Search
  • Follow NativePlanet
Share
» »వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?

వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?

రాజస్థాన్ లోని చతుర్ దాస్ మహారాజ్ మందిరానికి సంబంధించిన కథనం.

ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లడం సాధారణం. అయితే ఆ వ్యాధి నయం కాదని తెలిసినప్పుడు దైవం పై భారం వేసి అనేక దేవాలయాల చుట్టూ తిరుగుతాం. మన భారత దేశంలో దేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు అయితే మరింత భక్తి శ్రద్ధలతో ఆ దేవతలను పూజిస్తారు. ముఖ్యంగా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అయితే మరింత శ్రద్ధతో మనం దేవుళ్లను పూజిస్తూ వస్తాం. వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నా కొన్ని వ్యాధులకు చికిత్స ఇప్పటికీ కనుగొనలేకపోతున్నారు. అంటువంటి వ్యాధే పక్షవతం. ఈ వ్యాధి వచ్చినవారిలో చాలా మంది దేవుడి పై భారం వేస్తారు. అలా వైద్యుల చికిత్సకు లొంగని పక్షవాతాన్ని కూడా పూర్తిగా నయం చేసే ఓ దేవాలయం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

ఉచితం...

ఉచితం...

P.C: You Tube

పక్షవాతం వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అటువంటి వ్యాధులతో బాధపడేవారు ఏడు రోజుల పాటు ఈ దేవాలయంలో ఉండాలి. ఉండటానికి వసతి, భోజనం కూడా లభిస్తుంది. అంతా ఉచితమే.

భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారాభారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా

ప్రధాన మంటపంలో కూడా

ప్రధాన మంటపంలో కూడా

P.C: You Tube

ప్రస్తుతం ఈ దేవాలయానికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ప్రత్యేక గదులు దొరకడం చాలా కష్టం. అయితే ఒక పెద్ద మంటపం ఉంటుంది. ఆ మంటపంలోనే మనం వసతిని ఏర్పాటుచేసుకోవచ్చు.

నమ్మకం..

నమ్మకం..

P.C: You Tube

చాలా మందికి ఇది మూడ నమ్మకంగా తోచవచ్చు. అయితే చాతా మంది భక్తులు తమకు పూర్తిగా వ్యాధి తగ్గిన తర్వాత ఈ దేవాలయానికి వచ్చి అనేక కానుకలు ఇచ్చి వెలుతూ ఉంటారు. అందువల్ల నమ్మకం ఇక్కడ ప్రధానంగా చెబుతారు.

500 ఏళ్ల క్రితం

500 ఏళ్ల క్రితం

P.C: You Tube

ఇందుకు సంబందించిన కథనం ప్రకారం దాదాపు 500 ఏళ్ల క్రితం ఒక ముని ఇక్కడికి వచ్చాడు. అతడు తన దగ్గరకు వచ్చే భక్తుల రోగాలను నయం చేస్తుండేవాడు. ఆ సన్యాసి సమాధిని కూడా ఈ దేవాలయంలో చూడవచ్చు. ఈ సమాధి చుట్టూ ప్రతి రోజూ ఏడు ప్రదిక్షిణాలు చొప్పున ఏడు రోజుల పాటు చేస్తే వ్యాధి నయమవుతుందని చెబుతారు.

ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తిముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తి

మంగళహారతి

మంగళహారతి

P.C: You Tube

ప్రదిక్షిణాల తర్వాత అక్కడ మంగళహారతి ఇస్తారు. ఆ మంగళహారతిని తీసుకున్నవారు. కాలు చెయ్యి పనిచేయని వారికి కొద్ది కొద్దిగా కాళ్లు, చేతులు స్వాధీనంలోకి రావడం కనిపిస్తుంది. అంతే కాకుండా మాటలు కోల్పోయిన వారు కూడా కొద్ది కొద్దిగా మాట్లాడటం చూడవచ్చు.

డబ్బును ఆశించరు

డబ్బును ఆశించరు

P.C: You Tube

ఇక్కడ భక్తుల నుంచి ఎటువంటి డబ్బును నిర్వాహకులు తీసుకోరు. అయితే వ్యాధి నయమైన తర్వాత వారు తమకు తోచిన రీతిలో ఆలయ అభివ`ద్ధికి పాటు పడవచ్చు. ఇలా వచ్చిన కానుకలతోనే ఇక్కడికి వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.

రాజస్థాన్ లో

రాజస్థాన్ లో

P.C: You Tube

ఈ దేవాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని నాగోర్ జిల్లాలో దేగాన్ అనే మండలంలో బుడాటి అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ దేవాలయాన్ని చతుర్ దాస్ జీ మందిరం అని పిలుస్తారు. అత్యంత ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. వీరిలో 200 నుంచి 250 మంది పక్షవాతంతో బాధపడేవారే. ఉంటారు.

ప్రవేశ రుసుం లేదు

ప్రవేశ రుసుం లేదు

P.C: You Tube

చతుర్ దాస్ జీ మహారాజ మందిరానికి ఎటువంటి ప్రవేశ రుసుం లేదు. ఈ దేవాలయం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. అనేక ఆసుపత్రులకు వెళ్లి పక్షవాతం నయం కానివారు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

జైపూర్

జైపూర్

P.C: You Tube

ఈ దేవాలయానికి దగ్గరగా జైపూర్ విమానాశ్రయం ఉంది. జైపూర్ నుంచి ఈ దేవాలయానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. సుమారు 5 నుంచి 6 గంటల ప్రయాణం తర్వాత ఈ దేవాలయానికి చేరుకోవచ్చు.

కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటాకొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X