Search
  • Follow NativePlanet
Share
» »జిమ్ కార్బెట్ జాతీయ పార్కు, నైనిటాల్ !

జిమ్ కార్బెట్ జాతీయ పార్కు, నైనిటాల్ !

భారతదేశంలో ప్రాచీనమైనది మరియు అత్యంత ప్రాముఖ్యమైనది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ దగ్గరలో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇక్కడి ప్రపంచము నలుమూల నుండి పర్యాటకులు వస్తుంటారు.

By Mohammad

ఎక్కడ ఉంది ? - కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాంచల్, నైనిటాల్ జిల్లాలో రాంనగర్‌లో ఉంది.

విస్తీర్ణం : 520 చ.కి.మీ.

ఏమేమి చూడవచ్చు : 585 కంటే ఎక్కువ స్థానిక మరియు వలస పక్షుల జాతులు, 33 సరీసృప జాతులు, ఏడు యాంఫిబియాన్ జాతులు, ఏడు మత్స జాతులు మరియు 37 తూనీగ జాతులు, బెంగాల్ పులులు, ఎద్దులు, ఏనుగులు, చిరుత పులులు, అడవి పిల్లులు, బార్కింగ్, సాంబార్, హోగ్, బ్లాక్ బక్ మరియు చిటాల్, స్లోత్ మరియు హిమాలయ నల్లని ఎలుగుబంట్లు, ముంగీస, ఒట్టర్‌లు, పసుపు గెడ్డం గల మార్టెన్‌లు, ఘోరాల్, లాంగుర్ మరియు రెసస్ కోతులు, రాత్రివేళలో గుడ్లగూబలు మరియు నైట్‌జార్‌ లు మొదలుగునవి చూడవచ్చు.

ఇది కూడా చదవండి : ఎవరికీ తెలియని ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ లు !!

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలోని పురాతన జాతీయ పార్క్. ఈ ఉద్యానవనం హాయిలే నేషనల్ పార్క్‌లో 1936 లో స్థాపించబడింది. ఉత్తరఖాండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఈ ఉద్యానవనం నశించిపోతున్న భారతదేశపు బెంగాలీ పులికి ఒక సంరక్షక ప్రాంతంగా వ్యవహరించబడుతుంది, ఇది ఒక భారతీయ వన్యప్రాణుల సంరక్షణ చొరవ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ప్రధాన అంశం సురక్షిత మనుగడగా చెప్పవచ్చు.

టైగర్ రిజర్వ్

టైగర్ రిజర్వ్

కార్బెట్ చాలాకాలంగా పర్యాటకులు మరియు వన్యప్రాణులను ఇష్టపడేవారికి ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా ఉంది. పర్యాటక కార్యకలాపాలు కార్బెట్ టైగర్ రిజెర్వ్‌లోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అనుమతించబడ్డాయి.

చిత్రకృప : netlancer2006

పర్యాటకుల తాకిడి

పర్యాటకుల తాకిడి

ఇటీవల సంవత్సరాల్లో, దీనిని సందర్శించే ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం, ప్రతి సీజన్‌లోనూ భారతదేశం మరియు ఇతర దేశాల నుండి ఈ ఉద్యానవనాన్ని సందర్శించడానికి 70,000 కంటే ఎక్కువమంది సందర్శకులు విచ్చేస్తున్నారు.

చిత్రకృప : Prashant Ram

జంతు జాలము

జంతు జాలము

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది సాహసాలను ఇష్టపడే మరియు వన్యప్రాణుల సాహస ప్రియులకు ఒక స్వర్గంగా చెప్పవచ్చు. కార్బెట్ నేషనల్ పార్క్ 520 చ.కి.మీ.విస్తరించబడి ఉన్నది.

చిత్రకృప : Soumyajit Nandy

పార్కు

పార్కు

ఇది సముద్ర తీరానికి 1,300 అడుగుల నుండి 4,000 అడుగుల ఎత్తులో ఉంది. కార్బెట్ నేషనల్ పార్క్‌లో శీతాకాలంలో రాత్రివేళల్లో చల్లగా ఉంటుంది కాని ఆ సమయంలో పగటి వేళలు చాలా ప్రకాశవంతంగా మరియు వేడిగా ఉంటాయి.

చిత్రకృప : Rohit Varma

పక్షుల సంపద

పక్షుల సంపద

దట్టమైన ఆర్ద్ర ఆకులురాల్చే అడవి ప్రధానంగా సాల్, హాల్డు, పిపాల్, రోహిణీ మరియు మామిడి చెట్లను కలిగి ఉంది. ఈ ప్రాంతం 110 వృక్ష జాతులు, 50 క్షీరద జాతులు, 580 పక్షి జాతులు మరియు 25 సరీసృప జాతులకు నివాసంగా ఉంది.

చిత్రకృప : Ssaurism

ఢికాలా

ఢికాలా

ఇది కార్బెట్‌లోని పాట్లీ డన్ లోయ చివరిలో ఉన్న పేరు గాంచిన గమ్యంగా చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక విశ్రాంతి గృహం ఉంది. ఢికాలా నుండి, లోయ యొక్క అత్యద్భుతమైన ప్రకృతి వీక్షణను ఆస్వాదించవచ్చు.

చిత్రకృప : Vib.hu

గార్జియా ఆలయం

గార్జియా ఆలయం

ఇది కోసీ నదీతీరాన, రాంనగర్ పట్టణం నుండి సుమారు 14 కిమీల దూరంలో ఉంది. కార్తీక పూర్ణిమ నాడు, ఒక జాతర నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలో గార్జియా దేవి పూజలు అందుకుంటుంది.

చిత్రకృప : Anni in

రాణిఖెట్

రాణిఖెట్

ఇది ఉత్తరాంచల్‌లోని అల్మోరా నగరంలో ఉన్న అందమైన పర్వత ప్రాంతాల్లో ఒకటి. పర్యాటకులు ఈ స్థలం నుండి భారతీయ హిమాలయాల యొక్క అద్భుతమైన వీక్షణలను ఆస్వాదించవచ్చు. ఈ పర్వత ప్రాంతంలో డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు భారీ హిమపాతం ఉంటుంది.

చిత్రకృప : Mrneutrino

ఏనుగు సవారీ

ఏనుగు సవారీ

ఈ గంభీరమైన జంతువుపై సవారీ కార్బెట్ నేషనల్ పార్క్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. ఒక ఏనుగుపై మహారాజు వలె కూర్చుని, పులులు లేదా అడవి ఏనుగుల మందలను చూడటానికి పచ్చికబయళ్లు మరియు అరణ్యాల్లోకి ప్రవేశిస్తారు. రోజు రెండుసార్లు, ఏనుగు సవారీ ఏర్పాటు చేయబడుతుంది, ఇది ఢికాలా నుండి ఉదయాన మరియు మధ్యాహ్న సమయాల్లో ప్రారంభమవుతుంది.

చిత్రకృప : Pediddle

అనువైన సమయం

అనువైన సమయం

పర్యాటకులు ఉద్యానవనంలో నడవడానికి అనుమతించబడరు, కాని ఒక గైడ్‌తో మాత్రమే ఉద్యానవనంలో సుదూర ప్రయాణాలకు వెళ్లడానికి అనుమతించబడతారు. ఈ ప్రాంతం శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది, కనుక శీతాకాల సీజన్‌లో ప్రయాణించే పర్యాటకులు అవసరమైన వస్తువులను తీసుకునిపోవాలి.

సందర్శనకు సరైన సమయం: నవంబరు మధ్యకాలం నుండి జూన్ మధ్యకాలం వరకు.

చిత్రకృప : Dushyant Kaushik

కలాగార్ డ్యామ్

కలాగార్ డ్యామ్

ఈ ఆనకట్ట జిమ్ కార్బెట్ అభయారణ్యానికి నైరుతిలో ఉంది. ఇది పక్షులను చూడటానికి ఉత్తమ స్థలాల్లో ఒకటి. శీతాకాలంలో పలు వలస పక్షులు ఇక్కడకి చేరుకుంటాయి.

చిత్రకృప : Dushyant Kaushik

వసతి సదుపాయాలు

వసతి సదుపాయాలు

పార్క్ లో వసతి సౌకర్యాలు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉన్నాయి. ధికాల ఫారెస్ట్ లాడ్జ్, ఇక్కడి హోటళ్ళ లో ఒకటి. హోటళ్ళను ఆన్లైన్ లో గానీ, అక్కడికి వెళ్ళి గానీ బుక్ చేసుకోవచ్చు.

చిత్రకృప : HRUDANAND CHAUHAN

ఇలా చేరండి

ఇలా చేరండి

రామ్ నగర్ అనే చిన్న పట్టణం పార్క్ చేరుకోవటానికి ఉత్తమమైనది. ఈ పట్టణం బస్సు, రైలు మార్గాలతో చక్కగా కనెక్ట్ చేయబడింది. ఇక్కడికి ఢిల్లీ, మొరాదాబాద్, నైనిటాల్, బరేలి తదితర ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్ళు వస్తుంటాయి. కనుక పర్యాటకులు రాంనగర్ చేరుకొని అక్కడి నుంచి అర్ధగంటలో పార్క్ చేరుకోవచ్చు. రాంనగర్ రైల్వే స్టేషన్ నుండి పార్క్ 15 కి. మీ ల దూరంలో ఉన్నది.

చిత్రకృప : Deepti Dhamal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X