Search
  • Follow NativePlanet
Share
» »ఓరుగల్లు కోటను ఛేదించటానికి అమలుచేసిన రహస్యాలు వ్యూహాలు ఇవే !

ఓరుగల్లు కోటను ఛేదించటానికి అమలుచేసిన రహస్యాలు వ్యూహాలు ఇవే !

వరంగల్ భారతదేశంలో తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా మరియు 12-14 వ శతాబ్దం A.D. నుండి పాలించిన కాకతీయ రాజుల రాజధానిగా ఉండెను. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద నగరం.

By Venkatakarunasri

వరంగల్ భారతదేశంలో తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా మరియు 12-14 వ శతాబ్దం A.D. నుండి పాలించిన కాకతీయ రాజుల రాజధానిగా ఉండెను. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద నగరం. పురాతన కాలంలో వరంగల్ను 'ఓరుగల్లు' లేదా 'ఓంటికొండ' అని కూడా పిలిచేవారని దీనికి సాక్ష్యాధారంగా ఒక పెద్ద కొండ రాయిమీద ఈ పేర్లు చెక్కి ఉండటం కనిపిస్తుంది. వరంగల్ నగరం వరంగల్ జిల్లాలో ఉంది, దీనితోపాటుగా హన్మకొండ మరియు కాజీపేట్ కూడా ఉన్నాయ్. వరంగల్ కోట వంటి వివిధ వాస్తుకళా కళాఖండాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి మరియు ప్రోల రాజు (కాకతీయ వంశం యొక్క) ఈ సుందరమైన నగరం నిర్మించారు అని నమ్ముతారు. మార్కో పోలో, ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడు, అతని ప్రయాణ డైరీలలో మరియు ఆయన రచనల్లో వరంగల్ గురించి ప్రస్తావించినప్పుడు కాకతీయరాజుల సాంస్కృతిక మరియు పరిపాలన దక్షత గొప్పతనం ప్రతిబింబిస్తాయి.

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

వరంగల్ దుర్గంగా ప్రసిద్ధిచెందిన కాకతీయుల కోట వరంగల్ రైలుస్టేషనుకు 2 కి.మీ. దూరంలోనూ, హనుమకొండ నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడిన కోట. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట శిలాతోరణ స్తంభాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో వాడుకలో ఉన్నాయి.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఇక ఈ ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసారు.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసినది దీనిని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్నది రాతి కోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి (పూర్ణ కుంభం వంటివి). ఈ కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ఆధికారిక చిహ్నంగా ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఖుష్ మహల్

ఇక వరంగల్ కోటలోని కుష్ మహల్ గురించి చెప్పాల్సివస్తే షితాబ్ ఖాన్ అనే రాజు క్రీ.శ. 1500 ప్రాంతంలో ఈ సౌధాన్ని కట్టించాడు. ఈ దర్బారు పొడవు సుమారు 90 అడుగులుండగా, వెడల్పు-ఎత్తులు వరుసగా 45, 30 అడుగులుంటాయి.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

దర్బారు పైకప్పును కొనదేలిన ఆర్చిలు మోస్తున్నట్లుగా ఉన్నాయి, ఆర్చిల మధ్యన కర్ర దూలాలున్నాయి. నిజానికి పైకప్పును మోస్తున్నది ఈ దూలాలే. పెద్ద పెద్ద ప్రమాణాల్లో కనిపిస్తున్న ఈ ఆర్చీలు కేవలం అందాన్ని అతిశయింపజేయడానికే. ఆర్చీల ముందు దర్వాజా లాంటి ఆర్చి, దానిపైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింత పెంచాయి.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

దర్బారులోకి ప్రవేశించే ప్రాంగణం మరింత అందమైంది. నిజానికిది రెండంతస్తుల్లో ఉంది. ఇందులోని రెండు వరుసల్లో ఉన్న స్తంభాలు మూడు పొడవాటి హాల్‌లను ఏర్పరుస్తున్నాయి. ఈ కింద, పైనున్న గదులు రాచ కుటుంబీకులకు చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఈ మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టమైనవి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కన్పిస్తాయి. ఎత్తైన ఈ భవనం పై భాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ ఖుష్ మహల్‌లో భద్రపరిచారు.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

దర్బారు మధ్యలో అందమైన నీటి కుండం ఉంది. ఇది ఆనాడు రాచవర్గ ప్రజలకు ఎంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేదో! కాబట్టే, ఈ మహల్‌కు ‘ఖుష్ మహల్' అని పేరొచ్చింది. క్రీ. శ. 1296లో దేవగిరి స్వాధీనము తరువాత తుగ్లక్ సుల్తానుల కన్ను ఆంధ్రదేశముపై బడింది. సంపదతో తులతూగుతున్న ఓరుగల్లు వారి అసూయాద్వేషాలకు కారణమయింది.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు పై మొదటి ముట్టడివిషయానికొస్తే

క్రీ. శ. 1310లో మాలిక్ కాఫుర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టిగోడను ధ్వంసం చేశాడు. లోపలి రాతిగోడను ఛేదించలేక కోట బయటి గ్రామాలను నాశనము చేసి అమాయక ప్రజలను వధించుట మొదలుపెట్టగా ప్రతాపరుద్రుడు సంధిచేసుకొని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, కోహినూరు వజ్రము అప్పగించాడు.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

రెండవ ముట్టడి

1321లో ఘియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖాన్ (మహమ్మద్ బీన్ తుగ్లక్) ను ఓరుగంటిపై దాడికి పంపుతాడు. వీరోచితముగా పోరాడిన ప్రతాపరుద్రుని సైన్యము ధాటికి తట్టుకోలేక, మరియు ఆ సమయములో వ్యాపించిన మహమ్మారి వల్లనూ, ఆరు నెలల ముట్టడి తర్వాత ఉలుఘ్ ఖాన్ వెనుతిరుగుతాడు.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఇక మూడవ ముట్టడి

ఉలుఘ్ ఖాన్ రెట్టించిన ఉత్సాహముతో, బలీయమైన సైన్యముతో 1323లో మరలా దాడికి వచ్చాడు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యముగా సుల్తాను సేనలనెదుర్కొంటాడు. తుర్క్ సేనలుపయోగించిన ఆధునిక పద్ధతులవల్ల, బలీయమైన అశ్వికదళము వల్ల, తెలుగు నాయకుల అనైక్యత వల్లనూ, పరాజయము తప్పలేదు. ప్రతాపరుద్రుడు, కటక పాలుడు గన్నమ నాయుడు బందీలవుతారు.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఇక మూడవ ముట్టడి

వారిని ఢిల్లీ తరలిస్తుండగా మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణం చేసుకుంటాడు. ఢిల్లీలో గన్నమ నాయుడు (మాలిక్ మక్బూల్) ఇస్లాము మతములోనికి మార్చబడ్డాడు. ఉలుఘ్ ఖాను ఓరుగల్లును దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచి ఢిల్లీకి మరలుతాడు.

PC:youtube

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

ఓరుగల్లు కోటను ఛేదించే రహస్య వ్యూహాలు !

సుల్తానుల పాలన

ఓరుగంటి పేరు సుల్తాన్ పూర్ అని మార్చబడింది. స్వయంభూశివాలయము పూర్తిగా ధ్వంసం చేయబడింది. ప్రాకారము, గర్భగుడి, అస్థాన మండపము నేలమట్టము చేయబడ్డాయి. కోట కేంద్రస్థానములో మూడు కట్టడాలు నిర్మించబడ్డాయి. ఇవి ఖుష్ మహల్, జామీ మసీదు, . ఈ కట్టడాలకు గుడి రాళ్ళు, స్తంభాలు విరివిగా వాడబడ్డాయి. తోరణాలు మాత్రము వదిలివేయబడ్డాయి.

PC:youtube

ఇక్కడ చూడవలసినవి

ఇక్కడ చూడవలసినవి

రాక్ గార్డెన్, వరంగల్

రాక్ గార్డెన్ వరంగల్ ఫోర్ట్ ఆలయానికి దగ్గరగా ఉన్నది మరియు విశ్రాంతి స్థలం కోసం చూసే అనేక సందర్శకులను ఆకర్షిస్తుంది. జింక, సాంబార్, జిరాఫీలు, సింహాలు మరియు లేడి యొక్క రాతి నిర్మాణాలు,ఇంకా అనేకమైనవి రాక్ గార్డెన్ లో చూడవచ్చు. శిల్పుల జీవన శైలి, వారి వ్యాపార శైలి ప్రతిబింబించే కట్టడాలు ఇంకొక నిదర్శనం. వివిధ రకాల గులాబీలు, లిల్లీస్ మరియు ఇతర పూల చెట్లు కూడా ఈ తోటలో ఉన్నాయి. పిల్లలకు ఆటల మైదానాలు ఉన్నాయి మరియు ఇక్కడ సాయంకాలాలు విపరీతమైన నగర జనసందోహం, పర్యాటకులతో నిండి ఉంటుంది. ప్రకృతి ఆసక్తి ఉన్నవారు లేదా విశ్రాంతి తీసుకునేవారు తప్పనిసరిగా ఈ అందమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలి.

PC:youtube

ఇక్కడ చూడవలసినవి

ఇక్కడ చూడవలసినవి

పాకాల సరస్సు, వరంగల్

పాకాల సరస్సు ఒక కృత్రిమ (మానవ నిర్మిత) సరస్సు పాకాల అభయారణ్యంలో వరంగల్ నగరానికి దగ్గరగా ఉంది. కాకతీయ రాజు, గణపతిదేవుడు 1213 ఏ.డి. లో నిర్మించారని భావిస్తున్నారు, సరస్సు 30 చ. కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. పర్యాటకులు పాకాల సరస్సు యొక్క సుందర ప్రకృతి దృశ్యాలతో గంటలకొద్దీ గడుపుతారు. ఇది కొండ ప్రాంతం, దట్టమైన అడవుల మధ్యలో ఉంది మరియు ఇక్కడికి సంవత్సరం పొడుగునా వేలకొద్ది ప్రజలు వినోద స్థలంగా సందర్శిస్తారు. పాకాల సరస్సు తీరము చుట్టూ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది, మరియు వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలం ఇక్కడ చూడవచ్చు. ఈ అభయారణ్యంలో ఛిరుతపులులు, మానిటర్ బల్లులు, మొసళ్లు, ఎలుగు బంట్లు, కొండచిలువలు మరియు తోడేళ్ళువంటి జంతువులు పర్యాటకుల కన్నుల విందు చేస్తాయి. ఇది అంతా,839 చ.కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది.

PC:youtube

ఇక్కడ చూడవలసినవి

ఇక్కడ చూడవలసినవి

వేయి స్తంభాల గుడి, వరంగల్

వేయి స్తంభాల గుడి ఒక చారిత్రాత్మక హిందూ ఆలయం, ఇక్కడ విష్ణువు, శివుడు మరియు సూర్యుడు మొదలైన దేవతలు ఉన్నారు. కాకతీయ రాజు, రుద్ర దేవ 1163 ఏ.డి. లో దేవాలయం నిర్మించాడు మరియు ఈ మతపరమైన నిర్మాణానికి దివ్యంగా చెక్కబడిన వెయ్యి స్తంభాలును ఉపయోగించారు కాబట్టి దీనికి వేయి స్తంభాల గుడి అనే పేరు వొచ్చింది. ఈ గుడిలో ఆకట్టుకునే తలుపులు, పైన పేర్కొన్న వేయి స్తంభాలు మరియు శిల్ప కళతో ఉన్న ఆలయ పైకప్పులు-వరంగల్ యొక్క సందర్శన స్థలాలో ఒకటిగా నిలిచింది. వెనకాల ఉన్న హనుమకొండ కొండలు ఈ ఆలయ అందానికి ప్రతీకగా నిలిచాయి. ప్రవేశద్వారం వద్ద ఉన్నఅతిపెద్ద నంది, అత్యంత పాలిష్ చేసిన నల్ల అగ్గిరాయి ఏకశిలా విగ్రహం నుండి చెక్కబడినది అని నమ్ముతారు. వేయి స్తంభాల గుడి కాకతీయ రాజులకు ఉన్నశిల్పకళా తృష్ణకు ఒక ప్రతీక అని చెప్పవొచ్చు మరియు ఇది దక్షిణ భారతంలోనే చాల పురాతనమైనదని చెప్పవొచ్చు.

PC:youtube

ఇక్కడ చూడవలసినవి

ఇక్కడ చూడవలసినవి

వరంగల్ కోట, వరంగల్

వరంగల్ నగరంలోఅందరిని నిలువరించే ఆకర్షణలలో ఒకటి వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు ఉదాహరణ ఈ కోట. గణపతిదేవుడు 1199 ఏ.డి. లో కోట భవనం నిర్మాణం ఏర్పాటు చేసాడు మరియు 1261 ఏ.డి. లో అతని కుమార్తె రాణి రుద్రమ దేవి దానిని పూర్తి చేసింది. ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది,ఈ కోట రెండు గోడలతో ఉన్న నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలను సంచి శైలిలో కలిగిఉన్నది. ఎవరైతే నిర్మాణ ఆసక్తి కలిగి ఉన్నారో, చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నారో ఈ కోటను సందర్శించి ఆ విజ్ఞానాన్ని పొందుతారు మరియు అన్ని వయస్సుల సందర్శకుల ఆదరణ పొందటంలో నిదర్శనంగా ఉంటుంది. ఈ రోజు వరకు కూడా సింహాల వంటి జంతువులు మరియు స్వాన్స్ వంటి పక్షులు నిర్వచించేందుకు ఉపయోగింఛిన సున్నితమైన రాతి పని మరియు నమూనాలు స్పష్టంగా చూడవచ్చు.

PC:youtube

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ ద్వారా

రోడ్ ట్రాన్స్ పోర్ట్ పబ్లిక్ బస్ సర్వీసు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటికి అనుసంధించబడింది.ఒక కి.మీ.కు రూ.4 చొప్పున చార్జ్ తీసుకుంటూ వరంగల్ నుండి హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం వంటి నగరాలకు బస్సులు ఉన్నాయ్. వరంగల్ మరియు ఇతర నగరాల మధ్య ప్రైవేటు బస్ సర్వీసులు కూడా ఉన్నాయ్.

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రైలు ద్వారా

వరంగల్ రైల్వే స్టేషన్ చాల ముఖ్యమైన స్టేషన్ మరియు దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటికి అనుసంధించబడింది. చెన్నై, బాంగుళూర్,ముంబై మరియు న్యూ ఢిల్లీ నుండి రైళ్ళు వరంగల్ గుండా వెళ్ళేప్పుడు వరంగల్ స్టేషన్లో ఆగుతాయి.

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

విమానం ద్వారా

వరంగల్ దగ్గరగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. అది వరంగల్ నగరానికి 163కి.మీ. దూరంలో ఉన్నది మరియు దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటి కి అనుసంధించబడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X