Search
  • Follow NativePlanet
Share
» »కాబిని - ఈ ప్రాంత సందర్శన మరవకండి !!

కాబిని - ఈ ప్రాంత సందర్శన మరవకండి !!

కాబిని లో తప్పక సందర్శించవలసినది ఏనుగుల క్యాంప్. ఈ ప్రదేశంలో ఏనుగులు అధికంగా సంచరిస్తాయి. వసతికై జంగల్ రిసార్ట్ వంటివి కలవు.

By Mohammad

పర్యాటక స్థలం : కాబిని

రకం : అభయారణ్యం, నేషనల్ పార్క్

అందిస్తున్న సౌకర్యాలు : బోట్ సఫారీ, వెహికల్ సఫారీ, కొరకిల్ సఫారీ, నేచర్ వాక్, ఈవినింగ్ ఆక్టివిటీస్, నైట్ ట్రైల్స్

కర్నాటకలోని కాబిని ప్రాంతం వన్య జీవులకు ప్రసిద్ధి గాంచింది. ఇది నాగర్ హోలే అటవీ ప్రాంతంలో ఒక భాగం. బెంగుళూరుకు 163 కి.మీ. దూరంలో ఉన్న ఈ పర్యాటక స్ధలానికి సందర్శకులు ఎంతో ఇష్టంగా వస్తారు. కాబిని అటవీ ప్రాంతాన్ని అక్కడ కాబిని నది ప్రవహిస్తుండటం చేత, కాబిని పర్యాటక స్ధలంగా పేరు పెట్టారు.

ఇది కూడా చదవండి : బేలూరు శిల్పాలు ... అద్భుత రూపాలు !!

నాగర్ హోల్ అటవీ ప్రాంతానికి ఇది ఆగ్నేయంగా ఉంది. సుమారు 55 ఎకరాల ప్రదేశం విస్తరించి దట్టమైన అడవులు, అనేక ఎత్తులు, పల్లాలు, సరస్సులు, ప్రవాహాలు కలిగి రమణీయమైన ప్రదేశంగా చెప్పబడుతుంది.కాబిని డ్యామ్ నాగర్ హోల్ ప్రాంతాన్ని బండిపుర అటవీ ప్రాంతాన్ని వేరు చేస్తుంది.

అటవీ ప్రాంతం

అటవీ ప్రాంతం

నాగర్ హోల్ అటవీ ప్రాంతంలో పచ్చటి ఆకులు, మొక్కలు తిని జీవించే జంతుజాలం అధికంగా ఉంది. వాటిలో ఏనుగుల సముదాయాలు ప్రత్యేకం.

చిత్రకృప : Vjgeorgeinn

ఆసియా ఏనుగులు

ఆసియా ఏనుగులు

ఈ ప్రాంతంలో ఆసియా ఏనుగులు అధికంగా ఉంటాయి. ఏనుగు శాకాహారి. అధికంగా ఆకులను, కొమ్మలను తింటుంది. కనుక వాటికి ఆహారం విశేషంగా దొరుకుతున్న కారణంగా అక్కడ అవి అధికంగా పెరుగుతాయి.

చిత్రకృప : Vjgeorgeinn

వన్య జంతువులు

వన్య జంతువులు

లేడి, దుప్పి, జింకలు, సంభార్, అటవీ పందులు, కోతులు ఎన్నో కూడా ఉంటాయి. వీటిని ఆహారంగా తింటూ మరి కొన్ని జంతువులైన పులులు, చిరుత పులులు, వేట కుక్కలు వంటివి కూడా ఈ ప్రాంతంలో పెరుగుతాయి.

చిత్రకృప : vaidyanathan

స్వర్గం

స్వర్గం

అడవిలో సఫారిపై వెళితే, అనేక జంతువులను దగ్గరనుండి చూడవచ్చు. కాబినిలో 300 రకాల పక్షి జాతులు కూడా ఉండి పక్షుల జీవనంలో ఆసక్తి కలవారికి ఈ ప్రాంతం మరింత ఆకర్షణ కలిగిస్తుంది. దీనిని వారు ఒక స్వర్గంగా భావిస్తారు.

చిత్రకృప : ☻☺

బ్రిడ్జి

బ్రిడ్జి

కాబినిలో ప్రధాన ఆకర్షణ అంటే జంగిల్ సఫారి మరియు ఎనుగుల సఫారి. సరస్సులలో బోట్ విహారం చేస్తూ అక్కడి మొసళ్ళు, నీరు తాగే జింకలను చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప : Challiyan

ఆనందించవచ్చు

ఆనందించవచ్చు

కాబిని వెళ్ళే పర్యాటకులు కాబిని నది తప్పక చూడవలసిందే. ఈ నదిలో బోట్ విహారాలకు అనుమతిస్తారు. నదిలో నీరు తాగటానికి వచ్చే వన్య జంతువులను బోట్ లో నుంచి చూస్తూ ఆనందించవచ్చు. ఈ నది వాయనాడ్ జిల్లాలో పుడుతుంది.

చిత్రకృప : Gnissah

బీచనహళ్ళి

బీచనహళ్ళి

ఈ నది ని చూసేవారు దానిపై నిర్మించిన డ్యాం ను కూడా చూడాల్సిందే!! ఇది 696 మీటర్ల పొడవుతో, 58 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. ఇది బీచనహళ్ళి గ్రామంలో కలదు. హెగ్గనదేవర కోట నుండి బీచనహళ్ళి గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు.

చిత్రకృప : Kiranmadhu.e

కాబిని నేషనల్ పార్క్

కాబిని నేషనల్ పార్క్

కాబిని నదికి వెళ్ళే దోవలోనే పర్యాటకులు కాబిని నేషనల్ పార్క్ ను కూడా సందర్శించవచ్చు. ఇందులో ఆసియా ఏనుగులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవేమీ చేయవు, శాకాహారులు. దగ్గరకి వెళ్ళి చూడవచ్చు. మావటిగాళ్ళు (ట్రైనర్స్) ఉంటారు.

చిత్రకృప : Vinoth Chandar

సవారి

సవారి

సుంకదకట్ట లోని ఎలిఫెంట్ సవారి, జీపులు సైతం వెళ్ళలేని ఎత్తైన ప్రదేశాలను అన్వేషించేందుకు, పర్యాటకులకు ఒక సాహసంగా ఉంటుంది. ఒక ఏనుగుపై సవారి చేస్తూఆనందించాలనుకునే ప్రయాణీకులకు ఈ ప్రాంతంలోని సహజ అందాలను చూస్తూ, చేసే ఏనుగు సవారిఎంతో సంతోషాన్నిస్తుంది.

చిత్రకృప : Subham Dey

అనుభూతి

అనుభూతి

ప్రాచీన కాలంలో రాజులు, మహారాజులు ఏనుగు అంబారిలను ఎక్కితిరిగేవారని వింటూ ఉంటాం. అటువంటి అనుభూతిని పొందేందుకు ఈ ఎలిఫెంట్ సఫారి ఆనందం ఇస్తుంది. ఏనుగు మెల్లగానడుస్తుండటంతో దానిని ఎక్కిన ప్రయాణీకులు, ఆ ప్రాంతాలను మెల్లగా, చక్కగా చూస్తూ ప్రయాణించవచ్చు.

చిత్రకృప : Yathin S Krishnappa

జంగిల్ సఫారి

జంగిల్ సఫారి

కాబిని లోని వివిధ జంతువులను పరిశీలించాలనుకునేవారికి జంగిల్ సఫారి ఎంతో అనువుగా ఉంటుంది. కాబిని అటవీ ప్రాంతాలు పర్యావరణ వేత్తలకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అక్కడగల వివిధ వృక్షజాతులు, జీవ జాతులు, ఇతర జంతు జాలాలను జీపు ప్రయాణంలో చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప : vaidyanathan

కాలినడకన

కాలినడకన

పచ్చని ఈ ప్రాంతాలలో పర్యాటకులు కాలినడకన సైతం నడిచి ఆనందిస్తారు. ఇక్కడి వాతావరణం సంవత్సరంలో చాలా కాలం వెచ్చగా ఉండి కాబిని పర్యాటనకు అనుకూలంగా ఉంటుంది. పర్యాటకులు ఇక్కడి విశిష్ట వన్యప్రాణుల ప్రదేశాలను సాహసోపేతమైన ఒక జీపు సఫారీలో చేస్తారు.

చిత్రకృప : Johnson aj

విశ్రాంతి ప్రదేశం

విశ్రాంతి ప్రదేశం

అడవులలో నడక, ట్రెక్కింగ్, బోట్ విహారం, సైకిలింగ్, పక్షుల గమనం, రాత్రులలో చలిమంటలు, స్ధానికిగ్రామాల సందర్శనలతో ఎంతో ఆనందం పొందుతారు. కాబిని దేశంలోనే ఒక సహజ సెలవుల విశ్రాంతి ప్రదేశంగా చెప్పబడుతోంది.

చిత్రకృప : © Ranjith Kumar 2016

మరువకండి

మరువకండి

కర్నాటక రాష్ట్రంలో తప్పక చూడవలసిన ప్రదేశాలలో కాబిని ఒకటి. కనుక ఎట్టి పరిస్ధితులలోను ఈ ప్రాంత సందర్శన మరువకండి.

చిత్రకృప : Sandip Bhattacharya

కాబిని ఎలా చేరాలి?

కాబిని ఎలా చేరాలి?

విమాన ప్రయాణం -

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ పర్యాటకులకు స్థానికులకు విమానాశ్రయ సౌకర్యం. ఇది కాబిని నుండి 170 కి.మీ. దూరంలో ఉంది.

బస్ ప్రయాణం -

కాబిని సమీపంలోని నగరాలైన బెంగుళూరు, మైసూర్ లకు బస్ సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు కర్నాటక రాష్ట్ర రవాణా సంస్ధ నడిపే ఎ.సి. నాన్ ఎ.సి బస్ లను వినియోగించవచ్చు.

రైలు ప్రయాణం -

కాబిని ప్రాంతానికి రైల్వే స్టేషన్ లేదు. మైసూర్ రైల్వే స్టేషన్ సమీప జంక్షన్ షుమారు 24.9 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలిపి ఉంచుతుంది. మైసూర్ జంక్షన్ నుండి టాక్సీలు, క్యాబ్ లు విరివిగా లభ్యం అవుతాయి.

చిత్రకృప : Vinoth Chandar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X