Search
  • Follow NativePlanet
Share
» »జైపూర్ నగరం ... ఆకర్షణీయ అందాలు !!

జైపూర్ నగరం ... ఆకర్షణీయ అందాలు !!

భారత దేశ పర్యాటక ప్రదేశాలలో జైపూర్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు రాజరిక పాలనలోని రాజ్యాలకు రాజధానిగా ఉన్న ఈ నగరం ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర రాజధానిగా ఉంది. ఇది పాక్షిక ఎడారి ప్రాంతంలో నిర్మితమైన నగరం. ఈ నగరాన్ని క్రీ.శ. 1727లో మహారాజు రెండవ సవాయి జైసింగ్, బెంగాల్ ప్రాంతానికి సుపరిచితుడైన ప్రముఖ ఆర్కిటెక్(శిల్పి) విద్యధర్ భట్టాచార్యచే నిర్మించాడు. భారతీయ నిర్మాణశాస్త్రం అయిన శిల్పశాస్త్రం అధారంగా ఈ నగరం నిర్మించబడింది. ఇది భారత దేశ నగరాలలో కెల్లా సుందరమైన ఆకర్షణ గల ప్రదేశం. మీకు తెలుసా?ఈ నగరాన్ని "గులాబి నగరం" లేదా "పింక్ సిటి" గా పిలుస్తారని!. భారత దేశ నగరాలలో మొట్టమొదటి సారిగా వాస్తు శాస్త్రం ప్రకారం కట్టించిన నగరం కూడా ఇదే కావడం గమనార్హం!. మీరు గనక చూసినట్లయితే, హిందూ నిర్మాణ శైలికి ఒక అద్భుత ఉదాహరణ అయిన ఈ ప్రాంతాన్ని ‘పీఠపాద' లేదా ఒక ఎనిమిది భాగాల మండలం రూపంలో నిర్మించారు. "పీఠపాద" అనే తొమ్మిదవ విభాగం వాణిజ్య అవసరాల కొరకు నిర్మించబడింది. ఈ నగర నిర్మాణం రెండవ సవాయ్ జైసింగ్ యొక్క జ్యోతిషశాస్త్ర జ్ఞానం,వాస్తుశాస్త్ర జ్ఞానాన్ని తెలియజేస్తుంది.ఎందుకంటే! ఖగోళ శాస్త్రంలో చక్కటి జ్ఞానం ఉన్న సవాయి జై సింగ్ మహారాజు 9 అంకెకు ప్రాధాన్యత నిచ్చి దీనిని, దీని గుణకాలను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు. 9 అంకె 9 గ్రహాలను సూచిస్తుంది.
నగరంలో ఇరువైపులా కాలిబాటలతో నిర్మించబడిన విశాలమైనదార్లు ఉన్నాయి. నగరంలో అనేక ఆసుపత్రులు ఉన్నాయి. నగర ప్రధాన పరిశ్రమలు లోహములు మరియు పాలరాళ్ళు. జైపూర్ లోని జంతర్ మంతర్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి.

అంబర్ కోట

అంబర్ కోట

అంబర్ కోటను మాన్ సింగ్ మహారాజు, మీర్జా రాజా జై సింగ్, సవాయి జై సింగ్ దాదాపు 200 సంవత్సరాల పాటు కట్టారు. జైపూర్ ఉనికి లోనికి రావడానికి ముందు ఇది ఏడేళ్ళ పాటు కచ్చావహ పాలకుల రాజధానిగా ఉంది.మూథ సరస్సు ఒడ్డున ఉన్న ఈ కోటలో భవనాలు, మంటపాలు, సభామందిరాలు, దేవాలయాలు, ఉద్యానవనాలు ఉన్నాయి. ఏనుగు పై నుండి భవనాలను చూడటానికి పర్యాటకులకు ఏనుగు సవారీలు అందుబాటులో ఉన్నాయి. ఈ భవన సముదాయంలో శీలా మాత కు చెందిన అందమైన దేవాలయం ఉంది. దివానే ఆమ్, షీష్ మహల్, గణేష్ పోల్, సుఖ్ నివాస్, జస్ మందిర్, దిలారం బాఘ్, మోహన్ బారి అంబర్ కోట లోని ఇతర పర్యాటక ఆకర్షణలు.

Photo Courtesy:Nvvchar

జల్ మహల్

జల్ మహల్

జల మహల్, జై పూర్ లోని ఒక చిన్న సరస్సు మధ్యలో గల అందమైన భవనం. ఈ భవనాన్ని రాజులూ వారి కుటుంబాలు వారికి వేట విడిదిగా కట్టారు. సరస్సు ఒడ్డునుండి జల మహల్ ను చూడవచ్చు.

Photo Courtesy:Akinori Li

జైపూర్ సిటీ భవనం

జైపూర్ సిటీ భవనం

జైపూర్ మధ్యలో ఉన్న సిటీ భవనం పూర్వ సంస్కృతికి చెందిన ఒక ప్రముఖ ప్రాంతం. ఇది నగరంలోని పెద్ద భవనాలలో ఒకటి. ఈ అందమైన భవనాన్ని జైపూర్ రూపకర్త సవాయి జై సింగ్ మహారాజు కట్టించాడు. ఈ భవనం రాజపుత్రుల, మొఘలుల నిర్మాణ శైలుల అందమైన సమ్మేళనం.ఈ సముదాయ ప్రవేశం వద్ద ముబారక్ మహల్ (లేదా స్వాగత భవనం) ఉంది. 19 వ శతాబ్దం లో సవాయి మధో సింగ్ కట్టించిన ఈ భవనాన్ని స్వాగత ప్రాంతం గా ఉపయోగించేవారు. ప్రస్తుతం మ్యూజియంగా మారిన ఈ భవనాన్ని జైపూర్ రాజు రెండో సవాయి మాన్ సింగ్ కు అంకితం చేశారు. ఈ మ్యూజియం లో రాజులు వాడిన అనేక దుస్తుల తో బాటుగా బనారస్ పట్టు చీరలు, పష్మిన శాలువాలు ప్రదర్శనకు ఉంచారు.ఈ మ్యూజియం లో ఏనుగు దంతపు పిడిగల కత్తులు, గొలుసు కవచాలు, తుపాకులు, చిన్న తుపాకులు, ఫిరంగులు, విషపు కొన వుండే కత్తులు, మందు గుండు సామగ్రి సంచులను చూడవచ్చు. వీనిలో కత్తిరించే బాకు ప్రసిద్ధ ఆయుధం. వీనిలో కొన్ని ఆయుధాలు 15 వ శతాబ్దానికి చెందినవి.సందర్శకుల కోసం ఉదయం 9 నుండి సాయంతం 5 గంటల వరకు తెరిచి ఉంచే సిటీ భవనం ప్రవేశ రుసుము భారతీయులకు రూ.75 విదేశీ పర్యాటకులకు రూ. 300 ఉంటుంది.

Photo Courtesy:Rednivaram

ఆల్బర్టు హాల్

ఆల్బర్టు హాల్

ఆల్బర్టు హాల్ ను 1886 లో సవాయి రామ్ సింగ్ మహారాజు రూ. 4 లక్షల కరువు సహయక ప్రణాళిక లో భాగంగా కట్టించాడు. ఇది జైపూర్ లోని అందమైన రాం నివాస్ బాఘ్ దగ్గరలో ఉంది.ఈ కట్టడాన్ని సర్ స్వింటన్ జాకబ్ రూపొందించాడు. ప్రస్తుతం, ఆల్బర్టు హాల్ లోహ శిల్పాలు, చిత్రాలు, ఏనుగు దంతాలు, తివాచీలు, రంగు స్పటికాల గొప్ప సేకరణ ను ప్రదర్శించే మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. దగ్గరలో ఒక జంతు ప్రదర్శన శాల, రవీంద్ర రంగ మంచ్ ( థియేటర్) ఉన్నాయి.అల్బెర్టు హాల్ మ్యూజియం సందర్శకుల కోసం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. భారతీయులకు రూ. 20 విదేశీ పర్యాటకులకు రూ.150 లతో నామమాత్రమైన ప్రవేశ రుసుము ఉంటుంది.

Photo Courtesy:Ksheer

హవా మహల్

హవా మహల్

హవా మహల్ 1799 లో కవి రాజైన సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన ప్రసిద్ధ కట్టడం. ఇది జోహారి బజార్ సమీపంలోని ఐదు అంతస్తుల ఎరుపు, గులాబి రంగు ఇసుక రాయి భవనం. లాల్ చాంద్ ఉస్తా రూపొందించిన దీనిలో 950 కంటే ఎక్కువ కిటికీలు ఉన్నాయి. ఈ భవనాన్ని పల్చటి తెరల గుండా రాచకార్యాలు చూడటానికి స్త్రీల కోసం నిర్మించారు. ఈ భవనంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం ఉంది.

Photo Courtesy:Gryffindor

జంతర్ మంతర్

జంతర్ మంతర్

జైపూర్ లో రెండో సవాయి జై సింగ్ మహారాజు స్థాపించిన జంతర్ మంతర్ భారతదేశంలోని ఐదు అంతరిక్ష పరిశోధనా సంస్థలలో పెద్దది. ఈ పరిశోధన సంస్థను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చి "మొఘల్ కాలపు చివరలో వున్న రాజుగారి దర్బారు యొక్క ఖగోళ నైపుణ్యం, విశ్వోద్భవ శాస్త్రీయ భావనల అద్భుత ప్రదర్శన" అని పేర్కొన్నారు.ఈ పరిశోధనా సంస్థ నిర్మాణంలో నాణ్యమైన పాలరాయిని వాడారు. దానికదే సాటి అయిన రాం యంత్ర (ఎత్తులను కొలించేందుకు వాడే పరికరం) మహారాజు గారి ఖగోళ నైపుణ్యాలను సూచిస్తుంది. ఇక్కడి ముఖ్య పరికరాలలో ‘ధ్రువ', ‘దక్షిణ', ‘నారివల్య', ‘రాశివలయాస్', ‘చిన్న సామ్రాట్', ‘పెద్ద సామ్రాట్', ‘పరిశోధక స్థానం', ‘దిశా', ‘చిన్న రాం', ‘పెద్ద రాం' యంత్రం, చిన్న ‘క్రాంతి', పెద్ద ‘క్రాంతి', ‘రాజ్ ఉన్నతాంశ', ‘జై ప్రకాష్', ‘దిగంత' వంటి వాటిని చూడవచ్చు.

Photo Courtesy:Vibhijain

పండుగలు

పండుగలు

భవనాలు, కోటలతో బాటుగా ఈ ప్రాంతం అనేక ఉత్సవాలు, పండగలకు ప్రసిద్ది చెందింది. జనవరి లో నిర్వహించే జైపూర్ వింటేజ్ కార్ ర్యాలీ అటువంటి ప్రసిద్ధ సంవత్సరపు పండుగలలో ఒకటి. పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తూ ఇటీవల బాగా ప్రసిద్ది చెందిన కార్యక్రమం ఇది. వాహన ప్రియులు మెర్సిడెస్, ఆస్టిన్, ఫియట్ వంటి పాత కారు మాడల్ ల అద్భుతమైన సేకరణను చూడవచ్చు. వీటిలో కొన్ని కార్లు 1900 కు చెందినవి.

Photo Courtesy: Avinashmaurya

ఏనుగు ఊరేగింపు

ఏనుగు ఊరేగింపు

ప్రతి ఏటా జైపూర్ లో హోలీ నాడు ఇక్కడ ప్రసిద్ది చెందిన ఏనుగుల పండుగను నిర్వహిస్తారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఏనుగుల అందమైన ఊరేగింపులు ఈ ఉత్సవానికి జీవం పోస్తాయి. దీనితో బాటుగా, గంగౌర్ పండుగా కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందింది. గం-అనగా శివుడని, గౌర్-అనగా పార్వతి అనే అర్ధం ఉంది. ఈ పండుగ వైవాహిక ఆనందానికి సంకేతం కూడానూ. ఈ నగరంలో జరిగే ప్రసిద్ధ ఉత్సవాలు, పండుగలలో బాన్ గంగ ఉత్సవం, తీజ్, హోలీ, చక్సు ఉత్సవంలు ఉన్నాయి.

Photo Courtesy:Faraz Usmani

షాపింగ్ పర్యాటనలు ఇంకా...

షాపింగ్ పర్యాటనలు ఇంకా...

సాహస ప్రియులు ఒంటె స్వారి, హాట్ ఎయిర్ బెలూనింగ్, పార గ్లైడింగ్, పర్వతారోహణ వంటి క్రీడలతో వినోదించవచ్చు. అన్వేషణ ఔత్సాహికులు కరౌలి, రణతంబోర్ నేషనల్ పార్కు వంటి వాటికి విహార యాత్రగా వెళ్ళవచ్చు.జైపూర్ లో షాపింగ్ పర్యాటకులకు నచ్చుతుంది. ఇక్కడ అనేక మార్కెట్లు ఇతర వస్తువులతో బాటు పురాతన వస్తువులు, ఆభరణాలు, తివాచీలు, కుండలు, రత్నాలు విస్తృత శ్రేణిలో అందిస్తున్నాయి. పర్యాటకులు హస్తకళా కృతులు, కళాఖండాలు, దుస్తులు, పేరుందిన దుస్తులు ఎం ఐ రోడ్డు నుండి కొనుగోలు చేసుకోవచ్చు. జైపూర్ లోని స్థానిక మార్కెట్ లలో కొనుగోలు చేసినప్పుడు బేరసారాలు అవసరం లేకుంటే అంతే!

Photo Courtesy:Rolling Okie

విందులు

విందులు

ఈ ప్రాంతం ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి తో చేసిన రుచికరమైన కారపు వంటకాలకు ప్రసిద్ది చెందింది. దాల్ బాటి - చూర్మా, ఉల్లి కచోరి, కబాబ్, ముర్గు కో ఖాటో, అచారి ముర్గు ఈ నగరపు ప్రసిద్ధ వంటకాలలో కొన్ని. వీధి వంటలకు ప్రసిద్ది చెందిన నెహ్రు బజార్, జోహరి బజార్లలో భోజన ప్రియులు ఈ వంటకాలను రుచి చూడవచ్చు. ఈ ప్రాంతపు స్థానిక మిఠాయిలైన ఘేవర్, మిష్రి కోవ, కోవా కచోరి దేశవ్యాప్తంగా ప్రసిద్ది పొందాయి.

Photo Courtesy:Onef9day

విమాన మార్గం

విమాన మార్గం

ఈ నగరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో జైపూర్ అంతర్జాతీయ విమానశ్రయ౦గా పిలువబడే సంగానేర్ విమానాశ్రయం ఉంది. ముంబాయి, చండీఘడ్, ఢిల్లీ, హైదరాబాదు బెంగళూర్ వంటి ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఇక్కడ నుండి నిరంతరం విమానాలు ఉన్నాయి.

Photo Courtesy: Sranjanm2002

రైలు మార్గం

రైలు మార్గం

జైపూర్ రైల్వే స్టేషన్ నుండి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు ఉన్నాయి.

Photo Courtesy: Arjuncm3

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

పర్యాటకులకు కొన్ని రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్ ఎస్ ఆర్ టి సి ) బస్సులు భారతదేశ ప్రధాన నగరాల నుండి లభిస్తాయి. న్యూ ఢిల్లీ నుండి నేరుగా జైపూర్ వరకు ఆర్ ఎస్ ఆర్ టి సి బస్సులు ఉన్నాయి. నగరంలో పర్యటించాలనుకంటే సిటి బస్సు సౌకర్యం ఉత్తమమైనది!

Photo Courtesy: LRBurdak

వాతావరణం

వాతావరణం

ఏడాది పొడవున ఈ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణం ఉంటుంది. వేసవికాలం విపరీతమైన వేడితో ఉండగా, శీతాకాలంలో గడ్డ కట్టించే చలి ఉంటుంది. వేసవికాలంలో జైపూర్ ను సందర్శించే పర్యాటకులు తేలికైన దుస్తులు, టోపీలు, సన్ స్క్రీన్ లోషన్, తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మార్చి నుండి అక్టోబర్ మధ్య ఉన్న సమయం ఈ పింక్ సిటీ సందర్శనకు ఉత్తమమైనది,సౌకర్యవంతమైనది కూడానూ!

Photo Courtesy:McKay Savage

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X