Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ కాలభైరవున్ని పూజిస్తే సకల గ్రహదోషాలు, అపమృత్యుదోషాలు తొలగిపోతాయి

ఇక్కడ కాలభైరవున్ని పూజిస్తే సకల గ్రహదోషాలు, అపమృత్యుదోషాలు తొలగిపోతాయి

బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు, శివుడి మానసపుత్రుడు కాలభైరవుడు.బ్రహ్మ యొక్క అహాన్ని తగ్గించడంలో బ్రహ్మా యొక్క ఐదవ తలను ఖండిచడం వల్ల అతనికి బ్రహ్మ హత్యా మహాపాతకం తగలడం వల్ల దాన్ని పోగొట్టు

సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ క్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానస పుత్రుడే ఈ కాలభైరవుడు. బ్రహ్మణే సంహరించిన శక్తి శాలీ. దుష్టశక్తులకు సింహ స్వప్నం. మనసారా నమ్మనివారికి కొంగుబారాన్ని అందించే కాలభైరవుడు.

శరణు భైరవయ్యా అని పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి నిజామాబాద్ కామా రెడ్డి జిల్లా, రామారెడ్డి పల్లి, ఇసన్నపల్లిలో 8అడుగుల కాలభైరవ స్వామి మూల విగ్రహం కనిపిస్తుంది.

ఆదిశంకరాచార్యులచే స్తుతించబడనిన కాలభైరవుడు ఉత్తర ప్రదేశ్ లోని కాశీ క్షేతం తర్వాత దక్షిణ భారత దేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ గుర్తించబడిన ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు. ఈ కాలభైరస్వామి దేవాలయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం..

శ్రీ కాలభైరవ స్వామి ఆలయం

శ్రీ కాలభైరవ స్వామి ఆలయం

శ్రీ కాలభైరవ స్వామి ఆలయం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి గుడి. రామారెడ్డి పేటలోని శివాలయం, రామాలయాల నిర్వహణకోసం..దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇసనపల్లి. ఈగుడికి వెళ్ళే మార్గంలో చుట్టూ పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. ఇక్కడున్న గ్రామానికి ఎనిమిది దిక్కులా అష్టభైరవులున్నారు. ఈ ఆయం దగ్గరకు వెళ్ళగానే కాస్తంత దూరం నుండే ఈ గుడి సిందూరం రంగులో ఉన్న గుడి అభయమిస్తున్నట్లు కనబడుతుంది.

P.C: You Tube

ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం

ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం

ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం క్రీ.శ.13వ శతాబ్ధ కాలం నాటిదని చెబుతారు. సహజంగా ఈ గుడిలోని విగ్రహాన్ని కనుక చూసినట్లైతే కొంత మంది దిగంబర జైన విగ్రహని కొందరి వాదన. అయితే కాలభైరవుడిని దిగంబరుడిగా చెప్పిన పురాణాలు, తంత్ర గ్రంథాలున్న కాలభైరవ విగ్రహం సనాతన వైదిక దేవతా విగ్రమనే వాదన.కరువు సమయంలో ఇక్కడి ఆలయంలోని కాలభైరవుని విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారు. తర్వాత ఆపేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా పడేవని అక్కడ ప్రజలు ప్రఘాడమైన నమ్మకం.

P.C: You Tube

 కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు

కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు

ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 నిద్ర చేస్తే మంచిదని, ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం. ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని , సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.

P.C: You Tube

కాలస్వరూపం తెలిసినవాడు

కాలస్వరూపం తెలిసినవాడు

కాలస్వరూపం తెలిసినవాడు, ఇంకా సంతానభాగ్యం పొందడానికి, వివాహ మరియు ఉద్యోగ సమస్యలున్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి నియమం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని , అతీంద్రమైన శక్తులను ప్రసాధించే కాలభైరవునికి గారెలతో మాల వేస్తారు.బెల్లం, కొబ్బరి నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

P.C: You Tube

 శ్రీ శివపురాణం ప్రకారం

శ్రీ శివపురాణం ప్రకారం

శ్రీ శివపురాణం ప్రకారం ప్రధానంగా అష్టభైరవులు వరుసగా చండభైరవ, అసితాంగ భేరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోథ బైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, ఉన్మత్త భైరవ. ఈ ఇస్సన్నపల్లి గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు అక్కడివారు చెబుతారు.

P.C: You Tube

అష్టబైరవులలో కాశీభైరవుడు

అష్టబైరవులలో కాశీభైరవుడు

అష్టబైరవులలో కాశీభైరవుడు పైభాగంలో ఉంటాడు, క్రింది ఈశాన్య భాగంలో కాలభైరవుడు ఉంటారు, ఈశ్యాన్య దిక్కును ఈవానుడు పాలించడం వల్ల ఈ గ్రామానికి ఇస్సన్నపల్లి అని పేరు వచ్చింది. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం)కూడా అణిగి ఉంటాడు, కనుకనే కాళబైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.

P.C: You Tube

బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు

బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు

బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు, శివుడి మానసపుత్రుడు కాలభైరవుడు.బ్రహ్మ యొక్క అహాన్ని తగ్గించడంలో బ్రహ్మా యొక్క ఐదవ తలను ఖండిచడం వల్ల అతనికి బ్రహ్మ హత్యా మహాపాతకం తగలడం వల్ల దాన్ని పోగొట్టుకొనడం కోసం బిక్షాటన చేసి, కాశీకి వెళ్ళి అక్కడ విముక్తుడయ్యాడనికి, అప్పటి నుండి అక్కడే కాశీ క్షేత్రపాలకుడుగా ఉన్నాడని పురుణాలు చెబుతున్నాయి. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది.

P.C: You Tube

 త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడికి

త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడికి

అదేంటేంటే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడికి మొదట ఐదు తలలుండేవట, తను సృష్టికర్త కావడంతో బ్రహ్మలో గర్వం పెరిగిందట. త్రిమూర్తుల్లో తానే అధికుడని చెప్పుకోవడం మొదలు పెట్టాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చి ‘నా నాభికమంల నుండి పెట్టినవాడివి, అందువల్ల నేనే గొప్పవాణి అన్నారట. వాళ్లిద్దరూ వాదించుకుంటుండా అక్కడ ఒక జ్యోతి స్థంభం ప్రత్యక్షమైనది. అప్పుడు అది చూసి శ్రీ మహా విష్ణువు ఈ వాదన నుండి విరపించుకున్నాడు , కానీ బ్రహ్మకు మాత్రం అహంకారం పోలేదు.

P.C: You Tube

శివుడినుండి ఓ ఘోరరూపం

శివుడినుండి ఓ ఘోరరూపం

అప్పుడు శివుడినుండి ఓ ఘోరరూపం ఆవిర్భవించిందట. నాలాగే తనకూ ఐదు తలలున్నాయి కాబట్టి నాతో సమానుడని గర్వంతో విర్రవీగుతున్నాడు. ఈ ఐదో తలను నీ కొనగోటితో తుంచెయ్. అని ఆ రూపాన్ని ఆదేశించాడట. కొనగోటి బ్రహ్మఐదోతలను తొలగిస్తే కానీ ఆ బ్రహ్మకు తత్వం భోదపడలేదు. అప్పుడు శిశుడు ఆ రూపంతో నువ్వు బ్రహ్మ తలను తెంచావు కాబట్టి కాలం వలె కనిపిస్తున్నావు. అందుకే నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు.

P.C: You Tube

 బ్రహ్మతలను ఖండిచినందకు బ్రహ్మ హత్యాపాతకం

బ్రహ్మతలను ఖండిచినందకు బ్రహ్మ హత్యాపాతకం

అయితే బ్రహ్మతలను ఖండిచినందకు బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకోవడం వల్ల ఈ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండేళ్ళు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారమవుతుంది. ఇక పైన నా దేవాలయాల్లో నువ్వే క్షేత్రపాలకుడివి . కాశీ పట్టణానికి అధిపతిగా , నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు అని చెప్పాడట.

P.C: You Tube

కాలభైరవుని దేవాలయాలు

కాలభైరవుని దేవాలయాలు

కాలభైరవుని దేవాలయాలు మనదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నేపాల్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి మన రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలోనూ ఉంది.

P.C: You Tube

 కార్తీక మాసంలో

కార్తీక మాసంలో

ఇక్కడ కార్తీక మాసంలో ఘనంగా స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇసన్నపల్లిలో వెలసిన ఈ కాలభైరవున్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్టాల నుండీ కూడా భక్తులు సందర్శిస్తుంటారు.

P.C: You Tube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X