Search
  • Follow NativePlanet
Share
» »నర-మృగ రూపు విగ్రహం నుంచి స్వేదం అదే భక్తులకు తీర్థం ఇక్కడ

నర-మృగ రూపు విగ్రహం నుంచి స్వేదం అదే భక్తులకు తీర్థం ఇక్కడ

దేశంలోని 108 నరసింహ క్షేత్రాల్లో ఖద్రిలోని ప్రహ్లాద నరసింహస్వామికి పుణ్యక్షేత్రానికి ప్రత్యేకత ఎంతో ఉంది. ఇక్కడ స్వామి వారికి అభిషేకం తర్వత ఒంటి నుంచి స్వేదం వస్తుంటుంది. దీన్ని భక్తులు తీర్థంగా తీసు

By Beldaru Sajjendrakishore

భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఈ క్రమంలో నిర్మించిన దేవాలయాలు, స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాల్లో కొన్నింటి మర్మాలను తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. వేలాది సంవత్సరాలుగా ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా సఫలం కాలేక పోతున్నారు. ఇక భక్తులు మాత్రం ఇదంతా దేవుడి మహత్యంగా భావిస్తూ తరతరాలుగా దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. కోరిన కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఇలాగే తమను, తమ బిడ్డలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. ఇటువంటి కోవకు చెందినదే ఖద్రి నరసింహస్వామి పుణ్యక్షేత్రం. చారిత్రాత్మక, పురాణ ప్రముఖ్యత కలిగిన ఈ క్షేత్రంలోని మూలవిరాట్టు విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి ప్రాంతం నుంచి స్వేదం వస్తుంది. దీనిని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఈ స్వామి వారి

1.దశావతారాల్లో ఒకటి...

1.దశావతారాల్లో ఒకటి...

Image source

విష్ణు దశావతారల్లో ఒకటిగా చెప్పుకునే నరసింహావతారం ఉగ్రస్వరూపం. సింహపుతల, మనిషి మొండెం కలిగిన రూపంలోన నరసింహుడు మనకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం లోక కంటకుడిగా మారిన హిరణ్యకసిపుడిని సంహరించడం కోసమే ఇలా విచిత్రమైన రూపంలో ఈ నరసింహుడు భూమి పై అవతరించాడు.

2. విచిత్రమైన వరం...

2. విచిత్రమైన వరం...

Image source

అటు మనిషితో కాని ఇటు జంతువుతో కాని, పగలు కాని రాత్రి కాని, ఇంటి బయట కాని లోపల కాని, భూమి పై కాని ఆకాశంలో కాని... ఏ ఆయుధంతో కాని హిరణ్యకసిపుడికి మరణం ఉండదు. దీంతో అతని ఆగడాలకు అంతు ఉండదు. ముఖ్యంగా విష్ణు భక్తులను చాలా హింసించేవాడు. చివరికి తన సొంత కుమారుడైన ప్రహ్లదుడిని కూడా వదలలేదు.

3. అందుకే నర..సింహ రూపం...

3. అందుకే నర..సింహ రూపం...

Image source

ఈ క్రమంలో విష్ణువు నరసింహుడి (మానవుడు, జంతువు కలగలిసిన రూపం) రూపంలో వచ్చి సాయంత్రం (పగలు రాత్రి కాని సమయం) సమయంలో ఇటి గడప (ఇంటి బయట కాదు లోపలా కాదు) పై కుర్చొని తన ఒళ్లో హిరణ్యకసిపుడిని అడ్డంగా పడుకోబెట్టుకుని (భూమి ఆకాశానికి మధ్య అన్న సంకేతం) తన చేతి గోళ్ల (ఏ వస్తువుతో చేసిన ఆయుదం కాదు) తోనే హిరణ్య కసిపుడి పొట్టను చీల్చి అతడిని సంహరిస్తారు. ఇది పురాణాల ప్రకారం నరసింహుడి అవతారం వెనుక ఉన్న కథనం.

4. అటు పై కూడా శాంతించలేదు

4. అటు పై కూడా శాంతించలేదు

Image source

హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా ఆగ్రహం చల్లారక నరసింహుడు భీకరమైన అరుపులతో కదిరికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ పర్వతం ప్రాంతానికి చేరుకున్నాడు. పరిస్థితిని గమనించిన దేవతలు ప్రహ్లాదుడితో సహా ఈ పర్వతం పైకి వచ్చి స్వామివారిని శాంతిపజేయడానికి అనేకస్త్రోత్రాలను పఠించారు. దీంతో నరసింహుడు శాంతించాడని పురాణ కథనం. దేవతలు స్త్రోత్రాలను పఠించినందువల్లే ఈ పర్వతానికి స్త్రోత్రాద్రి అని పేరు వచ్చింది.

5. ఖాద్రి..కదిరిగా మారింది

5. ఖాద్రి..కదిరిగా మారింది

Image source

ఖా అంటే విష్ణు పాదం, ఆద్రి అంటే పర్వతం అని అర్థం. విష్ణువు పాదం మోపిన ప్రాంతం కాబట్టే దీన్ని మొదట ఖాద్రి క్షేత్రంగా పిలిచేవారు. కాల క్రమంలో అది కదిరిగా మారిపోయింది.

6.జానపద గేయమే...

6.జానపద గేయమే...

Image source

కాటమ అంటే అడవి అని అర్థం అదే విధంగా రాయుడు అంటే అధిపతి. అడవికి అధిపతి సింహం. సింహం తల కలిగినందువల్లే ఈ ఖాద్రి నరసింహుడికి కాటమరాయుడు అని పేరు వచ్చింది. స్త్రోత్రాద్రిలో నివసించే చెంచులు పాడుకున్న జానపదల్లోని ఈ పాట అటు పై భక్తి తత్వమైన పాటగా ప్రాచుర్యంలోకి వచ్చంది.

7.మొదట దుర్గాలయం

7.మొదట దుర్గాలయం

Image source

కదరి నరసింహ క్షేత్రానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో మొదట పశ్చిమ చాళుక్యులు 985 1076 మధ్య అద్భుత శిల్ప సంపదతో కూడిన దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ శిల్ప సంపదను మనం ఇప్పటికీ చూడవచ్చు.

8.పుట్టలో వెలిసిన స్వామి...

8.పుట్టలో వెలిసిన స్వామి...

Image source

1274 లో విజయ నగర రాజు వీరబుక్కరాయులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆయనకు కలలో స్వామి వారు కనిపించారు. స్వామి వారి ఆదేశాలను అనుసరించి ఖద్రి చెట్టు కింద తవ్వగా ఓ పుట్టలో స్వామి వారు సాలగ్రమ రూపంలో కనిపించారు.

9.వివిధ దశల్లో...

9.వివిధ దశల్లో...

Image source

దుర్గాదేవి ఆలయానికి దక్షిణ భాగంలో స్వామివారిని ప్రతిష్టింపజేసి గర్భగుడిని నిర్మింప జేశారు. అటు పై దశల వారిగా కొక్కంటి పాలేగాళ్లు, శ్రీక్రిష్ణ దేవరాయులు, అచ్చుతరాయులు ఈ క్షేత్రంలో వివిధ రకాల నిర్మాణాలు చేపట్టి ధూప, దీప, నైవేద్యాలకు వేల ఎకరాల పొలాలను, సందపదను అందజేశారు.

10.విగ్రహానికి స్వేదం...

10.విగ్రహానికి స్వేదం...

Image source

ఇక ఖద్రి చెట్టులో స్వామి వారి విగ్రహం ఉంటుందిం. ఇది స్వయంభువుగా ఇక్కడి వారు పేర్కొంటారు. అబిషేకం తర్వాత ఈ విగ్రహాన్ని శేషవస్ర్తంతో తుడిచినప్పుడు స్వేద బిందువులు వస్తూ ఉంటాయి. ఎన్ని సార్లు తుడిచినా అదే విధంగా స్వేద బిందువులు వస్తూ ఉంటాయి. దీనిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తుంటారు.

11. సుగంధభరితమైన దవనం...

11. సుగంధభరితమైన దవనం...

Image source

కదిరి పరిసర ప్రాంతాల్లో సుగంధ సువాసనలు వెదజల్లే దవనాన్ని ఎక్కువగా పండిస్తారు. స్వామివారి కళ్యాణోత్సవం సమయానికి ఈ దవనం చేతికి వస్తుంది. స్వామి వారిని ఆ సమయంలో దవనం, మల్లె పూలతో అలంకరిస్తారు. ఆ విధంగా అలకరించిన పుష్పాలను, పత్రాలను తిరిగి భక్తులకు అందజేస్తారు. వీటిని ఇంటికి తీసుకువెలితే శుభం కలుగుతుందని భక్తువ విశ్వాసం. అదే విధంగా కదిరిలో తయారు చేసే కుంకుమ కూడా చాలా ప్రసిద్ధి. ఇది కూడా సుంగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. దీంతో కదిరికి వచ్చినవారు తప్పక కుంకుమను తమతో పాటు తీసుకువెళుతారు.

12. తప్పక సంతాన ప్రాప్తి

12. తప్పక సంతాన ప్రాప్తి

Image source

ఇక్కడ దుర్గాదేవితో పాటు కోదండరామస్వామి, రామజపస్థూపం, గోవిందరాజుల స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని కూడా భక్తులు సందర్శిస్తుంారు. ఇక ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్టకు చేరుకుంటారు. ఇక్కడి నాగదేవతను పూజిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్ముతారు.

13. ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి...

13. ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి...

Image source

అనంతపురం పట్టణానికి కదిరికి 92 కిలోమీటర్లు. ప్రయాణ సమయం రెండు గంటలు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనంతపురానికి దగ్గరగా ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేక విమానసేవలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా కడప పట్టణానికి కూడా కదిరి 104 కిలోమీటర్ల దూరం. రోడ్డు మార్గంలో దాదాపు రెండున్నర గంటల ప్రయాణ సమయం. ఇప్పుడిప్పుడే కడపకు విమాన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

14. మరిన్ని చూడదగిని ప్రాంతాలు...

14. మరిన్ని చూడదగిని ప్రాంతాలు...

Image source

కదిరికి దగ్గరగా అనంతపురం జిల్లా పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా లేపాక్షి, తిమ్మమ్మమర్రిమాను, పెనుగొండ కోట తదితరాలు ఇక్కడ చూడవచ్చు. ఇందులో తిమ్మమ్మ మర్రిమాను కదిరికి 23 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రోడ్డు మార్గం ద్వారా 43 నిమిషాల ప్రయాణ సమయం.

Read more about: travel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X