Search
  • Follow NativePlanet
Share
» »బంగారు వర్ణంలో దగదగ మెరిసిపోతున్నఈ గోల్డెన్‌ ఫోర్ట్‌ ను ఒక్క సారి చూసొద్దామా..?!

బంగారు వర్ణంలో దగదగ మెరిసిపోతున్నఈ గోల్డెన్‌ ఫోర్ట్‌ ను ఒక్క సారి చూసొద్దామా..?!

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతుందీ కోట. అందుకే ఈ కోటను సోనార్‌ ఖిలా, గోల్డెన్‌ ఫోర్ట్‌ అని పిలుస్తుంటారు. మరి ఇలాంటి కోట ఎక్కడ ఉంది, ఆ కోట విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్ లోని థార్ ఎడారిలో ఉన్న అతి పెద్ద కోట ఇది. కోట చుట్టూ ఇళ్లు, దేవాలయాలు, షాపులు , రెస్టారెంట్లతో చిన్న పట్టణం ఉంది. ఇది 1156లో రాజ్ పుత్ వంశానికి చెందిన రాజు రావల్ జైసల్ ఈ కోటను నిర్మించారు. ఈ కోట గోడలను పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు పడి ఆ గోడలు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటాయి. అందుకే ఈ కోటను గోల్డెన్ ఫోర్ట్ అని పిలుస్తారు.

శత్రదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట గోడ

శత్రదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట గోడ

250 అడుగుల ఎత్తులో ఉన్న కోట పట్టణంలో ఎక్కడి నుండి చూసినా కనబడుతుంది. శత్రదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట గోడ 30 అడుగుల ఎత్తు కలిగి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. జైసల్మేర్ సందర్శించే వారు రాజ్ పుత్ శైలిలో నిర్మించిన ఈ కోటలోపలి నిర్మాణాల సౌందర్యం చూసి తీరాల్సిందే.

PC: Manoj Vasanth

ఈ కోటనుత్రికుట్ ఘర్ అని కూడా పిలుస్తారు

ఈ కోటనుత్రికుట్ ఘర్ అని కూడా పిలుస్తారు

మేరు ' అనే పర్వతం మీద కోటను , భవనాలను, ' త్రికూట ' పర్వతం మీద నిర్మించి రాజభవనాలను త్రికుట్ ఘర్ అని కూడా పిలుస్తారు. త్రికుట కొండలపై త్రిభుజాకారంలో నిర్మించడంతో ఆ పేరు స్థిరపడిందని స్థానికులు చెబుతుంటారు.

కోట అంటే మనుష్యులు నివసించని కోటలు చూస్తుంటాం కానీ

కోట అంటే మనుష్యులు నివసించని కోటలు చూస్తుంటాం కానీ

కోట అంటే మనుష్యులు నివసించని కోటలు చూస్తుంటాం కానీ ఈ కోటలో నేటీకీ జైసల్మేరు జనాభాలో మూడో వంతు ఈగోడల మధ్య వున్న నగరంలో నివసిస్తున్నారు. పెద్ద కోటగా ఉన్న ఈ గోల్డెన్ ఫోర్ట్ ముఖద్వారం నుండి లోనికి వెళితే కుడిచేతి వైపు రాజభవనాలు, ఎడమ చేతి వైపు మందిరాలు కనబడుతాయి.

ల ఈ కోటను సోనార్ ఖిలా అని కూడా పిలుస్తుంటారు.

ల ఈ కోటను సోనార్ ఖిలా అని కూడా పిలుస్తుంటారు.

ఈ కోట అంతా బంగారు రంగు ఇసుక రాయితో నిర్మించడం వల్ల ఈ కోటను సోనార్ ఖిలా అని కూడా పిలుస్తుంటారు. ఈ కోట ఉదయపు సూర్యకాంతిలో సింహం జూలు రంగులోనూ , అస్తమించే సూర్యకాంతిలో తేనె రంగులోకి మారుతుండడంతో ఈ కోటను రంగులు మారే కోట అని కూడా అంటుంటారు.

PC: SolReyes

అప్పటి రాజులకు ఈ కోటను జయించాలనే ధ్యేయం

అప్పటి రాజులకు ఈ కోటను జయించాలనే ధ్యేయం

ఢిల్లీ నుంచి అరేబియా పెర్షియా , ఈజిప్టు , దక్షిణ ఆఫ్రికా దేశాలకు వెళ్లే వాణిజ్య మార్గం ఈ దేశం గుండా ప్రయాణించడం వల్ల అప్పటి రాజులకు ఈ కోటను జయించాలనే ధ్యేయం వుండేది. 1276లో ఈ కోటను రాజా జెట్సి ఢిల్లీ సుల్తానుల నుంచి రక్షించే ఉద్దేశ్యంతో కోటను మూడు సురక్షా వలయాలతో పటిష్టం చేశాడు.

PC: arunpnair

కోటలోని రాణీవాసపు కాంతలు

కోటలోని రాణీవాసపు కాంతలు

1500 అడుగుల పొడవు 750 అడుగుల వెడల్పు 15 అడుగుల ఎత్తు వున్న గోడను నిర్మించాడు. మొదటి గోడ రెండవ గోడలకు మధ్య సైనికుల మొత్తం 4000 మంది సైనికులను 56 చిన్న చిన్న సమూహాలుగా మరుగుతున్న నూనె, నీళ్లు, రాళ్లతో తయారుగా వుంటారు . రెండవ మూడవ గోడల మధ్య విషనాగులు తిరుగుతూ వుండేటట్లు యేర్పాటు చేసారు . పదమూడవ శతాబ్దంలో అల్లావుద్దీను ఖిల్జీ ఎనిమిది సంవత్సరాలు సాగించిన పోరులో కోట పూర్తిగా ద్వంసం చెయ్యబడింది. కోటలోని రాణీవాసపు కాంతలు ' జవ్హర్ ' ( ఆత్మాహుతి ) చేసుకున్నారు.

PC: Suresh Godara

1306లో ఈ కోట 'రావల్' ల పరిపాలనలోనికి వచ్చింది

1306లో ఈ కోట 'రావల్' ల పరిపాలనలోనికి వచ్చింది

1306లో ఈ కోట 'రావల్' ల పరిపాలనలోనికి వచ్చింది. 16 వ శతాబ్దంలో బాబరు చేతిలో ఓటమి పాలై మొఘల్ పరిపాలనలోకి వచ్చింది. అప్పుడు కూడా రాణీవాసపు స్త్రీలు ఆత్మాహుతి చేసుకున్నారు . ఈ కోట చరిత్రలో ఇది రెండవ 'జవ్హర్ ' చర్య . బాబరు నుంచి వంశపారంపర్య హక్కుగా అక్బరు పరిపాలనలోకి వచ్చింది. రావల్ ల రాజపుత్రికని అక్బరు పరిణయమాడడంతో మొగలులకు రావల్ ల మధ్య సంధి జరిగి యుద్ధాలకు తెరపడింది. తరువాత' ఈస్ట్ యిండియా కంపెనీ ' చేతులలోకి వెళ్లింది. స్వాతంత్ర్యం వచ్చేక దేశ బద్రతా ద్రుష్ట్యా వాణిజ్య మార్గాన్ని మూసివెయ్యడం జరిగింది.

ఇప్పటికీ ఈ కోటలోపల సుమారు నాలుగువేల జనాభా

ఇప్పటికీ ఈ కోటలోపల సుమారు నాలుగువేల జనాభా

ఇప్పటికీ ఈ కోటలోపల సుమారు నాలుగువేల జనాభా బ్రాహ్మణ, దరోగా జాతివారు నివసిస్తున్నట్లు అంచనా. జైసల్మేరు ప్రపంచ పర్యాటక పటంలో ముఖ్యమైనదిగా గుర్తింపబడగానే పర్యాటకులు సౌకర్యార్దం హోటల్స్ కట్టవలసి రావడంతో నగరం కోట గోడలనుంచి బయటకు రావలసిన వచ్చింది.

PC: Adrian Sulc

 ఈ కోటకు నాలుగు ప్రవేశ ద్వారాలు

ఈ కోటకు నాలుగు ప్రవేశ ద్వారాలు

ఈ కోటకు నాలుగు ప్రవేశ ద్వారాలు వున్నాయి . ముఖ్యద్వారం దగ్గర పెట్టిన ఫిరంగిని చూడొచ్చు . కోట చుట్టుపక్కల ప్రదేశం చాలా రద్దీగా వుంటుంది . ఈ ప్రాంతాలలో ఆటో ప్రయాణం సులువుగా వుంటుంది . సోనార్ ఖిల్లా లో ముఖ్యంగా చూడవలసినవి ' త్రికూట భవనము , జైనమందిరము , లక్ష్మీనాథ్ మందిరము యివికాక వ్యాపార వేత్తల భనవాలు .

. ఈ కోటలో మొత్తం ఏడు జైనమందిరాలు

. ఈ కోటలో మొత్తం ఏడు జైనమందిరాలు

కోటలోకి ప్రవేశించగానే ఎడమవైపున రాజభవనాలు , కుడి చేతివైపున జైన , లక్ష్మీనాధ్ మందిరాలు కొన్ని అడుగుల దూరంలో వుంటాయి . ఈ కోటలో మొత్తం ఏడు జైనమందిరాలు వున్నాయి . ఇందులో పార్శనాథుని మందిరం పెద్దది. చంద్రప్రభు , శీతలానాథుడు , కుంటునాధుడు , శాంతినాథుడు మందిరాలు వున్నాయి. జైనులకు ఇది పవిత్రస్థలం .

పాలరాతితో నిర్మించిన మహారావల్ ప్యాలెస్

పాలరాతితో నిర్మించిన మహారావల్ ప్యాలెస్

పాలరాతితో నిర్మించిన మహారావల్ ప్యాలెస్ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. రాజులు నివాస మందిరాలుగా ఉపయోగించుకున్న జవహర్ ప్యాలెస్ నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. యునెస్కో ఈ కోటను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X