకర బాసాడి, హ్కిరియంగడ్డి నేమినాథ బాసాడి అనేకేరే పద్మావతి బాసాడి మందిరాలు ప్రసిద్ధి.

దివ్యత్వ ప్రవేశ ద్వారం

దివ్యత్వ ప్రవేశ ద్వారం

మంగళూర్ సమీపంలోని కర్కాల ప్రదేశంలో కల చాతుర్ముఖ జైన మందిరం 108 అందంగా చెక్కబడిన స్తంభాలు కలిగిన నిర్మాణం. ఈ జైన మందిరం పచ్చటి పడమటి కనుమల మధ్య తన అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీని సందర్శనలో ప్రతి ఒక్కరికి ప్రశాంతత, ఆనందం లభిస్తాయి.

పట్టదక్కాల్

పట్టదక్కాల్

ఇక్కడ కల జైన టెంపుల్ నిర్మాణాలు, చాలా మంది చరిత్రకారుల మేరకు 9 వ శతాబ్దంలో పాలన చేసిన రాష్ట్రకూట రాజుల పాలనలో వెలిశాయి. స్థానికంగా ఇక్కడ కల జైన టెంపుల్ ను జైన నారాయణ అని అంటారు. జైన మందిరాలలో ఇది అరుదైనది. ఈ మందిరం గురించి చాలా మందికి తెలియదు.

బాదామి - అయిహోలె

బాదామి - అయిహోలె

బాదామి - అయిహోలె లో కల జైన మందిరాలు రాతి గుహలలో మలచబడినవి. వీటి నిర్మాణం బాదామి చాళుక్యుల పాలనలో జరిగింది. ఈ రాతి గుహలలో నాలగవ దానిని మహావీరుడికి అంకితం చేసారు. అయిహోలె లో కల గుహ టెంపుల్ లోని గర్భ గృహంలో మహావీరుడు పద్మాసనంలో కూర్చుని వున్న పెద్ద విగ్రహం వుంటుంది.

లక్కుండి - శిల్ప కళల అభివృద్ధి

లక్కుండి - శిల్ప కళల అభివృద్ధి

కల్యాణి చాళుక్య రాజులు శిల్ప కళల అభివృద్ధికి చాలా కృషి చేసారు. లక్కుండి ప్రదేశంలోని జైన మందిరం రాణి అత్తిమబ్బే నిర్మించినది. దీని నిర్మాణంలో సాధారణ జైన మందిరాల గ్రానైట్ రాయి కాక, అత్యంత సున్నితమైన రాళ్ళను ఉపయోగించారు.

హడావల్లి - గత చరిత్ర వైభవం

హడావల్లి - గత చరిత్ర వైభవం

హడావల్లి గ్రామాన్ని చారిత్రకంగా సంగీతపుర అని అంటారు. దీనిని సంగీత కారుల స్వర్గం అంటారు. ఇక్కడ కళలు, శిల్పం బాగా అభివృద్ధి చెందాయి. హడావల్లి లో అనేక జైన మందిరాలు కలవు. అన్నిటిలోకి సాళ్వ రాజ వంశ పాలన లో 14 వ శతాబ్దం లో నిర్మించిన చంద్రనాథ బాసాడి ప్రసిద్ధి చెందినది. ఈ జైన మందిరాన్ని 24 స్తంభాలతో విజయనగర శిల్ప శైలి లో నిర్మించారు. ఇక్కడ ఇంకా అనేక చరిత్ర ప్రాధాన్యత కల జైన మందిరాలు, ప్రత్యేకించి ఉత్తర కర్నాటక లో కలవు. కర్ణాటకలో నేటికీ జైన మందిరాలు కొత్తవి నిర్మించి జైన మత అభివృద్ధికి ఆ మతస్తులు పాటు పడుతూనే వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X