Search
  • Follow NativePlanet
Share
» »స్వయంగా శివపార్వతులు విచ్చేసిన ఈ ప్రదేశంలో పుణ్యస్నానాలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి

స్వయంగా శివపార్వతులు విచ్చేసిన ఈ ప్రదేశంలో పుణ్యస్నానాలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి

స్వయంగా శివపార్వతులు విచ్చేసిన ఈ ప్రదేశంలో పుణ్యస్నానాలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి

కైలాసకోన అసల పేరు కైలాసనాథకో. కొండపై నుండి జాలువారే జలపాతం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తైన కొండపై నుండి రకరకాల ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ సుమారు వంద అడుగుల పై నుండి దూకే ఈ జలపాతం నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నీటిలో స్నానం ఆచరించడం వల్ల వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న నమ్మకం చాలా మందిలో ఉంది.

మన ఇండియాలో ఎంతో వైభవోపేతంగా విరిసిల్లిన దేవాలయాలు, దైవాన్ని తలపించే ఇతర కట్టడాలన్నీ పురాతన కాలంలో దేవతలు పరవశించి కొన్నాళ్లపాటు గడిపిన ప్రదేశాలకు చిహ్నంగా నిర్మించిబడినట్లు కొన్ని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మిక చరిత్రతో కూడిన నిర్మాణాల్లో కైలాసకోన గుహాలయం కూడా ఒకటి. ఇది చిత్తూర్ జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గది. ఈ కైలాస కోన గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

కొండ గుహాలనే ఆలయాలుగా

కొండ గుహాలనే ఆలయాలుగా

పూర్వకాలంలో ప్రత్యేకంగా దేవాలయాలను నిర్మంచడాని కంటే ముందు కొండ గుహాలనే ఆలయాలుగా మలచేవారు. అలాంటి గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ ముగ్ధమనోహరంగా ఉంటాయి.

PC: YOUTUBE

పూర్వం ఒక రోజు నారాయణపురంలో

పూర్వం ఒక రోజు నారాయణపురంలో

పూర్వం ఒక రోజు నారాయణపురంలో పద్మావతీ వెంకటేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు ఇతర దేవతలతో పాటు కైలాసం నుంచి శివపార్వతులు కూడా ఇక్కడిక విచ్చేశారు. ఈ ప్రదేశంలోని ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం పాటు ఇక్కడే గడిపారని పురాణాలు చెబుతున్నాయి. అలా వాళ్లిద్దరు నివసించడం వల్ల ఈ కొండకు కైలాసకోన అనే పేరు వచ్చింది.

PC: YOUTUBE

కైలాసకోన గుహాలయంలో

కైలాసకోన గుహాలయంలో

కైలాసకోన గుహాలయంలో ఒక శివలింగం ఉంటుంది. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం, దాని పక్కన వీరభద్రుని ప్రతిమ ఉన్నాయి. అలాగే వీరభద్రుని విగ్రహం పక్కన ఆదిశంకరాచార్యుల శిల్పం ఉంది.

PC: YOUTUBE

గుహాలయం ప్రక్కనే మనోహరంగా

గుహాలయం ప్రక్కనే మనోహరంగా

ఈ కైలాస కోనలో అందమైన గుహాలయం ప్రక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం ఎంతో చూడముచ్చటగా ఉండే ఆలయం అద్భుతంగా దర్శనమిస్తుంది.

PC: YOUTUBE

కైలాసకోన జలపాతం నారాయణవనం

కైలాసకోన జలపాతం నారాయణవనం

కైలాసకోన జలపాతం నారాయణవనం మండలంలో ఉంది. ఇది ఎత్తైన కొండలపై నుండి అనేక ఔషది వృక్షాల వేర్లు తడుస్తూ ప్రవహించడం వల్ల ఇక్కడ స్నానమాచరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం.

PC: YOUTUBE

కైలాసకోన గుహాలయంలో ఓ శివలింగం

కైలాసకోన గుహాలయంలో ఓ శివలింగం

అంతే కాదు ఈ కొండపైన ఉండే కైలాసకోన గుహాలయంలో ఓ శివలింగం దర్శనమిస్తుంది. ఈ లింగానికి ఎదురుగానే నంది విగ్రహం, దాని పక్రన వీరభద్రుని ప్రతిమ, దాని పక్కనే ఆదిశంకరాచార్యుల శిల్పం ఉంది. ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని తలపిస్తూ ముగ్ధమనోహరంగా ఉంటుంది.

PC: YOUTUBE

కైలాస కోనలో సిద్ధేశ్వర కామాక్షి మాత దేవాలయం

కైలాస కోనలో సిద్ధేశ్వర కామాక్షి మాత దేవాలయం

ఈ కైలాస కోనలో సిద్ధేశ్వర కామాక్షి మాత దేవాలయం కూడా ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్న తలకోన మరియు కైలాసకోన రెండూ ప్రసిద్ద జలపాతాలు

PC: YOUTUBE

 కైలాసకోన ఓ ప్రముఖ పర్యాటక ప్రదేశంగా

కైలాసకోన ఓ ప్రముఖ పర్యాటక ప్రదేశంగా

ప్రస్తుతం ఈ కైలాసకోన ఓ ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ది చెందినది. ఇక్కడికి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శన కోసం వస్తుంటారు. స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి ఇక్కడ వచ్చి సౌందర్యవంతమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని దర్శించుకుని సంతోషంగా గడుపుతారు.

PC: YOUTUBE

కైలాసకోన జలపాతంతో పాటు మరికొన్ని

కైలాసకోన జలపాతంతో పాటు మరికొన్ని

ఆంధ్రప్రదేశ్ లో కైలాసకోన జలపాతంతో పాటు మరికొన్ని జలపాతాలు కూడా పర్యాటకుల ఆకర్షించేవి, పరవశింప చేసేవి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఎత్తిపోతల జలపాతాలు, ఇది నాగార్జున సాగర్ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్నాయి.

PC: YOUTUBE

తలకోన,

తలకోన,

తలకోన, ఇది చిత్తూరు జిల్లాలోని దట్టమైన అరణ్యం మధ్యన తిరుపతికి సుమారు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కూడా నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది.

Photo Courtesy: Adityamadhav83

సంగద జలపాతం,

సంగద జలపాతం,

సంగద జలపాతం, సంగద జలపాతం అందమైన తూర్పు మనుమలలో అరకు వాలీలో ఒక భాగంగా ఉంది. సంగద గ్రామానికి దగ్గరలో ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. ఎంతో సుందరమైన ప్రదేశంగా పర్యాటక స్థలంగా ప్రసిద్ది చెందినది.

Photo Courtesy: Adityamadhav83

కటకి జలపాతం ,

కటకి జలపాతం ,

కటకి జలపాతం , కొండవాగుల్లో దాగున్న ఒక చక్కటి ప్రదేశం. ఈ ప్రదేశానికి వెళ్ళడం కాస్త కష్టమే అయినా , ఎప్పుడూ చూడని ప్రకృతి అందాలు, జలపాతాలు, లోయలు, పైనుండి పడే నీటి తుంపరలు చూస్తే మది పులకరిస్తుంది.

Photo Courtesy: Adityamadhav83

కుంటల జలపాతం

కుంటల జలపాతం

కుంటల జలపాతం, ఇది ఆంధ్రరాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం. శకుంతలా దుష్యంతులు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి కుంతల జలపాతం అని పేరు వచ్చింది.

Photo Courtesy: Ppavan1

పొచ్చెర జలపాతం:

పొచ్చెర జలపాతం:

పొచ్చెర జలపాతం: చూడముచ్చటైన జలపాతం. ఇక్కడ చుట్టూ ఉండే కొండకోనల మధ్య నుండి నీళ్ళు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు జాలువారిపడుతుంటే భలే మజాగా ఉంటుంది.

Photo Courtesy: Adityamadhav83

కపిల తీర్థం:

కపిల తీర్థం:

తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక ప్రదేశంలో శివుని విగ్రహం ఉన్న ఒకే ఒక ఆలయం కపిల తీర్థం. ఈ ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందు కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.

Photo Courtesy: Adityamadhav83

ఉబ్బల మడుగు జలపాతం

ఉబ్బల మడుగు జలపాతం

శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్దుల కోన అని పిలువ బడే అడవిలో వున్నది.ట్రెక్కింగుకు, మరియు విహార యాత్రలకు ఇది చాల అందమైన ప్రదేశము. దీన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో తమిళనాడు నుంచి పర్యాటకులు వస్తూంటారు.

Photo Courtesy: Tamba52

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X